ఎమ్మెల్సీ కుమారులపై రేప్‌ కేసు | FIR Filed Against Bihar MLC Sons On Rape Case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కుమారులపై రేప్‌ కేసు

May 20 2018 3:54 PM | Updated on Oct 5 2018 9:09 PM

FIR Filed Against Bihar MLC Sons On Rape Case - Sakshi

పట్నా: బిహార్‌ శాసనమండలి మాజీ చైర్మన్‌ అవధేష్ నారాయణ్ సింగ్ కుమారులు శుశాంత్‌ రాజన్‌, ప్రశాంత్‌ రాజన్‌లపై పట్నా మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వేధింపులు, అత్యాచార యత్నం కింద కేసు నమోదైంది. ఎఫ్‌ఐర్‌లో నమోదు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఓ యువతి ఓ విమాన సర్వీసులో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేస్తోంది. నెల కిందట పట్నాలో నివాసం ఉంటున్న తన తల్లిని చూడటానికి వచ్చిన యువతితో శుశాంత్‌కు పరిచయం ఏర్పడింది. మే16న యువతిని తన నివాసానికి డిన్నర్‌కి రావాల్సిందిగా శుశాంత్‌ రాజన్‌ ఆహ్వానించాడు.

శుశాంత్‌ నివాసానికి యువతి చేరిన కొద్ది సేపటికి తన సోదరుడు ప్రశాంత్‌ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు అక్కడికి చేరుకున్న తరువాత వారిద్దరి మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకుందని యువతి ఫిర్యాదులో తెలిపింది. ఆ తరువాత ఇద్దరు సోదరులు కలిసి తనను ఒక గదిలో బంధించి అత్యాచార యత్నానికి ప్రయత్నించారని బాధితురాలి ఫిర్యాదు చేసింది. తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది గది తలుపులు తెరిచారిని ఆమె తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement