
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పరీక్షలకు గతంలో థైరోకేర్‌ను అనుమతించిన ఐసీఎంఆర్ ఆ ల్యాబ్ ఆరు శాంపిల్స్ విషయంలో సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో టెస్టింగ్ చేపట్టకుండా థైరోకేర్‌పై థానే మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. థైరోకేర్ పరిశీలించిన ఆరు కేసుల్లో పాజిటివ్ ఫలితం రాగా థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం సమకూర్చిన కిట్ల ద్వారా పరీక్షించగా రోగులకు నెగెటివ్ పలితం వచ్చింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం నుంచి శాంపిల్స్‌ను థైరోకేర్ సేకరించడాన్ని నిలుపదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment