
లంచగొండి మంత్రిపై ఎఫ్ఐఆర్
లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిహార్ ఎక్సైజ్ మంత్రి అవధేష్ కుష్వాహపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పట్నా: లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిహార్ ఎక్సైజ్ మంత్రి అవధేష్ కుష్వాహపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి అవధేష్ 4 లక్షల రూపాయలను లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలను యూ ట్యూబ్లో అప్లోడ్ చేశారు.
దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. నితీష్ ఆదేశాల మేరకు అవధేష్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి ఆయన్ను తప్పించారు.