లాహోర్ : పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు భారీ షాక్ ఇచ్చింది. అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షరుతులతో కూడిన అనుమతినిచ్చిన కోర్టు గురువారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 2013లో పెషావర్ హైకోర్టు ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ముషార్రఫ్ 2016 నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నాడు. తనపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూలై 25న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతవారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అలాగే జూన్ 13వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించింది.
దీంతో ముషార్రఫ్ ఈ సారి ఎన్నికల్లో చిత్రాల్ నుంచి పోటీ చేసేందుకు దుబాయ్ నుంచే నామినేషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ముషార్రఫ్ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడంతో అతని లాయర్ మరింత సమయం ఇవాల్సిందగా కోర్టుకు అభ్యర్థించడంతో.. న్యాయమూర్తి ముషారఫ్‌కు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. అయిన కూడా ముషారఫ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment