ఖలీల్‌వాడి : జిల్లాలో ఇటీవల ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. అక్రమార్కులు మధ్యవర్తుల ద్వారా గాని తనకు అనుకూలంగా ఉన్న వారితో లంచాలు తీసుకోవడంతో కొంత కాలంగా ఏసీబీ దాడుల ఊసు లేకుండా పోయింది. అయితే లంచం తీసుకుంటూనే అక్రమార్కులు ఇబ్బందులకు గురి చేయడంతో బాధితు లు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.కాగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభమై ఏడాది పూర్తి కాక ముందే అందులోని సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో దాడులు చేసి ఏసీబీ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం డిమాండ్ చేస్తే డైరెక్ట్‌గా టోల్‌ఫ్రీనెంబర్ 1064కు కాల్ చేయాలని ఏసీబీ డీఏస్పీ ఆనంద్ సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. బాధితులు జిల్లా కేంద్రంలోని ఏసీబీ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చన్నారు.
తాజాగా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన దుగ్గెన రాజేందర్ వద్ద నాల కన్వర్షన్‌కు చెందిన పంచనామా పత్రం కోసం రూ. 10 వేలు డిమాండ్ చేసిన జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు.
ఈ నెల 17న తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా భీమ్‌గల్‌లోని ఓ ప్రవేట్ కాలేజీలో పరీక్ష సెంటర్ అనుమతి కోసం రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుపడ్డారు. హైదరాబాద్ తార్నాకలోని వీసీ ఇంటిలోనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment