ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్న రైతులు, ఎస్‌ఆర్‌ఎస్పీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు
సాక్షి, నిజామాబాద్ : పోచంపాడు ఎస్‌ఆర్‌ఎస్పీ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాంసాగర్ నుంచి సాగునీరు అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం పోచంపాడులోని ఎస్‌ఆర్‌ఎస్పీ ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 24 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మహిళా రైతులు సైతం భారీ సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సేవ్ ఫార్మర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు.
ఎస్‌ఆర్‌ఎస్పీ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించటానికి మహిళా రైతులు ప్రయత్నించటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఫర్నీచర్‌ను ధ‍్వంసం చేశారు. కాకతీయ కాలువకు, లక్ష్మీ కాలువకు నీటిని విడుదల చేసేవరకు ఆందోళన విరమించమని వారు పట్టుబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment