
‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’
అర్చకుల వేతనాల్లో సగం కోత విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు.
ఆదాయం లేని ఆలయాల్లో అర్చకుల వేతనాలను సగానికి తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఐవైఆర్ బుధవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కాగా అర్చకుల వేతనాలు తగ్గించారంటూ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వాస్తవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.