barred
-
కోవిడ్-19 టెస్టింగ్‌లు : థైరోకేర్పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పరీక్షలకు గతంలో థైరోకేర్‌ను అనుమతించిన ఐసీఎంఆర్ ఆ ల్యాబ్ ఆరు శాంపిల్స్ విషయంలో సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో టెస్టింగ్ చేపట్టకుండా థైరోకేర్పై థానే మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. థైరోకేర్ పరిశీలించిన ఆరు కేసుల్లో పాజిటివ్ ఫలితం రాగా థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం సమకూర్చిన కిట్ల ద్వారా పరీక్షించగా రోగులకు నెగెటివ్ పలితం వచ్చింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం నుంచి శాంపిల్స్‌ను థైరోకేర్ సేకరించడాన్ని నిలుపదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి : కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా -
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌పై చర్యలు
సాక్షి, కోల్‌కతా : యువతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై వర్సిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను క్లాస్‌లు తీసుకోకుండా నిలిపివేయడంతో పాటు క్యాంపస్‌లో అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించింది. విద్యార్ధులు చేసిన ఫిర్యాదులపై వైస్ ఛాన్స్‌లర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్‌పై తీసుకున్న చర్యలను వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం హెడ్ ఓంప్రకాష్ మిశ్రా వెల్లడించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ నుంచి తొలగించాలని విద్యార్ధులు పట్టుబట్టారని మిశ్రా తెలిపారు. కన్యత్వం లేని యువతులను ఎవరూ వివాహం చేసుకోరాదని తన ఫేస్బుక్ పేజ్‌లో కనక్ సర్కార్ చేసిన పోస్ట్‌లు కలకలం రేపాయి. కన్యత్వం కలిగిన యువతిని సీల్ చేసిన బాటిల్‌తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. మరోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కనక్ సర్కార్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ డీజీపీని కోరింది. -
ముషార్రఫ్‌కు షాక్ ఇచ్చిన పాక్ సుప్రీం కోర్టు
లాహోర్ : పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు భారీ షాక్ ఇచ్చింది. అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షరుతులతో కూడిన అనుమతినిచ్చిన కోర్టు గురువారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 2013లో పెషావర్ హైకోర్టు ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ముషార్రఫ్ 2016 నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నాడు. తనపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూలై 25న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతవారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అలాగే జూన్ 13వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో ముషార్రఫ్ ఈ సారి ఎన్నికల్లో చిత్రాల్ నుంచి పోటీ చేసేందుకు దుబాయ్ నుంచే నామినేషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ముషార్రఫ్ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడంతో అతని లాయర్ మరింత సమయం ఇవాల్సిందగా కోర్టుకు అభ్యర్థించడంతో.. న్యాయమూర్తి ముషారఫ్‌కు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. అయిన కూడా ముషారఫ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వ్యతిరేక కథనం రాశాడని పాక్ కర్కశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అక్కడి ప్రజలపైనే కాదు ప్రముఖులపైనా మరోసారి తన నియంతృత్వ పోకడను నిరూపించుకుంది. సైనిక నాయకత్వానికి, పౌరులకు మధ్య చీలికలు వచ్చాయని, అభిప్రాయబేధాలు వచ్చాయని బయటపెట్టిన అక్కడి టాప్ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లొద్దని నిషేధం విధించింది. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం వల్లే పాక్ ప్రపంచంలో ఒంటరి అయ్యిందని, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ చెప్పినట్లు కూడా ఆ జర్నలిస్టు పేర్కొనడంతో ఆయనపై పరిమితులు విధించారు. సిరిల్ ఆల్మేడియా అనే వ్యక్తి పాక్ లో ప్రముఖ జర్నలిస్టు. ఆయన డాన్ పత్రికకు రిపోర్టర్ గా, కాలమిస్టుగా పనిచేస్తున్నారు. తనపై పరిమితులు విధించిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు అసలు దేశం విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశమే లేదని, అయినా ఎందుకు నిషేధం విధించారో తనకు అర్ధం కావడం లేదని, కొంత గందరగోళాన్ని కలిగించిందని అన్నారు. భారత్, అఫ్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా పాక్ ఏ విధంగా యుద్ధం నిర్వహిస్తుందో అనే విషయాన్ని డాన్ పత్రికలో తొలిపేజీలో పెద్ద కథనాన్ని ఆయన వెలువరించారు. దీంతో ఆయన పేరును పాక్ అధికారులు 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్'లో చేర్చారు. ఈ జాబితాలో ఉన్నవారంతా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు. -
ఆ అందాలభామకు చైనా నో పర్మిషన్
మిస్ కెనడా వరల్డ్ గా కిరీటం గెలిచి, మిస్ వరల్డ్ పోటీల్లో కెనడా తరపున పాల్గొనాల్సిన ఆ అందాలరాశికి ఇప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. పోటీలు మొదలవుతున్నా ఆమె మాత్రం చైనా చేరలేకపోయింది. హాంకాంగ్ నుంచి చైనా వెళ్ళేందుకు ఫ్లైట్ ఎక్కాల్సిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. చైనా ప్రభుత్వ అభ్యంతరాలే అందుకు కారణంగా తెలుస్తున్నాయి. ఈసారి మిస్ వరల్డ్ ఫైనల్స్ చైనాలో జరుగుతున్నాయి. అయితే కెనడానుంచి మిస్ వరల్డ్ గా పోటీ చేయాల్సిన అనస్తాసియా లిన్ చైనాకు వెళ్ళడానికి అక్కడి సర్కారు ఒప్పుకోవడం లేదు. ఇంతకీ లిన్ పోటీకి చైనా ప్రభుత్వ అభ్యంతరాలకు లింక్ ఏంటీ అంటే... మానవహక్కులపై ఆమె చేస్తున్న ఉద్యమమేనట. ఆమె వ్యాఖ్యలే ఆమెను అందాలపోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నాయట. చైనాలో పుట్టి పెరిగిన లిన్... పదమూడేళ్ళ వయసులో కెనడాకు వెళ్ళి అక్కడే సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటిస్తూ ఉండిపోయింది. అదీ మానవ హక్కుల ఉల్లంఘనలపైనే ఎక్కువ క్యారెక్టర్లు చేసింది. ఇప్పుడు ఆమెకు 25 ఏళ్ళు. ఎంతో శ్రమపడి కెనడా మిస్ వరల్డ్ గా గెలిచిన ఆమెకు... ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వీసా రాలేదు. కారణం... ఆమెకు ఆహ్వానం అందకపోవడమే. అయితే ఆమె ఓ కెనడియన్ టూరిస్టులా స్పెషల్ ల్యాండింగ్ వీసాతో హాంకాంగ్ మీదుగా సన్యా వెళ్ళేందుకు ప్రయత్నించినా ఎయిర్ పోర్టులో ఆమెను అడ్డుకున్నారు. మిస్ వరల్డ్ టోర్నమెంట్ డిసెంబర్ 19 న చైనాలోని సాన్యా సముద్ర తీరం రిసార్ట్ లో జరగబోతోంది. 'నన్ను తిరస్కరించడం దురదృష్టకరం. ఇది పూర్తిగా ఊహించనిది కాదు. చైనీస్ ప్రభుత్వ రాజకీయ కారణాలతో పోటీనుంచి నన్ను నిరోధిస్తున్నారు' అంటూ లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. తాను మానవ హక్కుల గురించి పోరాడటం చైనా ప్రభుత్వానికి అభ్యంతరంగా ఉంది. అందుకే తనను ఈ రకంగా శిక్షించాలని చూస్తున్నారు అంటుంది లిన్. ఏది ఏమైనా మిస్ వరల్డ్ పోటీలు చైనాలో నిర్వహించడం ఇప్పుడు లిన్ కు ఎదురు దెబ్బ అయింది. మిగిలిన దేశాలవారికి పోటీలకు వీసాలిచ్చిన చైనా లిన్ కు ఆహ్వానం కూడ పంపలేదు. చైనాలో మానవ హక్కులను ఎలా అణచివేస్తున్నారో చెప్పడానికి తన విషయంలో జరిగిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ అంటోందామె. చైనాలో ఉంటున్న తన కుటుంబానికీ వేధింపులు ఎదురౌతున్నాయని, అయినా తాను పోరాటం ఆపేది లేదని తెగేసి చెప్తోందా అందాలరాణి లిన్. -
సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ!
రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మక్కా నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులు, ఇతర చెక్ పాయింట్ల వద్ద మక్కా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్లా భారీ బందోబస్తు విధించారు. గత సంవత్సరం అనుమతి లేని 4 వేల మందిని అడ్డకున్నట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ప్రవేశిస్తే దేశ బహిష్కరణతోపాటు, పదేళ్ల నిషేధాన్ని కూడా విధిస్తామన్నారు. -
మరో 10మందిపై నిషేధం: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి మరో 10 మందిపై నిషేధాన్ని విధిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీఎస్ఈ, ఎంసీఎక్స్ఎస్ఎక్స్లతో సంప్రదింపుల తరువాత 10 మంది డిఫాల్టర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో లోయిల్ కాంటినెంటల్ ఫుడ్, లోయిల్ హెల్త్ ఫుడ్స్, మోహన్ ఇండియా, నామ్‌ధారీ ఫుడ్ ఇంటర్నేషనల్, నామధారీ రైస్ అండ్ జనరల్ మిల్స్, వైట్ వాటర్ ఫుడ్స్, శ్రీ రాధే ట్రేడింగ్, పీడీ ఆగ్రోప్రాసెసర్స్, స్వస్తిక్ ఓవర్సీస్ కార్పొరేషన్, జుగర్‌నాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపులను చేపట్టడంలో ఎన్ఎస్ఈఎల్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంలో భాగమైన సభ్యులలో ఎన్కే ప్రొటీన్స్ సంస్థ అత్యధికంగా రూ. 970 కోట్లను చెల్లించలేకపోయిందని ఎన్ఎస్ఈఎల్ పేర్కొంది. ఈ బాటలో శ్రీ రాధే ట్రేడింగ్ రూ. 34.64 కోట్లు, పీడీ ఆగ్రోప్రాసెసర్స్ రూ. 637.55 కోట్లు, స్వస్తిక్ ఓవర్సీస్ రూ. 101 కోట్లు, ఏఆర్కే ఇంపోర్ట్స్ రూ. 719.4 కోట్లు, లోటస్ రిఫైనరీస్ రూ. 252.56 కోట్లు చొప్పున బాకీ పడినట్లు వెల్లడించింది.