కామారెడ్డి టౌన్: పొలా లకు వెళ్లేందుకు అటవీ భూమిలోంచి కల్వర్టు ని ర్మించుకుంటున్న రైతులను లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు. రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అంగిళ్ల ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు.. రాజంపేట మండలం ఆర్గొండ అటవీ శివారు ప్రాంతంలో భూములున్న రైతులు.. తమ పొలాల వ ద్దకు వెళ్లడానికి వీలుగా మట్టితో రోడ్డు వేసుకున్నా రు. ఈ దారిలో కొంత అటవీ భూమి కూడా ఉంది. అందులో కల్వర్టు నిర్మించుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న రాజంపేట మండలం కొండాపూర్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను.. పనులను నిలిపివేయాలని రైతులతో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు రూ. 30 వేలు ఇ వ్వాలని డిమాండ్ చేశాడు. ఆర్గొండ మాజీ సర్పంచ్, రైతు తుల సిద్దిరాములు రైతుల తరపున మధ్యవర్తిగా వ్యవహరించి, రూ.20వేలు ఇవ్వడానికి ఒ ప్పుకున్నారు. గతంలో సిద్దిరాములు తన కూతురి పెళ్లి సందర్భంలో అడవి నుంచి వంట చెరుకు తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు.
అది ఎందుకూపనికి రానిది కావడంతో వదిలేశారు. ఈ విషయంపై ఇటీవల సిద్దిరాములు ఇంటికి వెళ్లిన సదరు బీట్ ఆఫీసర్.. తాను చెబితేనే వదిలేశారని, ఇప్పు డు కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. కేసు పెట్టకుండా ఉండడానికి రూ. 40 వేలు ఇవ్వాలని డి మాండ్ చేశాడు. లేకపోతే తన ఇంటికోసం డోర్ ఫ్రేం తయారు చేయించి ఇవ్వాలన్నాడు. ఆ అధికా రి తీరుతో విసిగిపోయిన సిద్దిరాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు చెప్పిన విధంగా కామారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్దనున్న ఓ ఉడిపి హోటల్‌లో బుధవారం రూ.20 వేలను అటవీ అధికారికి అందించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment