అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు, అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) పూర్వ విద్యార్దులు, హిందూ యూనిటీ డే ఆధ్వర్యంలో 'భారత్ బచావ్ - విచార్ మంతన్ (భారత దేశం ను కాపాడుకుందాం - అంతర్గత సమస్యలను అధిగమిద్దాం) అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. న్యూజెర్సీలోని వెస్ట్ విండ్సర్ లో నిర్వహించిన చర్చలో భారత్ మాతకి జై, వందేమాతరం, జైహింద్ - జై కిసాన్ వంటి నినాదాలతో మారు మ్రోగింది
ఏబీవీపీ నాయకుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ ..ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అసహనం అంటూ గగ్గోలు పెడుతున్న జాతీయ మీడియా, సోకాల్డ్ మేధావులు, కుహనా లౌకిక వాదుల ద్వంద్వ నీతికి చక్కని ఉదాహరణగా మాల్దా మతకలహాల ఘటనను ఉదహరించారు. మనదేశంలో 'లౌకికవాద ముద్ర' వేసుకున్న నాయకులు, మేధావులు, కళాకారులు మౌనంగా ఉన్నారని తెలిపారు.
పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీ, కమ్యూనిష్టు నాయకులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ లోని పిల్లల్లో విష పూరితమైన దేశ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య దేశాన్ని కించపరిచేలా ప్రసంగించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, సత్య నీమన, ప్రదీప్ చాడ , రవి, కల్పనా శుక్లా , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
న్యూజెర్సీలో 'భారత్ బచావ్ - విచార్ మంతన్'
Published Wed, Mar 30 2016 9:52 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement