రాహుల్ గాంధీ
ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ లేదు. అయితే ఎన్నిక లకు ‘హిందుత్వ’ ఓటరుని లొంగదీసుకోవడమే ఒడుపు. ఆ పని మన రాహుల్ గాంధీ గారికి తెలిసినట్టు, చేస్తున్నట్టు మోడీగారికి తెలియదని నా ఉద్దేశం. ఈసారి ఎన్నికలు హిందుత్వానికి మతాతీతమైన సిద్ధాంతాలకీ పోటీ. ఒకరు హిందుత్వానికి ప్రతినిధి.
మరొకాయన ఇటలీ తల్లి సుపుత్రుడు. కానీ ఓటరుకి ఆయనా తాము ‘హిందుత్వా’నికి వ్యతిరేకి కాదని ఎలా నిరూపించాలి? (ఎందుకూ!) రాహుల్ గాంధీని కొట్టిపారేయడానికి వీలులేదు. వారు ఈ మధ్యనే హిందువులంతా కలలు గనే కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్లారు. (వాటికన్‌కి ఎందుకు వెళ్లి రాలేదు?) కర్ణాటక విమాన ప్రమాదం తప్పాక దేవునికి కృతజ్ఞతా సూచకంగా హిమాలయాలను ఎక్కారు. గుజరాత్‌లో ఎన్నో దేవాలయాలకు వెళ్లి, నెత్తినిండా విబూతి రాసుకుని దేవుళ్లకి మొక్కారు. మధ్య మధ్య భగవద్గీత పురాణాల గురించి తమ ప్రసంగాలలో గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారికి తమమీద ‘హిందుత్వం’ఎంతో కొంత ఆవహించిం దని నమ్మకం కుదిరింది. మొన్న ఒకానొక సభలో మోదీ గారిని ఉద్దేశించి ‘ఆయన ఏం హిందూ’ అని ఎద్దేవా చేశారు.
మోదీగారు వెనుకంజ వేసి ‘నిజమే నాకు హిందుత్వం గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. అయితే మహామహులైన మత గురువులకే హిందుత్వమంటే ఏమిటో ఈ దేశంలో అవగాహన కాలేదు. నేను కేవలం ‘కార్యకర్త’ని, రాహుల్ గాంధీ గారు కుటుంబ ‘వ్యవహర్త’ అన్నారు. తెలుగులో ఈ మాటకి ‘రుచి’ రాలేదు. నేను ‘కామ్‌దార్’ని ఆయన ‘నామ్‌దార్’ అన్నారు.అయ్యా మోదీగారూ! తరతరాల జాతి విశ్వా సాలకు కొత్త అర్థాలను వెతుకుతూ, మన పురాణా లకూ, దేవుళ్లకూ, పురాణ ఇతిహాసాలకూ కొత్త అన్వయాలను చెప్పగల మహానుభావులు తమ పార్టీలోనే ఉన్నారు.
నమూనాకు రెండు నామధే యాలు. ఉత్తర ప్రదేశ్‌లో బైరిక్ పార్లమెంట్ సభ్యు రాలు సావిత్రిబాయి పూలే ఒకరు. మరొకరు ఈ జాతికి విజ్ఞానాన్ని పంచే రచయిత.లక్నోలో ఒకానొక సభలో లక్ష్మణ్ గైక్వాడ్ అనే మరాఠీ రచయిత ఒక భాషణ చేశారు. గైక్వాడ్ అన్నారు: ‘‘రామాయణంలో హనుమంతుడు దళి తుడు. ఆయనకి ఒక తోకపెట్టి, వ్యక్తిని నల్లగా తయారుచేసి దళితుల్ని వెనుకబడినవారిగా ఉంచా లని ఈ పురాణ కవుల కుట్ర.హనుమంతుడు తన ప్రభువైన రాముడికి తన భక్తిని, విశ్వాసాన్ని చూపడానికి రొమ్ము చీల్చి చూపవలసి వచ్చింది. ఇది దళితుల ‘పీడన’కి నిదర్శనం. ప్రతీసారి ఈ విధంగా తమ ఉనికి ‘దళితులు’ నిరూపించుకోవలసి వచ్చింది.
దళితులని నిజంగా హిందువులు గౌరవిస్తున్నా రని నిరూపించదలచుకుంటే ఓ దళితుడిని– ఓ చర్మ కారుడిని– ‘శంకరాచార్య’ని చేయండి. లేదా బాలాజీ గుడిలో అర్చకుడిని చేయండి. చేయలేక పోతే ముందు దేవాలయాలను జాతీయం చెయ్యండి. ప్రపంచం ఒక పక్క అంతరిక్షంలోకి పోతుంటే సంస్కృతి, మతం పేరిట భారతదేశం వెనక్కి పోతోంది.ఈ హిందువులే దళితులను ‘వానర సేన’ అన్నారు. మేం ఎల్లకాలం ఈ వానర సేనగానే ఉండాలా? ఎప్పటికయినా ‘పాలకులం’ కావద్దా? రామాయణం కూడా ఈ మత విచక్షణనే ప్రచారం చేసింది. రాముడు– ఒక బ్రాహ్మణుడు నింద వేశా డని శూద్రుడయిన ‘శంభుకుడు’ని చంపాడు. హను మంతుడిని భక్తుడనకండి. రాముడిని దేవుడనకండి. అందరూ సమానంగా ఉండాలి’’.అయితే గైక్వాడ్ గారికి నాదొక విన్నపం. దళితుల్ని చిన్నచూపు చూసే మత పీఠాధిపతి ‘శంక రాచార్య’ పదవి మళ్లీ దళితునికి ఎందుకు? మతాన్ని దుర్వినియోగం చేసిన ఈ దిక్కుమాలిన దేవుళ్ల ఆల యాలలో మళ్లీ దళితులకి అర్చకత్వం ఎందుకు? ఈ రామాయణాన్ని రచించిన కవి కూడా ఒక దళితుడే నని వారు మరిచిపోయారా?
గైక్వాడ్‌గారూ! హిందుత్వం అంటే గుడులూ, గోపురాలూ, దేవుళ్లూ కాదు. ఒక జీవన విధానం. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురా ణాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా– మానవుని జీవన విధానాన్ని గురించే వేదం చదువుకున్న ఒక మేధావి అన్నాడు. Vedas are highly secular. Because they propound a way of life.
చిత్రం బాగులేకపోతే రంగు తప్పుకాదు.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment