విశ్లేషణ
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే, మార్చుకునే హక్కు ఉంది. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్యమాలు శూద్రులను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించేవారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని అర్థం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదని మన నాయకులు గ్రహించాలి.
భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవి. మెసçపటోమియా నాగరి కతతో, గ్రీకు ఫిలాసఫీతో పోల్చదగిన స్థాయిలో భారతదేశ చరిత్ర, నాగరికతలు ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల చరిత్ర కారులు, పురాతత్వవేత్తలు, భాషాతత్వవేత్తలు ఇంకా ఈ మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
భారతీయ గతంలోకి దర్యాప్తు తూర్పు భాషలు నేర్చిన ఇండా లజిస్టులతో ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీయ చరిత్ర, మరీ ముఖ్యంగా భారతీయ భాషలను తమ అధ్యయనంగా ఎంచుకున్న ఐరోపా పండితులతో ఇది మొదలైంది. వివిధ పాలనాపరమైన హోదా లలో ఈస్టిండియా కంపెనీ నియమించిన విలియం జోన్స్, కోల్ బ్రూక్, హెచ్.హెచ్.విల్సన్ వంటివాళ్లు ఇండాలజిస్టులలో కనిపిస్తారు. వారంతా ఐరోపా ప్రాచీన సంప్రదాయంలో శిక్షణ పొందినవారు.
ప్రాచీన భాషల పట్ల ఆసక్తి పెంచుకుని, కొత్త రంగంలో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పాలనా వేత్తలుగా వారికి సంప్రదాయ భారతీయ చట్టం, రాజకీ యాలు, సమాజం, మతం పట్ల ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. ఇదే వారిని సంస్కృతం, పర్షియన్ సాహిత్యం వైపు నడిపించింది. ఈ విషయా లను ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన ‘ఐడియాలజీ అండ్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ’ అనే గ్రంథంలో చెప్పారు.
భారతదేశంలోని మానవజాతుల పరిణామాలను పరిశీలించి నట్లయితే, మానవజాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్లు మానవజాతి పరిణామంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహæనిర్మాణం, సంపద కీలక పాత్ర వహిస్తాయి.
ఈ దశలన్నీ ఇప్పటికీ దళితుల జీవన విధానంలో కనిపించడం వలన, భారతదేశంలో మానవజాతి పరిణామ లక్షణాలన్నీ దళిత జాతుల్లో ఉండటం వలన బి.ఆర్. అంబేడ్కర్ నిర్వచించినట్లు వీరు ఆది భారతీయులనేది నిర్ధారణ అవుతుంది. డేనిష్ పురాతన శాస్త్రవేత్తలు నిర్వచించినట్లు శిల, కాంస్య, ఇనుప యుగలక్షణాలు కూడా భారత సమాజంలోని ఆదిమ జాతుల్లో ఉన్నాయి.
నిజానికి భారతదేశంలో సింధునది వారసులు దళితులు. ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వీరిని ప్రాచీనులు అని వాడారు. వారికి ఆ తర్వాత వచ్చినవారు అర్వాచీనులు అవుతారు. ఏది సనాతనం? ఏది అధునాతనం? అనే దగ్గర ఋగ్వేద ఆర్యులే ఋగ్వేదాన్ని సనాతనం అయిందనీ, అధర్వణ వేదాన్ని అధునాతనమైనదనీ ప్రస్తావించారు. పూర్వం కంటే ఉత్తర బలీయమైనదనేది శాస్త్రం. అందుకే ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం... ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందుదాని కంటే తర్వాత దానిలో ఇంకా విస్తృతి ఉంది అని చెప్పబడింది.
మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాuŠ‡ దగ్గర బయల్పడింది. ఇటుకల చైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కానీ వాస్తు వైశిష్ట్యం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ– లోమశ ఋషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాల యాలు. క్రమంగా గుహాలయ వాస్తు భాజా, బేడ్సే, జున్నార్, విఠల్కేరా, కన్హేరీ, కార్లాలలో వికసించి అజంతా – ఎల్లోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్లా చైత్యాలయం.
ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచించిన బి.ఎస్.ఎల్. హనుమంత రావు గారు ఆంధ్రులు బౌద్ధ సంస్కృతి వికాసితులు అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనంగా బౌద్ధం విస్తరిల్లిందని విశ్లేషించారు. బౌద్ధ దర్శన ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై, ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసి తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోక మౌర్యుడు దండ సమత, వ్యవహార సమత నెలకొల్పాడు. దీన్ని బట్టి చూస్తే శిక్షాస్మృతి విషయంలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అతని శాసనాలు చాటుతున్నాయి.
ఆర్య ఋషులు ఈ దేశంలోకి పశుపాలకులుగా ప్రవేశించారు. గోపాలకులు (గోవులను పాలించే వారు), గవేషణ (గోవులను వెదకడం), గోపతి (గోవుల కధిపతి), గోమేధం (గోవులతో చేయు యజ్ఞం), గోఘ్నుడు (అతి«థిగా వచ్చి గోవులను చంపించువాడు), గోత్రం (గోశాల) అని వారిని వెన్నాడుతూ వచ్చిన ఈ విశేషణాలే వారి వృత్తిని ప్రకటిస్తున్నాయి అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పారు. ఆర్యులు గోపాలకులనీ, బౌద్ధం ప్రభావానికి గురయ్యేవరకూ వారు గోవును యజ్ఞయాగాల్లో బలి ఇచ్చారనీ చెప్పబడింది.
తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన కామేష్టి యజ్ఞాలలో గోవృష భాలను బలి ఇవ్వటమే కాకుండా, ఎలాంటి వాటిని బలి యివ్వాలో కూడా ఉంది. విష్ణువుకి పొట్టి వృషభాన్ని, ఇంద్రుడికి వాలిన కొమ్ములు, ఎర్రని రంగు నుదురుగల వాటినీ, శని దేవుడికి నల్ల ఆవును, రుద్రుడికి ఎర్రగోవుని – ఆ రకంగా బలి ఇవ్వాలని నిర్దేశింపబడింది. అందులోనే ‘పంచశరదీయ’ సేవ అనే మరో రకమైన బలిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. అందులో ముఖ్యాంశం ఏమంటే – ఐదేళ్ల వయసున్న 17 పొట్టి గిత్తల్నీ, అదే సంఖ్యలో మూడేళ్ళు నిండని పొట్టి లేగల్నీ బలి ఇవ్వాలని చెప్పబడింది.
నిజానికి అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం.అందుండి బౌద్ధం గురించి మాట్లాడటం ఆంధ్రుల చారిత్రక కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతిని ఆంధ్రుల రాజధానిగా శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించిన దానిలో అర్థం అదే. ఆంధ్రులు వైదికేతర మతాలను, ధర్మాలను అన్నింటినీ ఆహ్వానించారు.
ముఖ్యంగా బౌద్ధాన్ని, జైనాన్ని, ఇస్లాంను, క్రైస్తవాన్ని, ఇంకా అనేక మతాలను, ధర్మాలను ఆహ్వానించారు. ఆంధ్రదేశంలో శిల్పరూపం క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందు లేదు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి ముందు నిరాకార తత్వాలే ఉన్నాయి. ఆ తర్వాత శిల్పరూపాలు వచ్చినాక కూడా ఒకరి నొకరు గౌరవించుకోవడమే ఎక్కువ కాలం ఉంది.
అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మతం మార్చుకునే హక్కు పొందు పరిచాడు. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్య మాలు శూద్రు లను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించే వారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు.
‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదు అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని 25, 26, 27, 28వ అధికరణా లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
అంబేడ్కర్ ‘విముక్తి అంటే ఏమిటి?’ అని చెప్తూ, 1835 అక్టోబర్ 13న చేసిన ప్రకటనలో మతం మారే హక్కు అందరికీ ఉందన్నారు. నిజానికి ఆంధ్ర దేశం భౌతికవాద తత్వాలతో ప్రభావితమైన దేశం. నార్ల వేంకటేశ్వరరావు, గుర్రం జాషువా, మహాకవి వేమన హేతు వాదాన్ని బోధించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తూ మాన వతా వాదాన్ని ప్రజ్వలింపజేసే కర్తవ్యంలో భాగస్వాములం అవుదాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment