proffesor
-
Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది..
వందేళ్ల చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎప్పుడూ ఒక మహిళను వైస్ చాన్సలర్‌గా చూడలేదు. కాని మొదటిసారి ప్రొఫెసర్ నైమా ఖాతూన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మువి.సి.గా నియమించారు. దీంతో నైమా ఖాతూన్ చరిత్ర సృష్టించారు. ఆమె మైనారిటీ వర్గ మహిళలకు గొప్ప స్ఫూర్తి కాగలదంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నైమా ఖాతూన్ పరిచయం..నైమా ఖాతూన్‌కు ముస్లిం మహిళల చదువు గురించి చాలా పట్టింపు ఉంది. ‘ఉత్తరాదిలో నేను ప్రిన్సిపాల్‌గా పని చేసిన అలీగఢ్ విమెన్స్ కాలేజ్ చాలా ముందంజలో ఉంది. అక్కడ మూడు వేల మంది ముస్లిం ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కాని ఇదొక్కటే సరిపోదు. ఉత్తరప్రదేశ్, బిహార్లలో ముస్లిం బాలికల విద్య చాలా వెనుకబడి ఉంది. దక్షణాదిలో ముస్లిం సమూహాలు విద్యా రంగంలో ముస్లిం బాలబాలికలను ఫ్రోత్సహిస్తున్నాయి. ఉత్తరాదిలో ఆ పని జరగడం లేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని జయించాలంటే విద్యార్జనకు మించిన వేరే మార్గమేదీ లేదు’ అంటుందామె.విద్యారంగంలో బాలికల విద్య కోసమే కాదు ఉన్నతవిద్యలో ముస్లింల ్రపాతినిధ్యం పెరగాలని కోరుకునే నైమా ఖాతూన్‌ను భారత ప్రభుత్వం గుర్తించి రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను చేసింది. దాదాపు 100 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి ఇలా ఒక మహిళ వి.సి. పదవిలో కూచోవడం ఇదే మొదటిసారి.గమనించాల్సిన విషయం ఏమంటే ఇన్నాళ్లు పురుషులు మాత్రమే వి.సి.లుగా ఉన్న జె.ఎన్.యుకు శాంతిశ్రీ పండిట్ మొదటి మహిళా వి.సి. కావడం, అలాగే జామియా మిలియా ఇస్లామియాకు నజ్మా అక్తర్ తొలి వి.సి. కావడం (ఆమె పదవీకాలం ముగిసింది) పాతమూసలను బద్దలు చేయడమే. ఆ వరుసలో ఇప్పుడు నైమా ఖాతూన్ చేరారు.సైకాలజీప్రొఫెసర్..ఒడిశాకు చెందిన నైమా ఖాతూన్ ఉన్నత విద్య అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనే జరిగింది. అక్కడే ఆమె బి.ఏ. సైకాలజీ చదివింది. ఆ తర్వాత పి.హెచ్డి. వరకూ అక్కడే కొనసాగి 1988లో అదే యూనివర్సిటీలో లెక్చరర్‌గా తన ఫ్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత అసోసియేట్ప్రొఫెసర్గా,ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది సైకాలజీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అయ్యింది.పొలిటికల్ సైకాలజీ అధ్యయనంలో భాగంగా ‘హిందూ ముస్లిం యువతపై రాజకీయ భావోద్వేగాల ప్రభావం’ అనే అంశం మీద ఆమె చేసిన పి.హెచ్డి. కీలకమైనది. అలీగఢ్ విమెన్స్ కాలేజ్‌కు ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ ఉండగా ఆమెను వి.సి.గా పని చేసే అవకాశం వరించింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కనుక ఇ.సి. అనుమతి తీసుకోని ఆమె నియామకం చేసింది ప్రభుత్వం. నైమా ఖాతూన్ తరచూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తన పరిశోధనా పత్రాలను సమర్పిస్తుంటారు.రాజకీయ ప్రాతినిధ్యం..భారతదేశంలో మహిళలకు రాజకీయ ్రపాధాన్యం లభించడం లేదని నైమా ఖాతూన్ అంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలు పార్లమెంట్ వరకూ చేరుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని, రాజకీయ అధికారం లేకుండా కీలకమైన విధానమార్పు తేలేమని అభి్రపాయపడతారు. ‘ఆర్థిక శక్తిని, రాజకీయ శక్తిని పొందడటంలో అణగారిన వర్గాల స్త్రీలు నిస్సహాయంగా ఉన్నారు’ అంటారామె.ఇవి చదవండి: Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి! -
ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్’ గోపీనాథన్
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది. ’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ల సస్పెన్షన్
తెయూ (డిచ్పల్లి) : మాజీ ఇన్చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ విద్యావర్థిని, ప్రొఫెసర్ కనకయ్యలను సస్పెన్షన్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) తీర్మానం చేసింది. తెయూ 61వ ఈసీ సమావేశం హైదరాబాద్‌లోని రూసా భవనంలో శనివారం జరిగింది. వైస్ చాన్స్‌లర్ డి రవీందర్ గుప్తా ఉదయమే హైదరాబాలోని తన స్వగృహంలో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. దీంతో కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. వర్సిటీలో జరు గుతున్న పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. తెయూ ఈసీ తీర్మానాలు.. ఈసీ ఆమోదం లేకుండా వీసీ రవీందర్ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ శివశంకర్, ప్రొఫెసర్ విద్యావర్ధిని లపై నిర్ధారిత నేరారోప అభియోగాల (ఆర్టికల్ ఆఫ్ చార్జెస్) కింద కేసులు నమోదు చేయాలి. ● వీసీ అవినీతి, అక్రమాలకు సహకరించిన కనకయ్య, విద్యావర్థిని ల ను సస్పెండ్ చేయాలి. ● ఏరియర్స్ పేరిట అక్రమంగా రూ.10 లక్షలు తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుడు శ్రీనివాస్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి. ● వివిధ కారణాలతో వీసీ పీఏలు, ఇతర సిబ్బంది తీసుకున్న అడ్వాన్సులు మొత్తం వెంటనే రికవరీ చేయాలి. ● ఇటీవల నిర్వహించిన అధ్యాపకుల క్యాస్ (కేరీర్ అడ్వాన్స్ స్కీం) పదోన్నతులకు ఆమోదం. వారికి రావాల్సిన ఎరియర్స్ చెల్లించాలి. అర్హత గల అధ్యా పకులకు రొటీన్‌గా క్యాస్ పదోన్న తులు కల్పించడం. ● 2021 –2023 వరకు నిర్వహించిన పీహెచ్డీ అడ్మిషన్లపై ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకు ల చేత విచారణ జరిపించాలి. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ నసీమ్, ప్రొఫెసర్ ఆరతి, కె రవీందర్ రెడ్డి, వసుంధర దేవి, మారయ్యగౌడ్, గంగాధర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, ఎన్ఎల్ శాస్త్రి హాజరు కాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరక్టర్ చంద్రకళ, రాజేందర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. -
ప్రొఫెసర్ సాహసం.. నీటి అడుగులో 100 రోజులు! అన్నీ అక్కడే..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్‌గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు. వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్‌గా పనిచేశారు. 2012లో కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. 'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు. చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన -
ప్రొఫెసర్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..
కోల్‌కతా : జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీజేపీ మద్దతుదారులైన కొందరు మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని వర్సిటీ ప్రొఫెసర్ ఆరోపించారు. ఓ వర్గాన్ని కించపరుస్తూ జాదవ్‌పూర్ వర్సిటీ ప్రతిష్టను మసకబార్చేలా ఆ పార్టీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనను గాయపరిచారని ఆమె వెల్లడించారు. కాగా వర్సిటీ ప్రొఫెసర్‌పై తమ పార్టీ కార్యకర్తలెవరూ దాడిచేయలేదని, క్యాంపస్ వద్ద జరిగిన తమ పార్టీ సమావేశంలో లెఫ్ట్ మద్దతుదారులు ఆందోళన చేపట్టినా సంయమనం పాటించామని బీజేపీ నాయకత్వం పేర్కొంది. మరోవైపు తనపై జరిగిన దాడిని ఆంగ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొయితా మజుందార్ సోషల్ మీడియాలో వివరించారు. పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని తాను వెనుదిరిగి వస్తుండగా క్యాంపస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరుగుతోందని, ఆ పార్టీ నేతలు విద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. అన్ని అనర్ధాలకు ఈ యూనివర్సిటీ కారణమని, ఇక్కడ ప్రతిరోజూ వారంతా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తుంటారని ఓ వక్త చెబుతుండగా తాను అవి అసత్యాలని బిగ్గరగా అరిచానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ప్రతిఘటించిన వెంటనే తనను పలువురు బీజేపీ మహిళా కార్యకర్తలు చుట్టుముట్టి దారుణంగా కొట్టారని చెప్పారు. అడ్డగించిన మరో వ్యక్తిని కూడా వారు గాయపరిచారని అన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రొఫెసర్ వెల్లడించారు. కాగా క్యాంపస్ వెలుపల తాము నిర్వహించిన సమావేశానికి కొందరు లెఫ్ట్ మద్దతుదారులు హాజరై నినాదాలు చేశారని, తమ కార్యకర్తలపై దాడి చేసినా తాము సంయమనం వహించామని బీజేపీ నేత షమిక్ భట్టాచార్య తెలిపారు. కాగా ప్రొఫెసర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. -
వైరల్: పిల్లాడిని వెనకాల కట్టుకుని..
జార్జియా : విద్యార్థిని తన చదువుమీద శ్రద్ధ పెట్టడానికి ఓ ప్రొఫెసర్ చేసిన సాయం నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాకు చెందిన రమట సిస్సొకో సిస్సే.. లారెన్స్‌విల్లేలోని జార్జియా గ్విన్నెట్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. బయోలజీ, అనాటమీ, సైకాలజీ ఆమె సబ్జెక్టులు. కొద్దిరోజుల క్రితం అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థిని(చంటిపిల్లాడి తల్లి) పిల్లాడితో క్లాస్ రూంలోకి వచ్చి కూర్చుంది. బేబీ సిట్టర్ దొరకని కారణంగా బాబుతో క్లాస్‌కు రావాల్సి వచ్చిందని తన పరిస్థితిని రమటకు వివరించింది. పిల్లాడిని ఒళ్లో పెట్టుకుని బోర్డుపై ఉన్న అంశాలను నోట్స్ రాసుకోవటం విద్యార్థినికి ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన రమట పిల్లాడిని తన వీపు వెనకాల కట్టుకుని, పాఠం చెప్పటం మొదలుపెట్టింది. ఇలా మూడు గంటల పాటు పిల్లాడిని వీపు వెనకాల ఉంచుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పింది. రమట కూతురు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా దానికి విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు 57వేల లైకులు సంపాదించుకుంది. -
పరిశోధన పేరుతో కీచక ప్రొఫెసర్ వేధింపులు..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ సైకియాట్రి ప్రొఫెసర్ రెడ్మండ్ పరిశోధన పేరుతో విద్యార్ధులను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. విద్యార్ధులకు ఆర్థిక సాయం అందిస్తూ, పరిశోధనలో సహకరిస్తానని లోబరుచుకుని వారిని కరీబియన్ దీవుల్లోని తన రీసెర్చి సైట్‌కి తీసుకువెళ్లి సదరు ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్న ఉదంతం వర్సిటీ అధికారులను షాక్‌కు గురిచేసింది. 1992 నుంచి ఈ కీచక ప్రొఫెసర్ ఇదే తంతు కొనసాగిస్తున్నా యేల్ వర్సిటీ అధికారులు పసిగట్టలేకపోవడం గమనార్హం. విద్యార్ధులను దశాబ్ధాల తరబడి లైంగికంగా వేధిస్తున్న ప్రొఫెసర్ లీలలు వర్సిటీ అధికారులు ఇటీవల వెల్లడించిన 54 పేజీల నివేదికలో బహిర్గతమయ్యాయి. దాదాపు 44 ఏళ్లుగా యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు అనుబంధంగా సైకియాట్రీ పాఠాలు బోధిస్తున్న రెడ్మండ్ నీచబుద్ధి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రెడ్మండ్ 13 మంది వరకూ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులను లైంగికంగా వేధించినట్టు వెల్లడైంది. 38 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు సహా 110 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ షాకింగ్ విషయాలు వెల్లడించాయి. వర్సిటీ అధికారుల నివేదికకు ముందే కీచక ప్రొఫెసర్ బాగోతాన్ని యేల్ డైలీ న్యూస్ పత్రిక సవివరంగా ప్రచురించింది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రెడ్మండ్ తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కథనాలను వండివార్చారని ఆరోపించారు. యేల్ క్యాంపస్ నుంచి రెడ్మండ్ను బహిష్కరించినా రిటైర్డ్ ఫ్యాకల్టీ మెంబర్‌గా అన్ని ప్రయోజనాలను ఆయన అనుభవిస్తున్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ నేరారోపణలు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ ప్రొఫెసర్ రెడ్మండ్ చేష్టలను యేల్ వర్సిటీ ప్రెసిడెంట్ పీటర్ సలోవే ఖండించారు. రెడ్మండ్ ప్రవర్తన పట్ల యేల్ తరపున తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. రెడ్మండ్ ప్రవర్తన తొలిసారిగా వెలుగుచూసినప్పుడే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండేదని అన్నారు. 994లోనే రెడ్మండ్ విద్యార్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మెడికల్ స్కూల్ సైకియాట్రి విభాగాధిపతికి పలువురు అండర్గ్రాడ్యుయేట్ విద్యార్ధులు తొలిసారిగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో తన సమ్మర్ రీసెర్చి కార్యక్రమాన్ని మూసివేస్తానని రెడ్మండ్ హామీ ఇచ్చినా ఆ పనికి పూనుకోలేదు. యేల్ అధికారులు సైతం ఆయన రీసెర్చి ప్రోగ్రాంను నిలిపివేసేలా చర్యలు చేపట్టలేదని నివేదిక ఎత్తిచూపింది. 1994లోనే ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు సరైన పర్యవేక్షణ చేపడితే రెడ్మండ్ విపరీత ప్రవర్తనకు అప్పుడే అడ్డుకట్ట పడేదని నివేదిక స్పష్టం చేసింది. 2018లో రెడ్మండ్పై ఓ విద్యార్ధి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేలోపుగా అదే ఏడాది రెడ్మండ్ పదవీవిరమణ చేయడంతో విచారణ అతీగతీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపించాయి. ప్రొఫెసర్ల లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసినా వారిని విధుల్లో కొనసాగనివ్వడం పట్ల విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌పై చర్యలు
సాక్షి, కోల్‌కతా : యువతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై వర్సిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను క్లాస్‌లు తీసుకోకుండా నిలిపివేయడంతో పాటు క్యాంపస్‌లో అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించింది. విద్యార్ధులు చేసిన ఫిర్యాదులపై వైస్ ఛాన్స్‌లర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్‌పై తీసుకున్న చర్యలను వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం హెడ్ ఓంప్రకాష్ మిశ్రా వెల్లడించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ నుంచి తొలగించాలని విద్యార్ధులు పట్టుబట్టారని మిశ్రా తెలిపారు. కన్యత్వం లేని యువతులను ఎవరూ వివాహం చేసుకోరాదని తన ఫేస్బుక్ పేజ్‌లో కనక్ సర్కార్ చేసిన పోస్ట్‌లు కలకలం రేపాయి. కన్యత్వం కలిగిన యువతిని సీల్ చేసిన బాటిల్‌తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. మరోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కనక్ సర్కార్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ డీజీపీని కోరింది. -
ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటాం: ఐలయ్య
హైదరాబాద్: ఆంధ్రా సెటిలర్స్‌కు అండగా ఉంటా మని, టీఆర్ఎస్ భయపెడితే వారు భయపడాల్సిన అవసరం లేదని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లపై టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తోందని, కేసీఆర్, కేటీఆర్ వాడే భాష సరైంది కాదన్నారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
కాఫీకి రా.. లేకపోతే ఫెయిల్ చేస్తా..!
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు బాలికలపై అనేక దాడులు జరుగుతున్నాయని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్ధినులు డిమాండ్ చేస్తున్నారు. -
సీన్ రివర్స్
జస్టిన్ థారోస్‌తో జెన్నిఫర్ ఆనిస్టన్ లాస్ట్ మంత్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క జెన్నిఫర్ ఫస్ట్ హస్బెండ్ బ్రాడ్ పిట్.. ఆంజెలీనా జోలీతో 2016లో డైవర్స్ తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు. థారోస్‌తో డైవర్స్ తర్వాత జెన్నిఫర్, ఆంజెలినాతో విడాకులు తర్వాత బ్రాడ్ పిట్.. ఇద్దరూ సింగిల్‌గానే ఉన్నారు, మళ్లీ కలిస్తే బావుండు అని ‘పిట్, జెన్నిఫర్’ అభిమానులు కోరుకున్నారు. కానీ సీను రివర్స్ అయింది. జెన్నిఫర్ సింగిల్‌గానే ఉన్నారు, కానీ బ్రాడ్ పిట్టే మరో అమ్మాయితో మింగిల్ అవుతున్నారట. ఎమ్ఐటీ ప్రొఫెసర్ నెరీ ఓక్స్మెన్తో బ్రాడ్ పిట్ డేట్ చేస్తున్నారని హాలీవుడ్లో హాట్ టాపిక్. ఆర్ట్, ఆర్కిటెక్చర్ డిజైన్‌లో నెరీ ఓక్స్మెన్ రాక్‌స్టార్ అని చెప్పవచ్చు. ఎమ్ఐటీలో నెరీ గీసిన ఓ త్రీడీ పెయింటింగ్ చూసి ఫ్లాట్ అయ్యారట బ్రాడ్ పిట్. అప్పటినుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారన్నది హాలీవుడ్ ఓపెన్ సీక్రెట్. సో జెన్నీఫర్, పిట్ మళ్లీ కలుస్తారనుకున్న అభిమానుల కోరిక నేరవేరనట్టే. -
ఆచార్యునిపై చర్య?
కాకినాడ / బాలాజీచెరువు: ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ప్రొఫెసర్ కె.బాబులు వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు ఆదివారం రోడ్డెక్కడంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన యూనివర్సిటీ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్ బాబులుకు అనుకూలంగా అధికార టీడీపీకి చెందిన నేతలు రంగంలోకి దిగారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విద్యార్థులు కూడా సన్నద్ధమవుతున్నారు. ‘బాబులు’ కమిటీ భేటీ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులుతో ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం రెక్టార్ పూర్ణానందం అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎదుట ప్రొఫెసర్ బాబులు హాజరయ్యారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీ సభ్యులు కూడా ప్రొఫెసర్‌కు అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో బాబులు వాదనను కూడా కమిటీ రాతపూర్వకంగా స్వీకరించినట్టు వర్సిటీ వర్గాలు చెప్పాయి. జేఎన్టీయూకే వద్ద నిరసన గళం ప్రొఫెసర్ బాబులును తక్షణమే విధుల నుంచి తప్పించాలంటూ ఆదివారం ఎంటెక్ విద్యార్థులంతా రోడ్డెక్కారు. జేఎన్టీయూకే ప్రధాన ద్వారం వద్ద దాదాపు 200 మంది బైఠాయించి ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించే వరకు తరగతులను బహిష్కరిస్తామని, పరీక్షలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఉభయవర్గాల సమక్షంలోనే విచారణ జరగాలంటూ ఆందోళన కొనసాగించడంతో చివరకు వీసీ కుమార్, రెక్టార్ పూర్ణానందం అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో రెండు గంటల తరువాత ఆందోళన విరమించారు. తాత్కాలికంగా తొలగింపు ప్రొఫెసర్ బాబులును ఐఎస్టీ డైరెక్టర్ పదవితోపాటు, ఎంటెక్ కోర్సు విధుల నుంచి తప్పిస్తూ ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా ముగింపుపలికారు. ఈ చర్యతో శాంతించిన విద్యార్థులు సోమవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరయ్యేందుకు సమ్మతించారు. రాజకీయ ఒత్తిళ్లు? కమిటీ విచారణ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్టు విద్యార్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్‌కు అనుకూలంగా రాష్ట్రస్థాయి చైర్మన్ పదవిలో ఉన్న ఓ నేతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి కూడా రంగంలోకి దిగి వీసీ, కమిటీ సభ్యులపై బాబులుకు అనుకూలంగా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇది కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసి రోడ్డెక్కారు. విచారణ తీరుపై విద్యార్థుల పెదవి విరుపు ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన తీరుపై విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. విద్యార్థులతో ఒకసారి, ప్రొఫెసర్‌తో మరొకసారి విడివిడిగా విచారణ జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నది వీరి వాదన. ఇరు వర్గాలతో ముఖాముఖి విచారణ జరపడంతోనే వాస్తవాలు బయటకు వస్తాయనే వాదన విద్యార్థుల్లో నెలకొంది. ఈ తరహా వివాదాలు తలెత్తిన సమయంలో గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ వేశారని, ఇక్కడ మాత్రం స్థానిక ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడం వల్ల న్యాయం జరగదన్న వాదనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. -
కాలేజీలో కొండచిలువ హల్ చల్ ..
సాక్షి, అలహాబాద్: పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ బాటనీ ప్రొఫెసర్ కాలేజీ గ్రౌండ్లోకి ప్రవేశించిన కొండచిలువను సునాయశంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. కాలేజీ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇది గమనించిన కాలేజీ ప్రొఫెసర్ ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. -
లేపేస్తాం: రయా సర్కార్‌కు బెదిరింపులు
సాక్షి,న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడే ప్రొఫెసర్లు, అథ్యాపకుల జాబితా వెల్లడించి విద్యావ్యవస్థలో కలకలం రేపిన లా స్టూడెంట్ రయా సర్కార్‌కు వేధింపుల పర్వం మొదలైంది. రయా సర్కార్ సాహసాన్ని అందరూ కొనియాడుతున్నా తనను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా ఖాతాల్లో హెచ్చరికలు వస్తున్నాయని బాధితురాలు పేర్కొన్నారు. ‘నాపై విషం చిమ్ముతున్నారు..చంపేస్తామనడం నుంచీ రేప్ చేస్తామనే వరకూ బెదిరింపులు వస్తున్నాయ’ని చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లా చదువుతున్న 24 ఏళ్ల రయా సర్కార్ భారత అత్యున్నత విద్యా సంస్థల్లో సాగుతున్న అరాచకాలను బయటపెట్టారు. అథ్యాపకుల వేధింపలకు తానూ బాధితురాలినేనని చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మణిపాల్ యూనివర్సిటీ, ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులకు పాల్పడే అథ్యాపకుల జాబితాను రయా సర్కార్ వెల్లడించారు. ప్రఖ్యాత నిర్మాత హార్వీ వెన్‌స్టీన్ లైంగిక వేధింపుల బారిన పడ్డ పలువురు హాలీవుడ్ నటీమణులు హార్వీ దురాగతాలపై పెదవివిప్పడం, వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడుతున్న గ్లోబల్ మిటూ క్యాంపెయిన్ల నేపథ్యంలో రయా సర్కార్ భారత అత్యున్నత విద్యా సంస్థల్లో జరుగుతున్ననిర్వాకాన్ని బయటపెట్టడం పెను దుమారం రేపింది. రయా జాబితాలో 69 మంది ప్రొఫెసర్లను పేర్కొంటూ ఈ జాబితా మరింత పెరుగుతుందని చెప్పడం విద్యా వ్యవస్థ దిగజారుడుతనాన్ని ఆవిష్కరిస్తోంది. ఫెమినిస్టుల ఫిర్యాదు మరోవైపు విద్యావ్యవస్థలో లైంగిక వేధింపులపై ఏళ్ల తరబడి సాగుతున్న పోరాటం రయా సర్కార్ జాబితా వెలువరించడంతో పక్కదారి పట్టిందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఆమె తన జాబితాను ఉపసంహరించాలని మరికొందరు ఫెమినిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సమస్యలపై నిత్యం పోరాడే ఫెమినిస్టులు 24 ఏళ్ల రయా సర్కార్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక యూజీసీ డేటా ప్రకారం ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 వరకూ 103 మంది విద్యార్థినులు తమపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఐఐటీ భువనేశ్వర్‌లో తన ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. 2012 నుంచి ఈ దారుణం జరుగుతున్నదని తనకు సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐఐటీ భువనేశ్వర్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్‌ను వెనకేసుకొచ్చింది. -
ఈ ప్రొఫెసర్లు బిహార్ పరువు తీశారు!
పాట్నా : పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు బిహార్ పెట్టింది పేరు. అక్కడ పరీక్షలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది అయితే, ఆ రాష్ట్రం మాస్ కాపియింగ్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే, తాజాగా వెలుగు చూసిన అంశాల ప్రకారం అక్కడ విద్యావ్యవస్థే అంత దారుణంగా ఉందని, సరిగ్గా పాఠాలు చెప్పే గురువులే కరువయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా నైపుణ్యం లేని గురువులు, విషయ సంబంధ జ్ఞానం లేనివారు ఉన్నారని బయటపడింది. ఇంకా చెప్పాలంటే ముగ్గురు గణిత ప్రొఫెసర్లు బిహార్ విద్యావ్యవస్థ పరువు తీసినంత పనిచేశారు. ఇటీవల తమకు గణితానికి సంబంధించిన ప్రొఫెసర్ కావాలంటూ బిహార్‌లో ప్రముఖ యూనివర్సిటీ అయిన 'మగద' ప్రకటన ఇచ్చింది. అంతకంటే ముందు తమ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లను పరీక్షించాలని అనుకుంది. వారి ముగ్గురుని పిలిచి సెలక్ట్ కమిటీ ముందు పరీక్షించగా కనీసం వారు తొమ్మిదో తరగతి లెక్కలు కూడా చేయలేకపోయారు. ఇక ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ట్రయాంగిల్ స్పెల్లింగ్‌ను ట్రాంగల్గా మార్చి చెప్పారు. మరో అసోసియేట్ ప్రొఫెసర్ కాస్త పర్వాలేదనిపించారు. దీనిపై వీసీ ప్రొఫెసర్ ఖమర్ అహసన్ స్పందించేందుకు నిరాకరించారు. కాగా, అంతకుముందు నిర్వహించిన ఇంటర్వ్యూలను వీడియో తీసి సిండికేట్ ముందుకు సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. ఆ ప్రొఫెసర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వారంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. -
టీఎస్ సెట్ ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల భర్తీ, పదోన్నతుల నిమిత్తం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2017 (టీఎస్ సెట్) ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఫలితాలను వెల్లడించద్దంటూ ఉస్మానియా వర్సిటీని ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 7న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఉత్తర్వులిచ్చారు. టీఎస్ సెట్ నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన నోటిఫికేషన్లో ఉన్న విధివిధానాలను పరీక్ష పూర్తయిన తరువాత మార్చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ రీసెర్చ్ స్కాలర్ ఏల్చల దత్తాత్రీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఫలితాల వెల్లడిపై స్టే విధించింది. ఇటీవల ఉస్మానియా వర్సిటీ ఈ స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి... గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణను వాయిదా వేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. -
ప్రొఫెసర్‌కు ఐఎస్‌కు లింకు
లాహోర్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాకిస్తాన్ లో మరో అరెస్టు జరిగింది. పంజాబ్ లోని యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ ని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రత్యేక రైడింగ్ లు జరిపిమరీ అతడిని అరెస్టు చేశారు. గత వారంలో అరెస్టయిన ఉగ్రవాద నేత హిజ్బుత్ తహ రీర్ కు గలీబ్ కు సంబంధాలు ఉన్నాయని తమ విచారణలో తేలిందని అందుకే ఆయనను ఉన్నపలంగా అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు చెప్పారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడని, గతంలో ఎవరికీ తెలియకుండా తీవ్ర భావజాల వ్యాప్తికి సంబంధించిన సమావేశాలకు కూడా గలీబ్ హాజరు అయ్యాడని తెలిపారు.