సాక్షి, తెయూ(డిచ్‌పల్లి): చిరుత సంచరిస్తుందనే వార్తలు ఉట్టి వదంతులునేని భావించాల్సి వస్తోందని, క్యాంపస్ ఆవరణలో చిరుత ఉంటే ఇప్పటికే దాని ఆనవాళ్లు దొరికి ఉండేవని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నసీమ్ తెలిపారు. క్యాంపస్ ఆవరణలో చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనును రిజిస్ట్రార్ మంగళవారం పరిశీలించారు. బోనులో మేకను ఎరగా వేసి ఉంచినా ఎలాంటి జాడ కన్పించలేదన్నారు. చిరుత సంచరిస్తుందనే వార్తలు పుకార్లుగానే భావిస్తున్నామని, విద్యార్థులు భయాన్ని వీడి చదువుపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. మరో రోజు చూసి బోనును తీసి వేస్తామని తెలిపారు. కొందరు కావాలనే చిరుత పేరుతో పుకార్లు పుట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. చీఫ్ వార్డెన్ ఎండీ జమీల్ అహ్మద్, ఎస్టేట్ ఆఫీసర్ యాదగిరి, సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment