Indian temples
-
భారతదేశంలో ఉన్న టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు (ఫోటోలు)
-
హనుమంతుని తోక
ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ లేదు. అయితే ఎన్నిక లకు ‘హిందుత్వ’ ఓటరుని లొంగదీసుకోవడమే ఒడుపు. ఆ పని మన రాహుల్ గాంధీ గారికి తెలిసినట్టు, చేస్తున్నట్టు మోడీగారికి తెలియదని నా ఉద్దేశం. ఈసారి ఎన్నికలు హిందుత్వానికి మతాతీతమైన సిద్ధాంతాలకీ పోటీ. ఒకరు హిందుత్వానికి ప్రతినిధి. మరొకాయన ఇటలీ తల్లి సుపుత్రుడు. కానీ ఓటరుకి ఆయనా తాము ‘హిందుత్వా’నికి వ్యతిరేకి కాదని ఎలా నిరూపించాలి? (ఎందుకూ!) రాహుల్ గాంధీని కొట్టిపారేయడానికి వీలులేదు. వారు ఈ మధ్యనే హిందువులంతా కలలు గనే కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్లారు. (వాటికన్కి ఎందుకు వెళ్లి రాలేదు?) కర్ణాటక విమాన ప్రమాదం తప్పాక దేవునికి కృతజ్ఞతా సూచకంగా హిమాలయాలను ఎక్కారు. గుజరాత్లో ఎన్నో దేవాలయాలకు వెళ్లి, నెత్తినిండా విబూతి రాసుకుని దేవుళ్లకి మొక్కారు. మధ్య మధ్య భగవద్గీత పురాణాల గురించి తమ ప్రసంగాలలో గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారికి తమమీద ‘హిందుత్వం’ఎంతో కొంత ఆవహించిం దని నమ్మకం కుదిరింది. మొన్న ఒకానొక సభలో మోదీ గారిని ఉద్దేశించి ‘ఆయన ఏం హిందూ’ అని ఎద్దేవా చేశారు. మోదీగారు వెనుకంజ వేసి ‘నిజమే నాకు హిందుత్వం గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. అయితే మహామహులైన మత గురువులకే హిందుత్వమంటే ఏమిటో ఈ దేశంలో అవగాహన కాలేదు. నేను కేవలం ‘కార్యకర్త’ని, రాహుల్ గాంధీ గారు కుటుంబ ‘వ్యవహర్త’ అన్నారు. తెలుగులో ఈ మాటకి ‘రుచి’ రాలేదు. నేను ‘కామ్దార్’ని ఆయన ‘నామ్దార్’ అన్నారు.అయ్యా మోదీగారూ! తరతరాల జాతి విశ్వా సాలకు కొత్త అర్థాలను వెతుకుతూ, మన పురాణా లకూ, దేవుళ్లకూ, పురాణ ఇతిహాసాలకూ కొత్త అన్వయాలను చెప్పగల మహానుభావులు తమ పార్టీలోనే ఉన్నారు. నమూనాకు రెండు నామధే యాలు. ఉత్తర ప్రదేశ్లో బైరిక్ పార్లమెంట్ సభ్యు రాలు సావిత్రిబాయి పూలే ఒకరు. మరొకరు ఈ జాతికి విజ్ఞానాన్ని పంచే రచయిత.లక్నోలో ఒకానొక సభలో లక్ష్మణ్ గైక్వాడ్ అనే మరాఠీ రచయిత ఒక భాషణ చేశారు. గైక్వాడ్ అన్నారు: ‘‘రామాయణంలో హనుమంతుడు దళి తుడు. ఆయనకి ఒక తోకపెట్టి, వ్యక్తిని నల్లగా తయారుచేసి దళితుల్ని వెనుకబడినవారిగా ఉంచా లని ఈ పురాణ కవుల కుట్ర.హనుమంతుడు తన ప్రభువైన రాముడికి తన భక్తిని, విశ్వాసాన్ని చూపడానికి రొమ్ము చీల్చి చూపవలసి వచ్చింది. ఇది దళితుల ‘పీడన’కి నిదర్శనం. ప్రతీసారి ఈ విధంగా తమ ఉనికి ‘దళితులు’ నిరూపించుకోవలసి వచ్చింది. దళితులని నిజంగా హిందువులు గౌరవిస్తున్నా రని నిరూపించదలచుకుంటే ఓ దళితుడిని– ఓ చర్మ కారుడిని– ‘శంకరాచార్య’ని చేయండి. లేదా బాలాజీ గుడిలో అర్చకుడిని చేయండి. చేయలేక పోతే ముందు దేవాలయాలను జాతీయం చెయ్యండి. ప్రపంచం ఒక పక్క అంతరిక్షంలోకి పోతుంటే సంస్కృతి, మతం పేరిట భారతదేశం వెనక్కి పోతోంది.ఈ హిందువులే దళితులను ‘వానర సేన’ అన్నారు. మేం ఎల్లకాలం ఈ వానర సేనగానే ఉండాలా? ఎప్పటికయినా ‘పాలకులం’ కావద్దా? రామాయణం కూడా ఈ మత విచక్షణనే ప్రచారం చేసింది. రాముడు– ఒక బ్రాహ్మణుడు నింద వేశా డని శూద్రుడయిన ‘శంభుకుడు’ని చంపాడు. హను మంతుడిని భక్తుడనకండి. రాముడిని దేవుడనకండి. అందరూ సమానంగా ఉండాలి’’.అయితే గైక్వాడ్ గారికి నాదొక విన్నపం. దళితుల్ని చిన్నచూపు చూసే మత పీఠాధిపతి ‘శంక రాచార్య’ పదవి మళ్లీ దళితునికి ఎందుకు? మతాన్ని దుర్వినియోగం చేసిన ఈ దిక్కుమాలిన దేవుళ్ల ఆల యాలలో మళ్లీ దళితులకి అర్చకత్వం ఎందుకు? ఈ రామాయణాన్ని రచించిన కవి కూడా ఒక దళితుడే నని వారు మరిచిపోయారా? గైక్వాడ్గారూ! హిందుత్వం అంటే గుడులూ, గోపురాలూ, దేవుళ్లూ కాదు. ఒక జీవన విధానం. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురా ణాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా– మానవుని జీవన విధానాన్ని గురించే వేదం చదువుకున్న ఒక మేధావి అన్నాడు. Vedas are highly secular. Because they propound a way of life. చిత్రం బాగులేకపోతే రంగు తప్పుకాదు. గొల్లపూడి మారుతీరావు -
పంచభూత స్థలాలు వాటి ప్రాముఖ్యత
భారతీయ దేవాలయాలు ప్రార్థన కోసం ఏర్పరచబడిన ప్రదేశాలు కావు. ఎప్పుడూ ఎవరూ అక్కడ ప్రార్థన చేయించరు. ఈ సంప్రదాయంలో మీకు ఎప్పుడూ చెప్పేదేమిటంటే మీరు ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ మీరు కొంచెం సేపు కూర్చోవాలి. ఎందుకంటే ఈ దేవాలయాలు శక్తి కేంద్రాలు. ఇవి పబ్లిక్ చార్జింగ్ ప్రదేశాల లాంటివి. ప్రతీరోజూ ఉదయాన్నే స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి కూర్చుని ఆ శక్తిని పొంది మిమ్మల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలని, ఆ తరువాతే ఈ ప్రపంచంలోకి సరైన ప్రకంపనలతో వెళ్ళాలని చెప్పేవారు. లింగాన్ని సృష్టించే శాస్త్రాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఉంది. కానీ గత 800-900 సంవత్సరాలుగా భక్తి ఉద్యమం దేశమంతా వ్యాపించిన తరువాత ఈ శాస్త్రం కనుమరుగైపోయింది. ఒక భక్తునికి అతని భావోద్వేగం తప్ప మరేదీ ముఖ్యం కాదు. అతని భావోద్వేగమే అతని మార్గం. ఒక భక్తుడు అతను కోరుకున్నది చేయవచ్చు. ఎందుకంటే అది తన భావోద్వేగపు బలము. అందువల్ల వారు శాస్త్రాన్ని పక్కన పెట్టి, వారికి నచ్చిన విధంగా దేవాలయాలను కట్టడం మొదలుపెట్టారు. అందువల్ల లింగాలను తయారుచేసే శాస్త్రం మరుగున పడిపోయింది. సాధారణంగా, శాస్త్రీయ ఆధారం కలిగిన లింగాలు ముక్తిని ఒక శాస్త్రీయ ప్రక్రియగా పరిగణించిన సిద్ధులు, యోగులచే సృష్టించబడినవే. అవి నిరంతర ప్రకంపనలు. సాధారణంగా అవి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట గుణాలతో మంత్రాలను ఉపయోగించి ప్రతిష్టించబడ్డాయి. దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. మీ భౌతిక శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మించబడినదే. మీరు అనుభవించే ప్రతీదానిపై వాటికి గట్టి పట్టు ఉంటుంది. వీటిని దాటి పోవడానికి యోగాలో ఉన్న మౌలికమైన సాధనే భూతశుద్ధి. ప్రతీ ధాతువుకి, దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచభూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే - నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచీపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి. మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్థన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగైపోయాయి, కానీ దేవాలయా లు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి. ప్రేమాశీస్సులతో, సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org - సద్గురు