తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 13న జరగనున్న తొలి స్నాతకోత్సవంలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 16 మంది టాపర్లు గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. స్నాతకోత్సవాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 16 కమిటీలను నియమించి, ఒక్కో కమిటీకి ఒక్కో పనిని అప్పగించారు. దీంట్లో గోల్డ్‌మెడల్ సెలక్షన్ కమిటీ ఒకటి. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరు బ్యాచులు పూర్తయ్యాయి. అసలే నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న వర్సిటీ తరపున ప్రతి బ్యాచు టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలంటే తలకు మించిన భారమే.
దీంతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి జిల్లాకు చెందిన వివిధ రంగాల్లో పలువురు ప్రముఖులను కలిసి టాపర్లకు గోల్డ్ మెడల్స్ అందజేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. రిజిస్ట్రార్ విన్నపాన్ని మన్నించడంతో పాటు వర్సిటీ అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేయాలని సదుద్దేశంతో 15 మంది దాతలు గోల్డ్ మెడల్స్ అందజేయాలని కోరు తూ ఒక్కొక్కరు రూ.2.10లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఒక్కో దాత తమకు నచ్చిన కోర్సులో టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలని సూచించారు. అలాగే వర్సిటీ ఉన్నతాధికారులు తమ వంతుగా ఒకరికి డాక్టర్ బీఆర్ అంబేద ్కర్ మెమోరియల్ గోల్డ్‌మెడల్ పేరిట అన్ని కోర్సుల్లో కలిపి టాపర్‌గా నిలిచిన వారికి గోల్డ్ మెడల్ అందజేయాలని నిర్ణయించారు. దీంతో తొలి స్నాతకోత్సవంలో 15 కోర్సుల్లో టాపర్లతో పాటు యూనివర్సిటీ టాపర్‌కు గోల్డ్‌మెడల్ అందజేయనున్నారు. దాతలు విరాళాలు అందజేసిన కోర్సులకు సంబంధించి గోల్డ్‌మెడల్ ఇవ్వనున్న టాపర్ల జాబితాకు వర్సిటీ పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కమిటీ) అనుమతి లభించింది. వర్సిటీ ఆధ్వర్యంలో ఇ చ్చే టాపర్‌కు పాలకమండలి అనుమతి లభిం చాల్సి ఉందని రిజిస్ట్రార్ లింబాద్రి తెలిపారు.
16 మంది టాపర్లకు గోల్డ్‌మెడల్స్
Published Sat, Nov 9 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement