లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
'ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు.
#WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt
— ANI (@ANI) December 26, 2023
స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్‌మానస్‌లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు.
ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్‌కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
Comments
Please login to add a commentAdd a comment