రేవంత్ కేసుపై కేంద్రం ఆరా | center Investigating about the case of REVANTH | Sakshi
Sakshi News home page

రేవంత్ కేసుపై కేంద్రం ఆరా

Published Sat, Jun 6 2015 2:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

రేవంత్ కేసుపై కేంద్రం ఆరా - Sakshi

రేవంత్ కేసుపై కేంద్రం ఆరా

గవర్నర్‌ను నివేదిక కోరిన హోంశాఖ
ఆకస్మికంగా గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ముడుపుల వ్యవహారం ఢిల్లీకి చేరింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్ల డీల్‌లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందన్న ప్రాథమిక సమాచారంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల నివేదికను పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరింది. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయంతోపాటు కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో కేసు వివరాల కోసం రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, సాక్ష్యాధారాలేమున్నాయి వంటి వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా గవర్నర్‌ను కలిశారు. వీరిద్దరూ అరగంటకుపైగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. టీడీపీ ముడుపుల వ్యవహారంపై రాష్ర్ట ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్‌కు అందించినట్లు తెలిసింది. ఈ వివరాలను రేపో మాపో  కేంద్రానికి నరసింహన్ నివేదించే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకరోజు ముందు(గత నెల 31న) నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల నగదు ఇవ్వజూపిన టీడీ పీ నేత రేవంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ బాస్(చంద్రబాబు) ఆదేశాల మేరకే ఈ డీల్ చేస్తున్నట్లు రేవంత్ పలుమార్లు అన్నట్లు ఏసీబీ వద్ద వీడియో ఆధారాలున్నాయి. ఈ ఉదంతం బయటపడిన మరుసటి రోజునే సీఎస్ రాజీవ్‌శర్మను గవర్నర్ పిలిపించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌ను కలిశారు. ఈ మొత్తం పరిణామాలపై జాతీయ మీడియా దృష్టిసారించింది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుక్కున్నారని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం కూడా ఈ కేసుపై ఆరా తీసింది. తాజాగా గవర్నర్ నుంచి నివేదిక కోరడం ప్రాధాన్యాతను సంతరించుకుంది.

 నోటుకు ఓటు కేసులో బాబును వదలం: తలసాని
 సాక్షి,హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును వదలం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ‘తెలంగాణ సినిమా - నిన్న- నేడు - రేపు’ అనే అం శంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, రేవంత్‌ల విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిళ్లు, ప్రభావాలు పని చేస్తున్నాయంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయని.. అది వాస్తవం కాదని తెలిపారు. బాబుపై చట్ట పరిధిలో చర్య లు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు.

 వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పట్టుబడి ఉంటే...
 రేవంత్‌లాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఇలా పట్టుబడి ఉంటే కొన్ని ప్రసార మాధ్యమా లు, పత్రికలు సంబంధిత ఎమ్మెల్యే, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి పేజీలకు పేజీలు రాసేవారన్నారు. జగన్‌ను ముద్దాయిగా చేసేవారన్నారు. వైఎస్ జగన్ ఏపీలో దీక్ష వేదిక నుంచి 100 ప్రశ్నలు సంధిస్తే దానికి స్పందించిన చంద్రబాబు ఆ హామీలు తాను సమైక్యంలో ఉన్నప్పుడు ఇచ్చినవని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ఆనాడు ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తే ఇవి సాధ్యమేనని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రేవంత్ విషయంలో మీడియాలో క్లిప్పిం గ్‌లు రానంత వరకు మీసాలు మేలేసి కుట్రలు, ట్రాప్ చేశారని ప్రగల్భాలు పలికారని.. టీవీల్లో వీడియోలు ప్రసారం కాగానే బాబుకు దిమ్మదిరిగి పోయిందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement