hooliganism
-
దారి కాచి.. దాడి చేసి..
సాక్షి, బంజరాహిల్స్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై నలుగురు ఆకతాయిలు మద్యం మత్తులో కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీకి చెందిన నగేష్ కొత్త చెరువు వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు డబ్బులు డిమాండ్ చేస్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వెళ్లిన క్షణాల్లోనే చెట్ల మాటున దాక్కున్న మిగతా ముగ్గురు మళ్లీ అక్కడికి వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి బాధితుడిపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు నిఘా ఉంచితే మళ్లీ దాడి జరిగి జరిగే ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. (చదవండి: భార్య గొంతుకోసి హత్య) -
మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పోకిరీలకు న్యాయస్థానం జరిమానాతో పాటు 2 నుంచి 8 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ షీ టీమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏక్ షామ్ చారి్మనార్ కే నామ్’ కార్యక్రమానికి వచ్చిన మహిళలను వెంబడిస్తూ.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన మల్లేపల్లిలో ఉంటున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ ఖాన్, అబ్దుల్ హాజీ, మహమ్మద్ అద్నాన్‌లను సిటీ షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్కూల్ విద్యార్థిని వెంబడించిన సోమాజీగూడకు చెందిన కరుణాకర్, బాధితురాలిని సోషల్ మీడియాలో వేధించిన నిందితులు మారేడుపల్లికి చెందిన ఏ ప్రవీణ్, బీ రాకేష్, కే శామ్యూల్‌లను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ప్రేమ కాదంటే వేధింపులు.. మహంకాళికి చెందిన సి. సోహ్రాబ్ వ్యాస్ అనే వ్యక్తికి, బాధితురాలికి మధ్య కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిచింది. వీరి పెళ్లికి ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ బంధానికి తెరపడింది. అయితే సోహ్రాబ్ అంతకు ముందు బాధితురాలితో దిగిన ఫొటోలను ఆమె బంధువులకు, స్నేహితులకు పంపించి మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు షీ టీమ్ నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన బోయినపల్లికి చెందిన ఖతిక్ ఆకాష్ సుంకర్నును ఓ యువతి ప్రేమించింది. ఏడాదిన్నర తర్వాత వీరిద్దరూ విడిపోయారు. కానీ, గత కొద్ధి కాలంగా నిందితుడు బాధితురాలికి తరుచూ సందేశాలు పెట్టడం, ఆమె వ్యక్తిగత, ఆఫీసు మెయిల్ ఐడీలకు మెయిల్స్ పెట్టడం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితుడు ఆకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న జే నరేందర్ కొంతకాలం బాధితురాలితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆపై అభిప్రాయబేధాలతో విడిపోయారు. అప్పటినుంచి అతను గతంలో తనతో దిగిన ఫొటోలను బయటపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నిందితులనందరినీ తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రెండు నుంచి ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించిందని హైదరాబాద్ షీ టీమ్ అదనపు జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. (చదవండి: నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!) -
టీడీపీ నేతల దౌర్జన్యాలు
-
దౌర్జన్యాలు ఆపండి
అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని దాడులు చేస్తారా.. దళితులని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేస్తారా.. ఇక మీ దౌర్జన్యాలు ఆపండి.. లేదంటే తగిన గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 18వ తేదీ దళితులపై జరిగిన దాడి విషయంపై గురువారం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాసులు క లిశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులైన దళితులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ను తరిమికొడతామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మహిళలు వణికిపోతూ.. తమకు రక్షణ లేదంటూ.. బోరున విలపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదురించడానికి దళితులకు అండగా జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. దాడిలో గాయపడిన దళిత కుటుంబాలకు నష్ట పరిహారం వచ్చే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది జేసీ బ్రదర్స్ పనే.... వీరాపురంలో జరిగిన ఘటనపై జేసి బ్రదర్స్ హస్తం ఉందని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. న్యాయం చేస్తాం : ఎస్పీ వీరాపురంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా రాజశేఖర్‌బాబు హామీ ఇచ్చారు. సంఘటన అనంతరం ఆ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నేతలు దిలీప్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నేత బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, పురుషోత్తమ్ ఉన్నారు. -
తమ్ముళ్ల తడాఖా
గుడివాడ అర్బన్ : జిల్లాలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్ముళ్లు తమ తడఖా చూపుతున్నారు. తాజాగా మంగళవారం గుడివాడ మున్సిపల్ అధికారులపై స్థానిక నేతలు బెదిరింపులకు దిగారు. ‘మా మాట వినలేదంటే ఏదో ఒక సాకుతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఉసిగొల్పుతాం. మీ సంగతి చూస్తాం..’ అంటూ గుడివాడకు చెందిన టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కమిషనర్, అధికారులను బెదిరించారు. మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కౌన్సిలర్లు చింతల వరలక్ష్మి, యేల్చూరి వేణు, అడుసుమిల్లి శ్రీనివాస్, పొట్లూరి కృష్ణారావు, మరికొందరు నాయకులు కలిసి సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ కార్యాలయంలోని జనన మరణ విభాగానికి సంబంధించి ఒక సమాచారం ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేశారు. మున్సిపాల్టీలోని సహాయ సమాచార అధికారి (మున్సిపల్ మేనేజర్) వీరి దరఖాస్తుకు నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వలేదు. సమాచారం కోసం దరఖాస్తు చేసిన టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను వివరణ కోరగా, అప్పీలేట్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. దీంతో మళ్లీ ఈ నెల ఒకటో తేదీన అప్పీలేట్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సమాచారం ఇచ్చేందుకు అప్పీలేట్ అధికారికి 30 రోజుల సమయం ఉంటుంది. కానీ, టీడీపీ నాయకులు మంగళవారం(21వ రోజు) మున్సిపల్ కార్యాలయానికి వచ్చి హడావుడి చేశారు. తాము దరఖాస్తు చేసినా ఎందుకు సమాచారం ఇవ్వలేదని కమిషనర్ ప్రమోద్‌కుమార్‌తో గొడవకు దిగారు. తనకు అప్పీలేట్ అధికారిగా ఈ నెలాఖరు వరకు సమయం ఉందని, అప్పటిలోపు సమాచారం ఇస్తానని కమిషనర్ చెప్పినా టీడీపీ నాయకులు శాంతించలేదు. ‘మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సమాచారం ఇస్తున్నారు. మాకు ఇవ్వట్లేదు..’ అంటూ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. సమాచార హక్కుచట్టం ప్రకారం సమాచారం ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని కమిషన్ చెప్పారు. సంతృప్తి చెందని టీడీపీ నేతలు కమిషనర్ టేబుల్‌పై బాదుతూ ‘మీ సంగతి తేలుస్తాం..’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ వెళ్లిపోయారు. -
చట్టాలను పకడ్బందీగా అమలు చేయూలి
సమస్యలపై మహిళలు చైతన్యంతో పోరాడాలి రాష్ర్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం హన్మకొండలో న్యాయవిజ్ఞాన సదస్సు కేయూ క్యాంపస్ : ఎన్నిచట్టాలు వచ్చినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు హింస, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేసినం త మాత్రాన సరిపోదని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆయాచట్టాలపై అవగాహన పెంచుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ గ్రామీ ణ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ సోషల్ సర్వీస్, ఉమెన్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రశ్నించి ముందుకెళ్లినప్పుడే సమాజంలో ముందుకెళ్తారాన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళా సాధికారిత కో సం కొన్నేళ్లుగా ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహించి చైతన్యం చేసే ప్రయత్నాలు చేశామన్నారు. అయినప్పటికీ మహిళలకు సాధికారిత ఇంకా రాలేదన్నారు. ఎన్నారై వివాహాలు వివాదస్పదమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల మధ్య చట్టాల్లో తేడాలుండడంతో ఈ సమస్య తలెత్తుతోందన్నారు. మహిళా కమిషన్ వద్దకు ఇలాంటివి 35 కేసులు వచ్చాయన్నారు. గల్ఫ్ దేశాలకు వెళుతున్న మహిళలు వారు ఏ ఏజెంటు ద్వారా వెళుతున్నారో ప్రభుత్వానికి వివరాలు అందించాలన్నారు. వరంగల్ జిల్లాలో ఈనెల 14న వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలిచివేసిందన్నారు. ట్రైసిటీలో పోలీసులు మఫ్టీలో ఉండి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సులోనే ఉన్న వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావును ఆమె కోరారు. ఇండియన్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, లా కాలేజీ ప్రిన్సిపాల్ విజయచంద్ర, ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం ఆర్జేడీ వై.శైలజ, సీడబ్ల్యూసీ సభ్యులు చంద్రశేఖర్, చక్రధర్, ఎక్సెటెన్సన్ ఆఫీసర్ ప్రేమలత, రేవతి ఓంకార్, రమేష్, మిత్ర అవేర్నెస్ సొసైటీ అధ్యక్షుడు పి.రామారావు పాల్గొన్నారు. న్యాయవిజ్ఞాన సదస్సు ఈనెల 16న కూడా కొనసాగనుంది. నమ్మకం సన్నగిల్లుతోంది... హన్మకొండ సిటీ : మహిళలపై జరిగిన దా డులు, అఘాయిత్యాలపై కేసులు సంవత్సరాల తరబడి నడుస్తుండడంతో మహిళల్లో నమ్మకం సన్నగిల్లుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. హన్మకొండలోని సర్క్యూ ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా కేసులను సత్వరం పరిష్కరించాలని మహి ళ కమిషన్ న్యాయమూర్తులను కోరామన్నారు. కేసుల్లో త్వరగా తీర్పు వచ్చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై లా కమిషన్ సూచనలు చేయాలని కోరారు. ప్రతి గ్రామం గంగదేవిపల్లి కావాలి గీసుకొండ : జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సూచించారు. బుధవారం సాయంత్రం ఆమె గంగదేవిపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గంగదేవిపల్లిలో 24 కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పని చే స్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి గ్రామాభివృద్ధి గురించి ఆమెకు వివరిస్తుంటే... సరళమైన భాషలో సూటిగా విషయాలను చెప్పడం విశేషమని, ఎంత వరకు చదువుకున్నారని ఆయనను ఆమె ప్రశ్నించారు. తాను 9వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఆయన వివరించిన తీరును వెంకటరత్నం ప్రశంసించారు. సమావేశంలో సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామ అభివృధ్ధి కమిటీ నాయకుడు, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, తహసిల్దారు మార్గం కుమారస్వామి, మంచినీటి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పెండ్లి మల్లారెడ్డి, కారోబార్ చెంచు రాజయ్య, సీఏ పెండ్లి జనార్ధన్, అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా త్రిపురన వెంకటరత్నం పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీల ఫొటోలను పరిశీలించారు. -
‘దేశం’ గూండాగిరి
* గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తరహా దాడులు * ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలపై దారి కాచి దాడులు * గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు గాయాలు * ఎంపీటీసీలు, బంధువులను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు * నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు * నెల్లూరు జిల్లాలో కోరం ఉన్నా... కోరం లేదంటూ ఎన్నిక వాయిదా * ఓ జెడ్పీటీసీ సభ్యురాలికి ఎస్పీ బెదిరింపులు.. ఓటేయలేనని వెళ్లిపోయిన సభ్యురాలు * సీఎం పేషీ జోక్యంతో ఎన్నికలను వాయిదా వేసిన కలెక్టర్.. పరిశీలకుడి ప్రేక్షక పాత్ర * ప్రకాశం జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికకు వెళ్తున్న జెడ్పీటీసీ అరెస్టు * నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించారు. తమ పార్టీకి మెజార్టీ లేని జెడ్పీలు, ఎంపీపీలను కూడా చేజిక్కించుకోవడానికి అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులను బెదిరించి, ప్రలోభపెట్టి లోబరుచుకునే యత్నం చేస్తున్నారు. ఆటలు సాగని చోట దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్నారు. ఈ నెల 5న జరిగిన జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఆగడాలకు కొన్ని స్థానాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. వాటికి ఆదివారం తిరిగి ఎన్నికలు జరిగాయి. ఈసారి టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. అధికారులు, పోలీసులూ వారికి వత్తాసు పలికారు. దీంతో ఏకంగా భౌతిక దాడులకే టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. గుంటూరు జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలోనే వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు కాపు కాసి మరీ దాడులకు దిగాయి. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, ఎమ్మెల్యే ముస్తఫా, అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. నలుగురు ఎంపీటీసీలను, వారి బంధువులను కిడ్నాప్ చేశారు. వీరిలో ముగ్గురు మహిళా ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి తమ వాహనాల్లో పడేసి తీసుకెళ్లారు. వీరిలో ఓ ఎంపీటీసీని సమావేశ మందిరానికి తీసుకొచ్చి, తమ పార్టీ ఎంపీటీసీని అధ్యక్షురాలిని చేసుకోగలిగారు. ఆ తర్వాత ఆ ఎంపీటీసీ ఇంటికెళ్లిపోతానని చెప్పినా వినకుండా వారి వెంటనే తీసుకెళ్లారు. ఈ దాడుల వెనుక శాసన సభ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ హస్తముందన్న ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఏడుగురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను లోబరచుకోవడమే కాకుండా, ఎస్పీ చేత ఓ మహిళా జెడ్పీటీసీని బెదిరించారు. దీంతో ఆమె ఓటు వేయలేనని వెళ్లిపోయారు. అయినా సీఎం పేషీ కల్పించుకొంది. ఎస్పీ, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి ఎన్నికలనే వాయిదా వేయించింది. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు వస్తున్న ఓ జెడ్పీటీసీని పోలీసులతో అరెస్టు చేయించారు. -
ఆగని గల్లా గూండాల ఆగడాలు
నలుగురి కిడ్నాప్ చోద్యం చూస్తున్న అధికారులు చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి దౌర్జన్యాలు మితి మీరుతున్నాయి. శెట్టిపల్లిలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై స్వైరవిహారం చేసి గాయపరిచిన సంఘటన మరవకముందే మళ్లీ గల్లా గూం డాలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. చంద్రగిరి మండలం పనబాకం పంచాయతీ ఇరుగురంగయ్యగారిపల్లెలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై సోమవారం సాయంత్రం దాడులు చేశారు. కర్రలు, ఇనుపరాడ్లతో ఆటోను ధ్వంసం చేశారు. అందులో వెళుతున్న ఇద్దరిని చితకబాదారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సాయంత్రం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరుగురు గ్రామశివార్లలో మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఓ సుమోలో వచ్చిన గ్రామానికి చెందిన గల్లా అనుచరులు మురళి, ప్రేమ్‌కుమార్‌తోపాటు మరికొందరు ఆ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. మిగిలిన నలుగురిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాయపరిచి వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పక్కకు తీసుకెళ్లిన ఆ ఇద్దరు లోకేష్, చంద్రబాబులను కర్రలతో చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అక్కడే వదలి పరుగెత్తుకుంటూ అమరరాజా స్టిక్కర్ ఉన్న సుమోలో పారిపోయారు. బాధితులు ఆటోలో రుయాకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఆ నలుగురిని ఏంచేశారు? బాధితుల వివరాల మేరకు ఐ.రంగయ్యగారిపల్లికి చెందిన గల్లా అనుచరులు, వైఎస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ఉమాపతి, వెంకటేశ్, మునికృష్ణ, భానును టాటా సుమో లో కిడ్నాప్ చేశారు. వారిని అమరరాజ ఫ్యాక్టరీకే తరలించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకులను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీలో పనిచేస్తున్నారనే కారణంతో యువకులను కిడ్నాప్ చేసి, బంధించారని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. పాకాలలో ప్రచార రథంపై దాడి పాకాల మండలం కంబాలమిట్టలో ప్రచారం చేస్తున్న ప్రచార రథంపై గల్లా అనుచరులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ ఆమె అనుచరులు ప్రచార రథం డ్రైవర్ భవన్‌ను చితకబాదారు. అనుమతులు ఉన్న ప్రచార రథంలో పాటలు వేయవద్దంటూ, రథానికి ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దీనిపై పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టించుకోని అధికారులు మూడు రోజలుగా గల్లా అనుచరులు, అమరరాజ ఫ్యాక్టరీ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రచార రథాలు, కళాకారులపై దాడులు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలకు వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులపై గల్లా అరుణకుమారి తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు. అమరరాజ కంపెనీకి చెందిన వాహనాల్లో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీటిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు.