జైపూర్: హిందూయిజాన్ని కొందరు నేడు బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగాన్ స్థాయికి దిగజార్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. తమ ఫుట్‌బాల్ టీంకు మద్దతివ్వని వారిపై దాడులకు పాల్పడే సంస్కృతినే బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగా నిజంగా పిలుస్తుంటారు. శశి థరూర్ ఆదివారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడారు. ‘ఇటీవల కొందరు మా టీంకు మద్దతివ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని కొడతాం.
జై శ్రీరాం అనట్లేదు కాబట్టి, కొరడాతో దండిస్తాం’అంటున్నారన్నారు. ‘ఇది కాదు హిందూయిజం. హిందూయిజానికి దీనితో అస్సలు సంబంధమే లేదు’అని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ హిందువు ఆచరించాల్సిన నాలుగు పురుషార్థాలున్నాయని వివరించారు. హిందూయిజం పేరుతో కొందరు తమది మాత్రమే ఉత్తమ మార్గమని ప్రచారం చేసుకుంటూ బ్రిటిష్ ఫుట్‌బాల్ హూలిగాన్ స్థాయికి దిగజార్చుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment