
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలపై భార్యతో కలిసి నిరసనకు దిగారు. ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ యూనివర్సిటీలో మాజీ రిజిస్ట్రార్ ధర్మరాజు పెన్షన్ డబ్బులు రావడం లేదని రిజిస్ట్రార్ చాంబర్లో తన భార్యతో సహా బైఠాయించారు.
గత మూడేళ్లుగా పెన్షన్ డబ్బులు రావట్లేదని ఆందోళన చేపట్టారు. భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా రోదిస్తూ...పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతామని, భిక్షం ఎత్తుకుని బతకాలా అంటూ ఆవేదన చెందారు. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment