bribe case
-
సౌరభ్ ప్రసాద్ రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు
-
ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులు అరెస్ట్
-
ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన జేఎంఎం ముడుపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు లంచాల కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు లంచాల కేసులో ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగినా విచారణ ఎదుర్కోవాల్సిందే లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ఓటు వేయడం తప్పే, విచారణ ఎదుర్కోవాల్సిందే చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఎందుకుండాలి? 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జిల తీర్పును కొట్టేసిన ధర్మాసనం ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడటం, లంచాలు తీసుకోవడం పార్లమెంట్ వ్యవస్ధ పనితీరును నాశనం చేస్తుంది ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో రాజ్యాంగ రక్షణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ధర్మాసనం.. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగితే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. Seven-judge Constitution bench of the Supreme Court rules that an MP or MLA can't claim immunity from prosecution on a charge of bribery in connection with the vote/speech in the Parliament/ Legislative Assembly. Supreme Court’s seven-judge bench in its unanimous view overruled… pic.twitter.com/xJ4MRWvpoO — ANI (@ANI) March 4, 2024 ఇదే సమయంలో 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు కేసులో నిందితులపై చర్యలు తీసుకోకుండా.. అప్పటి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. -
మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రూ.3 లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకి చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్ సీఐకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏసీబీ కార్యాలయానికి నరేందర్‌ను తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డును ఏసీబీ తరలించింది. సీఐ నరేందర్‌ను 20 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్కెలాంజ్ పబ్ యజమానులను ప్రశ్నించిన ఏసీబీ.. స్టేట్మెంట్ రికార్డు చేసింది. పబ్ వ్యవహారంతో పాటు... మిగతా వసూళ్ల పైనా ఏసీబీ ఆరా తీస్తోంది. 9న విచారణకు హాజరుకావాలి.. ఏసీబీ నోటీసులు.. నరేందర్ వసూళ్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ, ఎస్ఐ హోం గార్డ్లకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్ దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. చదవండి: మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్ -
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్
-
లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ..
జగిత్యాల: మెట్పల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్ఐ తిరుపతితోపాటు అతడి సహాయకుడు ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన వివరాలను ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ వీవీ.రమణమూర్తి వెల్లడించారు. మండలంలోని మేడిపల్లికి చెందిన బద్దం శంకర్‌కు గ్రామ శివారులోని సర్వే నంబర్ 797/ఉ/1లో తన భార్య లక్ష్మి పేరిట ఏడు గుంటల భూమి ఉంది. దీనిని నాలా కన్వర్షన్ కోసం గత నెల 22న స్లాట్ బుకింగ్ చేసుకున్నాడు. ఆర్ఐ తిరుపతిని కలువగా.. రూ.25వేల లంచం కావాలని, లేకుంటే పని కాదని తేల్చి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని, రూ.15వేలు ఇస్తానని శంకర్ వేడుకున్నాడు. దీనికి ఆర్ఐ అంగీకరించాడు. ఈ క్రమంలో శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్ఐని ఫోన్లో సంప్రదించగా.. తన సహాయకుడు ప్రవీణ్‌కు ఆ మొత్తాన్ని ఇవ్వాలని చెప్పాడు. దీంతో కార్యాలయానికి వెళ్లిన శంకర్ డబ్బులను ప్రవీణ్‌కు అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న అధికారులు ప్రవీణ్‌తోపాటు ఆర్ఐ తిరుపతిని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఏసీబీ దాడి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. సమాచారం తెలపడానికి, ఫొటోలు తీసుకునేందుకూ అంగీకరించలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అధికారులు కార్యాలయం బయటకు వచ్చి నామమాత్రంగా వివరాలు వెల్లడించి వెళ్లిపోయారు. -
నిజామాబాదు జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం...
ఖలీల్‌వాడి : జిల్లాలో ఇటీవల ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. అక్రమార్కులు మధ్యవర్తుల ద్వారా గాని తనకు అనుకూలంగా ఉన్న వారితో లంచాలు తీసుకోవడంతో కొంత కాలంగా ఏసీబీ దాడుల ఊసు లేకుండా పోయింది. అయితే లంచం తీసుకుంటూనే అక్రమార్కులు ఇబ్బందులకు గురి చేయడంతో బాధితు లు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.కాగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభమై ఏడాది పూర్తి కాక ముందే అందులోని సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో దాడులు చేసి ఏసీబీ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం డిమాండ్ చేస్తే డైరెక్ట్‌గా టోల్‌ఫ్రీనెంబర్ 1064కు కాల్ చేయాలని ఏసీబీ డీఏస్పీ ఆనంద్ సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. బాధితులు జిల్లా కేంద్రంలోని ఏసీబీ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చన్నారు. తాజాగా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన దుగ్గెన రాజేందర్ వద్ద నాల కన్వర్షన్‌కు చెందిన పంచనామా పత్రం కోసం రూ. 10 వేలు డిమాండ్ చేసిన జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ఈ నెల 17న తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా భీమ్‌గల్‌లోని ఓ ప్రవేట్ కాలేజీలో పరీక్ష సెంటర్ అనుమతి కోసం రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుపడ్డారు. హైదరాబాద్ తార్నాకలోని వీసీ ఇంటిలోనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం ఏడు బృందాలు
బెంగళూరు: కన్నడనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడుపుల వ్యవహారం.. అధికార బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్ ఈ కేసులో అరెస్ట్ కాగా, ఈ స్కాంకు సంబంధించి ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ సూపరిడెంట్స్ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ముడుపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న చన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విరూపాక్షప్ప కోసం ఆయా బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా బెంగళూరు, దావణగెరెలో గాలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కు లోకాయుక్త అధికారులు సీఆర్పీసి– 41 ఏ కింద నోటీస్ జారీచేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు, దావణగెరెలోని విరూపాక్షప్ప నివాసాలతో పాటు అధికారిక నివాసం, చన్నగిరిలోని కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించారు. విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్.. సబ్బులు, డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల డీల్‌ను క్లియర్ చేయడానికి రూ. 40 లక్షల లంచం రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, ఆ మరుసటిరోజు జరిగిన సోదాల్లో ఇంట్లో రూ. 6 కోట్లకు మించిన నగదు లభ్యం కావడం, అలాగే ప్రైవేట్ కార్యాయలంలో మరో రూ. 2 కోట్లు లభించడం.. మొత్తంగా ముడుపుల వ్యవహారం బయటపడింది. ఆ వెంటనే కేఎస్డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విరూపాక్షప్ప.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముడుపుల స్కాంలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పనే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్న అధికారులు.. ఆయన కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు తనయుడు ప్రశాంత్‌ను, మరో నలుగురు జ్యూడిషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం అధికార బీజేపీని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. కాంగ్రెస్ ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పార్టీనే(బీజేపీ) ఈ వ్యవహారం చూసుకుంటుందని చెబుతోంది. -
బయట పెట్టమంటావా.. రూ.2 కోట్లు చెల్లిస్తావా..
ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు పోలీసులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. ఓ వ్యాపారి స్నేహితుడి మరణానికి సంబంధించి డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.10 లక్షలను చెల్లించే క్రమంలో ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా కానిస్టేబుల్ గణేష్ చావన్‌ను పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మే 2 న పర్భనిలోని సెలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ 35 ఏళ్ల వ్యాపారి మరణించాడు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అతడిని వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనపై మే 3న సెలు పోలీస్ స్టేషన్లో ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే కొన్ని నెలల తర్వాత, మరణించిన వ్యక్తి భార్య అతడి స్నేహితుడు మాట్లాడుకున్న ఓ ఆడియో టేప్ వైరల్ అయ్యింది. ఇదే అదునుగా భావించిన డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ సదరు వ్యక్తిని రూ.2 కోట్లు చెల్లించమని బెదిరింపులకు దిగాడు. దీంతో సదరు వ్యక్తి ముంబైలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇందోలో భాగంగా మొదటి విడత రూ.10 లక్షలు కానిస్టేబుల్ గణేష్ చావన్ నివాసంలో చెల్లించడానికి అంగీకరించాడు. దీంతో ఏసీబీ అధికారులు కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీని వెనుక డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ ఉన్నట్లు తేలడంతో.. అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. -
Lalu Prasad Yadav: లంచం కేసులో లాలూకి క్లీన్ చీట్?
సాక్షి, న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ గ్రూప్ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినట్టు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినా... ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ తమ విచారణ కొనసాగించనుంది. రైల్వే ప్రాజెక్ట్లులో ... యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. డీఎల్ఎఫ్కి లబ్ధి చేకూర్చినందుకు 2007లో దక్షిణ ఢిల్లీలో రూ. 30 కోట్లు విలువ చేసే స్థలాన్ని లాలుకి కట్టబెట్టారని, ఆ తర్వాత 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరకే విలువైన షేర్లు అందించారనే ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల విచారణ లంచం తీసుకుని డీఎల్ఎఫ్ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం. కేసు నమోదైన కొత్తలో పూర్వపు స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని, లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని... ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్‌కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి క్లీన్‌చీట్ ఇచ్చింది. డీఎల్ఎఫ్ లంచం కేసులో 2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు లాలూ జైలులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్ రావడంతో లాలూ బయటకు వచ్చారు. -
‘బొల్లినేని’ కేసు: కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ
-
‘బొల్లినేని’ కేసులో సీబీఐ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అవినీతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి బొల్లినేని శ్రీనివాసగాంధీకి వ్యతిరేకంగా పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. జీఎస్టీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీలు కలిసి ఓ వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ సెప్టెంబర్ 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసి అత్యంత కీలకమైన ఆడియో రికార్డులు, పలు ఫొటోలు సంపాదించింది. ఇందులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, చిలుక సుధారాణి, బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిల సంభాషణల రికార్డులున్నాయని తెలిసింది. వీరు రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా తీసిన పలు ఫొటోలు కూడా సీబీఐ సేకరించిందని సమాచారం. ఈ కాల్స్‌లో లంచం డిమాండ్ చేయడం, వాటిని ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలో సత్యశ్రీధర్‌రెడ్డికి సూచించిన వ్యవహారం మొత్తం రికార్డయింది. (చదవండి: స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు) అసలేం జరిగిందంటే..? ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్, దాని అనుబంధ కంపెనీలు అక్రమమార్గంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందాయంటూ జీఎస్టీలో కేసు నమోదైంది. కేసులో నింది తుడు జగన్నగారి సత్యశ్రీధర్‌రెడ్డి అరెస్టయి, మార్చి 29న విడుదలయ్యాడు. ఇదే కేసులో వ్యాపార భాగస్వామిగా ఉన్న అతని భార్య అరెస్టు కాకుండా, మొత్తం కేసును నీరుగార్చేందుకు హైదరాబాద్ జీఎస్టీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న చిలుక సుధారాణి, అదే విభాగంలో సూపరింటెండెంట్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీలు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధితుడు సత్యశ్రీధర్ కూడా అంగీకరించాడు. అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఏప్రిల్ 15న చెల్లించాడు. మిగిలిన రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్ప్లాట్ల రూపంలో ఇవ్వాలని వారు షరతు విధించారు. ఈ లంచం వ్యవహారంలో సీబీఐకి ఉప్పందింది. దీంతో సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలతోపాటు లంచం విషయాన్ని తమకు చెప్పకుండా దాచినందుకు బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. ఏడాదికాలంలో బొల్లినేనిపై రెండో కేసు నమోదు కావడం గమనార్హం. గతేడాది బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్ ఎగవేత కేసును దర్యాప్తు చేసింది సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలే. (చదవండి: చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు) -
బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
-
చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ కమిషనరేట్‌లో ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ పన్ను ఎగ వేత నిరోధక విభాగం డిప్యూటీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరిం టెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీ, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్‌రెడ్డిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజా కేసు నమోదైందని సమాచారం. అసలేం జరిగిందంటే.?: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ పన్ను ఎగవేత విభాగంలోని అధికారులు లంచం తీసుకున్నట్లుగా గతేడాది అక్టోబర్ 31న సీబీఐకి సమాచారంఅందింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్– దాని అనుబంధ సంస్థలు అక్రమంగా ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తు చేసింది. కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 2019, ఏప్రిల్ 15న రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి భూములను కొనివ్వాలన్న ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై సీబీఐకిగానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఫిర్యాదు చేయనందుకుగాను సత్య శ్రీధర్‌రెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాగా, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాసగాంధీపై గతేడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అక్రమాస్తులు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో (ఈడీ) పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై విరుచుకుపడినట్లు ఆరోపణలున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీబీఐ గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువచేసే అక్రమాస్తుల్ని గుర్తించింది. ఈ కేసు ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ శ్రీనివాసగాంధీపై అదే నెల 23న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన కేసు, చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్న వారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు గాంధీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2019, జూన్ 26 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు... చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధి కారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు పైరవీల ఫలితంగా ఆయన్ను బషీర్‌బాగ్ జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీ సర్గా నియమించారు. ఆ విభాగం కేంద్రం గా చేసిన అవినీతిపై తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది. గతంలో ఎవరూ పని చేయని విధంగా బొల్లినేని గాంధీ ఈడీలో సుదీర్ఘకాలం పని చేశారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ.. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయన ఏడాది పాటు పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 వరకు ఎలాంటి బది లీలు లేకుండా ఈడీలోనే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పని చేసి వచ్చిన వారికి జీఎస్టీలో ఫోకల్ పోస్టు ఇవ్వరు. అయితే దీనికి భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, దీనికి బదులుగా భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు... గడిచిన పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు కట్టారు. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో, స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గత ఏడాది నమోదు చేసిన తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది. త్వరలో ఈ కేసుకు సంబంధించి గాంధీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీనివాసగాంధీపై సీబీఐ రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో బొల్లినేనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
ఇన్స్పెక్టర్ చెప్పాడు.. ఎస్సై చేశాడు!
బంజారాహిల్స్: ఓ చీటింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కేసు రాజీ చేయడానికి జూబ్లీహిల్స్ పోలీసులు రూ.లక్ష నగదు, రెండు ‘వ్యాట్ 69’మద్యం బాటిళ్ళు లంచంగా డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ బల్వంతయ్య సూచనల మేరకు అంగీకారం కుదిరిన రూ.50 వేల నగదు, మద్యం బాటిళ్ళు తీసుకుంటున్న ఎస్సై పి.సుధీర్‌రెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఇతడి వాంగ్మూలంతో పాటు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా బల్వంతయ్య పైనా కేసు నమోదు చేశారు. ఇటు సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న బల్వంతయ్య కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావు మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయ్ అనే వ్యాపారి జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.10లో ‘ఫేజ్ 3 లగ్జరీ సెలూన్’నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్ 27న వంశీకృష్ణ చౌదరి అనే వ్యక్తి తన భార్యను తీసుకుని ఈ సెలూన్‌కు వచ్చారు. అక్కడ రూ. 34,130 విలువైన ట్రీట్మెంట్స్ చేయించాడు. ఈ బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోవడంతో అక్షయ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో వంశీకృష్ణపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే డిసెంబర్ 31నే వంశీకృష్ణకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు, అలాగే ఐపీసీ 406 సెక్షన్ తీసేసి కేసును లోక్ అదాలత్‌కు పంపేలా చేసేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ.50 వేలు, రెండు మద్యం సీసాలను ఇస్తానని అంగీకరించిన వంశీ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో బాధితుడి నుంచి ఎస్సై సుధీర్ డబ్బులు, మద్యం బాటిళ్లను తీసుకుంటుండగా మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సుధీర్‌రెడ్డి 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై కాగా.. బల్వంతయ్య స్పెషల్‌బ్రాంచ్ నుంచి కొన్నాళ్ళ క్రితం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చారు. -
ఎందుకు చేశావ్ ఈ పని?
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : ‘పిత్రార్జితం ద్వారా సంక్రమించిన ఎకరంన్నర పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చేందుకు వీఆర్వో పుల్లయ్య రూ.50 వేలు లంచం అడిగాడు. గత్యంతరం లేని స్థితిలో రూ.50 వేలు ఇచ్చి వెంటనే పనిచేసి పెట్టమన్నాను. ఏడాదిన్నరగా తిప్పుకుంటూ భూమిని ఆన్లైన్ చేయించకపోగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు’ అంటూ అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. పెదపాలెంకు చెందిన తురకా రామకోటమ్మ అనే మహిళా రైతు చాలా ఆవేదనతో ఎమ్మెల్యే వద్దకు వచ్చి తన గోడు వినిపించింది. అప్పు చేసి మరీ వీఆర్వో పుల్లయ్యకు రూ.50 వేలు ఇచ్చానని తెలిపింది. చలించిన ఎమ్మెల్యే శంకరరావు వెంటనే వీఆర్వో పుల్లయ్యను పిలిపించారు. ‘ఎందుకు చేశావ్ ఈ పని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సార్.. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆన్లైన్ చేయలేకపోయా. పాస్ పుస్తకం ఇవ్వలేకపోయా’నని వీఆర్వో సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. ‘లంచం తీసుకున్నావా. లేదా’ అని ఎమ్మెల్యే నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. రెండు రోజుల్లో ఆమె భూమిని ఆన్లైన్ చేయించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రూ.50 వేలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మరికొందరు వీఆర్వోల అవినీతి, అక్రమాలనూ పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీఆర్వో పుల్లయ్య సస్పెండ్ పట్టాదారు పాసుపుస్తకాల కోసం వచ్చిన ఒక మహిళ వద్ద రూ.50 వేల లంచం తీసుకుని యేడాదిన్నర కాలంగా తిప్పుకున్న వీఆర్వో పుల్లయ్యను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అచ్చంపేట తహసీల్దార్ రాంభూపాల్‌రెడ్డి సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. -
సీబీఐ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఏసీబీ!
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం ఏసీబీల మధ్య రగడ మొదలైంది. లంచం డిమాండ్ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీక్ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో సీబీఐ నేరుగా దర్యాప్తు జరిపేందుకు అనుమతి రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కేంద్ర సీజీఎస్టీ రేంజ్ అధికారి ముక్కు కాళీ రమణేశ్వర్‌పై లంచం తీసుకున్న కేసులో రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. (ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ) వాస్తవానికి కాళీ రమణేశ్వర్‌పై విశాఖ సీబీఐ అధికారులకు ముందుగా ఫిర్యాదు అందింది. దీనిపై విచారించేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. అంతేకాక.. విశాఖ నుంచి సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని గురువారం వెలగపూడి సచివాలయంలో వ్యక్తిగతంగా కలిసి ఈ విషయంలో గోప్యత పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ వినతిని బేఖాతరు చేస్తూ సమాచారాన్ని ఏసీబీకి లీక్ చేసింది. దీంతో వారు రమణేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ కేసు నమోదు చేయడం ఇప్పుడు సీబీఐ, ఏసీబీలలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ వ్యవహరించిన తీరును సీబీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టింది. పరస్పర సహకారం లేకపోతే వ్యవస్థలోని అవినీతిని అరికట్టలేమని పేర్కొంది. ఫిర్యాదు తమకే నేరుగా వచ్చినట్లు ఏసీబీ ప్రకటించడంపై కూడా సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘన రాష్ట్రంలో సీబీఐని అడ్డుకునే దిశగా కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా మచిలీపట్నంలో కేంద్ర జీఎస్టీ రేంజ్ అధికారిపై వ్యూహాత్మకంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాటించాల్సిన నిబంధనలను కూడా ఏసీబీ అధికారులు ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేశారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఏసీబీ విభాగం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. తాము ఏ కేంద్ర ప్రభుత్వ అధికారిపై దాడి చేయనుందీ ముందుగా సీబీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా, రాష్ట్రంలోని ఆ కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఉన్నతాధికారికి కూడా ముందుగా తెలియజేసి అనుమతి పొందాలి. ఈ నిబంధనలను ఏసీబీ అధికారులు పట్టించుకోనే లేదు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన కాళీ రమణేశ్వర్ కేంద్ర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఉద్యోగి. ఆయనపై దాడిచేసి కేసు నమోదు చేయాలంటే ముందుగా రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్‌కు సమచారం ఇచ్చి అనుమతి పొందాలి. కానీ, తమను ఎవరూ సంప్రదించలేదని కస్టమ్స్ కమిషనర్ ఆఫీసు వర్గాలు తెలిపాయి. తమకు సమచారం ఇచ్చినా సరే తాము అనుమతించి ఉండేవారం కాదని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులమైన తమపై సీబీఐనే విచారించాలన్నది తమ సర్వీసు నిబంధనల్లో ఉందన్నారు. అందుకు విరుద్ధంగా ఏసీబీని అనుమతించే ప్రశ్నేలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోసిన సీబీఐ అవినీతి నిరోధక కేసులను విచారించడానికి అనుమతివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరును సీబీఐ ఖండించింది. లంచం అడిగిన కేంద్ర కస్టమ్స్ సూపరింటెండెంట్ కాళీ రమణేశ్వర్‌ను ట్రాప్‌చేసి పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినా ఇవ్వకపోగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి లీక్ చేయడాన్ని ఖండిస్తూ సీబీఐ శుక్రవారం ఓ ప్రకటను విడుదల చేసింది. అవినీతిని నిరోధించే సంస్థల మధ్య పరస్పరం నమ్మకం లేకపోతే వ్యవస్థలో అవినీతిని అరికట్టలేమంది. ఇరువురి మధ్య సహకారం, నమ్మకం ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని పేర్కొంది. దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర పోలీసు విభాగం వ్యవహరించిన తీరును సీబీఐ తీవ్రంగా తప్పుబట్టింది. వాస్తవానికి మచిలీపట్నంకు చెందిన కాళీ రమణేశ్వర్ అవినీతిపై నవంబర్ 28న విశాఖపట్నంలోని సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు అందిందని, అందిన వెంటనే సీబీఐ విశాఖపట్నం ఎస్పీ.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అత్యంత రహస్యంగా లేఖ రాసినట్లు సీబీఐ తెలిపింది. ఆ అధికారిని పట్టుకోవడానికి అనుమతివ్వమని కోరుతూ రాసిన ఈ లేఖను అదే రోజు మధ్యాహ్నం సీబీఐకి చెందిన డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి స్వయంగా వెళ్లి అందించడమే కాకుండా ఈ వివరాలను వేరొక్కరికి తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచమని కోరారని సీబీఐ ఆ ప్రకటనలో వివరించింది. అంతేకాకుండా 29న విశాఖ నుంచి సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని వెలగపూడి సచివాలయంలో స్వయంగా కలిశారు. తాము ట్రాప్ చేయడానికి వీలుగా నవంబరు 8న రద్దుచేసిన జనరల్ కన్సెంట్ను ఉపసంహరించుకోవాలని ఆ అధికారి కోరినట్లు సీబీఐ పేర్కొంది. తక్షణం అనుమతివ్వాల్సిందిగా మూడో రోజున ముఖ్య కార్యదర్శికి మరో లేఖ రాశామని, కానీ అందుకు అనుమతివ్వకపోగా రాష్ట్ర హోంశాఖ ఈ వివరాలను రాష్ట్ర ఏసీబీకి లీక్‌చేసి అదే రోజు సాయంత్రం ట్రాప్‌చేసి ఆ అధికారిని అరెస్ట్‌చేసినట్లు సీబీఐ ఆరోపించింది. కాగా, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి తాము చేసిన విజ్ఞప్తి గురించి సీబీఐ జోనల్ హెడ్‌కు కూడా సంబంధిత అధికారులు తెలియజేశారు. కానీ, ఈ ఫిర్యాదు నేరుగా తమకే వచ్చినట్లు ఏసీబీ అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొనడాన్ని సీబీఐ తప్పుబట్టింది. -
గాలి జనార్దన రెడ్డి అరెస్టు
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి యాంబిడంట్ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు శనివారం సాయంత్రమే జనార్దన రెడ్డి బెంగళూరులోని సీసీబీ (కేంద్ర నేర విభాగం) పోలీసు కార్యాలయానికి రావడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జనార్దన రెడ్డిని ప్రశ్నించామనీ, ఆదివారం ఉదయం కూడా విచారణను కొనసాగించి 9 గంటల సమయంలో అరెస్టు చేశామని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 24 వరకు జనార్దన రెడ్డికి జ్యుడీíషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయనను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఐపీసీ సెక్షన్లు 120, 204, 420లకింద కేసులు నమోదు చేశారు. కాగా జనార్దన రెడ్డికి, యాంబిడంట్ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కాగా, ఇదే కేసులో పోలీసుల అదుపులో ఉన్న జనార్దన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఆదివారం విడుదల చేశారు. అయితే తన యజమాని అరెస్టయినందున తాను కూడా జైలులోనే ఉంటానని అలీఖాన్ చెప్పడం గమనార్హం. ఏమిటీ యాంబిడంట్ కేసు? 2016లో సయ్యద్ అహ్మద్ ఫరీద్ అనే బడా వ్యాపారి ఆధ్వర్యంలో యాంబిడంట్ పేరుతో గొలుసుకట్టు పెట్టుబడుల వ్యాపారం ప్రారంభమైంది. నాలుగు నెలలకే పెట్టుబడిపై 50 శాతం రాబడి ఉంటుందంటూ రూ. 600 కోట్లను రాబట్టి అనంతరం చేతులెత్తేసింది. ఈడీ, ఐటీ అధికారులు ఫరీద్‌పై కేసులు నమోదు చేశారు. వీటి నుంచి బయటపడేస్తానంటూ జనార్దన రెడ్డి తన పీఏ ద్వారా ఫరీద్‌తో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇందులో భాగంగా రూ.18 కోట్లను చెందిన బంగారం వ్యాపారి రమేష్ కొఠారి ఖాతాకు జమ చేశారని తేలింది. ఆ సొమ్ముతో 57 కిలోల బంగారం కొన్నారు. రమేష్‌ను విచారణ చేయగా అలీఖాన్‌కు బంగారం అందించినట్లు చెప్పాడు. -
లంచం అడిగిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు
మెదక్ మున్సిపాలిటీ : రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు, రూ. 6వేల జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం గొల్లగడ్డ గ్రామం జీడిపల్లి పంచాయతీకి చెందిన పయ్యాల శంకర్‌కు అదే గ్రామ శివారులోని సర్వే నం. 128లో 2.15 ఎకరాల భూమి ఉంది. దాని మ్యూటేషన్ చేయించేందుకు తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. పేరు మార్చాలంటే రూ.5వేలు లంచం ఇవ్వాలని వీఆర్ఓ వెంకట కిషన్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో రైతు శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని రైతు శంకర్ నుంచి వీఆర్ఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో కేసు విచారణకు రాగా వీఆర్ఓ వెంకట కిషన్‌రావుపై నేరం రుజువు కావడంతో అతడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మరో 3నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చినట్లు తెలిపారు. -
లంచం కేసులో 'చిరంజీవి' అరెస్టు..
సాక్షి, విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గూడెం కొత్త వీధి (జీకే వీధి) తహసీల్దార్ చిరంజీవి రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మైనింగ్ క్వారీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు చిరంజీవి లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎంఆర్ఓ ఇంటిపై ఆకస్మిక దాడిచేసి.. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా చిరంజీవిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుతా
-
పోలీసుల ఎదుట దినకరన్
-
పోలీసుల ఎదుట దినకరన్
- ఈసీకి లంచమిచ్చారనే ఆరోపణలపై విచారణ - మధ్యవర్తి సుకేశ్ సమక్షంలో ప్రశ్నల వర్షం సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చాణక్యపురి అంతర్రాష్ట్ర సెల్ ఆఫీస్‌లో పటిష్టమైన భద్రత నడుమ ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దినకరన్‌ను విచారించారు. ‘ఈ కేసుకు సంబంధించి మధ్యవర్తి సుకేశ్‌తో దినకరన్‌కు సంబంధం, దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారిని కలిశారా లేదా అనే అంశాలపై ప్రశ్నించాం. ఇద్దరినీ విడివిడిగా, ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విచారణ సందర్భంగా దినకరన్ లాయర్లను పోలీసులు లోపలకు అనుమతించలేదు. జయలలిత హఠాన్మరణంతో చీలిన అన్నాడీఎంకేలో పార్టీ గుర్తుపై రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక విషయంలో అన్నాడీఎంకే విజయానికి ఆయువు పట్టైన రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ గుర్తును పొందేందుకు అత్యున్నత స్థాయి వ్యక్తులు, అధికారులతో పరిచయాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న సుకేష్ అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి రూ.50 కోట్లు ఎరవేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ ప్రయత్నం వికటించి రూ.1.30 కోట్లతో సుకేష్ ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్ ఖండిస్తూ వచ్చారు. తనెప్పుడూ సుకేశ్‌ను కలవలేదన్నారు. కానీ, సుకేశ్ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌కు సమన్లు జారీచేసి శనివారం ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించారు.