Telangana univeristy
-
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ నిషేధిత డ్రగ్స్ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ 2014లో తెయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్ (డిప్యుటేషన్) పీరియడ్ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ బయోమెట్రిక్ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి రావడంతో శ్రీనివాస్ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెడికెమ్ ల్యాబ్.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులో మెడికెమ్ ల్యాబ్ అనే సంస్థలో శ్రీనివాస్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్ అయిన వారిలో తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్ పోలీస్ అధికారులు గత నెల 22న అరెస్ట్ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇవి చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్.. -
తెలంగాణ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ల సస్పెన్షన్
తెయూ (డిచ్పల్లి) : మాజీ ఇన్చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ విద్యావర్థిని, ప్రొఫెసర్ కనకయ్యలను సస్పెన్షన్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) తీర్మానం చేసింది. తెయూ 61వ ఈసీ సమావేశం హైదరాబాద్‌లోని రూసా భవనంలో శనివారం జరిగింది. వైస్ చాన్స్‌లర్ డి రవీందర్ గుప్తా ఉదయమే హైదరాబాలోని తన స్వగృహంలో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. దీంతో కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. వర్సిటీలో జరు గుతున్న పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. తెయూ ఈసీ తీర్మానాలు.. ఈసీ ఆమోదం లేకుండా వీసీ రవీందర్ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ శివశంకర్, ప్రొఫెసర్ విద్యావర్ధిని లపై నిర్ధారిత నేరారోప అభియోగాల (ఆర్టికల్ ఆఫ్ చార్జెస్) కింద కేసులు నమోదు చేయాలి. ● వీసీ అవినీతి, అక్రమాలకు సహకరించిన కనకయ్య, విద్యావర్థిని ల ను సస్పెండ్ చేయాలి. ● ఏరియర్స్ పేరిట అక్రమంగా రూ.10 లక్షలు తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుడు శ్రీనివాస్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి. ● వివిధ కారణాలతో వీసీ పీఏలు, ఇతర సిబ్బంది తీసుకున్న అడ్వాన్సులు మొత్తం వెంటనే రికవరీ చేయాలి. ● ఇటీవల నిర్వహించిన అధ్యాపకుల క్యాస్ (కేరీర్ అడ్వాన్స్ స్కీం) పదోన్నతులకు ఆమోదం. వారికి రావాల్సిన ఎరియర్స్ చెల్లించాలి. అర్హత గల అధ్యా పకులకు రొటీన్‌గా క్యాస్ పదోన్న తులు కల్పించడం. ● 2021 –2023 వరకు నిర్వహించిన పీహెచ్డీ అడ్మిషన్లపై ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకు ల చేత విచారణ జరిపించాలి. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ నసీమ్, ప్రొఫెసర్ ఆరతి, కె రవీందర్ రెడ్డి, వసుంధర దేవి, మారయ్యగౌడ్, గంగాధర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, ఎన్ఎల్ శాస్త్రి హాజరు కాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరక్టర్ చంద్రకళ, రాజేందర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. -
రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీసీ గుప్తా
-
కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి
సాక్షి, నిజామాబాద్ (డిచ్పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు. పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు. చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి -
జీతాల కోసం హైడ్రామా..
తెయూ(డిచ్పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్ హాస్టల్స్ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్‌లో అల్పాహారం చేయలేదు. చీఫ్ వార్డెన్ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు పీఆర్వో జమీల్‌కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్‌కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్‌ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యకు ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్‌తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ క్యాంపస్‌కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు. దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్‌చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్ ఎన్ఎల్శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్‌కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. చాంబర్ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్‌కు వెళ్లారు. తమకు కనీసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారితో ఫోన్లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. -
మరోసారి విజిలెన్స్
రెండోసారి తనిఖీలు నిర్వహించడంపై తెలంగాణ వర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ చేపట్టిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, ఈసీ అనుమతి లేకుండా విచ్చలవిడిగా కొనుగోళ్లు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై ఆయా విభాగాల ఉద్యోగులను సుదీర్ఘంగా ప్రశ్నించారు. కాగా అధికారుల బృందం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆరతిలను పరిపాలనా భవనంలోకి రావాలని ఆదేశించినా వారు అందుబాటులో లేనట్లు తెలిసింది. తెయూ (డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తాపై అక్రమాలు, అవినీతి, నిధులు దుబారా చేశారని పాలకమండలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలిసారి ఈ నెల 6న వర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రామచంద్రాపురం యూనిట్ (ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల పర్యవేక్షణ) అదనపు ఎస్పీ ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోనే మంగళవారం రెండవసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం దాడులు చేసింది. నలుగురు అధికారులు ఉదయం 11 గంటలకు తెయూ పరిపాలనాభవనం చేరుకున్నారు. అకౌంట్స్, ఇంజనీరింగ్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఏవో కార్యాలయం, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సాయంత్రం 4.40 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. తొలిసారి తమ వెంట తీసుకెళ్లిన ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, సీపీయూలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. తమ పరిశీలనలో తేలిన కొన్ని అంశాలపై మరింత విస్తృత సమాచారం తీసుకోవడానికి అధికారులు మరోసారి వర్సిటీకి వచ్చినట్లు సమాచారం. తెయూ వీసీ గా ప్రొఫెసర్ రవీందర్ బాధ్యతలు తీసుకున్న ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, ఈసీ అనుమతి లేకుండా విచ్చలవిడిగా కొనుగోళ్లు చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై మరోసారి ఆయా విభాగాల ఉద్యోగులను ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వీసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, తదితర అంశాలను రికార్డు చేసుకున్నారు. సోదాల సమయంలో ఆయా విభాగాల తలుపులు మూసివేసి తనిఖీలు చేశారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆరతిని పరిపాలనా భవనంలోకి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయినట్లు తెలిసింది. అకౌంట్స్ విభాగంలో.. అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్ భాస్కర్‌ను, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్లను సుదీర్ఘంగా విచారించారు. పలు అంశాలపై అ ధికారులు ప్రశ్నలు వర్షం కురిపించా రు. అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చే సుకున్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇ చ్చిన పదోన్నతులు, దినసరి కూలీల పేరిట చెల్లించిన వేతనాలు వివరాలను తీసుకున్నారు. అధికారు ల ఎదుటే సాయాగౌడ్‌కు జూ.అసిస్టెంట్‌కు పదోన్నతుల విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అకడమిక్ కన్సల్టెంట్లకు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లిస్తున్న జీతాలకు సంబంధించి వివరాలు నమో దు చేసుకున్నారు. సాయంత్రం 4.40 గంటలకు తా ము సేకరించిన వివరాలతో నలుగురు అధికారులు తిరిగి వెళ్లిపోయారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల సమయంలో వర్సిటీలో వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య అందుబాటులో లేరు. వీసీ అయితే ఈనెల 6 నుంచి పత్తాలే కుండా పోయారని, ఆయన వైఖరి వల్లే తమకు జీ తాలు రావడం లేదని అధ్యాపకులు, బోధనేతర సి బ్బంది విమర్శిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల సో దాలు క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. -
Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి నియామకయ్యారు. ఈ నేపథ్యంలో వీసీ రవీందర్ స్పందిస్తూ రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీకి లేదన్నారు. దీంతో, రిజిస్ట్రార్ కుర్చీలో ప్రొ. కనకయ్యను వీసీ కూర్చెబెట్టారు. ఇదిలా ఉండగా.. అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలకమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని కొత్త సచివాలయంలో తెయూ 59వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ హాజరు కాకపోవడంతో సమావేశానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ చైర్మన్‌గా వ్యవహరించారు. గత నెల 19, 26, ఈ నెల 5, 12వ తేదీల్లో వరుసగా నిర్వహించిన 55, 56, 57, 58 సమావేశాల్లో చేసిన తీర్మానాల విషయమై సమావేశంలో సమీక్షించారు. 60వ సమావేశాన్ని జూన్ 3న నిర్వహించాలని, అదేవిధంగా వర్సిటీకి రిజిస్ట్రార్‌గా యాదగిరిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 15న వర్సిటీలోని రిజిస్ట్రార్ గదికి తాళం తీయించకుండా చేయడంతో అప్పటి నుంచి రిజిస్ట్రార్ యాదగిరి ఆ చాంబర్‌కు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యాదగిరి కొనసాగింపు గురించి ప్రస్తావించారు. అయితే సమావేశానికి యాదగిరి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా వీసీ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పాలక మండలి సమావేశంలో సమీక్షించిన అంశాల్లో వీసీ అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు కేసులు, ముగ్గురు రిజిస్ట్రార్ల నుంచి దుర్వినియోగమైన నిధుల రికవరీ, విద్యావర్ధిని సస్పెన్షన్, సర్వీసు పుస్తకాల టాంపరింగ్ అలాగే కనకయ్యపై పెట్టాల్సిన క్రిమినల్ కేసులు, బడ్జెట్, ఐదుగురు సభ్యుల బృందం చేయాల్సిన దర్యాప్తు తదితర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నసీమ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట -
వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించని వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తాను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండోరోజు కొనసాగింది. క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా చేశారు. వీసీ రవీందర్ ప్రస్తుత రిజిస్ట్రార్ కె.శివశంకర్ స్థానంలో ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా బి.విద్యావర్ధినిని నియమిస్తున్నట్లు తెలియడంతో ర్యాలీగా వెళ్లి వీసీ నివాసాన్ని ముట్టడించారు. తమ అందోళనను పక్కదారి పట్టించేందుకు రిజిస్ట్రార్‌ను మార్చారని ఆరోపించారు. వీసీ బయటకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వీసీ రవీందర్ బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. నూతన బాలికల హాస్టల్, ఆడిటోరియం నిర్మాణం అంశాలు తన చేతుల్లో లేవని, మిగతా సమస్యలను వారం, పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే తమ అందోళనను పక్కదారి పట్టించేందుకే రిజిస్ట్రార్‌ను మార్చారని, ఇన్చార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినిని తొలగించాలని, వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థుల తీరుపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకడమిక్, అడ్మిన్ నియామకాల విషయంలో విద్యార్థులు ప్రశ్నించకూడదని, చదువుపై దృష్టి పెట్టాలని పేర్కొని ఇంట్లోకి వెళ్లిపోయారు. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన వీసీకి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో వార్షికోత్సవం నిర్వహించాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామన్న వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి హాస్టళ్లకు తిరిగి వెళ్లారు. -
గురువు రుణం తీర్చుకున్నాడు
కేయూ క్యాంపస్ (వరంగల్): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్ చిదిమేసింది. కోవిడ్ కారణంగా గురువు చనిపోవడంతో శిష్యుడే అంత్యక్రియలు పూర్తిచేసి గురువు రుణం తీర్చుకున్నాడు. మాజీ వీసీ పశుల సాంబయ్య బుధవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని పరకాల మండలం నాగారానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుమారుడు వరుణ్‌కు ఇటీవల కరోనా సోకి తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కుమార్తె ప్రణయ గర్భవతి కావడంతో అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం వరుణ్ చేయి పట్టుకుని తలకొరివి పెట్టిద్దామదనుకున్నా ఆయన నీరసించి నిలబడలేని స్థితికి చేరడంతో సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను గురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆచార్య సాంబయ్యతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనలోనే తండ్రిని చూసుకుంటున్నానని,ఆయన పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన తాను ఇలా రుణం తీర్చుకున్నానని వెల్లడించారు. (చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి) -
తెయూ: త్వరలో కొత్త వైస్ చాన్సలర్
సాక్షి, తెయూ(నిజామాబాద్) : తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో కొత్త వైస్ చాన్సలర్ రానున్నారు. రెండు, మూడు వారాల్లో నియమితులయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీల నియామకంపై సీఎం కేసీఆర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న వీసీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకుని ఆయా వర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల (ఈసీ) నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండు, మూడు వారాల్లోనే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేసి అన్ని వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని సీఎం ఆదేశించడంతో తెలంగాణ యూనివర్సిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలో భేటీ కానున్న సెర్చ్ కమిటీ.. వీసీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల వారీగా రెండు నెలల క్రితమే సెర్చ్ కమిటీలను నియమించింది. తెయూ ఈసీ నామినీగా ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అప్పారావ్ (హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ), రాష్ట్ర ప్రభుత్వ నామినీగా సోమేశ్‌కుమార్ (ప్రస్తుత చీఫ్ సెక్రెటరీ) నియమితులయ్యారు. అయితే, ఇంతవరకు సెర్చ్ కమిటీ సమావేశం జరగలేదు. దీంతో వీసీ నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ రెండు, మూడ్రోజుల్లో భేటీ అయ్యే అవకాశముంది. వీసీ పదవికి తీవ్రమైన పోటీ.. తెయూ వీసీ పోస్టుకు ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ తర్వాత మూడో పెద్ద వర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీ పేరు గాంచింది. వీసీల నియామకాల్లో సామాజిక సమతూకాన్ని పాటిస్తారు. తెయూ తొలి రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ కాశీరాం, రెండో వీసీగా ప్రొఫెసర్ అక్బర్‌అలీఖాన్, మూడవ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ సాంబయ్య పని చేశారు. ఒకరు ఓసీ, మరొకరు మైనారిటీ, ఇంకొకరు దళిత సామా జిక వర్గానికి చెందిన విద్యావేత్తలు ఇప్పటివరకు తెయూ రెగ్యులర్ వీసీలుగా పని చేశారు. ఇక నాలుగో రెగ్యులర్ వీసీగా ఎవరు వస్తారనేది రెండు, మూడు వారాల్లో తేలనుంది. -
వర్సిటీలో కనిపించని చిరుత జాడ
సాక్షి, తెయూ(డిచ్పల్లి): చిరుత సంచరిస్తుందనే వార్తలు ఉట్టి వదంతులునేని భావించాల్సి వస్తోందని, క్యాంపస్ ఆవరణలో చిరుత ఉంటే ఇప్పటికే దాని ఆనవాళ్లు దొరికి ఉండేవని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నసీమ్ తెలిపారు. క్యాంపస్ ఆవరణలో చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనును రిజిస్ట్రార్ మంగళవారం పరిశీలించారు. బోనులో మేకను ఎరగా వేసి ఉంచినా ఎలాంటి జాడ కన్పించలేదన్నారు. చిరుత సంచరిస్తుందనే వార్తలు పుకార్లుగానే భావిస్తున్నామని, విద్యార్థులు భయాన్ని వీడి చదువుపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. మరో రోజు చూసి బోనును తీసి వేస్తామని తెలిపారు. కొందరు కావాలనే చిరుత పేరుతో పుకార్లు పుట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. చీఫ్ వార్డెన్ ఎండీ జమీల్ అహ్మద్, ఎస్టేట్ ఆఫీసర్ యాదగిరి, సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్, అధ్యాపకులు పాల్గొన్నారు. చదవండి: వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా -
వీసీ కనబడుటలేదు.. విద్యార్థుల నిరసన
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. యూనివర్సిటీ వైస్ చాన్సులర్ (వీసీ) గత పదిహేను రోజులుగా కనిపించడంలేదంటూ విద్యార్థులు కరపత్రాన్ని విడుదల చేశారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగులు గత నెల రోజులుగా విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు విధులకు రాకపోవడంతో క్లాస్‌లు జరగడంలేదని విద్యార్థులు వీసీకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. కానీ వీసీ సాంబయ్య విద్యార్థుల సమస్యలపై పట్టీపట్టనట్టు ఉంటున్నారని, ఇన్ని సమస్యలు ఉన్నా గత పదిహేను రోజులుగా యూనివర్సిటీకి రావడంలేదంటూ విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ యూనివర్సిటీలో ఆందోళనకు దిగి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
మాజీ రిజిస్టార్కు పెన్షన్ కష్టాలు
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలపై భార్యతో కలిసి నిరసనకు దిగారు. ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ యూనివర్సిటీలో మాజీ రిజిస్ట్రార్ ధర్మరాజు పెన్షన్ డబ్బులు రావడం లేదని రిజిస్ట్రార్ చాంబర్లో తన భార్యతో సహా బైఠాయించారు. గత మూడేళ్లుగా పెన్షన్ డబ్బులు రావట్లేదని ఆందోళన చేపట్టారు. భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా రోదిస్తూ...పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతామని, భిక్షం ఎత్తుకుని బతకాలా అంటూ ఆవేదన చెందారు. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
భారత్ మాతాకీ జై కాదు..భీమ్..భూమ్ జై అనాలి
తెయూ(డిచ్పల్లి): భారత దేశ పౌరులంద రూ భారత్ మాతా కీ జై.. అనే నినా దాన్ని మానుకుని జై భీమ్.. జై భూమ్.. అనే నినాదాన్ని చేయాలని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. బుధవా రం డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సి టీ క్యాంపస్‌లో తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహనీయుల జయంతి వేడుకలు’ కార్యక్రమానికి కంచె ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు గోమాతను పూజించాలని చెబుతుంటారని, అయితే గోవు కంటే బర్రె (గేదె) పాలు ఎక్కువగా ఇస్తుందని, మరి బర్రెలను పూజించమని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. గొల్ల కులంలో పుట్టిన అందరికీ వేపకాయంత వెర్రి ఉంటుందని, తనకు మాత్రం తాటికాయంత వెర్రి ఉందన్నారు. మంగళి కత్తి, చాకలి వృత్తి గొప్పవని, దేశంలో బ్రాహ్మణ రెజియేషన్ ఉందా అని ప్రశ్నించారు. భారత దేశానికి నిజమైన శత్రువు పాకిస్తాన్ కాదని, చైనా నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. భవిష్యత్‌లో చైనాను ఎదుర్కొవాలంటే బెండకాయ, బీరకాయ తింటే సరిపోదని, మంచి బీఫ్ తినాలని పిలుపునిచ్చారు. రాందేవ్ బాబా యోగా ఉత్త గేమ్ అని, ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజులు చేయాల ని సూచించారు. అలాగే ఇతరులతో పోటీ పడాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రజ్ఞ మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫూలేను చదువుల తల్లిగా కొలువాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5న సావిత్రి ఫూలే జయంతిని గురుపూజోత్సవం జరుపుకోవాలన్నారు. చిన్నారి ఆసిఫా అత్యాచారం, హత్య ఘటనలో రాజకీయ కుట్ర దాగి ఉం దని ఆరోపించారు. హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బంగ్యా బుక్యా, ఎస్ఎస్డీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంజర్ల నరేశ్, డాక ్టర్ మోతీలాల్, ఏఎస్ఏ తెయూ కన్వీనర్ జగన్, అధ్యక్షుడు అశోక్‌సామ్రాట్, రాజేందర్ పాల్గొన్నారు. -
పునరుత్పాదక ఇంధనాలదే భవిష్యత్
తెయూ(డిచ్పల్లి): కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ రంగాలలో పరిశోధనలకు దక్షిణాఫ్రికా దేశంలో అపార అవకాశాలున్నాయని దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుబూసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు కాలం చెల్లుతుందని, రాబోయే రోజులన్నీ పునరుత్పాదక ఇంధనాలదేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘భవిష్యత్ ఇంధనాలు’ అనే అంశంపై సుబూసింగ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోతున్నాయని, వాటి వాడకం వల్ల పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, సుస్థిర అభివృద్ధి, ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నా పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. శిలాజ ఇంధనాలు రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారణాలతో సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. హైడ్రోజన్ ఆధారిత ఇంధనాల అభివృద్ధి దిశగా తాము ప్రయోగాలు చేస్తున్నామని, ఇది భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశోధనలకు విస్తృత అవకాశాలున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఎంఎస్, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లో చేరవచ్చన్నారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబూసింగ్ డర్బన్‌లోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాలుగా కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. టూటా అధ్యక్షుడు రాజారాం, కార్యదర్శి పున్నయ్య, పరీక్షల నియంత్రణాధికారి యాదగిరి, ఫార్మా విభాగం హెడ్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ శిరీష, సత్యనారాయణ, నాగరాజు, సాయిలు తదితరులు సుబూసింగ్‌ను సత్కరించారు. -
కుల వ్యవస్థ నిర్మూలనతోనే సమాజ మార్పు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రగాఢంగా కోరుకున్నారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.శ్రీనివాసులు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్- సమకాలీన భారతదేశంలో కులం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే దేశంలో నూతన సమాజ ఆవిష్కరణ జరుగుతుందని పూలే, అంబేద్కర్ స్పష్టం చేశారన్నారు. వారిద్దరూ కులవ్యవస్తను తీవ్రంగా వయతిరేకించారన్నారు. కుల వ్యవస్థకు అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య చరిత్రలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉందన్నారు. కుల వ్యవస్థ విషయంలో మార్క్సిస్టుల అవగాహనకు, అంబేద్కర్ అవగాహనకు ఎంతో తారతమ్యం ఉందన్నారు. భారతీయ సమాజంలో కుల ప్రాధాన్యత తగ్గినట్లు గతంలో ఎంఎన్ శ్రీనివాస్ వంటి మేధావులు చెప్పినా, వాస్తవ ం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఇప్పటికీ కుల ప్రభావం నిమ్నవర్గాలను చిన్నచూపు చూస్తుందన్నారు. తెయూ వీసీ అక్బర్‌అలీఖాన్ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల వారికి సమానమైన అవకాశాలు లభించాలన్నారు. అప్పుడే సమాజంలో శాంతి, సౌభాగ్యం వెళ్లివిరిస్తుందన్నారు. వనరుల పంపిణీ సమాన స్థాయిలో జరిగి అన్నివర్గాలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కేయూ సామాజిక శాస్త్ర విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ రాములు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యా రు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సదస్సుకు అధ్యక్షత వహించారు. సదస్సులో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కనకయ్య, ఆర్ట్స్ విభాగం డీన్ ధర్మరాజు, బీసీ సెల్ డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా తెయూ స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవాన్ని ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. వర్సిటీలోని తన చాంబర్లో శుక్రవారం రిజిస్ట్రార్ లిం బాద్రి, సీఓఈ నసీంలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మిని ట్స్ ప్రకారం తెయూ స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తామని అన్నా రు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, దేశంలోని వివిధ వర్సిటీల వైస్చాన్స్లర్లు హాజరవుతారని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరవుతున్న యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్‌కు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్)కు ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్ ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, పలు గ్రంథాలు రచించారన్నారు. యూజీసీ చైర్మన్‌గా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, వర్సిటీ ల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ అందజేశారని వివరించారు. మినిట్స్ ప్రకారమే.. తెయూ తొలి స్నాతకోత్సవ వేడుకలను క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ సైన్స్ భవనంలో నిర్వహిస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్-1991 ప్రకారమే నిర్వహిస్తామన్నారు. మినిట్స్ టు మినిట్స్ కార్యక్రమ వివరాలు నిర్ణయించిన మేరకు జరుగుతాయన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 2006 నుంచి 2013వరకు వర్సిటీలో సుమారు ఐదువేల మంది విద్యార్థులు పీజీ కోర్సులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. 2013 వరకు ఆరు బ్యాచ్‌లు పూర్తయ్యాయన్నారు. వీరికి పాలకమండలి అనుమతి లభించిందన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు గవర్నర్ కాన్వొకేషన్(పట్టా)లు అందజేస్తారని చెప్పారు. మొత్తం 1497మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిబంధనలు పాటించాలి.. నవంబర్ 13న మద్యాహ్నం రెండు గంటలకు స్నాతకోత్సవ వేడుకలను గవర్నర్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభింస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని సూచించారు. విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించి రావాలని, 12గంటల లోపు వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలన్నారు. గుర్తింపుకార్డు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్నాతకోత్సవ కార్యక్రమానికి అనుమతించ బోమని రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టంచేశారు. కాన్వొకేషన్ కోసం 939మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 558 మంది బీఈడీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాన్వొకేషన్స్ అందుకునే విద్యార్థులతో డిగ్రీ విలువను కాపాడుతామని గవర్నర్ ప్రతిజ్ఞ చేయిస్తారని వీసీ తెలిపారు. స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా డీన్స్ సమావేశం నిర్వహించామన్నారు. స్నాతకోత్సవ వేడుకలను మిగతా విద్యార్థులు వీక్షిం చేందుకు కంప్యూటర్ సైన్స్ భవనం బయట ఎల్సీడీ తెరలు ఏర్పాటు చేస్తామన్నారు. అందరినీ గౌరవిస్తాం.. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లాలో నెలకొల్పేందుకు కృషి చేసిన రాజకీయ పార్టీల నాయకులు, సహకరించిన మీడియా వారికీ స్నాతకోత్సవం సందర్భంగా తగిన రీతిలో గౌరవిస్తామని తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించలేదని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్నాతకోత్సవం లో పాల్గొనే విద్యార్థులందరికీ తెయూ పూర్వవిద్యార్థుల(అలుమిని) అసోసియేషన్ డెరైక్టర్ ద్వారా ఆహ్వానాలు పంపించామన్నారు. -
16 మంది టాపర్లకు గోల్డ్‌మెడల్స్
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 13న జరగనున్న తొలి స్నాతకోత్సవంలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 16 మంది టాపర్లు గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. స్నాతకోత్సవాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 16 కమిటీలను నియమించి, ఒక్కో కమిటీకి ఒక్కో పనిని అప్పగించారు. దీంట్లో గోల్డ్‌మెడల్ సెలక్షన్ కమిటీ ఒకటి. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరు బ్యాచులు పూర్తయ్యాయి. అసలే నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న వర్సిటీ తరపున ప్రతి బ్యాచు టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలంటే తలకు మించిన భారమే. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి జిల్లాకు చెందిన వివిధ రంగాల్లో పలువురు ప్రముఖులను కలిసి టాపర్లకు గోల్డ్ మెడల్స్ అందజేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. రిజిస్ట్రార్ విన్నపాన్ని మన్నించడంతో పాటు వర్సిటీ అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేయాలని సదుద్దేశంతో 15 మంది దాతలు గోల్డ్ మెడల్స్ అందజేయాలని కోరు తూ ఒక్కొక్కరు రూ.2.10లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఒక్కో దాత తమకు నచ్చిన కోర్సులో టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలని సూచించారు. అలాగే వర్సిటీ ఉన్నతాధికారులు తమ వంతుగా ఒకరికి డాక్టర్ బీఆర్ అంబేద ్కర్ మెమోరియల్ గోల్డ్‌మెడల్ పేరిట అన్ని కోర్సుల్లో కలిపి టాపర్‌గా నిలిచిన వారికి గోల్డ్ మెడల్ అందజేయాలని నిర్ణయించారు. దీంతో తొలి స్నాతకోత్సవంలో 15 కోర్సుల్లో టాపర్లతో పాటు యూనివర్సిటీ టాపర్‌కు గోల్డ్‌మెడల్ అందజేయనున్నారు. దాతలు విరాళాలు అందజేసిన కోర్సులకు సంబంధించి గోల్డ్‌మెడల్ ఇవ్వనున్న టాపర్ల జాబితాకు వర్సిటీ పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కమిటీ) అనుమతి లభించింది. వర్సిటీ ఆధ్వర్యంలో ఇ చ్చే టాపర్‌కు పాలకమండలి అనుమతి లభిం చాల్సి ఉందని రిజిస్ట్రార్ లింబాద్రి తెలిపారు. -
ఎంజీయూలో ఫార్మా విద్యార్థుల నిరవధిక దీక్ష
ఎంజీయూ (నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ కోర్సుకు ఫ్యాకల్టీని నియమిం చాలని, ల్యాబ్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవా రం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించి విద్యాబోధన చేస్తుండగా ఎంజీయూలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో విద్యాబోధన చేయించడం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. 80 శాతం ఫార్మ సిలబస్‌ను బోధించే వారు లేకపోవడంతో 150 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం గా మారిందని అన్నారు. పూర్తిస్థాయి లో అధ్యాపకులను నియమించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షలో శివ, సోహెబ్, రాజు, నితిన్, దినేశ్, వెంకట్ పాల్గొన్నారు. నేడు ఎంజీయూ బంద్ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మాసూటికల్ విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా గురువారం ఆ వర్సిటీ బంద్‌కు ఎంజీయూ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఆ సమితి ప్రకటన విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ కోర్సుకు ఫ్యాకల్టీని నియమించాలని, ప్రయోగశాల వసతి కల్పించాలని డిమాండ్ చేసింది. బోధన సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరింది.