hinduism
-
హిందూయిజాన్ని గూండాగిరీగా మార్చేశారు
జైపూర్: హిందూయిజాన్ని కొందరు నేడు బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగాన్ స్థాయికి దిగజార్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. తమ ఫుట్‌బాల్ టీంకు మద్దతివ్వని వారిపై దాడులకు పాల్పడే సంస్కృతినే బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగా నిజంగా పిలుస్తుంటారు. శశి థరూర్ ఆదివారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడారు. ‘ఇటీవల కొందరు మా టీంకు మద్దతివ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని కొడతాం. జై శ్రీరాం అనట్లేదు కాబట్టి, కొరడాతో దండిస్తాం’అంటున్నారన్నారు. ‘ఇది కాదు హిందూయిజం. హిందూయిజానికి దీనితో అస్సలు సంబంధమే లేదు’అని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ హిందువు ఆచరించాల్సిన నాలుగు పురుషార్థాలున్నాయని వివరించారు. హిందూయిజం పేరుతో కొందరు తమది మాత్రమే ఉత్తమ మార్గమని ప్రచారం చేసుకుంటూ బ్రిటిష్ ఫుట్‌బాల్ హూలిగాన్ స్థాయికి దిగజార్చుతున్నారన్నారు. -
పవన్‌కు ఇది తగునా?
పవన్ కల్యాణ్‌కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్‌కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్‌కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్‌ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్‌కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్‌కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్‌ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్‌ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్‌ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్‌ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్‌లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
ఎవరికోసం ఈ అవతారం?
భారతీయ జనతా పార్టీ వారు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావించుకుంటారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికి కొత్త ప్రాంతాలకు విస్తరించాలి. ఇది కాషాయ దళానికి తక్షణ కర్తవ్యం. ఉత్తరాదిన బలపడటం కోసం మూడు దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత ఆ పార్టీదే! అదే వ్యూహంతో దక్షిణాది విస్తరణకు కమల దళం అడుగులు వేస్తున్నది. కర్ణాటక, తెలంగాణాల్లో దాని ఎత్తుగడలు ఒకమేరకు ఫలించాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేరళలో ఆ పార్టీ వోటు బ్యాంకు చెప్పుకోదగినంత పెరిగింది. ఆంధ్ర, తమిళనాడు మాత్రమే ఇంకా కొరకరాని కొయ్యలుగా మిగిలాయి.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు కమల దళాలను కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడేసుకుంటున్నారని బీజేపీలో చాలామంది బాధపడుతుంటారు. చంద్రబాబుకు ఆయన మామగారైన ఎన్టీరామారావు ‘జామాతా దశమగ్రహం’ అనే పేరును ఖాయం చేశారు. ఈ దశమ గ్రహానికి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తున్న కారణంగా స్వయం ప్రకాశితం కాలేక పోతున్నామని ‘ఒరిజినల్ పరివార్’ (ఓపీ బ్యాచ్) చింతాక్రాంత మవుతున్నది. వ్యక్తిగత పొరపొచ్చాల వల్ల మధ్యలో రెండు పార్టీలు దూరమైన ఓ రెండేళ్లు తప్పితే రాష్ట్ర బీజేపీలో ఎప్పుడూ ‘యెల్లో పరివార్’ (వైపీ బ్యాచ్)దే పైచేయి.ఇటీవల చంద్రబాబు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని ప్రసా దాన్నే రాజకీయాల్లోకి లాగడం, ఫలితంగా ఆయనపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతులే. తెలుగు దేశం పార్టీ నాయకులెవరూ సుప్రీం వ్యాఖ్యలపై స్పందించలేదుకానీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైపీ బ్యాచ్ నాయకురాలు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయ మూర్తుల కామెంట్లనే ఆమె తప్పుపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సంద ర్భాన్నీ, సన్నివేశాన్నీ కూడా గమనించాలి.కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఒక్క హామీని పట్టాలెక్కించకపోవడం... వరద నివారణ చర్యల్లో వైఫల్యం... వరద బాధితుల సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సందర్భం. మూడు కూటమి పార్టీలు ముచ్చటగా జరుపుకున్న శతదినోత్సవ వేడుక ఆ సన్నివేశం. కనుక తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం కూటమి ఉమ్మడి వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. ఆ వ్యూహం గొంతు కలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఉండటంతో వైపీ బ్యాచ్ బీజేపీకి బీపీ పెరిగిపోయింది.చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడటం, ఆయన పల్లకీని నిరంతరం మోయడం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు న్నాయి. రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన వైపీ బ్యాచ్ (యెల్లో పరివార్)కు యథాతథ స్థితి పట్ల అభ్యంత రాలేమీ లేవు. ఒరిజినల్ పరివార్ (ఓపీ బ్యాచ్) మాత్రం పార్టీ సొంతంగా ఇంకొంత బలం పుంజుకుంటేనే చంద్రబాబు దగ్గర కూడా గౌరవం లభిస్తుందనీ, లేకుంటే ఉపగ్రహం మాదిరిగానే మిగిలిపోతామనీ హైకమాండ్ దగ్గర వాదిస్తున్నది. తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించినా సొంత బలం పెంచుకొని ఎక్కువ స్థానాలను దక్కించుకోవలసిన అవసరం జాతీయ నాయకత్వానికి కూడా ఉన్నది. సొంత బలం పెంచుకోవడానికి వారి దగ్గరున్న ప్రణాళిక పాత మంత్రమే! మత విశ్వాసాలను ఆలంబన చేసుకోవాలి.వైపీ బ్యాచ్ నాయకత్వం కింద ఉన్న రాష్ట్ర బీజేపీతో ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడి ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వాడు, దాదాపు 13 శాతం జనాభా ఉన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, సినిమాల్లో మాదిరిగా వేషాల్నీ, సంభాషణల్నీ అవలీలగా మార్చగలిగినవాడు వారి దృష్టిలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా బీజేపీ అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటున్నారు. ఇంక కావలసిందేముంది? వీరవైష్ణవావతారం సిద్ధమైంది. శ్రీమహావిష్ణువు అవతారాలన్నీ ధర్మ సంస్థాపనార్థం సంభవించి కర్తవ్యం పూర్తికాగానే ఆయనలోనే ఐక్యమైపోయాయని చదువుకున్నాము. కానీ కమలం పార్టీ సృజించిన ఈ కొత్త వీరవైష్ణవమూర్తి వచ్చే ఎన్నికల కర్తవ్యానికి ముందుగానే అదే పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. సినీనటుడు కావడం వల్ల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన సేవలు వాడుకోవాలని బీజేపీ పెద్దల ఆలో చన. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలుగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనక్కూడా మరో దారి లేదు. వంద రోజుల్లోనే ప్రభుత్వ ప్రతిష్ఠ కనీవినీ ఎరుగని రీతిలో దిగ జారింది. ఈ మాట ప్రతిపక్షం వాళ్లు చెప్పడం కాదు. తెలుగు దేశం పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారు, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కోసం ఎన్నికల యుద్ధం చేసినవారు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.ఇకముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగ జారుడే తప్ప మెరుగయ్యే అవకాశం లేదు. ఉద్యోగుల బదిలీల్లో, ఇసుక దోపిడీలో, లిక్కర్ దుకాణాల పేరుతో పిండుకుంటున్న లంచాల ఫలితంగా ఇప్పటికే పార్టీ జెండా అవినీతి కంపు కొడు తున్నది. ఒక్క వాగ్దానం అమలు కాలేదు. ఈ రకమైన ట్రాక్ రికార్డుతో వారు జనం ముందుకు వెళ్లగలిగే పరిస్థితి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు మత విశ్వా సాలు రెచ్చగొట్టే పార్టీ వెంట నడవడం గుడ్డిలో మెల్ల కదా!పవన్ కల్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్ఠను పణంగా పెట్టి ఆయన ఆ టెంకా యను కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన మూడోరోజే పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష – కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్టు చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచకా తీసేయవచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది.ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సనాతన ధర్మం’ అనే మాటను హిందూ మతానికి పర్యాయపదంగానే ఆయన వాడారు. ‘నేను ముమ్మాటికీ సనాతన హిందువునే. నా ప్రాణాన్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు... నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధమ’ని గంభీరంగా ప్రకటించారు. గతంలో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్‌పై పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు.పవన్ కల్యాణ్ తన ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడిన ‘సనాతన ధర్మం’ అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదళ్లను ఇప్పుడు తొలుస్తున్నది. ఆయన ఉపన్యాసమంతా గమనిస్తే హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం అని భావిస్తున్నట్టుగా ఉన్నది. భారతీయ తాత్విక ధారలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రస్తావన లేదని పలువురు పండితుల అభిప్రాయం. అపౌరుషేయాలుగా, సకల శాస్త్రాలకు మాతృశాస్త్రంగా భారతీయులు పరిగణించే వేదాల్లో సనాతన ధర్మం అనే మాటను ఎక్కడా వాడలేదని చెబుతారు. బౌద్ధ సాహిత్యంలో ఏది సత్యమో అది సనాతనం... అంటే శాశ్వతమైనదనే ప్రస్తావన ఉన్నదట! అంటే ఉషస్సు సత్యం. సూర్యుడు సత్యం. చంద్రుడు సత్యం, గ్రహగతులు సత్యం కనుక అవి సనాతనం, అంటే శాశ్వతమని అర్థం.అట్లాగే సత్య వాక్కు కూడా! వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానతలకు పెద్దపీట వేసి, స్త్రీ స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలనే సనాతన ధర్మమనే ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధానంతరం అంపశయ్య మీదున్న భీష్మాచార్యుని దగ్గర రాజధర్మాన్ని తెలుసు కోగోరిన పాండవులు ఆయన చెంతకు వచ్చారట! పరిపాలకులు ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టి ఉండటం సనాతనమని భీష్ముడు వారికి ఉపదేశించాడట! వ్యాస భారతంలో ఈ ప్రస్తావన ఉన్న దని ఇటీవల ‘ఫ్రంట్‌లైన్’ ప్రచురించిన ఓ వ్యాసంలో రచయిత ఉటంకించారు.సత్యం సనాతనం, అంటే శాశ్వతం. ధర్మం యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి సామాజిక కట్టుబాటు కోసం ఏర్పడిన నియమావళి. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైంది. మన రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడింది. అట్లాగే ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రకటించింది. పౌరుల హక్కులకు పట్టం కట్టింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ ధర్మానికి భిన్నమైనదా? ఎందు కంటే, సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని కూడా తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అభియోగాన్ని మోపారు. పైగా అన్యమతాలకు కొమ్ము కాస్తున్నాయని కూడా న్యాయస్థానాలపై ఆయన విమర్శలు చేశారు.భారత రాజ్యాంగాన్ని నిర్వచించడం, దాని ఆదర్శాలను నిలబెట్టడం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాల విధి. అటువంటి న్యాయస్థానాలకు స్వమతం ఏమిటి? అన్యమతం ఏమిటి? ఇదేమి అభియోగం? రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సనా తన ధర్మాన్ని క్రోడీకరిద్దామా! ఇప్పుడు బీఫ్ తిన్నారనే అభియోగాలతో వీరహిందువులంతా కొందరిని వెంటాడి వేటాడి వధిస్తున్నారు. ఇది సనాతనమా? వేదకాలంలోని ముని వాటికల్లో పశుమాంస భక్షణ ఆమోదయోగ్యమే కదా!రుగ్వేద కాలంలో వసుక్ర రుషి దేవేంద్రుడిని ఇలా ప్రార్థించాడట! ‘‘ఓ ఇంద్రుడా! నీ కొరకు రుత్వికులు వేగంగా మత్తెక్కించే సోమాన్ని సిద్ధం చేస్తున్నారు. నీవు సోమాన్ని తాగు తున్నావు. వారు నీ కొరకు వృషభాన్ని వండుతున్నారు. నీవు ఆహారాన్ని తింటున్నావు’’ – ఈ రుగ్వేద శ్లోకాన్ని మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఉటంకించారు. కనుక ఆచార వ్యవహారాలు, ఆహారపు అల వాట్లు వగైరా ధర్మాధర్మ విచికిత్సలన్నీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతున్నది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనా తన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాము లున్నారు. శంకర పీఠాలతో సహా బోలెడన్ని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారీ, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థచింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మన పునాది లౌకికం
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే, మార్చుకునే హక్కు ఉంది. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్యమాలు శూద్రులను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించేవారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని అర్థం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదని మన నాయకులు గ్రహించాలి.భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవి. మెసçపటోమియా నాగరి కతతో, గ్రీకు ఫిలాసఫీతో పోల్చదగిన స్థాయిలో భారతదేశ చరిత్ర, నాగరికతలు ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల చరిత్ర కారులు, పురాతత్వవేత్తలు, భాషాతత్వవేత్తలు ఇంకా ఈ మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భారతీయ గతంలోకి దర్యాప్తు తూర్పు భాషలు నేర్చిన ఇండా లజిస్టులతో ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీయ చరిత్ర, మరీ ముఖ్యంగా భారతీయ భాషలను తమ అధ్యయనంగా ఎంచుకున్న ఐరోపా పండితులతో ఇది మొదలైంది. వివిధ పాలనాపరమైన హోదా లలో ఈస్టిండియా కంపెనీ నియమించిన విలియం జోన్స్, కోల్ బ్రూక్, హెచ్.హెచ్.విల్సన్ వంటివాళ్లు ఇండాలజిస్టులలో కనిపిస్తారు. వారంతా ఐరోపా ప్రాచీన సంప్రదాయంలో శిక్షణ పొందినవారు. ప్రాచీన భాషల పట్ల ఆసక్తి పెంచుకుని, కొత్త రంగంలో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పాలనా వేత్తలుగా వారికి సంప్రదాయ భారతీయ చట్టం, రాజకీ యాలు, సమాజం, మతం పట్ల ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. ఇదే వారిని సంస్కృతం, పర్షియన్ సాహిత్యం వైపు నడిపించింది. ఈ విషయా లను ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన ‘ఐడియాలజీ అండ్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ’ అనే గ్రంథంలో చెప్పారు. భారతదేశంలోని మానవజాతుల పరిణామాలను పరిశీలించి నట్లయితే, మానవజాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్లు మానవజాతి పరిణామంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహæనిర్మాణం, సంపద కీలక పాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ ఇప్పటికీ దళితుల జీవన విధానంలో కనిపించడం వలన, భారతదేశంలో మానవజాతి పరిణామ లక్షణాలన్నీ దళిత జాతుల్లో ఉండటం వలన బి.ఆర్. అంబేడ్కర్ నిర్వచించినట్లు వీరు ఆది భారతీయులనేది నిర్ధారణ అవుతుంది. డేనిష్ పురాతన శాస్త్రవేత్తలు నిర్వచించినట్లు శిల, కాంస్య, ఇనుప యుగలక్షణాలు కూడా భారత సమాజంలోని ఆదిమ జాతుల్లో ఉన్నాయి. నిజానికి భారతదేశంలో సింధునది వారసులు దళితులు. ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వీరిని ప్రాచీనులు అని వాడారు. వారికి ఆ తర్వాత వచ్చినవారు అర్వాచీనులు అవుతారు. ఏది సనాతనం? ఏది అధునాతనం? అనే దగ్గర ఋగ్వేద ఆర్యులే ఋగ్వేదాన్ని సనాతనం అయిందనీ, అధర్వణ వేదాన్ని అధునాతనమైనదనీ ప్రస్తావించారు. పూర్వం కంటే ఉత్తర బలీయమైనదనేది శాస్త్రం. అందుకే ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం... ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందుదాని కంటే తర్వాత దానిలో ఇంకా విస్తృతి ఉంది అని చెప్పబడింది. మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాuŠ‡ దగ్గర బయల్పడింది. ఇటుకల చైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కానీ వాస్తు వైశిష్ట్యం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ– లోమశ ఋషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాల యాలు. క్రమంగా గుహాలయ వాస్తు భాజా, బేడ్సే, జున్నార్, విఠల్కేరా, కన్హేరీ, కార్లాలలో వికసించి అజంతా – ఎల్లోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్లా చైత్యాలయం.ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచించిన బి.ఎస్.ఎల్. హనుమంత రావు గారు ఆంధ్రులు బౌద్ధ సంస్కృతి వికాసితులు అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనంగా బౌద్ధం విస్తరిల్లిందని విశ్లేషించారు. బౌద్ధ దర్శన ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై, ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసి తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోక మౌర్యుడు దండ సమత, వ్యవహార సమత నెలకొల్పాడు. దీన్ని బట్టి చూస్తే శిక్షాస్మృతి విషయంలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అతని శాసనాలు చాటుతున్నాయి.ఆర్య ఋషులు ఈ దేశంలోకి పశుపాలకులుగా ప్రవేశించారు. గోపాలకులు (గోవులను పాలించే వారు), గవేషణ (గోవులను వెదకడం), గోపతి (గోవుల కధిపతి), గోమేధం (గోవులతో చేయు యజ్ఞం), గోఘ్నుడు (అతి«థిగా వచ్చి గోవులను చంపించువాడు), గోత్రం (గోశాల) అని వారిని వెన్నాడుతూ వచ్చిన ఈ విశేషణాలే వారి వృత్తిని ప్రకటిస్తున్నాయి అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పారు. ఆర్యులు గోపాలకులనీ, బౌద్ధం ప్రభావానికి గురయ్యేవరకూ వారు గోవును యజ్ఞయాగాల్లో బలి ఇచ్చారనీ చెప్పబడింది. తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన కామేష్టి యజ్ఞాలలో గోవృష భాలను బలి ఇవ్వటమే కాకుండా, ఎలాంటి వాటిని బలి యివ్వాలో కూడా ఉంది. విష్ణువుకి పొట్టి వృషభాన్ని, ఇంద్రుడికి వాలిన కొమ్ములు, ఎర్రని రంగు నుదురుగల వాటినీ, శని దేవుడికి నల్ల ఆవును, రుద్రుడికి ఎర్రగోవుని – ఆ రకంగా బలి ఇవ్వాలని నిర్దేశింపబడింది. అందులోనే ‘పంచశరదీయ’ సేవ అనే మరో రకమైన బలిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. అందులో ముఖ్యాంశం ఏమంటే – ఐదేళ్ల వయసున్న 17 పొట్టి గిత్తల్నీ, అదే సంఖ్యలో మూడేళ్ళు నిండని పొట్టి లేగల్నీ బలి ఇవ్వాలని చెప్పబడింది.నిజానికి అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం.అందుండి బౌద్ధం గురించి మాట్లాడటం ఆంధ్రుల చారిత్రక కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతిని ఆంధ్రుల రాజధానిగా శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించిన దానిలో అర్థం అదే. ఆంధ్రులు వైదికేతర మతాలను, ధర్మాలను అన్నింటినీ ఆహ్వానించారు.ముఖ్యంగా బౌద్ధాన్ని, జైనాన్ని, ఇస్లాంను, క్రైస్తవాన్ని, ఇంకా అనేక మతాలను, ధర్మాలను ఆహ్వానించారు. ఆంధ్రదేశంలో శిల్పరూపం క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందు లేదు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి ముందు నిరాకార తత్వాలే ఉన్నాయి. ఆ తర్వాత శిల్పరూపాలు వచ్చినాక కూడా ఒకరి నొకరు గౌరవించుకోవడమే ఎక్కువ కాలం ఉంది.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మతం మార్చుకునే హక్కు పొందు పరిచాడు. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్య మాలు శూద్రు లను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించే వారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదు అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని 25, 26, 27, 28వ అధికరణా లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ ‘విముక్తి అంటే ఏమిటి?’ అని చెప్తూ, 1835 అక్టోబర్ 13న చేసిన ప్రకటనలో మతం మారే హక్కు అందరికీ ఉందన్నారు. నిజానికి ఆంధ్ర దేశం భౌతికవాద తత్వాలతో ప్రభావితమైన దేశం. నార్ల వేంకటేశ్వరరావు, గుర్రం జాషువా, మహాకవి వేమన హేతు వాదాన్ని బోధించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తూ మాన వతా వాదాన్ని ప్రజ్వలింపజేసే కర్తవ్యంలో భాగస్వాములం అవుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
గంగాస్నానం ఎంత గొప్పదంటే...
గంగేమాం పాహి... అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన చివరి చరణాల్లో. ‘‘..సకల తీర్థమూలే సద్గురు గుహలీలే/వరజహ్నుబాలే వ్యాసాది కృపాలే’’ అంటారు. దీక్షితార్ వారి కీర్తికి ప్రధాన కారణం గంగమ్మ ప్రసాదంగా లభించిన వీణకాగా మరొకటి తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం. సద్గురువు అయిన గుహుడు.. సుబ్రహ్మణ్యుడు గంగానది ఒడ్డున ఆడుకునేవాడని అన్నారు. అక్కడ ఆడుకునేవాడని చెప్పడం వెనుక సుబ్రహ్మణ్య జననం గురించి గుర్తు చేస్తున్నాడు. శివవీర్యం తేజస్సు భరించలేని దేవతలు దానిని అగ్నిహోత్రునివద్ద ఉంచారు. ఆయన ఒకనాడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి...‘‘ఇది దేవతాకార్యం. దీనిని నీవు ఉంచుకుని గర్భం ధరించు’’ అన్నాడు. గంగ అంగీకరించింది. అయితే శివ తేజస్సు శరీరం అంతటా ప్రవహించేసరికి తట్టుకోలేక..‘నేను వదిలిపెట్టేస్తాను.. ఎక్కడ వదిలిపెట్టేయను’ అనడిగింది. ‘‘రెల్లుగడ్డి పొదలో వదిలి పెట్టు’’ అని అగ్నిహోత్రుడు సలహా ఇచ్చాడు. అదే శరవణ భవ.. మంత్రం. అక్కడ సుబ్రహ్మణ్య జననం జరిగింది. అందువల్ల బాల సుబ్రహ్మణ్యుడు గంగానదీ ప్రవాహ తీరంలో ఆడుకునేవాడు. అదే సద్గురు గుహలీలే... అన్న చరణం. బ్రహ్మ, విష్ణు స్పర్శ పొందిన గంగ... సగరుల భస్మరాశిమీదుగా ప్రవహించడానికి పాతాళానికి భాగీరథుడి రథం వెంట పరుగెడుతూన్నది. మార్గమధ్యంలో జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచెత్తడంతో ఆయన ఆగ్రహించి మొత్తం గంగను తపశ్శక్తితో లోపలకు పుచ్చేసుకున్నాడు. భగీరథుడి అభ్యర్థన మేరకు మళ్ళీ విడిచిపెట్టాడు. అలా గంగ రుషి పుత్రిక జాహ్నవి అయింది. వ్యాసాది కృపాలే... అని కూడా అన్నాడు.. వ్యాసమహర్షికి గంగానది అంటే ఎంత వ్యామోహమో! పరమశివుడు శపిస్తే... గంగను, కాశీని వదిలిపెట్టి పోవడానికి వ్యాసుడు క్షోభిల్లాడు. గంగకు ఒకగొప్పదనం ఉంది. గంగావతరణమ్ గురించిగానీ, గంగను గురించిగానీ వింటే చాలు... అంటారు భీష్ముడు అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుతో మాట్లాడుతూ –‘‘గంగానది పేరు తలచుకోవడం గానీ, గంగలో స్నానం చేయడం గానీ, ఒక చుక్క గంగనీటిని నాలుకమీద వేసుకోవడం గానీ చేయాలి. ఆచరించవలసినవే అయినప్పటికీ యజ్ఞయాగాదులకన్నా, బ్రహ్మచర్యం కన్నా, తపస్సుకన్నా, దానం కన్నా, గంగాస్నానం గొప్పది’’ అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు...‘‘గౌరియొక్కతె యాకాశగంగ యొకతె/కాశియొక్కతె దక్షిణకాశి యొకతె/నలుగురును శంభునకు లోకనాయకునకు/రాణ్ వాసంబులనురాగ రసమ పేర్మి?’’ అని అంటాడు భీమేశ్వర పురాణంలో. అంటే గౌరిని ఎంతగా ప్రేమిస్తాడో శంకరుడికి గంగ, కాశి, దక్షిణ కాశి అన్నా కూడా అంతే అనురాగమట. ఎవరయితే భక్తితో గంగానది పేరు తలచుకుని ఒక్క గంగనీటి చుక్కను నాలుకమీద వేసుకుంటారో వారికి యమధర్మరాజుతో సంవాదం లేదన్నారు. అంటే వారికి యమదూతల దర్శనం ఉండే అవకాశం లేదు. అంతగొప్పగా గంగానదీ వైభవాన్ని కీర్తించిన ముత్తుస్వామి దీక్షితార్ వారి నోట కీర్తనల రూపంలో ప్రవహించిన శాబ్దికగంగను కూడా మనం నిత్యం వింటూ ఉండాలి. (చదవండి: అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!) -
రాజకీయ సుద్దపూసలు... హిందుత్వం చుట్టూ సరికొత్త రాజకీయం
-
హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 'ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. #WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt — ANI (@ANI) December 26, 2023 స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్మానస్లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
యూదుల ఆరాధనా విధానం ఏమిటి? ‘కిప్పా’కు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రపంచంలోని పురాతన మతాలలో జుడాయిజం ఒకటి. దీనికి సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం దాదాపు ఒకే సమయంలో ఉద్భవించాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ మతాల మధ్య ఎంతో సారూప్యత కనిపిస్తుంది. జుడాయిజాన్ని హిందూ మతంతో పోల్చిచూస్తే కొన్ని అంశాలు మినహా, ఎటువంటి సారూప్యత కనిపించదు. జుడాయిజం ప్రకారం ఈ మతాన్ని నమ్మేవారు రోజుకు మూడు సార్లు ప్రార్థనలు చేస్తారు. యూదులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ప్రార్థన చేసే సమయంలో జెరూసలేం వైపు చూస్తారు. జుడాయిజం విగ్రహారాధనను విశ్వసించదు. జుడాయిజంను అనుసరిస్తున్నవారు ప్రతిపనికీ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఖబద్ హౌస్ యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఖబద్ హౌస్‌లు పలు దేశాలలో కనిపిస్తాయి. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని ముంబై, ఢిల్లీలోని పహర్‌గంజ్, అజ్మీర్, హిమాచల్‌లోని ధర్మ్కోట్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లలో ఖబద్ హౌస్‌లు ఉన్నాయి. విదేశాల నుంచి భారత్ సందర్శనకు వచ్చే ఇజ్రాయిలీలు ఈ ఖబద్ హౌస్‌లలో ప్రార్థనలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, ధర్మ్కోట్లోని ఖబద్ హౌస్‌లను సందర్శించడానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యూదులు ప్రార్థనా సమయంలో తలపై కిప్పా(టోపీ) తప్పనిసరిగా ధరిస్తారు. కిప్పా అనేది ప్రతి యూదు ప్రత్యేక సందర్భాలలో ధరించే టోపీ. ఇది హిందూ, ఇస్లాంలో కూడా కనిపిస్తుంది. హిందువులు పూజ చేసేటప్పుడు తలపై గుడ్డ పెట్టుకునే ఆచారం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఇస్లాంలో కూడా నమాజ్ చదివేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరిస్తారు. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం!
బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది. కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది. అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు. తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి. – యామిజాల జగదీశ్ (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
ప్యారిస్ సభలో బీజేపీపై రాహుల్ ఫైర్..
ఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజంతో వారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హిందువులకు వారు చేసిందేమీ లేదని చెప్పారు. తాను భగవద్గీత, ఉపనిషత్‌లను చదివానని ఎక్కడా కూడా హిందువులు(బీజేపీ) వారి గురించి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో సైన్స్ పీఓ యూనివర్సిటీ విద్యార్ధులతో ముచ్చటించారు. I have read the Gita, Upanishads and many Hindu books. There is nothing Hindu about what the BJP does—absolutely nothing. I have not read anywhere in any Hindu book or heard from any learned Hindu person that you should terrorize or harm people who are weaker than you. They… pic.twitter.com/mEj2vOrAxq — Congress (@INCIndia) September 10, 2023 "మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని లేదా హాని చేయాలని నేను ఏ హిందూ పుస్తకంలో చదవలేదు. ఏ హిందూ పండితుడి నుంచి వినలేదు. ఈ ఆలోచన, హిందూ జాతీయవాది అనేది పూర్తిగా తప్పు పదం. 'హిందూ జాతీయవాదులు'లకు హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. "బిజెపి, ఆర్ఎస్ఎస్కు హిందూ మతంతో ఎటువంటి సంబంధం లేదు. వారు ఎలాగైనా అధికారం సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు ఏదైనా చేస్తారు" అని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ యువకులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ లోక్ సభ ఎంపీ తేజశ్వీ సూర్య తప్పుబట్టారు. రాహుల్ గాంధీకి మన ధర్మంపై చాలా తక్కువ అవగాహన ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ వేదికలకు భారత్ నిలయంగా మారిందని చెప్పారు. జీ20 సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను ప్రపంచ దేశాలు 100 శాతం ఆమోదించాయని గుర్తుచేశారు. The very fact that Rahul Gandhi thinks that Hinduism is practiced by referring to ‘books’ shows how shallow his understanding of our dharma. That he has been reduced to crying before a handful of people in some far away European city while Bharat is achieving global consensus… https://t.co/TZk2VmmC6w — Tejasvi Surya (@Tejasvi_Surya) September 10, 2023 ఇదీ చదవండి: జీ20 డిన్నర్ మీటింగ్‌లో మమతా బెనర్జీ.. కాంగ్రెస్ అసంతృప్తి -
నెహ్రూ హిందువు కాదంటారా?
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్ పరివార్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్ మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు. గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది. సుసంపన్న భారత ఆనవాళ్లు నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1934), ‘యాన్ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్. (బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు. 3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి. ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్.రాధాకృష్ణన్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆలోచనల ప్రతిధ్వనులు నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది. నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’. నెహ్రూకు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ ‘గురూజీ’ గోల్వాల్కర్... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
పెళ్లంటె ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర ‘స్నాతకం’ అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. ‘సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... ‘వరుడికి శుభం కలుగుగాక’ అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది. వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తయిదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో! వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?
అంబేడ్కర్‌ను బీజేపీ కానీ, నరేంద్ర మోదీ కానీ విశేషంగా గౌరవిస్తున్నట్లు పైకి కనబడుతోంది. మోదీ అయితే తాను అంబేడ్కర్ భక్తుడిని అని చెప్పుకున్నారు. కానీ బీజేపీ నమ్ముతున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ విశ్వసించారు. హిందూరాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుందని రాశారు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని కూడా అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజాస్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృత్వానికి చోటిచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి ప్రమాదం ఈరోజు కనబడటం లేదా? నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఒక ఆదర్శ మూర్తిగానే కాకుండా, తమ విశిష్ట కథా నాయకుల్లో ఒకరిగా కూడా గౌరవిస్తోంది. 2015లో ప్రధాని మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2016లో మరో సందర్భంలో తాను అంబేడ్కర్ భక్తుడిని అని ప్రకటించుకున్నారు. అయితే బీజేపీ విశ్వసిస్తున్న లేక పాటిస్తున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పిన దానికీ, పాటించిన దానికీ పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అధ్యయనం చేసి ప్రచురించిన ‘అంబేడ్కర్: ఎ లైఫ్’ వెల్లడించింది. హిందూయిజం, హిందూ–రాజ్‌పై అంబేడ్కర్, బీజేపీల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని శశి థరూర్ రచన పేర్కొంది. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. కానీ అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ ఆనాడు విశ్వసించారు. ‘‘హిందూ రాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుంది’’ అని అంబేడ్కర్ రాశారు. ‘‘హిందువులు ఏమైనా చెప్పవచ్చు. కానీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు హిందూయిజం పెనుముప్పు. ఈ విషయంలో అది ప్రజాస్వామ్యంతో ఏమాత్రం సరిపోలదు. హిందూ –రాజ్‌ని ఏ విధంగానైనా సరే నిరోధించి తీరాలి’’ అని అంబేడ్కర్ పేర్కొన్నారు. వాస్తవానికి అంబేడ్కర్ హిందూయిజాన్ని ఏమాత్రం ఇష్టపడ లేదు. హిందూ నాగరికతను మానవజాతిని బానిసత్వంలోకి దింపడా నికి పన్నిన క్రూరమైన కుట్రగా ఆయన పేర్కొన్నారు. హిందూయిజా నికి సరైన పేరు అపకీర్తి అని మాత్రమే అన్నారాయన. దీన్ని బట్టి హిందువులను కూడా ఆయన ఇష్టపడనట్లే కనిపిస్తుంది. ‘‘హిందు వులు... పిదపతనంతో కుంగిపోయి ఉన్నప్పటికీ శక్తిని కోరుకుంటున్న పిగ్మీలు, మరుగుజ్జులకు చెందిన జాతి... హిందువులు మంచిగానో, చెడ్డగానో ఉండవచ్చు కానీ ఉత్తమ హిందువు అంటూ ఎవరూ ఉండరు’’ అన్నారు అంబేడ్కర్. అంబేడ్కర్ భావాల గురించి బీజేపీకి తెలియకుండా ఉంటుందా... లేదా మనం అజ్ఞానులం అనీ, అంబేడ్కర్‌ను మనం కనుగొనలేమనీ అది భావిస్తోందా? లేక తనకు ప్రయోజనకరమైన కారణాలతో అంబేడ్కర్‌ను అది ఉద్దేశపూర్వకంగా కౌగలించుకుం టోందా? అందుకోసమే నిక్కచ్చిగానూ, ఇబ్బందికరంగానూ ఉండే అంబేడ్కర్ భావాల్లో పొడసూపే వ్యత్యాసాలను కూడా బీజేపీ పట్టించుకోకుండా ఉంటోందా? భారతీయ మైనారిటీలపై అంబేడ్కర్ అభిప్రాయాలను మీరు చూసినట్లయితే, ఈ ప్రశ్నలు మరింతగా ఇబ్బందిపెడతాయి. 1948లో రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ప్రసంగిస్తూ, మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి మెజారిటీ పైనే ఉందని స్పష్టంగా చెప్పారు. ‘‘భారతదేశంలోని మైనారిటీలు తమ అస్తిత్వాన్ని మెజారిటీ చేతుల్లో ఉంచడానికి అంగీకరించారు... వారు మెజారిటీ పాలన పట్ల విశ్వాసంతో ఉండటానికి అంగీకరించారు. ఆ మెజారిటీ ప్రాథమి కంగా మతపరమైన మెజారిటీనే తప్ప రాజకీయ మెజారిటీ కాదు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలి.’’ అలాంటి విధిని, బాధ్యతను ఆమోదించడం అటుంచి దాన్ని బీజేపీ గుర్తిస్తుందా? అంబేడ్కర్ ఎన్నడైనా ‘బాబర్ కి ఔలద్’, ‘అబ్బా జాన్’ అనే మాటల్ని ఆమోదించేవారా? ‘కబరస్తాన్, శ్మశాన్ ఘాట్’ అనే భావనలను ఆయన ఆమోదించేవారా? లేదా ముస్లిం మతస్థు లను మొత్తంగా పాకిస్తాన్‌కి పంపించేస్తామనే బెదిరింపులను ఆమో దించేవారా? ఇలా ప్రశ్నించడం ద్వారానే బహుశా ప్రశ్నలకు సమా ధానం రాబట్టగలం. అయితే అంబేడ్కర్ ఆనాడే ఒక హెచ్చరిక చేశారు. 1948 నవంబర్‌లో తాను చేసిన సుప్రసిద్ధ ప్రసంగంలో అత్యంత స్పష్టంగా ఒక విషయాన్ని వెల్లడించారు. ‘‘మైనారిటీలు విస్ఫోటక శక్తి. అది కానీ వెలుపలకు వచ్చిందంటే మొత్తం రాజ్యవ్యవస్థనే పేల్చివేస్తుంది’’ అన్నారు. నిజానికి 70 సంవత్సరాల క్రితం మైనారిటీలు చిన్న సంఖ్యలో ఉండేవారు. భయపడుతుండేవారు. తమను నిర్లక్ష్యం చేసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈరోజు వారి జనాభా 20 కోట్లు. తమను ఎంతగా ఆగౌరవ పరుస్తున్నారో, సమాజం నుంచి ఎంతగా తమను వేరుపరుస్తున్నారో అనే విషయంలో వీరు చైత న్యంతో ఉన్నారు. అంబేడ్కర్ బతికి ఉంటే ఈరోజు చాలా ఆందోళన చెంది ఉండే వారు. కానీ బీజేపీ ఆయన భయాలను పంచుకునేదా లేక అర్థం చేసుకునేదా? బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోందని అంబేడ్కర్ భావించేవారని మీరు ఊహించగలరా? కానీ బీజేపీ మాత్రం ప్రస్తుతం చాలా ఉల్లాసంగా పని చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.భారత్ ఎలాంటి తరహా ప్రజాస్వామిక దేశంగా మారిపోతోందో మీరు గుర్తించినప్పుడు అంబేడ్కర్ భావాలకూ, బీజేపీ ఆచరణకూ మధ్య ఉన్న మరో అంతరం స్పష్టమవుతుంది. స్వేచ్ఛా యుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భార తీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజా స్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృ త్వానికి చోటిచ్చే అవకాశం ఉందని ఆయన ఆనాడే చెప్పారు. ప్రజామద్దతు ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా నియంతృత్వం ఆవిర్భవించే అవకాశం ఉంటుందని అంబేడ్కర్ 1948లోనే హెచ్చ రించారు. అలాంటి ప్రమాదం ఈరోజు జరగడం లేదా? మన రాజ కీయాల్లో ప్రస్తుతం ఒక ప్రచండాకృతి ఆధిపత్యం చలాయిస్తోంది. ఆ ప్రచండాకృతి చుట్టూ వ్యక్తి ఆరాధన అల్లుకుపోతోంది. ఎలాంటి అసమ్మతినీ అది సహించడం లేదు. పార్లమెంటును తరచుగా సంప్ర దించడం లేదు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ బలహీన పడి పోయాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల కోరలు పెంచారు. మీడియాను నిర్వీర్యం చేసి పడేశారు. చివరగా, భారతదేశం విషయంలో బీజేపీని, దాని దార్శనికతను అంబేడ్కర్ ఎలా భావించి ఉండేవారో అని నేను ఆశ్చర్యపడు తున్నాను. నరేంద్ర మోదీ తనకు ఒక భక్తుడిగా ఉండటాన్ని చూసి అంబేడ్కర్ నిజంగా గర్వపడేవారా? బీజేపీవారు తన పాదముద్రల పైనే నడుస్తున్నారని అంబేడ్కర్ నమ్మి ఉండేవారా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
హిందువుగా ఉన్నంత వరకూ.. రాజా వ్యాఖ్యల దుమారం
చెన్నై: ‘‘హిందువుగా ఉన్నంత వరకూ నువ్వు దళితునివే. అంటరానివాడివే. శూద్రునివే. శూద్రునిగా ఉన్నంతకాలం నువ్వు ఓ వేశ్య సంతానమే’’అంటూ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం చెన్నైలో పార్టీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలో ఎంతమంది వేశ్య సంతానంగా, అంటరానివారిగా మిగిలిపోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలపై గొంతెత్తినప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని బద్దలుకొట్టే ఆయుధంగా మారగలం’’అంటూ పిలుపునిచ్చారు. ‘‘శూద్రులంటే హిందువులు కారా? వారిని మను స్మృతి తీవ్రంగా అవమానించింది. వారికి విద్య, ఉద్యోగ, సమానావకాశాలను, ఆలయాల్లోకి ప్రవేశాలను నిషేధించింది’ అంటూ రాజా ప్రసంగించినట్టుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ద్రవిడ ఉద్యమం 90 శాతం మంది హిందువులకు బాసటగా నిలిచిందంటూ అనంతరం రాజా ఓ ట్వీట్ కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. Who are Sudras? Are they not Hindus? Why they have been insulted in Manusmrithi denied equality, education, employment and Temple entry. Dravidian Movement as saviour of 90% Hindus questioned and redressed these, cannot be anti-Hindus. — A RAJA (@dmk_raja) September 13, 2022 ఇదీ చదవండి: బీజేపీ బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోం -
ఈ ధర్మాన్ని పరిరక్షించే వారెవరు?
హిందూ ధర్మంపై, హిందువులపై ప్రస్తుతం బహుముఖ దాడులు కొనసాగుతున్నాయి. మతమార్పిడి కార్యక్రమాల వల్ల హిందూ సమా జంలోని నిరుపేద వర్గాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా సంపన్నులైన ఆధిపత్య కులాల ప్రజలు కూడా మతం మార్చుకుంటున్నారు. హిందూ ధర్మంపై అవగాహన లోపమే మతమార్పిడికి ఒక కారణం. అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సమాజంలో ఉనికిలో లేకుండా పోయింది. దీంతో మన ధర్మం గురించి పిల్లలకు బోధించే వారే లేకుండాపోయారు. ఇంట్లో కానీ, పాఠశాలల్లో కానీ, సమాజ జీవితంలో కానీ హిందూ ధర్మం గురించి యువతకు చెప్పేవారే లేరు. హిందువుల్లో పలురకాల భక్తులున్నారనిపిస్తుంది. చాలామంది తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసమే పూజలూ, ప్రార్థనలూ చేస్తారు. వీరికి హిందూ ధర్మం గురించి ఎవరూ చెప్పరు. పూజారులు చదివే మంత్రాల అర్థాలూ వీరికి తెలియవు. దేశంలోనూ, దేశం వెలుపలి నుంచి సేకరిస్తున్న భారీ నిధులతో క్రైస్తవులు పాఠశాలలు నడుపుతున్నారు. అయితే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న పాఠశాలల కంటే మెరుగైన క్రమశిక్షణ, ఆదేశాలను పాటించడం క్రిస్టి యన్ పాఠశాలల్లో అమలవుతుందని అందరికీ తెలుసు. అందుకే హిందూ తల్లితండ్రులు తమ పిల్లలను కూడా క్రిస్టియన్ సంస్థలు నడుపుతున్న పాఠశాలలకే పంపుతుం డటం కద్దు. హిందూమతంలోని వివిధ పీఠాధిపతులు తమ వంతుగా విద్యాసంస్థలను స్థాపించి హైందవ ధార్మిక అంశాలను సిలబస్‌లో, పాఠ్యేతర కార్యక్రమాల్లో తప్ప కుండా భాగం చేయాలి. ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ, సమాజంలోనూ హిందూ ధర్మానికి సంబంధించి ఉపదేశించేవారే లేనప్పుడు మనం ఏం చేయాలి? క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలే ఇక్కడ కూడా మనకు ఆదర్శం కావాలి. క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళతారు. ముస్లింలు శుక్రవారం మసీదుకు వెళతారు. ఈ రెండింటిలోనూ ప్రార్థనలు మాత్రమే చేయరు. తమ మతం గురించి ఉపదేశిస్తారు. మతానుయాయుల విధులను వివరిస్తారు. (చదవండి: కేంద్ర పథకాలకు మార్గదర్శి) హిందూ మతంలోని ప్రతిశాఖలోనూ హనుమాన్‌ని పూజిస్తారు కాబట్టి ప్రతి ఆదివారం భక్తులందరూ సమీపంలోని హనుమాన్ ఆలయానికి నిర్దిష్ట సమయంలో వెళ్లి పూజలు చేయాలి. అక్కడ వీరికి చర్చిలు, మసీదుల్లో మాదిరే, హిందూ ధర్మం గురించి ప్రవచనాలు, ప్రసంగాలు వినిపించాలి. భజనలు, ప్రసాదం పంపిణీ ఆ తర్వాతే చేయాలి. ఈ రకంగా మాత్రమే వేర్వేరు దేవతలను, మత శాఖలను పూజించే, పాటించే హిందూమత అనుయాయుల మధ్య సంఘీభావం ఏర్పడుతుంది. ఇది మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఆలయాల నిర్వహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు వాటిని ఎవరికి అప్పగించాలని ప్రభుత్వాలే అడుగుతున్నాయి. దీనికి సమాధానం సింపుల్. మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు లాగానే భక్త బృందాలు, భక్తుల సొసైటీలు వీటిని నడపాలి. ఇంతకుమించి మహాధర్మాచార్య సభ ఉండితీరాలి. (చదవండి: సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి) ఆలయాలపై ప్రభుత్వ యాజమాన్యాన్ని తప్పించి తగిన స్థాయి కలిగిన హిందూ విభాగాల సూచనలను స్వీకరించి పరమ ధర్మాచార్యులతో కమిటీని ఏర్పర్చాలి. హిందూ సంస్థాగత నిర్మాణానికి మనం సిక్కు గురుద్వారా చట్టాన్ని ప్రారంభ బిందువులా స్వీకరించవచ్చు. అందుకే ధర్మాచార్యులు పీఠాలు, మఠాలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రాజకీయ పార్టీలను ప్రభావితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ సంకల్పం లేనిదే మనం కోరు కుంటున్న మార్పు సాధ్యపడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) హిందూ మతం లేనిదే భారతదేశానికి భవిష్యత్తు లేదని, భారతీయ మూలాల్లో పాతుకుని ఉన్న హిందూ తత్వాన్ని తొలగిస్తే దేశమనే దొడ్డ వృక్షం పునాది నుంచి కూలిపోతుందని మేడమ్ అనీబిసెంట్ చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. భారతమాత పుత్రులే ఆమె విశ్వాసాన్ని పుణికిపుచ్చుకోకపోతే దాన్ని ఎవరు పరిరక్షిస్తారు అని ఆమె ఆనాడు వేసిన ప్రశ్న ఈనాటికైనా మనకు కనువిప్పు కలిగించాలి. - డాక్టర్ టి. హనుమాన్ చౌదరి భారతీయ ధర్మ రక్షణ సమాఖ్య కన్వీనర్ -
పరాయీకరణ దిశలో మేడారం జాతర
ములుగు జిల్లా మేడారంలో ‘సమ్మక్క–సార లమ్మ’ జాతర ప్రారంభమైంది. ఈ గిరిజన జాతర నేడు కుల, మత, ప్రాంత భేదం లేని సకలజనుల జాతరగా మారింది. రెండేళ్లకొకసారి జరిగే జాత రను ప్రభుత్వం ఆదాయవనరుగా భావిస్తున్నదే తప్ప... గిరిజనులకు లాభం చేకూర్చే సంగతి పట్టించుకోవడంలేదు. ఆదివాసీలకు మతాచారాలు లేవు. విగ్రహారాధన అసలే లేదు. పండుగలు, పూజల్లో వేద మంత్రాలు ఉండవు. కానీ హిందూ పండుగలను కూడా చేసుకుంటారు. ఇటువంటి ఆదివాసీల దేవతలను హైందవీకరణ చేసే ప్రక్రియ ఇప్పుడు మంచి ఊపు మీదుంది. ఆదిమ సంస్కృతికి విరుద్ధమైన పరాయీకరణ మొదలైంది. ఆదివాసీ సాంస్కృతిక జీవనంలో రాజకీయ నాయకుల, గిరిజనేతరుల, అధికారుల జోక్యం పెరిగింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ గద్దెల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, అడవి పూల అలంకరణకు బదులుగా పెయింట్, ప్లాస్టిక్ పూలు, కాకతీయ తోరణాలు, హిందూత్వ చిహ్నాలు వాడుతున్నారు. పారేటాకుకు బదులు అరిటాకు భోజనం, ప్రసాదంగా బెల్లం (బంగారం) కాక లడ్డూలు దర్శనమిస్తున్నాయి. రూపమే లేని సమ్మక్క, సారలమ్మలకు కిరీటం, శంకు, కత్తి, డాలు అంటగట్టి వారు జింక, పులిపై ఊరేగుతున్నట్లు చిత్రించడం బ్రాహ్మణీకరణ కాక ఏమవుతుంది? ఇది ఏమాత్రం ఆదివాసీ సంస్కృతి కాదు. (చదవండి: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!) రాజకీయ నాయకులు, వీఐపీలు, అధికారులు చిలుకలగుట్ట, ఆలయంలోకి దర్శనం కోసం గిరిజన వడ్డె (పూజారి)ల అభ్యంతరాలను పట్టించు కోకుండా పాదరక్షలతో ప్రవేశించిన గతానుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవతల ఆగమన సమయంలో తూతకొమ్ము శబ్దం కాకుండా తుపాకీ శబ్దం చేయడం ఆదివాసుల జాతరపై ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆదివాసీల మౌఖిక సాహి త్యానికి విరుద్ధంగా దేవతల భిన్న కథనాలు, పాటలు, పుస్తకాలు, వీడియో ఆల్బమ్స్ వ్యాపారం జరుగుతోంది. ఆదివాసీలు క్రమంగా తమ సంస్కృతి పరమైన హక్కులను కోల్పోతున్న సంఘ టనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. జాతర నిర్వహణలో భాగంగా గిరిజన సంస్కృతి, పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘ట్రస్టుబోర్డ్’ కమిటీలో ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు మినహా మిగిలిన వారంతా గిరిజనే తరులే ఉండటం ఆక్షేపణీయం. జాతర ఆదాయవనరు కావడంతో గిరిజనేతరుల వలసలు పెరిగి స్థానిక నాయకుల ప్రమేయంతో 1/70 చట్టానికి విరుద్ధంగా భూములు కొనుగోలు చేసి, భవనాలు నిర్మించారు. జాతర జరిగే ఏడాదికి ఆదివాసులు నష్టపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. జాతర నిర్వహణ, పర్యవేక్షణకు ఆదివాసీ అధికారులకు బాధ్యత అప్పగించాలి. వనదేవతల స్వస్థలాలైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యక్కపేట, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్ల గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి పనులు చేపట్టాలి. జాతర ఆదాయంలో 14 మంది పూజారులకు ఇచ్చే 1/3 వంతు వాటాధనాన్ని పెంచాలి. మిగిలిన జాతర ఆదాయాన్ని ఆదివాసీల సంప్రదాయిక వారసత్వాలను గౌరవించి స్థానిక ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన జాతరకు ఒకరోజు సెలవు (కాంపెన్సేటరీ హాలిడే)గా కాకుండా కనీసం రెండు రోజులైనా సాధారణ సెలవు ప్రకటించాలి. (చదవండి: ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!) - గుమ్మడి లక్ష్మీనారాయణ వ్యాసకర్త ఆదివాసీ రచయితల వేదిక సభ్యుడు ---------------------------------------------------------------- ఆదివాసీ అస్తిత్వం అంతమవుతోంది! మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. కానీ నేడది పూర్తిగా బ్రాహ్మణ ఫ్యూడల్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. జాతర బ్రాహ్మణీకరణకూ, హైందవీకరణకూ గురవుతోంది. దీనిమూలంగా జాతరలో ఆదివాసీ అస్తిత్వం అంతం అవుతోంది. ప్రభుత్వ చొరబాటు కూడా ఎక్కువైంది. సమ్మక్క సారక్క గద్దెల వద్ద గిరిజనేతరులను నియమించి ఆదివాసీ సంప్రదాయాలను అవమానిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో గిరిజనేతరులను నియమించి జాతరను కబ్జా చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా గిరిజనేతర పార్టీల్లో చేరి జాతరను నిర్లక్ష్యం చేస్తున్నారు. జాతర సంపదను దోచుకోవడానికి బడాబాబులు, మద్యం డాన్లు, బెల్లం డాన్లు మేడారం ట్రస్ట్ బోర్డులో చేరుతున్నారు. జాతరకు జాతీయ హెూదా కల్పించాలని పాలకులు పథకాలు పన్నుతున్నారు. ఈ హెూదా వస్తే జాతర ఆదివాసీల నుండి మరింత చేజారి పోతుంది. టూరిజం పేరుతో పెద్ద భవనాలు, హోటళ్లు కట్టి ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటారు. జాతరను కమర్షియల్ చేస్తారు. బ్రాహ్మాణీయ సంప్రదాయాలకు పునాదిగా లడ్డు ప్రసాదం జాతరలో ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో నిరాడంబర మూర్తులైన సమ్మక్క–సారలమ్మకు పెద్ద భవనాలను బంగారంతో నిర్మించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
కర్మ... ఫలితం
తెల్లవారి లేచినప్పటినుంచి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. దీనినే అమెరికన్లు‘సరైన మనిషి, సరైన ప్రదేశం లో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు. కర్మకోణం నుంచి చూస్తే– కారణం లేకుండా కార్యం జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కాని, చెడుకానీ లేదా వీటి మిశ్రమకర్మలు కాని గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి. మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. నిష్కామకర్మలో ఐదు భాగాలున్నాయి. 1.పని చేయి 2. దాన్ని నీకోసం చేయకు 3.పరులకోసం చేయి 4.పని తాలూకు ఫలితాన్ని ఆశించకు 5. ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు. మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం. ‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాము’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అనుకుని చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు. క్రైస్తవంలో సేవాతత్పరతకి పెద్దపీట వేశారు. హిందూమతంలో భక్తికి పెద్దపీట. కాబట్టి గుళ్లూ గోపురాలకి వెళ్లడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్లకి సేవకోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు. నిష్కామకర్మ వల్ల స్వార్థం కరిగి, మనిషి ఉన్నతుడవుతాడు. మనం చేసిన కర్మఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ, వాటినుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి(జన్మ) నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ, అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు, కర్మఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తోంది. నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూటగట్టుకుంటారు. ఉదాహరణకు పక్కింటివారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం, వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం, నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం, తను పని చేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణాలను, వాహనాలని, సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం, ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపటం, ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లర ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం, రోడ్డుమీద చెత్త వెయ్యడం మొదలైన దుష్కర్మలు చే యకుండా స్వయం నియంత్రణను అలవరచుకోవాలి. లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారం బాగా పెరుగుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది. ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునేకంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగ గలుగుతుంది. ఇదే సుకర్మల ప్రయోజనం. – మల్లాది వెంకటకృష్ణమూర్తి -
అసలైన హిందూయిజాన్ని కాపాడాలి!
‘‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సంప్రదాయ హిందూయిజాన్ని, హిందుత్వకు చెందిన బలిష్ఠమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన ప్రామాణిక రాజకీయ రూపమే తప్ప మరొకటి కాదు’’ అని నా తాజా పుస్తకంలో రాసిన వాక్యం నా ఇంటిపైకి హిందుత్వ శక్తుల దాడి వరకు తీసుకొచ్చింది. చాలాకాలంగా హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉందనే భావన కలిగించాం. ఇప్పటికైనా మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి. నా తాజా పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ 300 పేజీలతో రూపొందింది. అయోధ్యపై తీర్పులో న్యాయపరమైన ఔచిత్యంపై నా సహ న్యాయవాదులు చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నప్పటికీ, నా ఈ పుస్తకంలో ఆ తీర్పును బలపర్చడానికే ప్రయత్నించాను. హిందూయిజం తాత్వికతను గుర్తించడమే కాకుండా ప్రశంసిస్తూ వచ్చాను. సనాతన ధర్మానికి సంబంధించిన మానవీయ కోణాలను ఎత్తి చూపాను. హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, విచారకరమైన గతాన్ని మూసివేసి పరస్పర భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్తుకు ఒక మంచి అవకాశంగా అయోధ్య తీర్పును ఎత్తిపట్టడమే నా తాజా పుస్తకం లక్ష్యం. విచారకరంగా, నా ఈ ప్రయత్నాన్ని జాతీయ మీడియా కానీ, అధికార పార్టీ సభ్యులు కానీ గమనించకపోగా, నా పుస్తకంలోని 6వ అధ్యాయంలో హిందూయిజానికి, హిందుత్వకు మధ్య వ్యత్యాసం గురించి పేర్కొన్న ఒక వాక్యంపై విరుచుకుపడ్డారు. అదేమిటంటే ‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సాంప్రదాయ హిందూయిజాన్ని హిందుత్వకు చెందిన బలిష్టమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన రాజకీయ రూపమే.’ హిందుత్వ స్వభావాన్ని ప్రశ్నించడం, అంతకు మించి దాన్ని బోకో హరామ్, ఐసిస్‌తో పోల్చి వర్ణించడం వల్ల నా పుస్తకంపై ఇంత ఆగ్రహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థల మధ్య ఉన్న సామాన్య లక్షణాలను చెప్పడానికే ఆ వాక్యాన్ని వాడాను తప్ప ఇవన్నీ సమానమని నేను పేర్కొనలేదు. మతాన్ని వక్రీకరిస్తూ, మానవత్వాన్ని గాయపర్చే ఒక అపక్రమ రూపానికి ఇవి సాధారణ నమూనాలు అని మాత్రమే చెప్పానని నేను ఇచ్చిన వివరణను ఎవరూ పట్టించుకోలేదు. నాపై ట్రోల్స్ దాడి చేస్తున్న సమయంలోనే కల్కిథామ్ వద్ద ఉన్న కల్కి మహోత్సవ్ చివరి రోజు కార్యక్రమానికి నేను ప్రత్యేక అతిథిగా వెళ్లే అదృష్టానికి నోచుకున్నాను. ఆ పీఠాధిపతి శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఎప్పటిలాగా నాపై కరుణ చూపారు. అలాగే ఆ రోజు కాశీపీఠం జగద్గురు శంకరాచార్య నరేంద్రానంద్ గిరీజీ సరస్వతి మహారాజ్ ఆశీర్వాదాలు కూడా అదనంగా అందుకున్నాను. మతం కానీ, కులం కానీ మనలను విడదీయలేని మానవజాతి ఐక్యత గురించి ఆయన ఆరోజు సుదీర్ఘంగా వివరించారు. ఒక గొప్ప మతాన్ని రాజకీయంగా దుర్వినియోగపరుస్తుండటాన్ని నేను ఆమోదించడం లేదు. అందుకే కాబోలు.. శంకరాచార్య పట్ల నా ఆరాధనా భావం, సనాతన ధర్మపై నా ప్రశంస, అయోధ్య తీర్పును నేను ఎత్తిపడుతూ అందరూ సమన్వయంతో సర్దుబాటు కావాలనీ, రాముడు... ఇమామ్ ఇ హింద్ పాత్ర పోషించాలనీ నేను చెప్పిన మాటలన్నీ వృథా అయిపోయాయి. ఆసక్తికరంగా, నా సీనియర్ సహచరుడు గులామ్ నబి అజాద్ బహుశా అనుద్దేశంగానే కావచ్చు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. నా పుస్తకాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటలలోపో అజాద్ స్వీయ సంతకంతో కూడిన ప్రకటన మీడియాకు పంపించారు. అది నన్ను కలవరపెట్టింది. వెంటనే కాంగ్రెస్ పార్టీలోనే నా పుస్తకంపై తీవ్రమైన చర్చ మొదలైందంటూ అజాద్ ప్రకటన ఆధారంగా మీడియా ప్రకటించేసింది. కానీ ఇక్కడ రెండు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అజాద్ కూడా హిందుత్వను ఒక రాజకీయ భావజాలంగా తిరస్కరించారు. కానీ తాను ఎందుకు తిరస్కరిస్తోందీ ఆయన చెప్పలేదు.హిందూయిజం ఒక మిశ్రమ సంస్కృతిని కలిగి ఉందనీ, కానీ హిందుత్వను బోకో హరామ్, ఐసిస్‌లతో పోల్చడం సత్యదూరమని, అతిశయోక్తితో కూడుకున్నదని అజాద్ వివరించారు. కానీ అతిశయించి చెప్పాలంటే ఏవైనా పోలికలు ఉండాలి. ఏదైనా వాస్తవం ఉనికిలో ఉన్నప్పుడే అతిశయోక్తి పుడుతుంది. కానీ ఇదే అజాద్ కొన్నేళ్ల క్రితం హిందుత్వను ఐసిస్‌తో పోల్చుతూ మాట్లాడిన వీడియోను నేను ఇప్పుడు మళ్లీ ప్రదర్శించాలనుకోలేదు. ఈ విషయమై నాతో మాట్లాడినవారిలో చాలామంది, హిందుత్వను పాటించేవారిలో అనారోగ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఉదాహరణను చూపించవలసిందిగా కోరారు. నావద్ద చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ మతాల మధ్య సమన్వయాన్ని సాధించాలనుకుంటున్న నా లక్ష్యాన్ని అది పూర్వపక్షం చేస్తుంది. పైగా నా ఇంటిపై జరిగిన దాడిని వారు ఆమోదించడం లేదు కూడా. నా పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా పి. చిదంబరం దీన్ని అద్భుతంగా తన మాటల్లో చెప్పారు. ‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును కూడా ఎవరూ కూల్చలేదు.’ బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్కి చెందిన అనేకమంది ప్రముఖులతో నేను చేసిన సంభాషణలను ఈ సందర్భంగా ఇక్కడ జోడించతగినవే. అవేమిటంటే, ‘‘పెహ్లూ ఖాన్, అఖ్లాక్ ఖాన్‌లను మన దేశంలో ఎవరూ కాళ్లూ చేతులూ విరగ్గొట్టలేదు. 2002లో నరోదా పటియా వద్ద మహిళలను, పిల్లలను ఎవరూ చంపలేదు. ఉన్నావో, హత్రాస్ వద్ద అమ్మాయిలపై ఎవరూ అత్యాచారం చేయలేదు. ముజఫర్‌నగర్‌లో ఎవరూ ఇళ్లను తగలబెట్టలేదు. ఇస్రత్ జహాన్ని ఎవరూ చంపేయలేదు. లకింపూర్ ఖేరీలో ఎవరూ రైతులను ట్రాక్టర్లతో తొక్కించి చంపలేదు. అలాగే, మహాత్మా గాంధీని కూడా ఎవరూ చంపలేదు.’’ నేను చర్చకు ఎప్పుడూ సుముఖమే. కానీ బయటకు సుమోటో ప్రకటనలను జారీ చేయడం రూపంలో కాకుండా ఆ చర్చలు పార్టీలో అంతర్గతంగా ఎందుకు జరపకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండటం గమనార్హం. మన ఆలోచనల్లో సైద్ధాంతిక స్పష్టత ఉండటంపై ఆయన ఆలస్యంగా అయినా దృష్టిపెట్టారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైన విషయాలని, వీటిలో హిందుత్వ... అమాయకులను వధించే కార్యక్రమంలో ఉంటోందని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా చర్చేమిటి? వాస్తవానికి, చాలాకాలంగా మనం హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉన్నట్లుగా అభిప్రాయాన్ని మనకు మనమే కలిగిస్తూ వచ్చాం. ప్రకృతే గాయాలను మాన్పుతుందని, ప్రజా జీవితం సాధారణ స్థాయికి చేరుతుందని భావించేలా చేయడమే దీని వ్యూహం. మనం ఒక అంగుళం స్థానమిస్తే, ప్రత్యర్థి అనేక అడుగులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడని తాజా ఉదంతం మనకు స్పష్టం చేస్తోంది. కాబట్టి ఇకనైనా మన శ్రేయస్సు కోసమే కాకుండా మన దేశ ఉనికిని కాపాడేందుకు కూడా ఒక పెద్ద గీత గీసుకోవాలి. ఇది హిందుత్వ శక్తుల ప్రవృత్తి, స్వభావాన్ని వ్యతిరేకించడానికి కాదు, ఒక అద్భుత మతమైన హిందూయిజాన్ని కాపాడేందుకు మనల్ని మనం ఇక తీర్చిదిద్దుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల ప్రమాదం నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మితవాద శక్తులు మనల్ని బంధించి ఉంచిన శృంఖలాలను తెగ్గొట్టుకోవడం తప్ప మనం కోల్పోయేది ఏమిటి? స్వాతంత్య్రాన్ని కోల్పోవడం అనేది ఒక భౌతిక నిర్బంధం మాత్రమే కాదు. అది మన బుద్ధికి, వాక్కుకు శృంఖలాలు తగిలించడమే. హిందుత్వ ప్రచారకులు మొదట సత్యాన్ని తొక్కేస్తున్నారు, తర్వాత దాన్ని అణిచి ఉంచడానికి ప్రతి ఆయుధాన్నీ సానబెడుతున్నారు. గాంధీతత్వం మనల్ని హింసామార్గం వైపు పోకుండా అడ్డుకుంటోంది కానీ నిష్క్రియాత్మక ప్రతిఘటన పర్యవసానాలకు మనం బలవుతున్నాం. కానీ మనం సత్యం వైపు నిలబడదాం. నైని టాల్లోని నా ఇంటిని తగలబెట్టినప్పుడు, ఈ చర్యకు ఎవరు పాల్పడి ఉంటారు అని నన్ను ప్రశ్నించారు. బొకో హారమ్, ఐసిస్, హిందుత్వ శక్తులు. ఎవరు దీనికి పాల్పడ్డారో విజ్ఞులే నిర్ణయించుకోవాలి. వ్యాసకర్త సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
హిందూయిజం, హిందూత్వ వేర్వేరు
వార్ధా/న్యూఢిల్లీ: హిందూయిజం, హిందూత్వ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అవి రెండూ వేర్వేరు అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎక్కడా చెప్పలేదని, కానీ హిందూత్వ ఆ పని చెయ్యమంటోందని విమర్శించారు. హిందూమతాన్ని అనుసరిస్తూ ఉంటే హిందూత్వ అన్న కొత్త పదం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో వార్ధాలోని సేవాగ్రమ్ ఆశ్రమంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆన్లైన్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘హిందూయిజానికి, హిందూత్వకి ఉన్న తేడాలేంటి? ఆ రెండూ ఒకటేనా? ఒక్కటే అయితే రెండింటికి ఒక్కటే పేరు ఉండాలి కదా! అందుకే అవి రెండూ వేర్వేరు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఉపనిషత్తులు చదివాను. హిందూ మత గ్రంథాలు చదివాను. అందులో ఎక్కడా అలా లేదు. కానీ వారిని కొట్టమని హిందూత్వ చెబుతోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మన జాతి సిద్ధాంతం ఒకటేనని, అదొక విలువైన రత్నమన్నారు. అందులో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎల్ల ప్పుడూ సజీవంగా, మహత్తర చైతన్యంతో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ దానిని కనిపించకుండా చేస్తూ మీడియాని అడ్డం పెట్టుకొని హిందూత్వని విస్తరిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్నవి కాంగ్రెస్ సిద్ధాంతం, ఆరెస్సెస్ సిద్ధాంతాలేనని, బీజేపీ పనిగట్టుకొని విద్వేషాలు నూరిపోస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ మతంపై ఎందుకంత ద్వేషం: బీజేపీ హిందూత్వకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. హిందూమతంపై కాంగ్రెస్ నేతలు ద్వేషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించింది. రాహుల్ ఆదేశాల మేరకే సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, చిదంబరం వంటి నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. -
లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే
సాక్షి, హైదరాబాద్: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నకిలీ హిందువులు
సాక్షి , న్యూఢిల్లీ: హిందూ పారీ్టగా చెప్పుకొనే బీజేపీ, దేశంలో హిందుత్వాన్ని వాడుకుంటుందే తప్ప వారు ఎప్పటికీ హిందువులు కారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు తమ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకొనే నకిలీ హిందువులు అని ఆయన ఆరోపించారు. అంతేగాక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మహిళా శక్తిని అణచివేసి, దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే కాంగ్రెస్ మాత్రం మహిళా శక్తికి సమాన వేదికను ఇస్తుందని ఆయన తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రాహుల్ మహిళా కాంగ్రెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ తన గదిలో కూర్చొని భయంతో వణికిపోతున్నందున సమాజంలోని ప్రతి విభాగంలోనూ భయాన్ని సృష్టించారని అన్నారు. చైనా అంశాన్ని ఉదహరించిన రాహుల్‌గాం«దీ, ఇటీవల చైనా వేల కిలోమీటర్ల భూమిని లాక్కుందని, అయితే నరేంద్ర మోదీ చైనాపై ఉన్న భయంతో అంతా బాగానే ఉందని చెప్పారని ఎద్దేవా చేశారు. ఇది ప్రధాని మోదీ భయానికి సంకేతమని రాహుల్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ జీవితమంతా అబద్ధాలపై ఆధారపడి ఉన్నందునే ఆయన భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ద్వేషంతో కాదు.. ప్రేమతో పోరాడుదాం కాంగ్రెస్ సిద్ధాంతం.. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమని, రెండు సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే దేశాన్ని పాలించగలదని అన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నాయకులు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేశారని, ప్రస్తుతం రైతులు, మహిళలు భయపడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో జీఎస్టీని అమలు చేసినప్పుడే, చిన్న చిన్న దుకాణదారుల ఇంట్లో లక్ష్మీదేవిని బీజేపీ తీసేసిందని ఆయన మోదీ ప్రభుత్వాన్ని నిందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఐని అమలు చేయడం ద్వారా దుర్గా శక్తిని కోట్లాది మంది ప్రజల చేతుల్లో అస్త్రంగా ఉంచామని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తమను తాము హిందూ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ, దేశవ్యాప్తంగా లక్షి్మ, దుర్గలపై దాడి చేశారని దుయ్యబట్టారు. హిందూమతం పునాది అహింస. మహాత్మా గాంధీ తన జీవితమంతా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో గడిపితే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఆ హిందువు ఛాతిపై మూడు బుల్లెట్లను ఎందుకు కాల్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మనం వారిపై ప్రేమతో పోరాడాలి తప్ప ద్వేషంతో పోరాడలేమని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ఒక మహిళా ప్రధానిని ఎప్పటికీ ఇవ్వలేవని, కాంగ్రెస్ పార్టీ మహిళను ప్రధానిని చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎవరికీ భయపడదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ప్రధాన కార్యదర్శులు సీతక్క, సౌమ్యారెడ్డి, అప్సరా రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ సహా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200మంది కార్యకర్తలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన సుమారు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
షోడశ సంస్కారాలు
గృహస్థు పాటించాల్సిన సంస్కారాల గురించి మనకు మన ప్రాచీన మహర్షులు గృహ్య సూత్రాల రూపంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. సంస్కారం అంటేనే సంస్కరించునది అని అర్థం. అంటే, ఈ సంస్కారాలు పాటించడం ద్వారా మనిషి సంస్కారవంతుడు అగుచున్నాడు. ఏవిధంగా అయితే మట్టిలో ఇతర ఖనిజలవణాలతో కలిసిపోయి దాదాపుగా మట్టిలాగే దొరికిన బంగారం, సంస్కరించబడి, అనుభవయోగ్యమైన సువర్ణంగా, ఆభరణాలుగా మారుతుందో, అలాగే మనిషి కూడా సంస్కారాలు పాటించడంద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని, పరిపక్వమైన మానసికస్థితిని పొందుచున్నాడు. తద్వారా సమస్తజనాలూ సుఖసంతోషాలతో నివసించగలిగేలా క్రమశిక్షణతో కూడిన నడవడికగల ఒక సర్వోన్నత ధార్మికసమాజాన్ని నిర్మించగలిగాడు. సంస్కారాల సంఖ్యగురించి అభిప్రాయ భేదాలున్నా, లోకంలో ప్రాచుర్యంపొందినవి మాత్రం పదహారే. ఈ పదహారు రకాల సంస్కారాల గురించి, అవి అనుసరించాల్సిన సమయాల గురించి, వాటి విధానాల గురించి, ఈ వ్యాసంలో క్లుప్తంగా తెలుసుకుందాం. మనిషికి ఈ సంస్కారాలు జరిగినట్లుగా మనకంటికి ఏమైనా మార్పులు కనిపిస్తాయా? అంటే కొన్ని సంస్కారాల తాలూకు మార్పులు కంటికి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఎందుకంటే, కొన్ని సంస్కారాలు శరీర సంబంధ వేషభాషలలో మార్పులు తీసుకొస్తే, కొన్ని సంస్కారాలు మానసిక పరిపక్వతనీ, ఉన్నతమైన ఆలోచనావిధానాన్నీ, సామాజిక శ్రేయస్సును కలిగిస్తాయి. శరీర సంబంధ మార్పులు కంటికి కనిపిస్తాయి, కానీ మానసికమైన మార్పులు మాత్రం వారి ప్రవర్తనలో, మాట్లాడే విధానంలో, ఎదుటివారిని గౌరవించే తీరులో, వారు తీసుకునే నిర్ణయాలలో ప్రతిబింబిస్తాయి. ఏది ఏమైనా, ‘వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకారైః పంచభిర్యుక్తః నరోభవతి పూజితః’ అను ఆర్యోక్తిని అనుసరించి, ఒక వ్యక్తి గౌరవించబడాలంటే, పంచవకారాలైన వస్త్రం, వేషభాషలు, విద్యా వినయాలను పాటించాలి. వాటిని నేర్పించేది కూడా ఈ సంస్కారాలే. గర్భాధానం మొదలుగాగల పదిహేను సంస్కారాలు మనిషి జీవించి వుండగా జరిపించేవి కాగా, పదహారవ సంస్కారమైన అంత్యేష్టిమాత్రం మనిషి మరణించిన తరువాత జరిపించేది. ఇది మానవశరీరాన్ని అగ్ని మొదలైన పంచభూతాలకు హవిస్సుగా అర్పించే పరమ పవిత్రమైన సంస్కారంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. దాదాపుగా ప్రతి సంస్కారమూ అగ్నిని ఆధారంగాచేసుకునే జరపాలని సమస్త గృహ్యశాస్త్రాలూ చెప్తున్నాయి. సంస్కారాల వలన సంస్కరింపబడి, దయ ఓర్పు మొదలైన ఆత్మగుణాలు కలిగినవారు పరమపదాన్ని పొందుతారని స్మృతులు చెప్తున్నాయి. సంస్కారాల వరుసక్రమంలో అభిప్రాయ భేదాలున్నా, దాదాపుగా అందరూ అంగీకరించిన వరుసక్రమాన్ని అనుసరించే వాటిని వివరించడం జరుగుతుంది. -
మీ పాఠాలు మాకు అనవసరం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ బి.ఎస్.కోషియారీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రార్థన స్థలాల పునః ప్రారంభంపై ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ‘మీరు అకస్మాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా?’అని కోషియారీ సోమవారం రాసిన లేఖలో వ్యాఖ్యానిస్తే.. హిందుత్వంపై మీ సర్టిఫికెట్ తనకేమీ అవసరం లేదని ఉద్ధవ్ సమాధాన మిచ్చారు. మహారాష్ట్రలో ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవాలని మూడు బృందాలను తనకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేశాయని గవర్నర్ తన లేఖలో ప్రస్తావించగా.. ఆ మూడు బృందాలూ కాకతాళీయంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులేనని ఉద్ధవ్ వ్యంగ్యవ్యాఖ్య చేశారు. కోవిడ్ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవడంపై ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గవర్నర్ కోషియారీ సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ‘‘లౌకికవాదం అన్న పదాన్నే వ్యతిరేకించిన మీరు అకస్మాత్తుగా మారిపోయారా’’అని రాయగా.. ఉద్ధవ్ దానికి బదులిస్తూ.. ప్రార్థన స్థలాలను తెరిచినంత మాత్రాన హిందుత్వ వాదుల వుతారా? తెరవకుంటే లౌకికవాదులవుతారా? అని ప్రశ్నించారు. తాను ఆచరించే హిందుత్వకు గవర్నర్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. ప్రజల ఉద్వేగాలు, నమ్మకా లను పరిగణనలోకి తీసుకుంటూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సరికాదని ఉద్ధవ్ పేర్కొన్నారు. గుడులను తెరవాలన్న డిమాండ్‌తో బీజేపీ మంగళవారం ఆందోళనకు దిగింది. కోవిడ్ సమస్య ఉందని తెలిసినా బార్లు తెరిచిన ప్రభుత్వం గుడులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందని వారు ప్రశ్నించారు. శివసేన హిందుత్వం బలమైంది: రౌత్ శివసేన హిందుత్వ విధానం గట్టి పునాదులపై నిర్మించిందని వారికి ఇతరుల పాఠాలేవీ అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా ఉందన్న ప్రధాని∙వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ప్రజల బాధ్యత సీఎం ఠాక్రేదని అన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సమర్థ చర్యలు తీసుకోవడాన్ని గవర్నర్ ప్రశంసించాల్సిందని అన్నారు. అది మితిమీరిన భాష: పవార్ సీఎం ఠాక్రేకు రాసిన లేఖలో గవర్నర్ కోషియారీ వాడిన భాష అతిగా ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘అన్ని మతాలను సమ దృష్టితో చూడాలని రాజ్యాంగ పీఠిక చెబుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అందుకు తగ్గట్లుగా నడుచు కోవాల్సి ఉంటుంది. కానీ, గౌరవ గవర్నర్ ఆ లేఖను ఓ రాజకీయ పార్టీ నేతనుద్దేశించి రాసినట్లుగా ఉందే తప్ప.. ముఖ్యమంత్రికి రాసినట్లుగా లేకపోవడం దురదృష్టకరం’ అని పవార్ పేర్కొన్నారు. -
భారతీయులందరూ హిందువులేనా?
ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తమ తమ దేవుళ్లతోపాటు, భారతమాతను పూజిస్తే చాలు.. వీరంతా హిందువులే అవుతారని ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్ సదస్సులో ప్రకటించారు. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అంటూ సూత్రీకరించారు. ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని కోరుకోరని చెప్పడం ద్వారా ఆయన కౌటిల్యుడిని, మనువును, సావర్కార్‌ని, హెగ్డేవార్‌ని, గోల్వాల్కర్‌ని కూడా దాటి ముందుకు వచ్చేశారు. అయితే రాజ్యాధికారం కోసం కాకపోతే బీజేపీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్న మోహన్ భగవత్ కొత్త సిద్ధాంతంపై చర్చ జరగాల్సి ఉంది. శాంతి, అహింసల ప్రబోధకుడిగా ప్రపంచమంతటా గుర్తించిన జీసస్ క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ, హిందువులు, హిందూయిజం పూర్తిగా భిన్నమైనవని నిర్వచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని 130 కోట్లమంది ప్రజలు హిందువులేనట. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అన్నారు. అంటే తమ తమ విశ్వాసాల మేరకు తమ దేవుడిని పూజించే, ప్రార్థించే భారతీయులందరూ ఇకనుంచి ఆర్ఎస్ఎస్ సృష్టించి, ప్రచారం చేస్తున్న భారతమాతను కూడా తమ దేవతగా తప్పకుండా పూజించాలన్నమాట. ఆయన చెప్పిందాన్ని బట్టి, ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తదితరులందరూ రెండు శక్తులను (ఒకరు తమ దేవుడు, మరొకరు దేవత అయిన భారతమాత) పూజించాల్సి ఉంటుంది. జాతీయ పౌర పట్టికలో కానీ, పాఠశాలలో కానీ, మరే ఇతర రికార్డులో కానీ మతం అనే కాలమ్‌లో భారతీయులు తప్పనిసరిగా ఇకనుంచి ముస్లిం–హిందూ, బుద్ధిస్టు–హిందూ, క్రిస్టియన్–హిందూ, సిక్కు–హిందూ, పార్శీ–హిందూ అని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు తమ పవిత్ర గ్రంథం, తమదైన ఆహార సంస్కృతిని, తమ వివాహ వ్యవస్థను అనుసరించవచ్చు. అయితే ఈసారి మాత్రం మోహన్ భగవత్ దేశపౌరులందరూ ఆవును పూజిం చాలని, గొడ్డు మాంసం తినడం ఆపివేయాలని తన ప్రసంగంలో చెప్పలేదు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇస్లాం లేక క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం లేక సిక్కిజం మరే ఇతర మతంలో అయినా చేరినా లేదా చేరాలని తలుస్తున్నవారు తప్పకుండా తమ మతంలో విడదీయరాని విధంగా హిందూ అనే పదాన్ని చేర్చాలన్నది ఆయన ప్రసంగ సారాంశం. సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్ తదితరులు హిందుత్వకు ఇచ్చిన గత నిర్వచనాల నుంచి మోహన్ భగవత్ వేరుపడ్డారు. గతంలో హిందుత్వ లేక హిందూయిజం కాస్త విభిన్నార్థంలో కని పించేది. కాని ఇప్పుడు ఆయన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించేశారు. ఈ క్రమంలో రాజకీయ సైద్ధాంతిక విషయాన్ని సైతం ఆయన తీసివేశారు. ఇది ముస్లింలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులను కలుపుకోవడానికి అవకాశమిస్తుందని ఆయన అభిప్రాయం. ఇది పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. వలస వచ్చిన ముస్లింలు లేక శరణార్థులు తమ పేర్లకు ముస్లిం–హిందూ అని చేర్చుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు అరబిక్ భాషలో అల్లా అని ప్రార్థించవచ్చు. కానీ ప్రార్థన ముగింపులో మాత్రం తప్పకుండా భారత్ మాతా కీ జై అని చెప్పాల్సి ఉంటుంది. కౌటిల్యుడు, మనువు తర్వాత హిందూ తత్వశాస్త్రానికి సంబంధించిన అతి గొప్ప సిద్ధాంతవేత్తగా మోహన్ భగవత్ ఆవిర్భవించారు. కౌటిల్యుడు, మనువు తమ సొంత సైద్ధాంతిక రచనలైన అర్థ శాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించడం ద్వారా మౌర్య చంద్రగుప్త, పుష్యమిత్ర శుంగ సామ్రాజ్యాలను స్థాపించారు. తమ సిద్ధాంతాలతో చంద్రగుప్తుడిని, పుష్యమిత్రుడిని అధికారంలోకి తెచ్చిన కౌటిల్యుడు, మనువు లాగే మోహన్ భగవత్ కూడా నరేంద్రమోదీని అధికారంలోకి తెచ్చారు. నరేంద్రమోదీ తర్వాత తాను జీవించి ఉన్న కాలంలోనే అమిత్ షా కూడా దేశ ప్రధాని కావచ్చు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీ సాధించిన మెజారిటీ కానీ, కేంద్రంలో రెండు దఫాల పాలన కానీ మోహన్ భగవత్ తాత్విక వ్యూహాత్మక చేర్పుగానే చెప్పాలి. హైదరాబాద్ సదస్సులో తన నూతన సిద్ధాంతాన్ని విస్తరించి చెప్పినట్లుగా మోహన్ భగవత్ అభిప్రాయం మేరకు, ప్రపంచంలోని మానవులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరందరికీ మూడు రకాలైన లక్షణాలు ఉంటాయి. అవి ‘తమో, రజో, సత్వ’ గుణాలు. తమోగుణం కలిగినవారు తాము విషాదంలో ఉంటూ ఇతరులనూ విషాదంలో ముంచెత్తుతుంటారు. వీరు హింసను ప్రేరేపించినప్పటికీ విజయం సాధించలేరు. అంతిమంగా వీరు ప్రతి ఒక్క అంశాన్నీ విధ్వంసం చేస్తారు. ఇక రజోగుణానికి చెందినవారు తమ ప్రయోజనాలకు చెందిన పనులను మాత్రమే చేపడుతుంటారు. తాము సంపన్నులు కావడానికి, తమ సొంత ప్రతిష్టలకు వీరు ఇతరులను ఉపయోగించుకుంటుంటారు. కాగా సంఘ్ పరివార్, భారతదేశం ధర్మ విజయాన్ని (సత్వ గుణాన్ని) నమ్ముతుంటాయి. ఈ ధర్మపాలనలో ప్రజలు ఇతరుల సంతోషం కోసం, శ్రేయస్సు కోసమే వీరు జీవి స్తుంటారు తప్ప స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని లేక మరి దేన్ని కూడా తమకోసం కోరుకోరు’’ (ది హిందూ 2019 డిసెంబర్ 28) ఇది ఎంత అత్యున్నతమైన సృజనాత్మక సిద్ధాంతం అంటే.. స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని రెండింటినీ సాధించడానికి నేరాలకు, హింసలకు పాల్పడుతూనే స్వర్గంపై, రాజ్యాధికారంపై విశ్వాసం నుంచి విశ్వాసులను కాపాడుతూ వస్తోంది. ఈ రెండు వ్యవస్థలూ మారణకాండకు దారితీసిన హింసను ప్రేరేపిస్తూ వచ్చాయి. ఇంతవరకు పవిత్ర ముస్లింలుగా, పవిత్ర క్రిస్టియన్లుగా, పవిత్ర బౌద్ధులుగా, పవిత్ర సిక్కులుగా చెప్పుకుంటూ జీవిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఈ జీవితంలో మరణం తర్వాత, రాజకీయాధికారం పొందిన తర్వాత స్వర్గాన్ని కోరుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్లందరూ హింసకు పాల్పడుతూనే వచ్చారు. అయితే తొలిసారిగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాన్నీ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. పైగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలకుమల్లే స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలనే కోరిక నుంచి బయటపడాలనే వారు తమ తమ మత చిహ్నాలతో పాటు హిందూ ట్యాగ్‌ను కూడా చేతపట్టాల్సి ఉంటుంది. హిందూయిజంలోకి మారాలని కానీ లేక తన హిందూ మతం నుంచి వేరొక మతంలోకి మారిన వారు ఘర్‌వాపసీలో భాగంగా మళ్లీ హిందూమతంలోకి మారాలని కానీ మోహన్ భగవత్ ఇప్పుడు ఎవరినీ కోరలేదు. దీనికి బదులుగా వీరందరూ తమ మతానికి అదనంగా హిందూ ట్యాగ్‌ను చేర్చుకుంటే చాలు. అయితే ఇక్కడ మనకు తట్టే ప్రశ్నల్లా ఏమిటంటే.. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాకపోతే భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? పాపకార్యాలుగా తాను భావిస్తున్న లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజ కీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? ఆరెస్సెస్ తన 95 ఏళ్ల జీవితకాలంలో తమో, రజోగుణ కార్యాచరణలో ఎన్నడూ పాల్గొనలేదని ప్రపంచానికి మోహన్ భగవత్ నొక్కి చెబుతున్నారు. లేక ధర్మ కాలంలోలాగా 2014కి ముందు ఆరెస్సెస్ ఘర్షణల చరిత్రను ఆయన గుర్తిం చడం లేదు. హిందువులకు స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలోనే మోహన్ భగవత్ ధర్మంలోని మౌలిక సారాంశం దాగి ఉంది. అందుచేత ఆయన ప్రస్తుత మాటలు గౌతమబుద్ధుడి కంటే మించిన రాడికల్ స్వభావంతో ఉంటున్నాయి. ప్రాచీన హిందూ పురాణాలు మనకు చెబుతూ వచ్చినట్లుగా తమో, రజో గుణం కలిగినవారు భారతదేశంలో లేరని భగవత్ నూతన హిందూ సిద్ధాంతం చెబుతోంది. వారు భారతదేశంలోని దిగువ కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు చెందినవారు కారనీ వారంతా భారత్ బయటే ఉంటున్నారని ఈ సిద్ధాంత భావన. అయితే భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోనట్లయితే అప్పుడు వారిని తమో, రజో, గుణ సంపన్నులుగా గుర్తించవచ్చు. ఈ రకమైన వరివర్తనకు మోహన్ భగవత్ తగినంత పరిధిని ఇచ్చారు. ఇదీ మోహన్ భగవత్ నూతన భారతదేశం. ఈ జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక భారీ డిజైన్ని సూచిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ప్రవచించిన సిద్ధాంతాన్ని పలురకాలుగా వ్యాఖ్యానించవచ్చు, పునర్ వ్యాఖ్యానించవచ్చు కూడా. ఇప్పటికే మీడియా ఆయన సిద్ధాం తాన్ని చాలా ప్రముఖంగా నివేదించింది. టీవీ చానల్స్ ఆయన ప్రసంగాన్ని విస్తృతంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర మతాలకు చెందిన మేధావులు, లౌకిక మే«థావులు, పాశ్చాత్య విద్యా పండితులు ఆయన సిద్ధాంతం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్యషెపర్డ్; డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
దేవాదాయ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని ఆ శాఖ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో అన్యమతస్తులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ పద్మ సర్క్యులర్ జారీ చేశారు. దేవాలయాలు, దేవదాయ శాఖ కార్యాలయాలు, సంస్థ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించారు. నిర్ణీత పత్రంలో అఫిడవిట్ 15 రోజుల్లోగా కమిషనర్ కార్యాలయంలో అందచేయాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం హిందూ మతస్తులనే ఉద్యోగులుగా, ఆలయాల్లో తీసుకోవాలనే స్పష్టమైన నిబంధన ఉంది. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో పేర్కొన్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీసుకోవాల్సిన అఫిడవిట్ ఫ్రొఫార్మను దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతోపాటు అన్ని దేవదాయ శాఖ సంస్థలు, ఆలయాలకు కమిషనర్ పంపించారు. -
ద్వారకామాయి
ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. ‘మనది హిందూ ధర్మమే తప్ప హిందూమతం కానేకాదు’. ‘మతి’ని బట్టి ఏర్పడేది మతం. ఎవరో కొందరు ఓ సంఘంగా ఏర్పడి, ఒకరిని అనుసరిద్దామని నిర్ణయించుకుని, ఆ ఉత్తమ లక్షణాలు ఫలానావానిలో ఉన్నాయని, కాలంలో జరిగే ఆయన ప్రవర్తనలని బట్టి నిశ్చయించుకుని, ఆయన మతిని బట్టి కొన్ని నియమాలనీ, సంప్రదాయాలనీ ఏర్పరుచుకుంటే అదీ ‘మతం’. మన హిందూధర్మం ఓ మతం కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టీ నడుస్తూ ఉండే విధానం కలదీ కాదు. మనకి కనిపించని ఋషులందరూ.. ఏ ఉపనిషత్తులూ, వేదాలూ అనే వాటిని నిరంతరం మననం చేస్తూ.. ఉండేవారో ఆ వేదాలని బట్టి ఏర్పడిన ధర్మం మనది. అందుకే దీనికి మొదట్లో వేదధర్మం లేదా వైదికధర్మం అని పేరు ఏర్పడింది. ఆ మీదట కాలక్రమంలో ఇతర మతాలు ఏవేవో వచ్చాక ఈ గుర్తింపు నిలవడం కోసం ‘హిందూధర్మం’ అనే పేరుతో స్థిరపడింది. ఇదంతా ఎందుకంటే.. సాయి ఉండిన మసీదులో హిందూధర్మమే ఆచరింపబడుతూ ఉండేది. వినడానికి ‘ఇది నిజమా?’ అనిపిస్తుంది గానీ, కొద్దిగా పరిశీలించి చూస్తే మాత్రం– ఎందుకు ఇంతకాలం ఈ విషయాన్ని గమనించలేదు? అన్నంతగా హిందూధర్మమే పాటింపబడుతూ కనిపిస్తుంది పరిశీలిద్దాం!! 1. పంచసూనాలు భారతీయులం.. అందునా హిందువులమయ్యుండి కూడా ఈ మాటని (పంచసూనాలు) ఎందరో విని ఉండలేదు? సాయి మాత్రం నిరంతరం ఈ 5 దోషాలు(సూనాలు) ఏమున్నాయో వాటిని తొలగించుకుంటూనే ఉండేవాడు. రోట్లో ధాన్యం పోసి, రోకలితో దంచి, బియ్యంగా చేసేటప్పుడు (అప్పట్లో అదే మరి విధానం) మనకి తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు మన కారణంగా చంపబడతాయి. ఇలా దంచినప్పుడు ధాన్యపు పై–పొట్టుపోతుంది – తినే వీలుకల బియ్యంగా అవుతుంది ధాన్యం. దీన్నే సంస్కృతంలోనైతే వ్రీహీ అవఘాతనం (వడ్లని దంచడం) అంటారు. మరాఠాలోనైతే ‘కండణి’ అంటారు. ఇది మొదటి దోషం. దోషమంటే ఇక్కడ పాపదోషమని అర్థం. అన్ని దోషాల వల్లా పాపం రాదు. ఉదాహరణకి పిల్లలు ఎక్కువగా తీపిని తింటూ ఉంటే.. ఆ బెల్లం ముక్కని దాచేసి, కాకి ఎత్తుకుపోయిందని అబద్ధమాడతాం. అది దోషమే అయినా పాపదోషం (పాపాన్ని తెచ్చిపెట్టే దోషం) కాదు. ఇక ఆ రోజుల్లో ఎండినపుల్లలు, కందికట్టలు, కొబ్బరి డొక్కలు, మట్టలు.. వంటి వంటచెరకుతో వండుతూండేవారు. వాటిలో కొన్ని పురుగులుండచ్చు. అలాగే ఆ వండేటప్పుడు కూడా కొన్ని పురుగులు మంటలో మనకారణంగా చనిపోవచ్చు. ఇది రెండవ దోషం. సంస్కృతంలోనైతే ‘దాహన’మంటారు. మరాఠాలో ‘ఛుల్లీ’ అంటారు. ఇది రెండవ పాపదోషం. ఒకప్పటి రోజుల్లో తిరుగలి వాడకం మరింత ఎక్కువగా ఉండేది. కందులు, పెసలు, మినుములు, శనగలు, గోధుమలు... ఇలా అన్నింటినీ.. కొన్నింటిని పప్పుబద్దలుగా, కొన్నింటిని మొరుముగా, మరి కొన్నింటిని పిండిగా అయ్యేంత వరకూ విసిరేవారు. ఈ సందర్భంలో కూడా మన కారణంగా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. ఇది మూడవసూనం. దీన్నే మరాఠా, సంస్కృత భాషల రెండింటిలోనూ ‘పేషణి’ అంటారు. ఇది మూడవ పాపదోషం. ఇక నీళ్లని కడవలతో తెచ్చేందుకు వాటిని మట్టితో కడగడం, తొలవడం చేస్తారు. దానివల్ల ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. దాన్ని ‘ఉదకుంభి’ దోషంగా చెబుతారు. ఇది నాల్గవది. మరాఠాలో ‘ఉత్కంభి’ అంటారు. ఇక చీపురుతో నేలని ఊడ్చినప్పుడూ ఎన్నో జీవులు మనవల్ల చనిపోతాయి.. బలమైన సన్నికల్లు వంటి వాటిని నేల మీద పెట్టినప్పుడూ.. ఇంకా బూజు వంటివాటిని దులిపినప్పుడూ, ఆవుపేడనీటితో కలిపి కలాపం(అందం సౌందర్యం కోసం) (కలాపి)చల్లినప్పుడూ కొన్ని సూక్ష్మజీవులు మన కారణంగానే మరణిస్తాయి. ఆ పాప దోషాన్ని ‘మార్జని’ అంటారు ఉభయభాషల్లోనూ. ఆ 5 పాపదోషాలూ తొలగడం కోసం సాయి ఏ రోజునా బ్రహ్మయజ్ఞం – పితృయజ్ఞం– దేవయజ్ఞం– భూతయజ్ఞం(ఇది మరీ ముఖ్యం పంచసూనాల దోష నివృత్తికి) మనుష్యయజ్ఞమనే వాటినీ చేస్తూనే ఉండేవారు. (ఈ యజ్ఞాల గురించి 46వ భాగంలో వివరణ ఉంది) సాయి... ఈ చిన్నవాటిని ‘పంచసూనాలనే పేరిట చెప్పడమంటే? ప్రాచీన భారతీయధర్మాన్నీ, హైందవసంప్రదాయాన్నీ పాటించడం కిందికి రాదా?’ పోనీ ఇదంతా ఏ హిందూ దేవాలయంలోనా? అని ఆలోచిస్తే స్పష్టంగా మసీదులో కదా!? 2. అగ్ని ఆరాధన హైందవధర్మంలో అతి ముఖ్యమైనది దీపారాధన. ‘అగ్నిముఖా వై దేవాః’ దేవతల్లో ఏ ఒక్కరికి దేన్ని మనవి చేసుకోవాలన్నా ఆ దైవానికి సంబంధించిన జపం, ధ్యానం, మంత్రమననం అనే వాటిని– ఏ దైవానికి ఎంత సంఖ్యతో మననం చేయాలో అలా చేశాక ఆ మంత్రసంఖ్యలో దశాంశాన్ని (ఉదాహరణకి లక్షమార్లు మంత్రాన్ని మననం చేసే దానిలో 10వ వంతు అంటే.. 10 వేల మార్లు తర్పణం హోమం చేయాలి) మళ్లీ మంత్రాన్ని మననం చేస్తూ కొన్ని వస్తుద్రవ్యాలతో అగ్నిలో హోమం చేయాలి. అప్పుడు మాత్రమే ఏ దైవాన్ని పూజిస్తున్నామో కోరిక ఏమిటో ఏ దైవానికి చెందించవలసిందో అగ్నిదేవునికి తెలియజేయబడినట్లు. దాంతో ఆ అగ్ని ఆ దేవునికి ఈ వ్యక్తి వివరాలనీ కోరికలనీ తెలియజేస్తాడు ఆ అగ్నిలో వేయబడిన వస్తు ద్రవ్యాలతో సహా. ఈ అగ్నిలో వేయబడిన వస్తుద్రవ్యాలని నేతితో వేసే కారణంగా దాన్ని హవిస్సు అంటారు.అలా దేవతలతో మనకి దగ్గర సంబంధాన్ని ఏర్పరిచే దైవం అగ్ని అన్నమాట. మసీదులో నిత్యం అగ్ని వెలిగింపబడి దీప ఆరాధనం నిరంతరం సాగుతూనే ఉంటుంది. నూనె దీపాలన్నింటినీ వెలిగిస్తూ మనని నూనెకి ఇబ్బంది పెట్టడమా? అంటూ వర్తకులందరూ నూనెని ఇయ్యడం మానేసారనే విషయం – సాయే నీటితో దీపాలని మసీదు నిండుగా వెలిగించాడనీ అనుకున్నాం కదా! ఈ దీపారాధన అది కూడా మసీదులో జరగడమంటే హైందవ సంప్రదాయాన్ని పాటించడం కాదూ మరీ! అలాగే ఏ కోరిక తీరాలన్నా ఆ కోరికకి సరిపడిన హోమాన్ని చేస్తూ ఉంటాం. సరిగ్గా అదే పద్ధతి నిత్యహోమం జరుగుతూండే ‘ధుని’ ద్వారా మసీదులో నిర్వహింపబడుతూనే ఉంది. ఉదయం నిద్రనుండి లేచీ లేవగానే.. కాళ్లూచేతులూ కడుక్కుని, నోటిని పుక్కిలింత ద్వారా శుభ్రపరుచుకుని, వెంటనే గాయత్రీ మంత్రాన్ని మననం చేయడమనే ఆ హైందవసంప్రదాయాన్ని.. ‘అజపాగాయత్రి’ అంటారు. అదే విధానం సక్రమంగా సాయి చేత పాటించబడుతూ ‘అల్లాహ్హో మాలిక్!’ అనే మంత్రమే మననం చేయబడుతూ ఉండేది. ఈ లో–విశేషం తెలియని ఏ కొందరో మాత్రం ‘సాయి ఇంకా స్నానాన్నే చేయలేదు’ అని భావిస్తూ ఉండేవారు. ఈ స్నానానికి వెనుక మంత్ర మననం హైందవ సంప్రదాయం ప్రకారం ఉన్నదే కదా! పైగా ఇది మసీదులోనే జరుగుతూ ఉండేది! 3. నిత్య పారాయణాలు సహజంగా ఎవరైనా దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ దైవసమక్షంలో ఆ దైవానికి సంబంధించిన – దీంతోపాటూ ఇతర దేవతలకి సంబంధించిన మంత్రాలనో స్తోత్రాల్నో శ్లోకాల్నో పాటల్నో కీర్తనల్నో పద్యాల్నో అలా నోటికొస్తే చదువుతూ ఉండటం, రాని పక్షంలో చూసి చదువుతూండటమో చేస్తుంటాం. దాన్నే పారాయణం అంటాం. ఆశ్చర్యకరమైన అంశమేమంటే.. ‘రామదాసుబువా’ వంటి శ్రోత్రియులు శ్రీమద్రామాయణాన్నీ భగవద్గీతనీ అధ్యాత్మరామాయణకీర్తనలనీ ఇన్నింటికీ ముందు గాయత్రీమంత్రజపాన్నీ చేస్తూ ఉంటే, శ్యామా వంటి వాళ్లు శ్రీ విష్ణు సహస్రనామాలని పఠిస్తూ ఉంటే.. ఇంకా ఎందరో మరెందురో వాళ్ల వాళ్ల కొచ్చిన ఎన్నెన్నో స్తోత్రాలని చదువుకుంటూనే ఉంటూండేవాళ్లు. ‘ఇది మసీదు’ అని ఏ ఒక్కరూ అభ్యంతరపెట్టడం గాని, సాయి వీరందరినీ ఉద్దేశించి పఠించవద్దని అనడం గాని ఏ నాడూ జరగనే లేదు. 4. యా సాయీ! ఖండోబా దేవాలయపు అర్చకుడైన మహల్సాపతి తనని చూస్తూనే ‘యా సాయీ!’ (సాయీ! నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నీ రాకని పవిత్రపూర్వకంగానూ ఆదరణపూర్వకంగానూ భావిస్తున్నాను) అన్నాడు. ఈ అర్చకుడూ సామాన్యుడు కాదు నిజానికి. సాయిలో ఉన్న గొప్పదనాన్ని గమనించే ‘సాయీ!’ అనే పేరుతో పిలిచాడు. నిజంగా మహమ్మదీయాభిమానమే తనకి ఉన్నట్లయితే ‘నేను రాను!’ అనవచ్చు. మహమ్మదీయనామంతో తనని పిలిచినట్లయితేనే వస్తానని భీష్మించవచ్చు – లేదా – లోపల ద్వేషించుకుంటూ పైకి అలా అంగీకరించినట్లు భావించవచ్చు. అలాంటిదేమీ లేకుండా స్పష్టంగా తానంగీకరించాడంటే హైందవధర్మంతో మసీదు నిండిపోయి కనిపించడం లేదా? ఆయన చేతిలో ఉన్న సటుకాని సంన్యాసులకుండే ధర్మదండం (ఆకారంలో కనిపించే)గా భావించవచ్చు. నుదుట పెట్టించుకున్న భస్మాన్నీ దాన్ని కూడా త్రిపుండ్రాంకంగా (మూడు గీతలుగా భావించి ముఖాన పూసుకునే శైవ చిహ్నం) అంతేకాక హిందూసంప్రదాయానుగుణంగా ఏ చందనాన్ని అతిపవిత్రంగా భావిస్తూ అభిషేకాన్ని కూడా ఏ దైవానికి చేస్తూ ఉంటారో ఆ చందనంతో నామాన్ని డాక్టర్ పండిత్ పెడితే ఏ మాత్రపు అభ్యంతరాన్నీ పెట్టలేదు. శ్యామా మొదలైన వాళ్లు కంఠానికి చందనాన్ని రాస్తే ఆనందిస్తూ ఉండేవాడు కూడా. ఇక హైందవ సంప్రదాయ అర్చన పుష్పాలంకరణ నైవేద్యాలని పెట్టడం, హారతి విధానం, అగరుధూపసేవ.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా మసీదులోనే జరిగాయంటే ఇదంతా సంపూర్ణ హైందవ విధానం కాదూ! ఇంతటి హైందవ సంప్రదాయం పాటింపబడుతోంది కాబట్టే.. హిందూధర్మంలో నిత్యం మునకలేస్తూ ఉండే మహానుభావులైన తాపసులూ (తపస్సు మాత్రమే తను జీవన వృత్తిగా కలవారు) దండకమండలాలని ధరించేవారూ హరిద్వార్ మొదలైన పుణ్యపవిత్ర క్షేత్రంల్లో నిత్యం ఉండే యోగులూ మఠాధిపతులై మఠాల్లో ఉండే సంన్యాసులూ ఇంకా మఠం స్థాపించుకున్న స్థితిలో లేని పరి వ్రాజకులూ (నిత్యం భక్తులకి దర్శనాన్నిచ్చేందుకై యాత్రల్ని చేస్తూ తిరుగుతూ ఉండే సంన్యాసులూ) అన్నింటినీ విడిచిన త్యాగ బుద్ధితో ఉన్న త్యాగులూ ఎక్కడా భోజనాన్ని చేయకుండా తామే వండుకుని, తినే సంప్రదాయాన్ని పాటించే శిష్టులూ.. ఇలా అందరూ మసీదుకొస్తూ సాయిని దర్శించి వెళ్తూ ఉండేవారు. 5. శిరోవేష్టనం శిరః అంటే తలకి వేష్టనం అంటే ధరించిన వస్త్రవిధానమని అర్థం. మహమ్మదీయుల సంప్రదాయం ప్రకారం తలకి టోపీ పెట్టుకుంటారు. కొందరు బారుగా ఉండే పెద్ద వస్త్రాన్ని ఒక తలపాగాలాగా ఉండే పద్ధతిలో ధరిస్తారు. మరి కొందరైతే ఒంటిపొరతో గుడ్డని తలపాగగా ధరిస్తూ శిరసుని పూర్తిగా గుడ్డతో కలిపివేస్తూ కనిపిస్తాడు. సాయి శిరోవేష్టనవిధానాన్ని చూస్తే స్పష్టంగా అది ఇన్నింటికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఎలా అయితే హైందవధర్మ ప్రబోధకులైన స్వాములూ సంన్యాసులూ మఠాధిపతులూ తమ శిరసు కనిపించకుండా ఉండేలా ఒంటిపొర వస్త్రాన్ని తల మీద ఉంచుకుని, రెండు చెవులూ వినపడేలానూ, శిరసు కప్పబడి ఉండేలానూ ఆ మిగిలిన వస్త్రాన్ని చెవిపక్కన ముడివేసి కనిపించేలానూ శిరోవేష్టనాన్ని కలిగి ఉంటాడు. ఆయన శిరసు ఏనాడూ ఆచ్ఛాదన లేకుండా ఉండేది కాదు– ఉండదు. మన హైందవ సంన్యాసులు కూడా అదే తీరుగా ఉంటారనేది అనుభవంలో కనిపించే సత్యమే. ఇదే శిరోవేష్టన విధానాన్ని అవలంబిస్తూ సాయి దర్శనానికి వచ్చే భక్తులు స్త్రీలైతే తల మీద చీర చెంగుని ధరిస్తూనూ, పురుషులైతే తలపాగలతోనూ వస్తూండేవారు. యతిలాగా భిక్షావృత్తి హిందూ ధర్మ సంప్రదాయంలో యతీ లేదా సంన్యాసీ అయిన మహానుభావుడు మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే బిచ్చమెత్తాలి నిరహంకార విధానాన్ని సూచించుకుంటూ.. అది కూడా 5 ఇళ్ల నుండి మాత్రమే తీసుకోవాలి. ఆ తీరుగా వచ్చిన అన్నాన్ని పప్పుతో అన్నాన్ని కలిపీ.. పచ్చడితో అన్నాన్ని కలిపీ.. పులుసుతో అలాగే పెరుగుతో.. ఈ తీరుగా వేటి రుచిని వాటికిగా అనుభవిస్తూ తినడం సంన్యాససంప్రదాయం కాదు. అన్నింటినీ కలిపి రుచిలో అభిరుచి కలిగినవానిగా కాకుండా తినాలి. మళ్లీ కావాలంటూ మారు(రెండోమారు) అడగకూడదు. తినకూడదు. ఆ రోజుకి భగవంతుడు అంత మాత్రపు ఆహారాన్నే అంతటి రుచితోనే అనుగ్రహించాడని భావించి – యదృచ్ఛాలాభ సంతుష్టః – దొరికిందానితోనే సంతృప్తిపడే లక్షణాలతో ఉండాలి సంన్యాసి. సాయి ఇదే సంప్రదాయాన్ని మసీదులో పాటిస్తూ ఉండేవాడు.ఏ భజన సంప్రదాయం మన హిందువులదో ఆ ధర్మాన్ని మసీదులో పాటింపజేస్తూ పండరినాధుని భజననీ, వేణుగోపాలుని భజననీ చేయిస్తూ చేస్తూ ఉండేవాడు. కాళ్లకి గజ్జెలని కట్టుకుని ఆనందంతో నృత్యాన్ని చేస్తూ ఉండేవాడు కూడా. ఎందరెందరో భక్తులు ఏమేమో ఆహారపదార్థాలు తెచ్చినా ఆహారపదార్థాలు తెచ్చినా సంన్యాసధర్మానికనుగుణమైన భిక్షాటనాన్ని ఏనాడూ మరవలేదు. మహానుభావులైన ఏ కొందరు మహానుభావులో పవిత్రజీవనాన్ని గడిపి మరణిస్తే వాళ్ల సమాధుల వద్ద జరిగే ఉత్సవమైన ఉరుసురోజునే శ్రీరామనవమిని ఏర్పాటు చేసి మసీదుని హిందూదైవ మందిరంగా మార్చేసాడు సాయి. పైవారం – సాయి సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షా..? – సశేషం -
సాయి బోధ సుధ
ఎందరికో ఓ పెద్ద ధర్మసందేహం.. సాయి ఓ మహమ్మదీయుడు కదా! ఆయన నిత్యం జపించే మంత్రం ‘అల్లాహ్ హో మాలిక్!’ అనేదే కదా! అని. అలాగే హిందూ ధర్మంలో ఉండే ఆచారవ్యవహారాలని వేటినీ పాటించే లక్షణం లేనివాడు కదా! పైగా హిందూ ధర్మంలో ఏ పూజాపురస్కారాలూ ముఖ్యమైన పర్వదినాలూ వస్తే ఏ ఉపవాసపద్ధతిని అవశ్యం పాటిస్తారో, ఆ ఉపవాసవిధికి ఆయన పూర్తి వ్యతిరేకి కావడమే కాకుండా, ఇతరుల్ని కూడా ఉపవాసవిధానం సరికాదని బోధించే వ్యక్తి కూడా కదా! హైందవవిధానంలో స్త్రీలు అశుచి(నెలసరి) గా ఉండే మూడురాత్రుల పాటూ ఇంట్లో ఉన్న దైవమందిరం వైపు కూడా కనీసం చూడనే చూడకుండా దైవానికి అడ్డుగా అంటే మనకి ఆయన కనబడకుండా ఓ పరదాని వేసేస్తారు కదా! అలాంటిది ఆయన సంప్రదాయాన్ని కాదంటూ స్త్రీలు నెలకి నెలరోజులూ దర్శనానికి రావచ్చునంటారెందుకని? అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తితో మనకుండే బాంధవ్యపు దగ్గర – దూరపు తనాలని బట్టి – ఇన్ని రోజుల పాటు ఆశౌచాన్ని(మైల) పాటించాలనే నియమముంటే దాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడైనా సరే దర్శనానికి దోషం లేనే లేదంటూ ఎలా చెప్తారు? అని ఈ తీరుగా అనేక సందేహాలు వెలిబుచ్చుతుంటారు ఎందరో. సాయి తన భక్తులందరూ ప్రశాంతంగా కూర్చున్న వేళ సాయికి సమయం ఉందని అనిపించిన వేళ ‘సాయినాథా! ఏదైనా చెప్పవూ?’ అని అడిగితే కొద్దిగా అర్థం చేసుకుందామనే దృష్టితో ఉన్న 15 సంవత్సరాల పిల్లవాని నుండి ఎంతటి వయసు వారికైనా బాగా అర్థమయ్యేలా వేదాంతాన్ని తన ఆత్మసంతృప్తికి మాత్రమే చెప్పుకుంటూ ఉండేవారు. ఏనాడూ ఏ భక్తుడినీ, భక్తురాలినీ విని తీరవలసిందే! అని నిర్బంధిస్తూ ఉండేవారు కానే కాదు. ఇంతకీ ఆయన చేసిన వేదాంతబోధని(మరాఠీ భాషలో ఉన్న ఓవీలనే పేరున్న ఛందోబద్ధగేయాల్లో ఎలా ఉందో) గమనిద్దాం! సాయి చెప్పడం ప్రారంభించాడు ఇలా. మనిషి – మరణం భక్తులారా! ప్రతిరోజూ ఉదయం అలా చూస్తూ ఉండగానే సాయంత్రం కొద్దిసేపటికి రాత్రీ అయిపోయి ఒకరోజు గడిచిపోతూ ఉంటుంది. కొన్నాళ్లయ్యాక అప్పుడే సంవత్సరం అయిపోయిందా? చిత్రంగా ఉందే! అనిపిస్తుంది కదా! అలాగే మనిషి జీవితం కూడా సగం నిద్రలో పోతుంది. 12 ఏండ్లు బాల్యంలో గడిచిపోతుంది. వృద్ధాప్యం (+65 ఏళ్లు) సంసారపు ఎత్తుపల్లాల ఆలోచనలతో ముసలితనం రోగాలూ రొప్పులతో వెళ్లిపోతుంది. ఈ మధ్యలో ఉండే కాలంలో యవ్వనమంతా భార్యపట్ల ఆసక్తి వినోదం, విహారం, విలాసం..తో గడిచిపోతుంది. ఇదే విధంగా కుక్కలు, పందులు, పశు పక్ష్యాదులూ కూడా జీవనాన్ని గడిపేస్తున్నాయి కదా! అయితే బతికే కాలంలో హెచ్చుతగ్గులుండచ్చు గాని జీవనవ్యవస్థ ఇదే కదా! మరి నరజన్మకున్న గొప్పదనమేమిటి?\కొలిమిలో మంటని మండించడానికున్న తిత్తులు కూడా గాలిని పీల్చి విడుస్తాయి. వాటిలాగే మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తూ ఉంటే మనకీ వాటికీ తేడా ఏముంది? ఏముంటుంది? ప్రతి వ్యక్తీ మరణ భయంతోనే జీవిస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు పోయిన సందర్భంలో తానే చితికి నిప్పంటించి ఉండి కూడా తనకి మరణమే లేదన్నట్లుగా ధైర్యంగా ఉంటాడు. అదే నిజమైన మాయ అనే తెర. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం లేకుండా ఉండేవరాన్ని కోరి, దైవం ద్వారా ఆ వరాన్ని పొంది కూడా మరణించారుగా కొందరు. (హిరణ్యకశిపుడు రావణుడు..) అంతదాకా ఎందుకు? మార్కండేయుడ్ని చిరంజీవి అంటారు. శివుని కారణంగా మరణాన్ని జయించి చిరంజీవి అయ్యాడు. ఆయన కూడా 14 కల్పాలు దాటాక మరణిస్తున్నాడా లేదా? ఇదంతా ఎందుకు ఈ ఫకీరు చెప్తున్నట్లు? అనుకోవచ్చు మీరు. మరి ఇంత అశాశ్వతం అనిత్యం పైగా మరణధర్మం కలిగిన ఈ శరీరాన్ని ఏ పశువులానో, పక్షిలానో, మృగంలానో విడిచేస్తే నరజన్మ గొప్పదనమేముంది? గమనించండి. అందుకే మహాత్ముల పుణ్యకథలని వింటూ వాళ్లని స్మరిస్తూ – ఏ పుణ్యాత్ముడివల్లనో ఉపదేశించబడిన మంత్రాన్ని మననం చేసుకుంటూ సాధన మార్గంలోనికి వెళ్తే అలా గడిపిన కాలం మాత్రమే సార్థకమవుతుంది. ఇలాంటి భావం ఎవరికైతే కలుగుతుందో అతని జన్మ సఫలమైనట్లే. మనిషి –తానూ తన కుటుంబం సంతానం అభివృద్ధి ఐశ్వర్యం సంపాదన... ఇదే ధోరణిలో వెళ్తూ తన ఆయుష్యాన్ని వ్యయం చేసేసుకుంటున్నాడు. చేపలు పట్టేవాడు వలని వేసి బలంగా లాగినట్టు కాలమనేది మనిషి ప్రాణాలని లాగేస్తుంది. ఆ మరణసమయంలో మనిషి వలలో పడ్డ చేపకి తనకి గాలి ఆడక ఎగిరెగిరి పడేటట్టు విలవిలా తన్నుకుంటూ మరణిస్తాడు. ఆ సమయంలో ఈ పొలాలు, భూములు, ఇళ్లు, వ్యాపారాలు.. ఏవీ గుర్తుకురావు. చచ్చిపోయాక సాధన చేయడం అసాధ్యం కదా! కాబట్టి బతికుండగానే మంత్రాన్ని మననం చేస్తూ ఆ సాధన క్రమంలో నడిచే ప్రయత్నాన్ని చేయండి. ‘ఈ జన్మకేదో ఇలా అయిపోయాను గానీ, పై జన్మలో పుట్టుకనుండీ సాధన మార్గంలోనే జీవించదలిచాను’ అనుకోవడం వట్టి మూర్ఖత్వం. ఎందుకంటే రాబోయే జన్మలో – నువ్వు నరజన్మ ఎత్తడం కష్టమట. దాన్లో కూడా పురుషునిగా పుట్టడం మరింత దుర్లభమట. (తనతో పాటు భార్యాపుత్రుల్ని పోషించే సమర్థత కలిగి ఉండటం) ఆ పురుషజన్మలో కూడా విప్రునిగా (బ్రాహ్మణునిగా) జన్మనెత్తడం ఇంకా అనూహ్యమైన విషయమట. (పుట్టుకతో అందరూ శూద్రులేనట. ఉపనయన సంస్కారం కారణంగా ద్విజుడు అవుతాడట. ఆ సంస్కారం ఏ వేదవిద్యని అభ్యసించే అర్హతని పొందడానికో అలాంటి వేదవిద్యని పొందడం చేత విప్రుడు అవుతాడట. జన్మనాజాయతే శూద్రః – సంస్కారా ద్ప్విజ ఉచ్యతే– విద్యయా యాతి విప్రత్వమ్) అలాంటి విప్రజన్మలో అతనికే గాని వైదుష్యం (ఇతరుల సందేహాలని ప్రమాణబద్ధంగా తీర్చగలిగిన పాండిత్యశక్తి) ఉంటే ఇక అతని జన్మధన్యమట’ అని. (జంతూనాం నరజన్మ దుర్లఛ–మతః పుంస్త్వం– తతో విప్రతా–తస్మా ద్వైదికమార్గధర్మపరతా– విద్వత్వమస్మాత్పరమ్– అనేది ప్రమాణశ్లోకం).ఎవరు నేను? ఎలా వచ్చాను? దేనికొచ్చాను? ఏమిటి నా లక్ష్యం? ఏం సాధించాలి? అని ఇలా ఆలోచించగల శక్తి, బుద్ధి, పశువులకి, పక్షులకి, మృగాలకి క్రిమి కీటకాలకీ ఉందా? లేదుగదా! అందుకే నరజన్మ నెత్తినవాడే ఆలోచించాలి. గారడీవాడు తాను చేయబోయే ఇంద్రజాలవిద్యలోని ఆనందాన్ని గ్రహించి సంతోషించగలవాళ్ల ముందే ఆ విద్యని ప్రదర్శిస్తాడు తప్ప, దాన్ని ఆనందించలేని వాళ్ల ముందు – కనీసం తాను ఇంద్రజాలికుడ్ని అనే విషయాన్ని కూడా చెప్పడు. అవునా? కాదా? అలాగే భగవంతుడు కూడా ప్రాణులనెన్నిటినో ఎన్ని జాతుల వాటినో సృష్టించి ఆశ్చర్యపడి దిగులు చెంది– తాను సృష్టించిన సూర్య చంద్ర నక్షత్ర గ్రహ విశ్వ అంతరాళ విశేషాలని గ్రహించగలిగిన మానవజాతిని సృష్టించాలనే తపనతో ఈ నరజాతిని సృష్టించాడు. ఇంటిలో తండ్రి తన పిల్లలు దేన్ని తింటే పుష్టిగా పెరుగుతారో గమనించి ఆ తినే పదార్థాలని తెచ్చినట్టుగా భగవంతుడు కూడా నరజాతిని అంత ఇష్టంతో సృష్టించాడు. సృష్టించడమే కాదు. అంత ఇష్టమైన ఈ జాతిలో తానూ ఒకడుగా పుట్టాలని నిర్ణయించుకుని మన మధ్యే తిరుగుతూ – ఆయన్ని గుర్తించగలిగిన వారికి దైవంగా కనిపిస్తున్నాడు. కొద్ది పెద్ద భాషలో చెప్తాను. కాలిలో ముల్లు గనుక గుచ్చుకుంటే ఏం చేస్తున్నాం? మరో బలమైన ముల్లును తెచ్చి ఈ లోతుగా గుచ్చుకున్న ముల్లుని తీసి, ఈ ముల్లునీ ఆ ముల్లునీ కూడా మరెవరికీ గుచ్చుకోకుండా ఉండేలా దూరంగా పడేస్తున్నాం కదా! జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించాలి. ఆ మీదట ఈ జ్ఞానాలకీ, అజ్ఞానానికీ కూడా అతీతుడైన స్థితికి వెళ్లిపోగలిగాలి. ఇదే ఈ జన్మకి సార్థకత.దీపాన్ని వెలిగిస్తాం. ప్రమిదని తెచ్చి దానిలో నూనెని పోసి వత్తిని వేసి ఆ వత్తి నూనెతో తడిపాక వత్తికి నిప్పుని అంటించి దీపంగా చేసి ఆ ప్రకాశంలో అన్నింటినీ చూడగలుగుతున్నాం. రాగం(బంధువులు మిత్రులు ఆప్తులు శ్రేయోభిలాషులు... అనే ఈ తీరు అనురాగాలు..) అనే నూనె మొత్తం అయిపోవాలి జీవితమనే ప్రమిదలో. ఈ జ్ఞానదీపం వెలుగుతూ ఉంటే అజ్ఞానమనే చీకటి పూర్తిగా తొలగిపోవాలి. నేనూ నాదీ అనే ఆ తీరు అహంకార మమకారాలుగా కనిపించే వత్తి కాలిపోయి బూడిదగా మారిపోవాలి. అప్పుడు నిజమైన జ్ఞానం వ్యక్తికి కలుగుతుంది.సముద్రంలో ఉన్న నీరంతా ఉప్పదనంతో నిండిందే. అది సూర్యకిరణాల ద్వారా పీల్చుకోబడుతూ మేఘంగా రూపు దిద్దుకుంటుంది. ఎంత నీరు పీల్చబడిందో అంత మాత్రమే వర్షించడం లేదు. పైగా ఏ ఉప్పునీటిని పీల్చిందో అలాంటి ఉప్పు నీటినే విడవడం లేదు. అలాగే మనం గాని సరైన గురువుని ఆశ్రయిస్తే ఆయన మనకి జ్ఞానబోధని చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి – మనం ఊహించలేనంత విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి జ్ఞానాన్ని బోధించే మహానుభావులకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సరైన కాలాల్లో చక్కటి భోజనాల మీద దృష్టీ.. సరైన సౌకర్యాలున్న చోట పడకా–మంచి వస్త్రాలతో తిరగాలనే బుద్ధీ. కీర్తి ప్రతిష్టలని ఎలా పొందాలి? అనే తపనా ఉండనే ఉండవు. తపస్సు చేసుకుంటూ ఉండే వ్యక్తి ఎంత ఆడంబరంగా అట్టహాసంగా మనకి కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి అంత స్థాయిలో అధముడని లెక్కించి తీరాల్సిందే. ఎక్కడెక్కడికో వెళ్లి ఆ మహానుభావులిచ్చే ప్రవచనాలూ పురాణకథలూ ద్వారా తెలుసుకోలేని ఎన్నెన్నో విశేషాలని మనం మహాత్ములని సేవిస్తూ వారివారి ఆచరణలని గమనిస్తూ తెలుసుకోగలం. జ్ఞానమనేది నిజానికి నిశ్శబ్దం ఉపదేశమే. వేలకొలదీ ఉన్న నక్షత్రాలు ఇయ్యలేని కాంతిని ఒక్క చంద్రుడూ, అతనికి మించిన కాంతిని సూర్యుడూ ఇయ్యగలుగుతున్నారు. అలాగే పురాణపఠనం ద్వారా పొందలేని అమోఘజ్ఞానాన్ని గురుసేవ ద్వారా పొందవీలుంది. ఎందరు అమ్మలో! ఈ ప్రపంచంలో కనిపించే దైవాన్ని ‘తల్లి’ అంది ధర్మగ్రంథం మీ అందరికీ ఒక్కొక్క తల్లి ఉంది. ఆమె మాత్రమే మీ పోషణని గమనిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆ తల్లి గతించిన వారుంటే అలాంటి వారికి ఆమె కూడా లేనట్లే కదా! అయితే నా అదృష్టం ఎంతదో తెలుసా? ఏ మాత్రపు అభిమానమూ సిగ్గూ లేకుండా భుజానికి ఓ జోలె చేతిలో ఓ డబ్బా పట్టుకుని ‘అమ్మా!’ భాకరీ ఒకటి పెట్టమ్మా! అని ప్రతి ఇంటి ముందూ నిలబడి అడుగుతూ ఎందరు అమ్మల్నో కలిగినవాడ్ని. అమ్మ ఎప్పుడూ తన సంతానం ఆకలి గురించే భయపడుతూ ఉంటుంది కదా! అందుకే ఆ ఇంటి ముందు నా పిలుపు వినబడగానే ఈ ఇంటి ఇల్లాలు పళ్లెంతో భిక్ష తెచ్చి నాకియ్యడానికి సిద్ధంగా ఉంటుంది. ఉంటోంది. ఇన్నాళ్ల పాటు భిక్షాటనకి వెళుతున్నా ఏ అమ్మ కూడా ‘చెయ్యి ఖాళీ లేదు – పైకెళ్లు’ అననే లేదంటే నన్ను సృష్టించిన ‘అల్లాహ్’ కి నేనెంత రుణపడి ఉన్నాను? ఎన్ని కృతజ్ఞతలని సమర్పించవలసి ఉన్నాను. నువ్వు ఫకీరువి కదా! నీ ఒక్కడి వ్యవహారం నువ్వు చూసుకో! ఇన్ని ఇళ్లకెందుకొస్తావని గాని, పైగా ఒక్కో రోజున గరిష్టంగా 12 మార్లు భిక్షాటన కెందుకొస్తావని గాని ఏ తల్లీ అడగలేదు. పిల్లవాడు ఎన్ని మార్లు ‘తిండి’ అని అడిగితే అన్ని మార్లు విసుక్కోకుండా వాడి కడుపు చూస్తూ పెట్టేది తల్లే కదా! అలాంటి తల్లుల్నిచ్చిన ఆ భగవంతుడు నా పట్ల ఎంత దయ చూపుతున్నాడో కదా! యజ్ఞాలు 5 శాస్త్రం తెలిసిన పెద్దలూ, పండితులూ అయితే వీటిని పంచమహాయజ్ఞాలంటారు. మొదటిది బ్రహ్మయజ్ఞం. మన ప్రాచీనులు మనకి అందించిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధార్మికగ్రంథాలున్నాయే వాటిని కేవలం పారాయణ చేస్తే చాలు బ్రహ్మయజ్ఞాన్ని చేసినట్లే. గీత అనే గ్రంథం ఉపనిషత్తులు సారాంశం (ఉపనిషత్సు.. అని ఉంటుంది భగవద్గీత ప్రతి అధ్యాయం చివరా) కాబట్టి కనీసం రోజుకొక్క శ్లోకాన్ని చదివినా చాలుగా బ్రహ్మయజ్ఞాన్ని ముగించగలుగుతారుగా! అందుకే నేను శ్యామాకి గీతనీ విష్ణుసహస్రనామాన్నీ ఇచ్చి చదువుతూ ఉండమన్నాను. రోజూ మసీదులో ఎవరో ఒకరు గీత, భాగవతం, ఉపనిషత్తులు.. ఇలా చదువుతూనే ఉంటారు. ఏ భాషవాళ్లు ఆ భాషలో చదవడం తప్పు కాదు. చదవబడేది అదే కాదా? అనేదే ముఖ్యం.ఇక రెండవది దేవ యజ్ఞం. హోమాన్ని చేస్తూ ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు ఆనందంతో దేవతలకి ఆహుతులని సమర్పించడం దేవయజ్ఞం. ధునిలో కనిపించేది అదే కదా! ఇక మూడవది పితృయజ్ఞం. బాలా కాకా కడూన, వజేయాంచ్యా కడూద, సాహెబ్ జోగ్ భా ఊ సాహెబ్ దీక్షిత్, బాలా సాహెబ్ భాటే.. ఇలా ఎందరో పితరులకి ఈ యజ్ఞాన్ని చేస్తూనే వస్తున్నారు కదా! హైందవధర్మం ప్రకారం నువ్వులూ నీళ్లతో తర్పణాలని ఇస్తూ వస్తున్నారు కదా అది కూడా మసీదులో! అందుక్కాదూ ఈ మసీదుకి వస్తే చింతలన్నీ తొలగిపోతూ ఉంటాయి! నాల్గవది భూతయజ్ఞం. ‘భూ’ అంటే జీవించి ఉన్నదని అర్థం. అంటే ప్రాణంతో ఉన్నదని భావం. వచ్చిన భిక్షాన్నాన్ని కుక్కలు, పందులు, ఎలుకలు.. ఎన్ని తినడం లేదు? భిక్షాపాత్రపైన మూతని కూడా ఉంచేది ఇందుక్కాదూ? మన ఇంట్లో మన ఒకళ్లం తినేసి ప్రపంచంలోని అందరి కడుపు నిండిపోయిందనుకోవడం సిగ్గుచేటైన విషయం కాదూ! ఒకప్పటి రోజుల్లో ప్రతి గృహస్థు కూడా తాను తినబోయే ముందు కాకికి ఓ అన్నం ముద్దని వీధి గోడ మీద పెట్టి ఆ మీదటే తింటూ ఉండేవాడు. ఇలాంటి సంప్రదాయాలని బతకనియ్యాలి. ఇదే శాస్త్ర పరిభాషలోనైతే భూతయజ్ఞమవుతుంది.ఐదవది మనుష్యయజ్ఞం. కేవలం తానూ తన కుటుంబం మాత్రమే భోజనాన్ని ఆరగించడం కాకుండా తోటి మనుషులకి అన్నం విషయంలో తిండి దొరక్క ఆర్తితో ఉన్నవాళ్లకి భోజనాన్ని తమతో కలిపి తినేలా చేయడం దీని లక్ష్యం. సత్రాల్లో జరుగుతూ ఉండేది ఇదే. ఈ భోజనాన్ని పెట్టడమనేది నిస్సా్వర్థంగానే జరగాలి తప్ప ‘భోజనానికి ఇంత!’ అనే తీరుగా సొమ్ముని తీసుకుని పెట్టడం సరికాదు. ఒక చేలో ముప్ఫై నలభై పశువులు మేస్తూ ఉంటే.. ఓ చెట్టుకున్న పళ్లని ఓ కొన్ని చిలుకలు ముక్కులతో పొడుస్తూ తింటూ ఉంటేనూ, ఓ బియ్యపు రవ్వలోని చిన్న చిన్న అణువుల్ని చీమలు తినడానికి ప్రయత్నిస్తూ ఉంటేనూ ఆ దృశ్యం ఎంత హృదయరంజకంగా ఉంటుందో అలా మనం తినబోతూ పదిమందిని కలుపుకుని తింటున్నా ఆ దృశ్యం భగవంతుని కంటపడితే ఎంత ఆశీర్వచనం ఆయనది మనమీద ఉంటుందో ఊహించలేం!ఇలా ఐదు యజ్ఞాలనీ మనం సామూహికంగా నిర్వహించిన రోజున భగవంతుని కృప ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అన్నింటినీ ఒక్కడే చేయాలని దీనర్థం కాదు. అందరం కలిసి చేయాలనేది దీని ఉద్దేశ్యం అంటూ ఆ రోజు బోధని ముగించాడు సాయి.పైవారం – సాయి మాటకి తిరుగులేదు! కారణం??? – సశేషం -
హిందూమతం–హిందుత్వం
తాటిచెట్టుకీ తాతపిలకకీ ముడివేసినట్టు– ఈ దేశంలో ప్రతీవ్యక్తీ హిందూమతాన్నీ, హిందుత్వాన్నీ కలిపి రాజకీయ ప్రయోజనానికి వాడటం రోజూ పేపరు తెరిస్తే కనిపించే అసంబద్ధత. రెండింటికీ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఉంది. అయితే దగ్గర బంధుత్వమూ ఉంది. స్థూలంగా చెప్పాలంటే హిందుత్వం సిమెంట్. హిందూమతం కట్టడం. కట్టడం దేవాలయమా? పాఠశాలా? మరొకటా మరొకటా– మనిష్టం. దేవాలయాన్ని సిమెంట్ అనం. ‘ఆ పెద్ద సిమెంట్ ఉన్నదే!’ అని పాఠశాలని చూపించం. సిమెంట్‌తో రూపుదిద్దుకున్నాక ‘అది పాఠశాల’. దానికి వేరే రూపు, ప్రయోజనం, ప్రత్యేకత, అస్తికత సమకూరింది. హిందుత్వం ఒక జాతి ప్రాథమిక విశ్వాసాలకు ప్రతీక. ఒక ‘ప్రత్యేకమైన’ ఆలోచనా వ్యవస్థకి రూపు. రామాయణం మతం, రాముడు మతానికి ప్రతీక. కానీ ‘సత్యం’, ధర్మం, పర స్త్రీని కన్నెత్తి చూడని నిష్ఠ– హిందుత్వం. భాగవతం మతం. శ్రీకృష్ణుడు మతానికి ప్రతీక. కానీ– చిలిపితనంతో జీవితాన్ని ప్రారంభించినా చివరలో జాతికి ఆచార్యత్వాన్ని సాధించడం హిందుత్వం. సావిత్రి సత్యవంతుల కథ మతం. కానీ ఓ స్త్రీ మూర్తి అచంచలమైన ఆత్మవిశ్వాసం హిందుత్వం. అందుకే అరవిందులకు మరో స్థాయిలో ‘సావిత్రి’ లొంగింది. అంటే– ఓ జాతి నమ్మిన విలువ– ఆ జాతికి ప్రతీక. ఆ విలువకు ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలు– ఆయా కాలాలకు అనుగుణంగా ఇచ్చిన ‘రూపు’ మతం. వేంకటేశ్వరుడు మతం. కానీ వేంకటేశ్వరత్వం హిందుత్వం. మత సామరస్యానికి రామానుజులు అనే ప్రవక్త ‘తీర్చిన’ రూపు మతం. కారుణ్యం ఓ జాతి ప్రాథమిక విలువ. దానికి జీసస్ ప్రవక్త ఇచ్చిన అపూర్వమయిన ‘రూపు’ క్రైస్తవం. సర్వమానవ సౌభ్రాతృత్వం విలువ. దానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ‘రూపు’ ఇస్లాం. ప్రాథమిక విలువల విస్తృతి ఆ జాతి‘త్వం’ని వికసింపజేస్తుంది. ఆ గుణం Plasticity ప్రపంచంలో అధికంగా ఉన్నది ‘హిందుత్వం’. అందుకనే శతాబ్దాలుగా ఎన్ని మతాలకయినా– అంటే ప్రాథమిక విలువలు పెట్టుబడులుగా, ఆయా ప్రవక్తలు రూపు దిద్దిన అపూర్వ ‘మతా’లకు స్వాగతం పలకగలిగింది. క్రైస్తవం కారుణ్యమా? ‘రండి. మాకు బుద్ధుడు ఉన్నాడు’. ఇస్లాం సర్వమానవ సౌభ్రాతృత్వమా? ‘రండి. మాకు ప్రహ్లాదుడున్నాడు’. అవన్నీ ఒక జాతిని ప్రభావితం చేసిన ఆయా ప్రవక్తలు తీర్చిన మహాద్భుత మేరుశృంగాలు. రామాయణంలో రాముడి పాత్రీకరణలో అభిప్రాయభేదం ఉన్నదా? ఉండవచ్చు. కానీ అది ‘హిందుత్వా’నికి అంటదు. ఏనాడయినా మనం తాజ్‌మహల్ సౌందర్యానికి మురిసిపోయాం. కానీ ‘అందులో వాడిన చెక్క సున్నం ఎంత బాగుందో!’ అనుకున్నామా? సత్యమును ఆచరించుము– హిందుత్వం. రాముడు సత్యమునే ఆచరించెను– మతం. Hindutva is a way of life. Religion is a way of choice. కాలగతి, మానవ స్వభావాల వికసనం, కొండొకచో పతనం, ఆనాటి సమాజ హితం, ఆ సమాజానికి మార్గదర్శకం కాగలిగిన ఓ ‘ప్రవక్త’ అపూర్వ సిద్ధాంత నిర్దేశన– మతం. దానికి కవులు, రచయితలు, ప్రవచనకారులు– సమాజ చైతన్యానికిగాను రూపుదిద్దిన ‘చిలవలు–పలవలు’ – మతం. మరొక్కసారి– రామమందిర పునర్నిర్మాణం హిందుత్వానికి పెట్టుబడి కాదు. రాముడిలోని ‘రామత్వం’ మాత్రమే హిందుత్వం. Hindutva is a definition. Religion is a denami- nation. గోడ కట్టడంలో ‘గోడ’ స్థాయిలో ఆర్కిటెక్టు అవసరం లేదు. కానీ ఆ గోడ పెట్టుబడిగా నిలిచే కట్టడానికి ఆర్కిటెక్టు అవసరం. కాలగతిలో మన జీవన విధానాన్ని వైభవోపేతం చేసిన ఎందరో ఆర్కిటెక్టులు. శంకరాచార్య, రామానుజాచార్య, మహమ్మద్, జీసస్, మహావీర్, గురునానక్, వీరు ఈ ‘త్వం’కి కాలానుగుణంగా, సమాజానుగుణంగా అద్భుతమైన శిల్పాలను నిర్మించిన కారణజన్ములు. మరొక్కసారి– రామాయణం మతం. రామత్వం హిందుత్వం. దీనికి వాల్మీకి దిద్దిన రూపు రామాయణం. మరికొన్ని వందలమంది దిద్దిన రూపు మతం. రామారావులూ, రామనాథాలు, రామ్సింగులూ, రామశాస్త్రులూ, రామ్ యాదవ్‌లూ– అందరూ ఈ మతాన్ని నెత్తిన పెట్టుకున్నవారు. విలువ శాశ్వతం. అది హిందుత్వం. విలువకు ఆ జాతి దిద్దుకున్న ‘రూపం’ మతం. కొండొకచో మతానికి కాలదోషం పట్టవచ్చు. రూపం మారవచ్చు. అన్వయం మారవచ్చు. కానీ ‘త్వం’ మారదు. ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యరశ్మి హిందుత్వం. ఆ రశ్మిలో వికసించిన పుష్పం మతం. గొల్లపూడి మారుతీరావు -
హనుమంతుని తోక
ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ లేదు. అయితే ఎన్నిక లకు ‘హిందుత్వ’ ఓటరుని లొంగదీసుకోవడమే ఒడుపు. ఆ పని మన రాహుల్ గాంధీ గారికి తెలిసినట్టు, చేస్తున్నట్టు మోడీగారికి తెలియదని నా ఉద్దేశం. ఈసారి ఎన్నికలు హిందుత్వానికి మతాతీతమైన సిద్ధాంతాలకీ పోటీ. ఒకరు హిందుత్వానికి ప్రతినిధి. మరొకాయన ఇటలీ తల్లి సుపుత్రుడు. కానీ ఓటరుకి ఆయనా తాము ‘హిందుత్వా’నికి వ్యతిరేకి కాదని ఎలా నిరూపించాలి? (ఎందుకూ!) రాహుల్ గాంధీని కొట్టిపారేయడానికి వీలులేదు. వారు ఈ మధ్యనే హిందువులంతా కలలు గనే కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్లారు. (వాటికన్‌కి ఎందుకు వెళ్లి రాలేదు?) కర్ణాటక విమాన ప్రమాదం తప్పాక దేవునికి కృతజ్ఞతా సూచకంగా హిమాలయాలను ఎక్కారు. గుజరాత్లో ఎన్నో దేవాలయాలకు వెళ్లి, నెత్తినిండా విబూతి రాసుకుని దేవుళ్లకి మొక్కారు. మధ్య మధ్య భగవద్గీత పురాణాల గురించి తమ ప్రసంగాలలో గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారికి తమమీద ‘హిందుత్వం’ఎంతో కొంత ఆవహించిం దని నమ్మకం కుదిరింది. మొన్న ఒకానొక సభలో మోదీ గారిని ఉద్దేశించి ‘ఆయన ఏం హిందూ’ అని ఎద్దేవా చేశారు. మోదీగారు వెనుకంజ వేసి ‘నిజమే నాకు హిందుత్వం గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. అయితే మహామహులైన మత గురువులకే హిందుత్వమంటే ఏమిటో ఈ దేశంలో అవగాహన కాలేదు. నేను కేవలం ‘కార్యకర్త’ని, రాహుల్ గాంధీ గారు కుటుంబ ‘వ్యవహర్త’ అన్నారు. తెలుగులో ఈ మాటకి ‘రుచి’ రాలేదు. నేను ‘కామ్దార్’ని ఆయన ‘నామ్‌దార్’ అన్నారు.అయ్యా మోదీగారూ! తరతరాల జాతి విశ్వా సాలకు కొత్త అర్థాలను వెతుకుతూ, మన పురాణా లకూ, దేవుళ్లకూ, పురాణ ఇతిహాసాలకూ కొత్త అన్వయాలను చెప్పగల మహానుభావులు తమ పార్టీలోనే ఉన్నారు. నమూనాకు రెండు నామధే యాలు. ఉత్తర ప్రదేశ్‌లో బైరిక్ పార్లమెంట్ సభ్యు రాలు సావిత్రిబాయి పూలే ఒకరు. మరొకరు ఈ జాతికి విజ్ఞానాన్ని పంచే రచయిత.లక్నోలో ఒకానొక సభలో లక్ష్మణ్ గైక్వాడ్ అనే మరాఠీ రచయిత ఒక భాషణ చేశారు. గైక్వాడ్ అన్నారు: ‘‘రామాయణంలో హనుమంతుడు దళి తుడు. ఆయనకి ఒక తోకపెట్టి, వ్యక్తిని నల్లగా తయారుచేసి దళితుల్ని వెనుకబడినవారిగా ఉంచా లని ఈ పురాణ కవుల కుట్ర.హనుమంతుడు తన ప్రభువైన రాముడికి తన భక్తిని, విశ్వాసాన్ని చూపడానికి రొమ్ము చీల్చి చూపవలసి వచ్చింది. ఇది దళితుల ‘పీడన’కి నిదర్శనం. ప్రతీసారి ఈ విధంగా తమ ఉనికి ‘దళితులు’ నిరూపించుకోవలసి వచ్చింది. దళితులని నిజంగా హిందువులు గౌరవిస్తున్నా రని నిరూపించదలచుకుంటే ఓ దళితుడిని– ఓ చర్మ కారుడిని– ‘శంకరాచార్య’ని చేయండి. లేదా బాలాజీ గుడిలో అర్చకుడిని చేయండి. చేయలేక పోతే ముందు దేవాలయాలను జాతీయం చెయ్యండి. ప్రపంచం ఒక పక్క అంతరిక్షంలోకి పోతుంటే సంస్కృతి, మతం పేరిట భారతదేశం వెనక్కి పోతోంది.ఈ హిందువులే దళితులను ‘వానర సేన’ అన్నారు. మేం ఎల్లకాలం ఈ వానర సేనగానే ఉండాలా? ఎప్పటికయినా ‘పాలకులం’ కావద్దా? రామాయణం కూడా ఈ మత విచక్షణనే ప్రచారం చేసింది. రాముడు– ఒక బ్రాహ్మణుడు నింద వేశా డని శూద్రుడయిన ‘శంభుకుడు’ని చంపాడు. హను మంతుడిని భక్తుడనకండి. రాముడిని దేవుడనకండి. అందరూ సమానంగా ఉండాలి’’.అయితే గైక్వాడ్ గారికి నాదొక విన్నపం. దళితుల్ని చిన్నచూపు చూసే మత పీఠాధిపతి ‘శంక రాచార్య’ పదవి మళ్లీ దళితునికి ఎందుకు? మతాన్ని దుర్వినియోగం చేసిన ఈ దిక్కుమాలిన దేవుళ్ల ఆల యాలలో మళ్లీ దళితులకి అర్చకత్వం ఎందుకు? ఈ రామాయణాన్ని రచించిన కవి కూడా ఒక దళితుడే నని వారు మరిచిపోయారా? గైక్వాడ్‌గారూ! హిందుత్వం అంటే గుడులూ, గోపురాలూ, దేవుళ్లూ కాదు. ఒక జీవన విధానం. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురా ణాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా– మానవుని జీవన విధానాన్ని గురించే వేదం చదువుకున్న ఒక మేధావి అన్నాడు. Vedas are highly secular. Because they propound a way of life. చిత్రం బాగులేకపోతే రంగు తప్పుకాదు. గొల్లపూడి మారుతీరావు -
మీరెక్కడ నేర్చుకున్నారు?
జోధ్‌పూర్: హిందూ మతంపై తన పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సాధారణ పనివాడిని (కామ్దార్) అయిన తనకు హిందూ మతం గురించి పూర్తిగా తెలియదని, కానీ నామ్‌దార్ (రాహుల్)కు మాత్రం దాని గురించి మాట్లాడే హక్కు ఉందని వ్యంగ్యంగా అన్నారు. హిందూయిజాన్ని మీరెక్కడ నేర్చుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘హిందూ మతం గురించి పూర్తిగా తెలుసని నామ్‌దార్ గొప్పలకు పోతున్నారు. సాధువులు, పండితులు కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు. నేను మాత్రం ఓ సాధారణ పనివాడిని. ఎంతో పురాతనమైన, విశిష్ట సంస్కృతితో కూడిన హిందూయిజం, హిందుత్వల గురించి సంపూర్ణంగా ఎప్పుడూ తెలుసుకోలేను’ అని అన్నారు. గాంధీ కలల్ని వమ్ము చేశారు.. పారిశుధ్యంపై గాంధీజీ కన్న కలల్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని మోదీ ఆరోపించారు. తమ వంశాన్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వారు ఆరాటపడ్డారని మండిపడ్డారు. గాంధీ స్వప్నాల్ని నిజం చేసే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని తెలిపారు. విదేశీయులు కూడా ఇప్పుడు భారత్‌లో వివాహాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని, మన పర్యాటక రంగ అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘ఫకీర్ గాంధీ(జాతిపిత గాంధీ) ప్రజల మనసుల్లో ఉంటే నామ్‌దార్(రాహుల్) గాంధీని మరచిపోతారనే భయంతోనే వారు గాంధీజీ ఆశయాల్ని విస్మరించారు’ అని అన్నారు. పారిశుద్ధ్యంతోనే పర్యాటకం.. అధికారంలోకి వచ్చాక భవనాలు, వంతెనలు, హోటళ్లు నిర్మిస్తానని హామీ ఇవ్వలేదని, మరుగుదొడ్లు మాత్రమే కడతానని మాటిచ్చానని తెలిపారు. పర్యాటక రంగానికి పారిశుద్ధ్యమే కీలకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదన్నారు. ‘కాంగ్రెస్ దేశాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించింది. వారు పారిశుద్ధ్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ వినలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్‌తో దేశం శుభ్రం కావడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందింది. వీధి వ్యాపారుల నుంచి ప్రయాణ కంపెనీల వరకు ఎందరికో పర్యాటకం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశంలో ఆకర్షణీయ పర్యాటక గమ్యస్థానాల్లో రాజస్తాన్ కూడా ఒకటిగా ఎదిగింది. జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్‌లలో కోటలు మోదీ అధికారం చేపట్టాక వచ్చాయా? కాంగ్రెస్ హయాంలో లేవా? అయినా పర్యాటకం అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు?’ అని ప్రశ్నించారు. సరైన ప్రచారం లేకనే కాంగ్రెస్‌కాలంలో పర్యాటక రంగంలో కాస్త వెనకబడ్డామని ఆయన అన్నారు. నెహ్రూకు వ్యవసాయం తెలీదు తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 134వ జయంతి సందర్భంగా మోదీ.. ఆయనతో పాటు తొలి ప్రధాని నెహ్రూను ప్రస్తావించారు. విదేశీయుల దాడిలో ధ్వంసమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు రాజేంద్ర ప్రసాద్ హాజరుకావడంపై నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ చొక్కాపై గులాబీ పువ్వు ధరించే నాయకుడికి తోటల గురించి తెలుసు కానీ, రైతులు, వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అందువల్లే రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి అన్నారు. -
మోదీజీ మీరెలాంటి హిందువు
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల వాడి పెరిగింది. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ..‘తను హిందూనంటూ ప్రధాని మోదీ చెబుతుంటారు. కానీ, ఆయనకు హిందూయిజం మూలాలు అర్థం కావు. ఆయన ఎలాంటి హిందువు?’ అని ప్రశ్నించారు. ‘హిందూయిజం సారం ఏమిటి? ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం ఉంటుంది. మన చుట్టూతా విజ్ఞానం ఉంది. ప్రతి జీవికీ విజ్ఞానం ఉంటుంది. ఇదే కదా భగవద్గీత చెబుతోంది?’ అని అన్నారు. 2016లో భారత్ బలగాలు పాక్ భూభాగంపై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా ప్రధాని మోదీ అప్పటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకున్నారని రాహుల్ ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా ఇలాంటి సైనిక చర్యలు మూడు జరిగినా అవి బయటకు వెల్లడికాలేదని తెలిపారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు రూ.2 లక్షల కోట్ల మేర ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.12 లక్షల కోట్లకు పెరిగిపోయాయని విమర్శించారు. ఆ అగత్యం రాకూడదు?: సుష్మ మంత్రి సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందూయిజం గురించి రాహుల్ గాంధీ ద్వారా తెలుసుకోవాల్సిన ఆగత్యం ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా. ఆయన మతం, కులం ఏమిటో తెలియక రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయంలో ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. -
హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్
న్యూయార్క్: హిందూమతం అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కొనియాడారు. అనిశ్చితితో కూడిన నేటి సమాజానికి సరిగ్గా సరిపోయేది హిందూ మతమేనని పేర్కొన్నారు. మనకు తెలియని చాలా విషయాలు ఈ మతంలో ఉన్నాయన్నారు. జైపూర్ సాహిత్య వేడుకలకు అనుబంధంగా న్యూయార్క్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అద్భుతమైదని కొనియాడారు. ‘అనిశ్చితి, సంశయాలను జయించే ఒకే ఒక గొప్ప మతం హిందూయిజం. హిందూమతానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత నిర్ణయం. స్త్రీలను, కులాన్ని ద్వేషించే విషయాలను గ్రహించి, తన మతం ఇతరుల పట్ల వివక్ష చూపడానికి అనుమతిస్తోందని వాదిస్తే అది వ్యక్తి తప్పవుతుంది కానీ మతానికి కాదు’ అని థరూర్ పేర్కొన్నారు. -
హిందుత్వపై సరికొత్త సమరం
దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగారుపెడుతు న్నాయి. అందుకే, రాహుల్ మానససరోవర్ యాత్ర ఫొటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్ తాజా యాత్రలతో దెబ్బతీస్తారని బీజేపీ ఊహించలేదు. హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం. పరమశివుడి దయ కోసం కైలాస్ మానస సరోవర్ వెళ్లిన రాహుల్ గాంధీ పాలకపక్షంలో గుబులు పుట్టించగలిగారు. ప్రతిపక్ష నాయకులకు ఇంతకన్నా ఏం కావాలి? నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుని తీర్థయాత్రపై బీజేపీ నేతలు సక్రమంగా అలోచించి ‘ఎంత గొప్ప ఐడియా వచ్చింది, మీకు! భోలేనాథుడు(శివుడు) మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ ప్రత్యర్థుల కోసం కూడా మీరు శివుడ్ని ప్రార్థించండి’ అని స్పందించి ఉంటే బావుం డేది. శివుడు కూడా బీజేపీని మెచ్చుకునేవాడు. బీజేపీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఆరు రెట్ల బలం ఎక్కువున్నా కాషాయపక్షంలో ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో కనిపిం చడం లేదు. రాహుల్ పంపిస్తున్న యాత్ర ఫొటోలు నిజమైనవా, కావా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ట్విటర్ వ్యాఖ్యలతో వివాదాల మంటలు సృష్టించే కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ వివాదం రేపారు. ఊతకర్రతో దిగిన రాహుల్ ఫొటోలు ఫొటో షాప్ ద్వారా తయారుచేసినవని, ఆ చిత్రంలో రాహుల్ వెనుక నీడ లేదంటే ఫొటో నిజం కాదని ఆయన చెప్పారు. రాహుల్ ఎంత తెలివిగా యాత్ర వెళితే, బీజేపీ అంత తెలివి తక్కువగా కైలాస యాత్రపై వ్యాఖ్యానించింది. బీజేపీకి నెహ్రూపై ఎంత వ్యతిరేకత ఉందంటే, దేవుని ఉనికిపై తేల్చి చెప్పలేని ఆయన అజ్ఞేయవాదమే ఆయన వారసులను కూడా నడిపిస్తోందనే పిచ్చి నమ్మకం దాన్ని పీడి స్తోంది. ఇందిరాగాంధీ, రాజీవ్, ఇద్దరూ ఆస్తికులు గానే వ్యవహరించారు. వీరిద్దరూ లౌకికమార్గంలో పయనించారంటే వారు తమ ‘వంశ’ స్థాపకుడు నెహ్రూలా దేవునిపై విశ్వాసం లేనివారని అనుకో వడం తెలివితక్కువతనమే. ఇందిర మెడలో రుద్రాక్ష మాల ఉండేది. ఆలయాలు, బాబాలు, తాంత్రికులను దర్శించడం ఆమెకు అలవాటే. రాజీవ్‌గాంధీ తాను ప్రధానిగా ఉండగా అయోధ్యలో రాముడి గుడి తలుపులు తీయించారు. ఇక్కడ నిర్మించే ఆలయానికి భూమిపూజకు అనుమతించారు. గెలిస్తే రామరాజ్యం తెస్తానంటూ 1989 లోక్‌సభ ఎన్నికల ప్రచారం అయోధ్య నుంచే ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన పదేళ్ల యూపీఏ పాలనపై నరేం ద్రమోదీ–అమిత్‌షా నడిపే బీజేపీలో కొంత గందర గోళం ఉంది. మొదటి ఐదేళ్లూ వామపక్షాల మద్ద తుతో మన్మోహన్సింగ్ సర్కారు నడవడం బీజేపీ అవగాహనలో లోపానికి కారణం. మధ్యేవాద, లెఫ్ట్ పార్టీలపై ఆధారపడి నడవడం వల్ల ఈ ప్రభుత్వం మతపరమైన ఎలాంటి ప్రదర్శన లేకుండా సాగింది. అయితే, అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ దూకుడుగా మన్మోహన్ జవాబిస్తూ, గురు గోవింద్‌సింగ్ పంజాబీలోకి తర్జుమా చేసిన చండీ ప్రార్థన గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. యుద్ధానికి వెళ్లే ముందు చండీ మాత ‘నేనెప్పుడూ మంచి చేసేలా, నేను శత్రువుతో తలపడినప్పుడు గెలి చేవరకూ పోరాడేలా నన్ను ఆశీర్వదించండి’ అంటూ శివుడిని కోరుతూ చేసిన ప్రార్థనను మన్మోహన్ పార్ల మెంటులో గుర్తుచేశారు. లౌకికత్వంపై బీజేపీకి అవగాహన ఎంత? నెహ్రూ పాటించిన పకడ్బందీ లౌకికవాదాన్ని కాంగ్రెస్ ఎప్పుడో వదిలేసింది. కానీ, కాంగ్రెస్ దాన్నే పట్టుకు వేళ్లాడుతోందనే పొరపాటు అవగాహన బీజేపీకి ఉంది. ఇందిర హయాం నుంచీ కాంగ్రెస్ అన్ని మతాలవారిని ఏక కాలంలో ఆకట్టుకునే విధా నాలు బాహాటంగా అనుసరించింది. అంటే, హిందు వులకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూనే, మైనారిటీల పక్షాన గట్టిగా నిలబడుతున్నట్టు ప్రకటించు కుంది. దీన్నే బీజేపీ మైనారిటీలను బుజ్జగించడంగా విమర్శిస్తోంది. అయితే, రాహుల్ మరి కొన్ని అడు గులు ముందుకేసి తాను ‘జంధ్యం వేసుకున్న హిందు వు’గా జనం ముందుకొచ్చారు. వాస్తవానికి దేవుని నమ్మే మనలో చాలా మంది జంధ్యాలు ధరించరు. తెల్ల బట్టలతో ఆలయాలకు వెళ్లరు. రాహుల్ మాత్రం ముందే గొప్ప ప్రచారంతో టిబెట్‌లోని మానస సరోవర్కు తీర్థయాత్ర స్థాయిలో వెళ్లారు. అయితే, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రదర్శించని విధంగా రాహుల్ తాను హిందువుననే విషయాన్ని చాలా దూకుడుగా ప్రదర్శించుకుంటున్నారు. బీజేపీ తీవ్రవాద హిందుత్వకు విరుగుడుగా ఆయన సుతి మెత్తని హిందుత్వ మార్గంలో పయనిస్తున్నారు. కర డుగట్టిన లౌకిక వామపక్షవాదుల్లో రాహుల్‌కు కొత్తగా మద్దతుదారులైనవారు మాత్రం ఈ పరిణామాలు దిగమింగుకోలేకపోతున్నారు. కానీ దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించ డానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగా రుపెడుతున్నాయి. అందుకే, ఇటీవల దేవాలయాలు దర్శించినప్పుడు దేవుని విగ్రహాల ముందు హిందువులా సరిగా మోకాళ్లపై కూర్చోలేదంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ మానససరోవర్ యాత్ర ఫోటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్ తాజా యాత్రలతో దెబ్బ తీస్తారని బీజేపీ ఊహించలేదు. మొత్తంమీద హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం. ఐదుగురి అరెస్టుపై అనూహ్య స్పందన! మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ఇటీవల బీజేపీ సర్కారు అరెస్టు చేసిన ఐదుగురు ప్రముఖులకు రాహుల్ సూచనతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు, సానుభూతి ప్రకటించింది. కేంద్ర సర్కారు అరెస్టు చేసిన హక్కుల నేతలు, ‘పట్టణ నక్సల్స్’గా ముద్రవేసినవారికి రాహుల్ వెంటనే మద్దతు ప్రకటించారు. ఈ విషయంపై పార్టీ వేదికల్లో ఎక్కడా చర్చించలేదు. కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలో మార్పునకు ఇదో సంకేతం. పైన చెప్పిన ఐదుగురు ప్రముఖుల్లో నలుగురిని ఆయన యూపీఏ ప్రభుత్వమే అరెస్టు చేసి, వేధించింది. వారిలో ఒకరు ఆరేళ్లు, మరొకరు ఏడేళ్లు జైల్లో గడిపారు. చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఊపా) సహా అనేక నల్ల చట్టాల కింద వారిపై యూపీఏ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసి జైళ్లో పెట్టింది. సాయుధ నక్సలైట్లను, వారికి సానుభూతిపరులుగా ఉండే మేధావులను కాంగ్రెస్ ప్రభుత్వం వేటాడింది. అణచి వేసింది. మావోయిస్టు నేత కోబాడ్ గాంధీని, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ అధ్యాపకుడు జీఎన్ సాయిబాబాను ఆయన యూపీఏ సర్కారు అరెస్టు చేసి, వారు అప్పటినుంచీ జైళ్లలో మగ్గిపోయేలా చర్యలు తీసుకుంది. రాహుల్ సొంత ప్రభుత్వానికి చెందిన రహస్య పోలీసు సంస్థలు ఇద్దరు ప్రముఖ మావోయిస్టు నేతలు చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్), మల్లోజుల కోటేశ్వరరావు(కిషన్‌జీ)లను ఎన్కౌంటర్ల పేరుతో దారుణంగా చంపించాయి. మరి ఇప్పుడు రాహుల్ నక్సల్స్ విషయంలో తన వైఖరి మార్చుకుంటున్నారా? వామపక్ష తీవ్రవాదం (నక్సలైట్లు) దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు అని 2006లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. వామపక్షాల మద్దతుపై యూపీఏ ఆధారప డిన మొదటి ఐదేళ్లలో ఇదంతా జరిగింది. వామపక్షాలను, వామపక్ష తీవ్రవాదాన్ని వేరు చేసి మన్మోహన్ చాలా తెలివిగానే మాట్లాడారు. అంటే, ఈ వైఖరికి భిన్నంగా రాహుల్ భావిస్తున్నారని అనుకోవచ్చా? నక్సల్స్ విషయంలో కాస్త మెత్తగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా, ఆయన యూపీఏ ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా నడిచే అవకాశాలు లేవు. అయితే, అప్పట్లో ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు మావోస్టుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నప్పుడు అప్పటి కేంద్రమంత్రి పి.చిదంబరం కఠిన వైఖరి అవలంబించకుండా రాహుల్ తల్లి సోనియా ద్వారా ప్రయత్నించారనే ప్రచారం ఉంది. 1971 యుద్ధం, స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్లార్ తర్వాత ఈ రాష్ట్రంలోని చింతల్నార్‌లోనే భద్రతాదళాలు ఎక్కువమందిని నష్టపోయాయి. చిదంబరం ఆదేశాలతో బస్తర్‌లో భద్రతాదళాలు నక్సలైట్లపై భారీ స్థాయిలో పోరు ప్రారంభించగానే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయసింగ్ కేంద్ర సర్కారు అను సరిస్తున్న ఈ విధానం ‘ఒంటి కన్ను’దని దుయ్య బట్టారు. అప్పుడే ఒడిశాలో మావోయిస్టు్టలు అపహ రించిన ఓ ఐఏఎస్ అధికారిని విడుదల చేయించడానికి ప్రభుత్వం ఓ కీలక నక్సల్ నేత భార్యను విడుదల చేయించింది. సోనియా అధ్యక్షతన నడిచిన ఎన్ఏసీ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి హర్ష మందర్ నడుపుతున్న ఓ ఎన్జీఓ సంస్థకు ఈ నక్సల్ భార్య అధిపతిగా ఉన్నారు. అలాగే, ఛత్తీస్‌గఢ్ పోలీసులు రాజద్రోహ నేరం మోపిన పిల్లల వైద్యుడు బినాయక్ సేన్‌ను కోర్టు దోషిగా తేల్చాక బెయిలుపై విడుదలవగానే అప్పటి ప్రణాళికా సంఘంలోని ఆరోగ్యకమిటీ సభ్యునిగా ఆయనను తీసుకున్నారు. మారనున్న బీజేపీ ఎన్నికల వ్యూహం! 2017 డిసెంబర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన బీజేపీ అనుభవం దృష్ట్యా ప్రధానంగా ఆర్థికరంగంలో తమ సర్కారు పనితీరు ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోరాడకూడ దని మోదీ–షా ద్వయం నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది. వారు ప్రజలకు తమ హిందుత్వ, అవినీతి వ్యతిరేక పోరాటం, తీవ్ర జాతీయవాదం–ఈ మూడు అంశాలకూ సమ ప్రాధాన్యం ఇచ్చి పార్లమెంటు ఎన్ని కల్లో విజయానికి ప్రయత్నిస్తారు. బీజేపీ హిందు త్వకు పోటీగా రాహుల్ తన తరహా హిందూత్వతో ప్రయోగాలు ప్రారంభించారు. జాతీయభద్రత విష యంలో మెతకగా వ్యవహరిస్తే భారత ప్రజలు సహించరు. సాయుధ నక్సల్ ఉద్యమానికి జనం పల్చగా ఉన్న కొన్ని మారుమూల జిల్లాల్లో తప్ప ఇంకెక్కడా మద్దతు లేదు. హిందుత్వ, జాతీయ వాదాలను పరిమిత స్థాయిలో ఆచరిస్తే కాంగ్రెసే నష్ట పోతుంది. రాహుల్ తన పంథా మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని స్వయంగా అందించినట్టే అవుతుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పీఠాధిపతి అరెస్ట్.. శైవ క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామిని మరో సారి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసలు శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేశారు. శైవక్షేత్రం చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. శివస్వామిని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని భక్తులు పోలీసులను నిలదీశారు. శివస్వామి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. క్షేత్రంలో పోలీసుల్ని చూసి భక్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చేబుతారని విమర్శించారు. కాగా ఈ నెలలో శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. హిందులపై కత్తి మహేశ్ చేసిన వాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన శివస్వామిని ఈ నెల 16న హౌజ్ అరెస్ట్ చేశారు. -
శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి అరెస్ట్
-
పీఠాధిపతి అరెస్ట్.. శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి తీవ్ర ఆరోపణల చేశారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినందుకు హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శివస్వామి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హిందుత్వంపై జరుగుతున్న దాడులను క్షేత్రానికి చెందిన పలువురు ఖండించారు. శ్రీవారి ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కమిటీ వేసి విచారణ చేయకుంటే ఆరోపణల్లో నిజముందని భావించాల్సి ఉంటుందన్నారు. హిందుత్వంపై టీడీపీ సర్కార్ చేస్తున్న దాడులను నిరసిస్తూ చలో తిరుపతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆగస్టు 12కు తిరుమల చేరుకుంటుందని వెల్లడించారు. 30 మంది స్వామిజీలు, 200 మంది శిష్యులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని.. ఇందులో భాగంగా 500 గ్రామాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. హిందుత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలకు వివరించి, ఏం జరిగినా సరే ఆగస్టు 13న తిరుపతి బంద్ నిర్వహిస్తామని శివస్వామి వివరించారు. -
రాహుల్ గాంధీ హిందువు కాదా?!!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసలు హిందువా, కాదా ? అన్న అంశంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ బుధవారం నాడు సోమ్‌నాథ్ ఆలయన్ని సందర్శించినప్పుడు హిందువేతరులు సంతకం చేయాల్సిన పుస్తకంలో సంతకం చేశారని, ఈ విధంగా రాహుల్ గాంధీ హిందువు కాదని తానే స్వయంగా ఒప్పుకున్నారంటూ బీజేపీ వర్గాలు, మద్దతుదారులు బుధవారం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొట్టమొదట ఈ కథనాన్ని ‘జీ గుజరాతీ’ ప్రసారం చేసింది. జీ గుజరాతీకి చెందిన జర్నలిస్ట్ తేజాష్ మోదీ సోమ్‌నాథ్ ఆలయం వద్ద నుంచి పంపిన ట్వీట్‌ను యధాతథంగా ‘జీ గుజరాతీ’ ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది. ‘కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ ట్రస్ట్ హిందువులుకానీ వారి కోసం ఏర్పాటు చేసిన పుస్తకంలో రాహుల్ గాంధీ తన పేరు రాసి సంతకం చేశారు. ఆయన కిందనే అహ్మద్ పటేల్ కూడా తన పేరు రాసుకొని సంతకం చేశారు’ అని తేజాష్ మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం అధిపతి అమిత్ మాలవియా ఆగమేఘాల మీద పార్టీ ట్విట్టర్ నిర్వాహకులందరికి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఆయన తొందరపడి చేసిన ట్వీట్ విస్తతంగా సోషల్ మీడియాతోపాటు ముద్రణా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తతంగా ప్రచారమైంది. అది రాహుల్ గాంధీ హిందువు కాదా? అంటూ కొత్త చర్చను లేవదీసింది. ఇలా తొందరపడి తప్పుడు వార్తలను ట్వీట్ చేయడం అమిత్ మాలవియాకు మొదటి నుంచి అలవాటే. ఇప్పటికీ ఐదుసార్లు ఆయన తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్ మత కల్లోలు జరుగుతున్నప్పుడు ‘పట్టపగలు ఓ హిందువు స్త్రీని వివస్త్రను చేస్తున్న ముస్లిం గుండాలు’ అనే శీర్శికన ఓ మరాఠీని సినిమా షూటింగ్ స్టిల్‌ను ఎవరో పోస్ట్ చేస్తే దానికి మాలవియా విస్తత ప్రచారం కల్పించారు. సరే, ఆయనంటే బీజేపీ పక్కా మనిషి కనుక అలాంటి ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని పక్కన పెట్టొచ్చేమోగానీ కొన్ని ఆంగ్ల పత్రికలు, ఛానళ్లు వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే హిందువు కానంటూ రాహుల్ గాంధీ దండోరా వేసుకున్నాడంటూ వార్తలను ప్రసారం చేయడం శోచనీయం. ముఖ్యంగా ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ వార్తకు మొదటి పేజీలో బ్యానర్ ప్రాముఖ్యతను ఇవ్వడం విడ్డూరం. గూగుల్‌లో నిక్షిప్తమైవున్న రాహుల్ రాతతో ఆలయ పుస్తకంలో రాహుల్ గాంధీ పేరుతో ఉన్న రాతను పోల్చి చూసినట్లయితే అది రాహుల్ గాంధీయే రాశారా, మరెవరైనా రాశారా? అన్న విషయం ఇట్టే తేలిపోయేది. ఎవరు కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ఆ మాత్రం కసరత్తు చేయకపోవడం శోచనీయం. ముఖ్యంగా మీడియాకైతే ఇది సిగ్గుచేటే! అందులోబాటులో ఉన్న రెండు రాహుల్ గాంధీ చేతి రాతలకు, సోమ్‌నాథ్ ఆలయ పుస్తకంలోని రాహుల్ చేతి రాతకు, సంతకానికి ఎక్కడా పోలిక లేదు. మరెవరో దీన్ని రాసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైగా రాహుల్ గాంధీ తన పేరును ఎప్పుడు కూడా రాహుల్ గాంధీజీ అని రాసుకోరు. పుస్తకంలో రాహుల్ గాంధీజీ అని రాసి ఉంది. అహ్మద్ పటేల్ పేరు ఇంగ్లీషు అక్షరాల్లో ‘ఏహెచ్ఎంఈడీ పీఏటీఈఎల్’ను ఏహెచ్ఏఎంఈడీగా తప్పుగా రాశారు. అహ్మద్ పటేల్ తన పేరును తప్పుగా రాసుకోరుగదా! అంతేకాకుండా రాహుల్ గాంధీజీ, అహ్మద్ పటేల్ పేర్లను ఎవరో ఒకరే రాసినట్టుగా రాతను చూస్తే స్పష్టం అవుతోంది. రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయంలో సందర్శకుల పుస్తకంలో చేసిన సంతకాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. తాను హిందువును కానంటూ మరే పుస్తకంలోనూ ఆయన సంతకం చేయలేదంటూ వివరణ ఇచ్చింది. గాంధీ సంతకం చేసిన పేజీనీ కూడా ట్వీట్ చే సింది. రాహుల్ గాంధీ ఒక్క సందర్శకుల పుస్తకంలో మినహా మరే పుస్తకంలో సంతకం చేయలేదంటూ సోమ్‌నాథ్ ఆలయం ట్రస్ట్ కార్యదర్శి పీకే లహరి మీడియాకు స్పష్టం చేశారు. మరి రాహుల్, పటేల్ పేరిట హిందువేతరుల పుస్తకంలో ఎవరు సంతకం చేశారు? రాహుల్ వెంట ఆలయంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించాలంటే ఈ పుస్తకంలో సంతకం చేయాలంటూ ఎవరో ఆలయం పుస్తకం ఇస్తే అందులో కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగీ... రాహుల్, పటేల్ పేర్లు రాసి సంతకం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోడానికి మనోజ్ త్యాగీ అందుబాటులో లేరు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత కల్పించాల్సిందిపోయి పనికిమాలిన అంశాలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో నాడు ఇందిరాగాంధీ గుజరాత్‌ను పర్యటించినప్పుడు మోర్బీలో ముక్కుమూసుకున్నారని విమర్శించడంలో ఉద్దేశం ఏమిటీ? -
వినాయకిని మరచిపోతున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ: కాల గమనంలో స్త్రీ శక్తి స్వరూపిణి వినాయకిని పూర్తిగా మరచిపోతున్నారు. వినాయకుడికి స్త్రీ రూపం ఉందన్న విషయాన్ని కూడా తెలియనివారు ఎంతో మంది ఉన్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందూ పురాణాల్లోనే వినాయకి ప్రస్థావన తక్కువగా ఉన్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లు ఉన్నాయి. ప్రముఖ పరిశోధకుడు బాలాజ్ ముండుకుర్ రాసిన ‘ది ఎనిగ్మా ఆఫ్ వైనాయకీ’ పుస్తకం ప్రకారం వినాయకికి వైనాయకి, గణేషిని, గజానిని, విఘ్నేషిని, శ్రీ ఐనింగిని, గజరూప అని పేర్లున్నాయి. హిందూ కాలెండర్ ప్రకారం భాద్రపద నెలలో వినాయకుడి పుట్టిన రోజు వస్తుంది. సహజంగా ఆగస్టు నెల చివరలో వచ్చే వినాయకుడి పుట్టిన రోజునాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించడం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువుల విశ్వాసం. విఘ్నాలు తొలగిపోవడానికి స్త్రీ రూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీ లేవుగానీ ప్రతి నెలలో వచ్చే నెలవంక నాలుగో రోజున ‘వినాయకి చతుర్థి’ పేరిట మహిళలు ప్రత్యేక పూజలు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తనుమాలయన్ ఆలయంలో వినాయకి విగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే ఉన్నాయి. ఇందులో ఓ విగ్రహం సుకాసనంలో కూర్చొని ఉన్నది. నాలుగు చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమ చేతిలో గొడ్డలి, కింది ఎడమ చేతిలో శంఖం పట్టుకొని ఉంది. అలాగే కుడివైపున పై చేతిలో కలశం, మరో చేతిలో దండం ఉంది. ఆ పక్కనే మరో విగ్రహంలో వినాయకి నిలబడి ఉంది. దానికి రెండు చేతులే ఉన్నప్పటికీ విరిగిపోయి ఉన్నాయి. 1300 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలో వినాయకి విగ్రహాలకు ప్రత్యేకతలు ఉన్నాయని రిటైర్డ్ పురాతత్వ శాస్త్రవేత్త సి. శాంతలింగమ్ చెప్పారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకి విగ్రహాలు కనిపిస్తాయని, మరే ఆలయంలో ఈశాన్య దిశన ఇలా విగ్రహాలు ఉండవని ఆయన వివరించారు. క్రీస్తుశకం 550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకి ప్రస్తావన ఉంది. శివుడి అవతారంగా పేర్కొన్న 200 మంది దేవతల పేర్లలో వినాయకి పేరును పేర్కొన్నారు. హిందూ పురాణాలపై పలు పుస్తకాలు రాసిన దేవ్‌దత్ పట్నాయక్ కూడా వినాయకి ప్రస్థావన తీసుకొచ్చారు. ఆయన కథనం ప్రకారం అంధక అనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని పార్వతి శంకరుడికి ఫిర్యాదు చేయడంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షుసుడి ఒక్క రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. అలా రాలిన చుక్కల నుంచి మళ్లీ ప్రాణం పోసుకునే వరం ఆ రాక్షసుడికి ఉంది. అందుకని పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మ శక్తయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తయినా ఇంద్రానితోపాటు వినాయకిని సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తుంది. అప్పుడు వీరందరు ఆ రాక్షసుడి రక్తాన్ని నేల రాలకుండానే గాల్లో ఉండగానే తాగేస్తారు. రాజస్థాన్‌లోని రైరా, ఒడిశాలోని హిరాపూర్, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికీ వినాయకి విగ్రహాలు ఉన్నాయి. ముందుగా జానకి శ్రీనివాసన్ వినాయకి విగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వాటిని అనేక మంది షేర్ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికీ ఉన్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త శోధనలో మరెన్ని వినాయకి విగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. -
‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’
సాక్షి, అమరావతి: అర్చకుల వేతనాల్లో సగం కోత విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. హిందూ మతాన్ని నాశనం చేయడానికి బయట శతృవులు అక్కర్లేదని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఒక్క నిర్ణయం చాలని దుయ్యబట్టారు. అర్చకుల వేతనాన్ని రూ.10,000 నుంచి రూ. 5,000కి తగ్గిస్తే గ్రామాల్లో హిందూ మతం కనిపించకుండా పోతుందని లేఖలో పేర్కొన్నారు. ఆదాయం లేని ఆలయాల్లో అర్చకుల వేతనాలను సగానికి తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఐవైఆర్ బుధవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కాగా అర్చకుల వేతనాలు తగ్గించారంటూ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వాస్తవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
యోగి హిందూత్వ అస్త్రం: కీబోర్డ్ ఆర్మీ
న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో హిందుత్వానికి వ్యతిరకేంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ఎస్ఎస్-బీజేపీ థింక్ ట్యాంక్ భారత్ నీతి సిద్ధమవుతోంది. తమ హిందూత్వానికి వ్యతిరేకంగా లెఫ్టిస్టులు, ఇస్లామిస్టులు ఆన్లైన్లో చేస్తున్న ప్రచారాన్ని తుద ముట్టించేందుకు కీబోర్డు ఆర్మీని తయారు చేయాలని భారత్ నీతి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు నవంబర్‌లో 'హిందూఇజం అండ్ సోషల్‌మీడియా' సమావేశాన్ని వారణాసిలో నిర్వహించనుంది. ఈ సమావేశంలో వ్యతిరేక భావజాలాన్ని అడ్డుకునేందుకు 'కీబోర్డు ఆర్మీ'ని తయారుచేయాలనే అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్వీటర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హిందూత్వానికి వ్యతిరేకంగా భావజాలం పెరిగిపోతోందని భారత్ నీతి సభ్యుడు శైలేంద్ర సెంగర్ అన్నారు. దీనివల్ల హిందూవులు వేదనకు గురవుతున్నారని చెప్పారు. హిందూ దేవుళ్లు, దేవతలను అవమానపరుస్తూ కొందరు పోస్టింగులు చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై కాశీ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. సమావేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం పంపామని కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అకడమిక్ కామెంటెటర్ ఆన్ హిందూఇజం డేవిడ్ ఫ్రాలే వెబ్ ఆర్మీని మోటివేట్ చేస్తారని తెలిపారు. సద్గురు జగ్గీవాసుదేవ్, ఆచార్య బాలకృష్ణ, కాలమిస్టు అద్వైత కళలు కూడా సమావేశానికి హాజరై హిందూత్వంపై ప్రసంగిస్తారని చెప్పారు. -
న్యూజెర్సీలో 'భారత్ బచావ్ - విచార్ మంతన్'
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు, అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) పూర్వ విద్యార్దులు, హిందూ యూనిటీ డే ఆధ్వర్యంలో 'భారత్ బచావ్ - విచార్ మంతన్ (భారత దేశం ను కాపాడుకుందాం - అంతర్గత సమస్యలను అధిగమిద్దాం) అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. న్యూజెర్సీలోని వెస్ట్ విండ్సర్ లో నిర్వహించిన చర్చలో భారత్ మాతకి జై, వందేమాతరం, జైహింద్ - జై కిసాన్ వంటి నినాదాలతో మారు మ్రోగింది ఏబీవీపీ నాయకుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ ..ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అసహనం అంటూ గగ్గోలు పెడుతున్న జాతీయ మీడియా, సోకాల్డ్ మేధావులు, కుహనా లౌకిక వాదుల ద్వంద్వ నీతికి చక్కని ఉదాహరణగా మాల్దా మతకలహాల ఘటనను ఉదహరించారు. మనదేశంలో 'లౌకికవాద ముద్ర' వేసుకున్న నాయకులు, మేధావులు, కళాకారులు మౌనంగా ఉన్నారని తెలిపారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీ, కమ్యూనిష్టు నాయకులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ లోని పిల్లల్లో విష పూరితమైన దేశ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య దేశాన్ని కించపరిచేలా ప్రసంగించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, సత్య నీమన, ప్రదీప్ చాడ , రవి, కల్పనా శుక్లా , రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
’హిందూస్థాన్ చేయండి’
-
150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్పుర్హత్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది గిరిజన క్రైస్తవులు హిందూమతం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ‘ఇది మతమార్పిడి కాదు. గిరిజనులు స్వచ్ఛందంగా మతం మారారు’ అని వీహెచ్‌పీ నాయకుడు సచ్చింద్రనాథ్ సింఘా తెలిపారు. -
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా
ముస్లింలు, క్రిస్టియన్లు అందరినీ హిందూ మతంలోకి మారుస్తామని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలని, తాము దాన్ని సమర్థిస్తామని ఆయన చెప్పారు. హిందూమతం అనేది ఒక జీవన విధానమని, ప్రతి హిందువు తోటి హిందువు కోసం రోజుకు పిడికెడు బియ్యం, పది రూపాయలు పక్కన పెడితే హిందువులన్నవాళ్లు ఎవరూ పేదలు కారని ఆయన చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తామని ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. -
నిగ్గు తేల్చే పరీక్ష
సందేశం హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది. గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు. వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు. ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు. - రెంటాల జయదేవ -
నిండుకుండ వంటిది నిరాడంబరత
హైందవం నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ తెలిసిన సంపూర్ణ స్థితి. శివుడు, ఆంజనేయుడు, షిర్డీసాయిల నిరాడంబర అభివ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మహాదేవుడు: నివాసం శ్మశానం. కంఠహారం సర్పం. ఆయుధం త్రిశూలం. ఆసనం పులిచర్మం. ఇదీ శివుడి నిరాడంబర బాహ్యరూపం. కానీ, దీని అంతరార్థం వేరు. శివుడు ధరించిన త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. శరీరంపై సర్పాలు జీవాత్మలు. భస్మం పరిశుద్ధతకు ప్రతీక. ఆసనమైన పులిచర్మం కోరికలను త్యజించమనే సూచిక. వినయ హనుమ: అతి బలవంతుడు హనుమంతుడి జీవన విధానం కూడా ఎంతో నిరాడంబరమైంది. ఎంత శక్తి సంపన్నుడైనా ఎంతో నిరాడంబరంగా ఉన్నాడు. సుగ్రీవుడు, జాంబవంతుల ముందు కూడా వినయంతోనే మెలిగాడు. ‘జై హనుమాన్’ అని ఎక్కడా తనకు జేజేలు కొట్టించుకోలేదు. ‘జై శ్రీరామ్’ అంటూ తన నిరాడంబరతను ప్రకటించుకున్నాడు. బాబా ప్రేమ తత్వం: షిర్డీ సాయిబాబా అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే ఆయన ఆస్తులు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా తిరిగి వారికే అత్యంత ప్రేమగా పంచేసేవారు. బాబాని దర్శించుకునేందుకు నిత్యం వందలమంది భక్తులు వచ్చేవారు. అయినా, పనులన్నీ సొంతంగానే చేసుకునేవారు. భిక్షాటన చేసి భోజనం చేసేవారు. లెండి బావి నుంచి స్వయంగా నీళ్లు తోడి మొక్కలను పెంచేవారు. ఎక్కడికి ప్రయాణమైనా కాలినడకే తప్ప, ఎలాంటి వాహనాలనూ ఉపయోగించలేదు. ఫకీరులా కనిపించే బాబాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కరతలామలకం. తన ముందు నిలబడ్డవాడు భక్తుడా మూర్ఖుడా అనే తేడా లేకుండా అందరికీ ప్రేమతత్వాన్ని పంచారు బాబా. సాయి నిరాడంబర జీవన సందేశం కూడా అదే. నిండుకుండ తొణకదు అంటారు. నిరాడంబరత కూడా నిండు కుండలాంటిదే. విజ్ఞానమూ, బలమూ పెరుగుతున్న కొద్దీ మనిషి నిండుకుండలా మారిపోవాలి. నిరాడంబరత అలవర్చుకోవాలి. - సురేష్‌బాబా -
కేరళ పట్టు... ఈ కలరిపయట్టు!
భారతీయ అతి ప్రాచీన యుద్ధ కళ... కరాటే, కుంగ్‌ఫూ, సమురాయ్ అంటూ గొప్పగా చెప్పుకునే విదేశీయులంతా మన దేశంలోని సామాన్య సైనికుని ముందు తలవంచేలా నిలబెట్టిన కళ... యుద్ధ చాతుర్యం గల శక్తిని ప్రసాదించగలిగిన కళ.... ‘కలరిపయట్టు.’ ‘కలరి’ అంటే పాఠశాల,‘పయట్టు’ అంటే యుద్ధం. ప్రపంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్‌గా ఈ కళకు గుర్తింపు ఉంది. అయితే శాస్త్రీయ సంగీతానికి, పాప్ సంగీతానికి ఎంత తేడా ఉంటుందో కలరిపయట్టుకు- ఇతర మార్షల్ ఆర్ట్సకు అంత వ్యత్యాసం ఉంటుంది. ఆద్యుడు పరశురాముడు పరశురాముడిని ఈ విద్యకు ఆద్యునిగా భావిస్తారు. ఆ విధంగా కేరళీయుల యుద్ధక్రీడగా కలరియపట్టు పేర్గాంచింది. క్రీస్తుపూర్వం 15-16 శతాబ్దాలలో యోధుల మధ్య గొడవలను సద్దుమణిగేలా చేయడానికి ఈ యుద్ధ విద్యను అనుసరించేవారట. చోళరాజ్య సైనిక గురువు ఇలంకులం పిళ్లై కాలంలో ఈ విద్య పాఠశాలల్లో కలారిగా నేర్పబడేది. అప్పటి సైన్యాధ్యక్షతను, రాజ్యాధికారాన్ని కూడా ఈ విద్యే నిర్ణయించేది. పరీక్ష పద్ధతుల ద్వారా ఉత్తమ విద్యార్థులను ఎంచి రాజ్యసంరక్షణకు అవకాశం కల్పించేవారు. హిందూధర్మం ప్రకారం సమర్థుడు విద్యార్థిగా వస్తే విద్యను నేర్పించాలి. అలా బౌద్ధ సన్యాసులు ఈ విద్యను నేర్చారు. వారివల్ల పొరుగు దేశాలైన శ్రీలంక, మలేసియన్లకు ఈ కళ పరిచయం అయ్యింది. అటు విదేశాలకూ ఈ కళ గొప్పతనం తెలిసింది. యోగవిద్య ప్రముఖ పాత్ర... ఈ విద్యను నేర్పే గురువులను నాయర్ లేదా ఇలావార్ అంటారు. ‘కలారి పనికర్’ అనే తెగవారు ఈ విద్యను నేర్పుతారు. దీంట్లో మల్లయుద్ధం, కత్తి యుద్ధం, గదా యుద్ధం, ఉరుమి, కర్రసాము.. ముఖ్యమైనవి. ఆయుధాలు లేకుండాను, కత్తి-డాలుతోను, పరిగ లాంటి బరువైన వస్తువులతోనూ, కొరడా లాంటి లోహపదార్థ ఆయుధంతోనూ, కర్రలతోనూ శిక్షణ పొందుతారు. వీరి తర్ఫీదు లో యోగవిద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. వాస్తుశాస్త్రం... కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలనేది గురువుల మాట. మంత్ర, తంత్ర, మర్మ శాస్త్రాలను కలరిలో శక్తులను బ్యాలెన్స్ చేయడానికి ఆశ్రయిస్తారు. ఈ కళ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇందులోని శరీర కదలికలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇతర శిక్షకులెందరో ఇప్పుడు కలరిపయట్టు పట్ల ఉత్సాహం చూపుతున్నారు. అయితే శాస్త్రీయ సంగీతానికి కఠోర సాధన ఎంత అవసరమో కలరిపయట్టు ఒంటపట్టడానికి అంత సాధనా అవసరం. -
హిందుత్వ పరిరక్షణకు కృషి అవసరం
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం శోచనీయమని విశ్రాంత డీజీపీ అరవింద రావు అన్నారు. ఆదివారం ఇక్కడ అఖిల భారతీయ చాణక్య దళ్(ఏబీసీడీ) సమావేశంలో మాట్లాడుతూ హిందుత్వ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కోస్తా జిల్లాల్లో అత్యధికంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే హిందూ సమాజం పటిష్టంగా ఉంటుందన్నారు. అందరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. అఖిల భారతీయ చాణక్య దళ్ అధ్యక్షులు మురళీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ బ్రాహ్మణులను ఏకతాటిపై నడిపించే నేత కరువయ్యారన్నారు. దేశంలో బ్రాహ్మణులను ఏకతాటిపైకి తెచ్చేందుకే తాము సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సత్తా అధికార ప్రతినిధి గీతామూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణులు చట్టసభల్లోకి ప్రవేశిస్తేనే హిందుత్వ పరిరక్షణ సాధ్యమన్నారు. విప్ర సంఘం అధ్యక్షులు భగవాన్‌దాస్, అఖిల భారతీయ చాణక్యదళ్ నేత కె.కృష్ణమాచారి, ధన్వంతరి ట్రస్టు చైర్మన్ డా. కమలాకర శర్మ, మల్లేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.