వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్‌గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు.
వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్‌గా పనిచేశారు. 2012లో కమాండర్‌గా పదవీ విరమణ చేశారు.
అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష‍్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు.
'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్‌బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు.
ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు.
చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment