
చంచల్ గూడ జైలుకు 'ఆ ముగ్గురు'
ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు సెబాస్టియన్ హారీ, ఉదయ్, మాథ్యూస్ లను చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు సెబాస్టియన్ హారీ, ఉదయ్, మాథ్యూస్ లను చంచల్ గూడ జైలుకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు వీరు ముగ్గురికి న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తమ బాస్ (చంద్రబాబు) ఆదేశాల ప్రకారం ముడుపులు ఇవ్వజూపినట్టు చెబుతూ వీరందరూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో సెబాస్టియన్ హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.