సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ | CBI registers case against Syndicate Bank CMD | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్

Published Sat, Aug 2 2014 2:45 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

CBI registers case against Syndicate Bank CMD

హైదరాబాద్: 50 లక్షల రూపాయిలు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్ కే జైన్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. రుణాలు మంజూరు చేయడానికి వివిధ కంపెనీల నుంచి లంచం తీసుకున్నట్టు సీబీఐ వీరిపై అభియోగాలు నమోదు చేసింది.

సీబీఐ అధికారులు శనివారం ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబైలలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. లంచంగా తీసుకున్న 50 లక్షల రూపాయిల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుని, కేసు విచారణ చేస్తున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement