మరోసారి విజిలెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

మరోసారి విజిలెన్స్‌

Published Wed, Jun 14 2023 12:56 AM | Last Updated on Wed, Jun 14 2023 8:11 AM

- - Sakshi

రెండోసారి తనిఖీలు నిర్వహించడంపై తెలంగాణ వర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ చేపట్టిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, ఈసీ అనుమతి లేకుండా విచ్చలవిడిగా కొనుగోళ్లు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై ఆయా విభాగాల ఉద్యోగులను సుదీర్ఘంగా ప్రశ్నించారు. కాగా అధికారుల బృందం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్‌ ఆరతిలను పరిపాలనా భవనంలోకి రావాలని ఆదేశించినా వారు అందుబాటులో లేనట్లు తెలిసింది.

తెయూ (డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. తెయూ వీసీ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ గుప్తాపై అక్రమాలు, అవినీతి, నిధులు దుబారా చేశారని పాలకమండలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలిసారి ఈ నెల 6న వర్సిటీలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రామచంద్రాపురం యూనిట్‌ (ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల పర్యవేక్షణ) అదనపు ఎస్పీ ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోనే మంగళవారం రెండవసారి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం దాడులు చేసింది.

నలుగురు అధికారులు ఉదయం 11 గంటలకు తెయూ పరిపాలనాభవనం చేరుకున్నారు. అకౌంట్స్‌, ఇంజనీరింగ్‌, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌, ఏవో కార్యాలయం, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ లో సాయంత్రం 4.40 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. తొలిసారి తమ వెంట తీసుకెళ్లిన ఫైళ్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌, సీపీయూలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. తమ పరిశీలనలో తేలిన కొన్ని అంశాలపై మరింత విస్తృత సమాచారం తీసుకోవడానికి అధికారులు మరోసారి వర్సిటీకి వచ్చినట్లు సమాచారం. తెయూ వీసీ గా ప్రొఫెసర్‌ రవీందర్‌ బాధ్యతలు తీసుకున్న ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, ఈసీ అనుమతి లేకుండా విచ్చలవిడిగా కొనుగోళ్లు చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై మరోసారి ఆయా విభాగాల ఉద్యోగులను ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

వీసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, తదితర అంశాలను రికార్డు చేసుకున్నారు. సోదాల సమయంలో ఆయా విభాగాల తలుపులు మూసివేసి తనిఖీలు చేశారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్‌ ఆరతిని పరిపాలనా భవనంలోకి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయినట్లు తెలిసింది.

అకౌంట్స్‌ విభాగంలో..

అకౌంట్స్‌ విభాగంలో సూపరింటెండెంట్‌ భాస్కర్‌ను, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయాగౌడ్‌లను సుదీర్ఘంగా విచారించారు. పలు అంశాలపై అ ధికారులు ప్రశ్నలు వర్షం కురిపించా రు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతులు పొందిన రికార్డులను పరిశీలించి వివరాలు నమోదు చే సుకున్నారు. అలాగే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఇ చ్చిన పదోన్నతులు, దినసరి కూలీల పేరిట చెల్లించిన వేతనాలు వివరాలను తీసుకున్నారు. అధికారు ల ఎదుటే సాయాగౌడ్‌కు జూ.అసిస్టెంట్‌కు పదోన్నతుల విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

అకడమిక్‌ కన్సల్టెంట్లకు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి చెల్లిస్తున్న జీతాలకు సంబంధించి వివరాలు నమో దు చేసుకున్నారు. సాయంత్రం 4.40 గంటలకు తా ము సేకరించిన వివరాలతో నలుగురు అధికారులు తిరిగి వెళ్లిపోయారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీల సమయంలో వర్సిటీలో వీసీ రవీందర్‌, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ కనకయ్య అందుబాటులో లేరు. వీసీ అయితే ఈనెల 6 నుంచి పత్తాలే కుండా పోయారని, ఆయన వైఖరి వల్లే తమకు జీ తాలు రావడం లేదని అధ్యాపకులు, బోధనేతర సి బ్బంది విమర్శిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారుల సో దాలు క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement