సాక్షి, హైదరాబాద్: అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్‌పై విచారణకు ఆదేశిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. శాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం రేషన్ కార్టుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు.
కాళేశ్వరం టూర్‌కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒకరోజు ముందు వెనుక అయినా మేం రెడీగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ సారి 23 శాతం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
‘‘గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. ఇరిగేషన్‌లో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ఇస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులు తేలుతారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment