తెయూ (డిచ్‌పల్లి) : మాజీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ విద్యావర్థిని, ప్రొఫెసర్ కనకయ్యలను సస్పెన్షన్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) తీర్మానం చేసింది. తెయూ 61వ ఈసీ సమావేశం హైదరాబాద్‌లోని రూసా భవనంలో శనివారం జరిగింది. వైస్ చాన్స్‌లర్ డి రవీందర్ గుప్తా ఉదయమే హైదరాబాలోని తన స్వగృహంలో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. దీంతో కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. వర్సిటీలో జరు గుతున్న పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తెయూ ఈసీ తీర్మానాలు..
ఈసీ ఆమోదం లేకుండా వీసీ రవీందర్ నియమించిన ఇన్‌చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ శివశంకర్, ప్రొఫెసర్ విద్యావర్ధిని లపై నిర్ధారిత నేరారోప అభియోగాల (ఆర్టికల్ ఆఫ్ చార్జెస్) కింద కేసులు నమోదు చేయాలి.
● వీసీ అవినీతి, అక్రమాలకు సహకరించిన కనకయ్య, విద్యావర్థిని ల ను సస్పెండ్ చేయాలి.
● ఏరియర్స్ పేరిట అక్రమంగా రూ.10 లక్షలు తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుడు శ్రీనివాస్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి.
● వివిధ కారణాలతో వీసీ పీఏలు, ఇతర సిబ్బంది తీసుకున్న అడ్వాన్సులు మొత్తం వెంటనే రికవరీ చేయాలి.
● ఇటీవల నిర్వహించిన అధ్యాపకుల క్యాస్ (కేరీర్ అడ్వాన్స్ స్కీం) పదోన్నతులకు ఆమోదం. వారికి రావాల్సిన ఎరియర్స్ చెల్లించాలి.
అర్హత గల అధ్యా పకులకు రొటీన్‌గా క్యాస్ పదోన్న తులు కల్పించడం.
● 2021 –2023 వరకు నిర్వహించిన పీహెచ్‌డీ అడ్మిషన్లపై ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకు ల చేత విచారణ జరిపించాలి.
ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ నసీమ్, ప్రొఫెసర్ ఆరతి, కె రవీందర్ రెడ్డి, వసుంధర దేవి, మారయ్యగౌడ్, గంగాధర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, ఎన్‌ఎల్ శాస్త్రి హాజరు కాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరక్టర్ చంద్రకళ, రాజేందర్‌రెడ్డి గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment