
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 63,87,275 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,759.99 కోట్లను పంపిణీ చేయనుంది.
ఈ మొత్తాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదురోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment