సాక్షి, కోల్‌కతా : యువతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై వర్సిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను క్లాస్‌లు తీసుకోకుండా నిలిపివేయడంతో పాటు క్యాంపస్‌లో అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించింది. విద్యార్ధులు చేసిన ఫిర్యాదులపై వైస్ ఛాన్స్‌లర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్‌పై తీసుకున్న చర్యలను వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం హెడ్ ఓంప్రకాష్ మిశ్రా వెల్లడించారు.
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ నుంచి తొలగించాలని విద్యార్ధులు పట్టుబట్టారని మిశ్రా తెలిపారు. కన్యత్వం లేని యువతులను ఎవరూ వివాహం చేసుకోరాదని తన ఫేస్‌బుక్ పేజ్‌లో కనక్ సర్కార్ చేసిన పోస్ట్‌లు కలకలం రేపాయి. కన్యత్వం కలిగిన యువతిని సీల్ చేసిన బాటిల్‌తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. మరోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కనక్ సర్కార్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ డీజీపీని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment