జీతాల కోసం హైడ్రామా.. | - | Sakshi
Sakshi News home page

జీతాల కోసం హైడ్రామా..

Jun 15 2023 7:14 AM | Updated on Jun 15 2023 10:53 AM

తెయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ను నిలదీస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు - Sakshi

తెయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ను నిలదీస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు

తెయూ(డిచ్‌పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్‌ హాస్టల్స్‌ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్‌లో అల్పాహారం చేయలేదు. చీఫ్‌ వార్డెన్‌ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు.

విద్యార్థులు పీఆర్‌వో జమీల్‌కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్‌కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్‌ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్‌ వివరించారు.

ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్‌, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ కనకయ్యకు ఫోన్‌లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్‌తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ సత్యనారాయణ క్యాంపస్‌కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్‌వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్‌ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్‌వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు.

దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్‌చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్‌ ఎన్‌ఎల్‌శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్‌కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు.

చాంబర్‌ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్‌ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్‌కు వెళ్లారు. తమకు కనీసం ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ వారితో ఫోన్‌లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement