తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవాన్ని ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. వర్సిటీలోని తన చాంబర్‌లో శుక్రవారం రిజిస్ట్రార్ లిం బాద్రి, సీఓఈ నసీంలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మిని ట్స్ ప్రకారం తెయూ స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తామని అన్నా రు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, దేశంలోని వివిధ వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు హాజరవుతారని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరవుతున్న యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్‌కు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్)కు ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్ ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, పలు గ్రంథాలు రచించారన్నారు. యూజీసీ చైర్మన్‌గా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, వర్సిటీ ల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ అందజేశారని వివరించారు.
మినిట్స్ ప్రకారమే..
తెయూ తొలి స్నాతకోత్సవ వేడుకలను క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ సైన్స్ భవనంలో నిర్వహిస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్-1991 ప్రకారమే నిర్వహిస్తామన్నారు. మినిట్స్ టు మినిట్స్ కార్యక్రమ వివరాలు నిర్ణయించిన మేరకు జరుగుతాయన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 2006 నుంచి 2013వరకు వర్సిటీలో సుమారు ఐదువేల మంది విద్యార్థులు పీజీ కోర్సులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. 2013 వరకు ఆరు బ్యాచ్‌లు పూర్తయ్యాయన్నారు. వీరికి పాలకమండలి అనుమతి లభించిందన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు గవర్నర్ కాన్వొకేషన్(పట్టా)లు అందజేస్తారని చెప్పారు. మొత్తం 1497మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
నిబంధనలు పాటించాలి..
నవంబర్ 13న మద్యాహ్నం రెండు గంటలకు స్నాతకోత్సవ వేడుకలను గవర్నర్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభింస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని సూచించారు. విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించి రావాలని, 12గంటల లోపు వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలన్నారు. గుర్తింపుకార్డు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్నాతకోత్సవ కార్యక్రమానికి అనుమతించ బోమని రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టంచేశారు. కాన్వొకేషన్ కోసం 939మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 558 మంది బీఈడీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాన్వొకేషన్స్ అందుకునే విద్యార్థులతో డిగ్రీ విలువను కాపాడుతామని గవర్నర్ ప్రతిజ్ఞ చేయిస్తారని వీసీ తెలిపారు. స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా డీన్స్ సమావేశం నిర్వహించామన్నారు. స్నాతకోత్సవ వేడుకలను మిగతా విద్యార్థులు వీక్షిం చేందుకు కంప్యూటర్ సైన్స్ భవనం బయట ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేస్తామన్నారు.
అందరినీ గౌరవిస్తాం..
తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లాలో నెలకొల్పేందుకు కృషి చేసిన రాజకీయ పార్టీల నాయకులు, సహకరించిన మీడియా వారికీ స్నాతకోత్సవం సందర్భంగా తగిన రీతిలో గౌరవిస్తామని తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించలేదని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్నాతకోత్సవం లో పాల్గొనే విద్యార్థులందరికీ తెయూ పూర్వవిద్యార్థుల(అలుమిని) అసోసియేషన్ డెరైక్టర్ ద్వారా ఆహ్వానాలు పంపించామన్నారు.
ప్రతిష్టాత్మకంగా తెయూ స్నాతకోత్సవం
Published Sat, Nov 9 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement