సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామిని మరో సారి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసలు శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేశారు. శైవక్షేత్రం చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. శివస్వామిని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని భక్తులు పోలీసులను నిలదీశారు.
శివస్వామి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. క్షేత్రంలో పోలీసుల్ని చూసి భక్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చేబుతారని విమర్శించారు. కాగా ఈ నెలలో శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. హిందులపై కత్తి మహేశ్ చేసిన వాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన శివస్వామిని ఈ నెల 16న హౌజ్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment