Akbar Ali Khan
-
తెయూ డిగ్రీ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల ఫలితాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొపెసర్ లింబాద్రి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్లో వీసీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించిన డిగ్రీ ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఓయూ నుంచి తెయూకు అఫిలియేషన్ అనుమతి వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా తెయూ ద్వారా డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ నసీం, పరీక్షల అదనపు నియంత్రణాధికారి నాగరాజు, అసిస్టెంట్ అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ రాంబాబు, ప్రిన్సిపాల్ కనకయ్య, నాగరాజు, సాయాగౌడ్, అసిస్టెంట్ పీఆర్వో ఖవి పాల్గొన్నారు. తొలిసారి గ్రేడింగ్ విధానం.. తెయూ పరిధిలో మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఫరీక్ష ఫలితాల్లో తొలిసారి గ్రేడింగ్ పద్ధతిలో కన్సాలిడేటెడ్ మెమోలు జారీ చేస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2013-14)లో డిగ్రీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, తృతీయ సంవత్సరం పరీక్షల్లో 33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. మూడేళ్లకు సంబంధిం చి అన్ని కోర్సుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. -
తెయూ వీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు
తెయూ (డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగుసుకుంటోంది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమిం చారు. మూడు రోజుల క్రితం యూనివర్సిటీని సందర్శించిన జస్టి స్ సీవీ రాములు నియామకాలకు సంబంధించిన రికార్డులను పరి శీలించారు. వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిని ప్రశ్నించారు. కొన్ని రికార్డులను తన వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలేం జరిగింది తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, ఏడు బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012 మే 25న మూడు నోటిఫికేషన్లు వెలువడ్డా యి. 2012 అక్టోబర్-నవంబర్ నెలలో హైదరాబాద్‌లో ఇంట ర్వ్యూలు నిర్వహించారు. అర్హతలు న్న వారికి కాకుండా, అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించార ని, ముఖ్యంగా రోస్టర్ పాయింట్ పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, రద్దు చేసిన కోర్సులకు కూడా అధ్యాపకులను నియమించారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా వీసీ నియామకాలు చేపట్టారు. 54 మందికి 2013 ఫిబ్రవరి ఒకటిన నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉం డడంతో అప్పటి కలెక్టర్ క్రిస్టినా ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. ఈ అన్ని విషయాలపై విద్యార్థి సంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు గవర్నర్ నరసింహన్‌కు, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డి ప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు అకడమిక్ కన్సల్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. ద్విసభ్య కమిటీ నియామకం ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు నియామకాలను నిలిపివేయాలని 2013 ఫిబ్రవరి 15న ఆదేశించిం ది. ఆరోపణలపై విచారణకు, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావుతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వి చారణ జరిపి నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి 2013 ఏప్రిల్ 16న నివేదిక అందజేసింది. అదే సమయంలో హైకోర్టు సైతం ని యామక ప్రక్రియను నిలిపివేయాలని 2013 మార్చి 13న స్టే ఇచ్చింది. ఈ ఏడాది జనవరి మూడున హైకోర్టు స్టే ఎత్తివేసింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలిపారు. పాలకమండలి సమావేశంలో చర్చించి అనుమతి పొందాలని ఆయన సూచించారు. అయితే ఆయన ఆదేశాలను ప ట్టించుకోకుండా వీసీ, రిజిస్ట్రార్ హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి ని యామక పత్రాలు సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేశారు. మరుసటి రోజున తెల్లవారుఝామున వీరిలో 48 మంది విధులలో చేరారు. ఇప్పటివరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. వీసీని పదవి నుంచి తప్పించే అవకాశం వీసీ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ దీనిపై దష్టి సారించి మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. హైకోర్టు తీర్పుపై దష్టి సారించారు. అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం మే 14తో ముగియనుంది. ఈ లోపు విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తుది నివేదికను ఇవ్వాలని జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం కోరనుంది. ఇంత జరుగుతున్నా, తన పదవీ కా లం పూర్తయ్యేలోగా లైబ్రేరియన్లు, ఇతర బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
తెయూలో కొత్త కోర్సులకు ఆమోదం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో వర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ నేతృత్వంలో శనివారం ఐదో అకడమిక్ సెనేట్ సమావేశం నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సెనేట్ సమావేశం సుమారు మూడు గంటల పాటు హాట్ హాట్‌గా కొనసాగింది. ఎజెండా అంశాలను రిజిస్ట్రార్ సెనేట్ సభ్యులకు వివరించి చర ్చకు ఆహ్వానించారు. ఎజెండాలోని 27 అంశాలపై సెనేట్ సభ్యులు తమ సూచనలను అందించారు. కెమిస్ట్రీలో కొత్తగా మూడు కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించగా, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు.యూనివర్సిటీ లో ఇప్పటికే సైన్స్ కోర్సులు చాలానే ఉన్నాయని, పలుమార్లు కోరినా సోషల్ సెన్సైస్ కోర్సుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సైన్స్ కోర్సులతో పాటు ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కోర్సులకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన కోరారు. ఎల్ఎల్ఎల్ కోర్సులో రెండు నూతన అంశాలు చేర్చాలని, బీఎడ్, ఎంఈడీ కోర్సులు ప్రారంభించాలని, ఎంఏఎం కోర్సును ఐదేళ్ల ఎంబీ ఏ కోర్సుగా మార్చాలన్న ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భిక్కనూరు సౌత్‌క్యాంపస్‌లో ఎంఏ తెలుగు, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు సంబంధించి అదనపు విభాగాలు ప్రారంభించాలని, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సీ మాథ్స్, ఎంఫార్మసీ మొదలైన కొత్త కోర్సుల ప్రారంభించాలన్న అంశాలపై సెనెట్ సభ్యులు చర్చించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ న్యూస్ బులెటిన్ ప్రారంభించాని తీర్మానించారు. పరిశోధన, బోధన, విద్యార్థుల వసతి, పరీక్షలు ఇతర అంశాలలో అభివృద్ధికి అవసరమైన సూచనలను సెనేట్ సభ్యులు చర్చించారు. సెనేట్ సమావేశంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఎల్ఎల్ఎం విభాగంలో రెండు స్పెషలైజేషన్ కోర్సులు ప్రారంభించాలని సూచించారు. కార్పొరేట్ లా(ఎల్ఎల్ఎం), కాన్సిస్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ లా(ఎల్ఎల్ఎం) కోర్సులను భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ప్రారంభించాలని సెనేట్ ఆమోదించింది. దీంతో పాటు బీటెక్ విభాగంలో సీఎస్సీ, ఐటీ కోర్సులను ప్రారంభించాలని, అలాగే వర్సి టీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల్లో కామర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆమోదించారు. వర్సిటీ పరిధిలోని ఎల్లారెడ్డి, బిచ్కుంద, కామారెడ్డి, ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఏటా కాకుండా, శాశ్వత అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సెనేట్ సభ్యు లు తీర్మానించారు. సమావేశంలో సెనేట్ సభ్యులు, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు. -
తెయూలో నియామకాలపై విచారణ..?
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జరిగింది ఇదీ... డిచ్పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు. -
మహిళలు అభివృద్ధి సాధించాలి
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అక్బర్‌అలీఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో ‘అధికార వికేంద్రీకరణ, మహిళ సాధికారత’ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీసీ మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతూ భర్తచాటున అన్నట్లు ఉంటున్నారన్నారు. మహిళలకు కల్పిస్తున్న అవకాశాలు, రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో తమకంటూ ప్రత్యేకతను చాటాలన్నారు. సమాన హక్కులు, న్యాయం మహిళలు పొందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు సమాజసేవలో ముందుకు రావాలన్నారు. తద్వారా అవగాహన పెరిగి అభివృద్ధి సాధిస్తారన్నారు. వీరి అవకాశాలను పురుషులు అడ్డుకోకుండా చూడాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమాజ అవగాహన తప్పనిసరి అన్నారు. మహిళలకు అధికార వికేంద్రీకరణ అంటే ఏంటో పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు కల్పిస్తున్న అవకాశాలు బాగున్నాయన్నారు. ఈ సదస్సు కళాశాల యువతులు నిర్వహించడం బాగుందన్నారు. ఉపయోగిస్తేనే ప్రయోజనం.. అనంతరం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ వీసీ వీఎస్.ప్రసాద్ మాట్లాడారు. మహిళలు అభివృద్ధిని సాధించాలంటే వారిలో ఆత్మస్థైర్యం పెరగాలన్నారు. అయితేనే వారికి కల్పించిన సౌకర్యాలు, రిజర్వేషన్లు, హక్కులు సక్రమంగా వినియోగించబడి వారి అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారు పూర్తి స్థాయిలో వాటిని తమకు తామే వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. మహిళల స్థానంలో మరొకరు జోక్యం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే మహిళలు అభివృద్ధిని సాధిస్తారన్నారు. సదస్సులో వివిధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, మహిళ కళాశాల చైర్మన్ నారాయణ రెడ్డి, మహిళ సర్పంచులు, విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్, అధ్యాపకురాలు వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు వాయిదా వేయాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీ ఖాన్ మొండివైఖరిని వీడాలని, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం వర్సిటీలో పరీక్షలు బహిష్కరించారు. తర్వాత బాలుర హాస్టల్నుంచి పరిపాలన భవనం వరకు వీసీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. భవనం వద్ద బైఠాయించి వర్సిటీ అధికారులెవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా వీసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తుండడం దారుణమన్నారు. విద్యార్థుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించా రు. గతంలో పరీక్షలు బహిష్కరించాలని పిలుపునిచ్చినవారే మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరీక్షలు రాయాలని కోరడం సిగ్గు చేటన్నా రు. అలాంటి వారు క్యాంపస్‌లోకి వచ్చినప్పు డు నిలదీయాలని తోటి విద్యార్థులకు సూచిం చారు. పరీక్షలను వాయిదా వేసే వరకు బహిష్కరించడంతో పాటు అందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆందోళనలో తెయూ క్యాంపస్ విద్యార్థులతో పాటు నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కొనసాగిన నిరసనలు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పరిపాలనా భవనం వద్ద తమ నిరసన కొనసాగించారు. వసతి గృహం నుంచి వంటకాలను తెప్పించుకొని అక్కడే భోజనాలు చేసి, నిరసన తెలిపారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో రాజకీయాలు చేసే విద్యార్థులు లేరని, విద్యార్థుల తరపున పోరాటం చేసేవారే ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో సందిగ్ధత తొలగేందుకు విద్యార్థులు, ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని వారు కోరారు. ఆందోళనల్లో బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలవీర్ప్రసాద్, ఎన్ ఎస్‌యూఐ వర్సిటీ ఇన్చార్జి రమేశ్‌కుమార్, టీఆర్ఎస్వీ నాయకుడు కిషోర్‌నాయక్, టీజీవీపీ నాయకులు సంతోష్, నాగరాజు, లాల్‌సింగ్, నరేశ్‌కుమార్, చెన్నయ్య, కృష్ణ, జగన్, రాజు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు రాసింది 60 మంది తెయూ పరిధిలో బుధవారం 60 మంది పీజీ సెమిస్టర్ పరీక్షలను రాశారని వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ యాదగిరి తెలిపారు. 1,580 మంది పీజీ విద్యార్థులుండగా డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో 25 మంది, ఆర్మూర్‌లో 35 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు. వర్సిటీలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఏడుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో పాల్గొన్నారు. -
తెయూ పరువు గంగ పాలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడల వల్ల అభాసు పాలైంది. బుధవారం జరిగిన తెయూ స్నాతకోత్సవంలో అధికారుల తీరు, ఖాళీ కుర్చీలతో అతిథుల ఎదుట వర్సిటీ పరువు గంగలో కలిసిందని విద్యార్థులు, వర్సిటీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా కసరత్తు... తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు మూడు నెలలుగా వీసీ అక్బర్ అలీ ఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు కసరత్తు చేశారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు 16 కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కో పనిని అప్పచెప్పారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని తరచూ ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి మరీ ఊదర గొట్టారు. వారం క్రితం జిల్లా కేంద్రానికి టూరిస్టు బస్సు పంపి మరీ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను వర్సిటీకి పిలిపించి స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ స్నాతకోత్సవం విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల కోసం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏ కోశానా కన్పించలేదు. తమ హయాంలో తొలి స్నాతకోత్సవం జరిపిన ఖ్యాతి కోసమే కార్యక్రమం నిర్వహిం చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ రారని తెలిసినా... రాష్ట్ర గవర్నర్ రారని ముందస్తుగానే తెలిసినా, ఆయన వస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. అసలు విషయాన్ని దాచి గవర్నర్ రాకను సైతం ప్రచారానికే వాడుకున్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ లేనిపోని ఆంక్షలు విధించడం, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడకపోవడం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడలను తెలియజేస్తుంది. వర్సిటీ ఏర్పాటైన తర్వాత ఇప్ప టి వరకు పూర్తయిన ఆరు బ్యాచులకు సంబంధించి 13 మంది టాపర్లకు మాత్రమే గోల్డ్ మెడల్స్ ఇస్తామని పదే పదే ప్రకటించడం గమనార్హం. దీంతో ప్రతి బ్యాచులో టాపర్లుగా వచ్చిన వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసం తమకు వేదికపై అతిథుల చేతుల మీదుగా కాన్వకేషన్స్ ఇప్పించాలని వారు పలుమార్లు విన్నవించినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దాతలకు గౌరవమేదీ... తొలిస్నాతకోత్సవం కోసం టాపర్లకు గోల్డ్‌మెడల్స్ అందజేయాలని కోరుతూ పలువురు దాతలు ముందుకు వచ్చారు. 15 మంది దాతలు ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ కోసం రూ.2.10 లక్షలు విరాళంగా అందజేశారు. స్నాతకోత్సవం రోజు దాతలకు కనీస గౌరవం దక్కలేదు. దాతలను ఆహ్వానించే వారే కరువయ్యారు. కనీసం వర్సిటీ సంక్షేమం కోసం విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేక భోజనం అందజేయలేదు. అలాగే కాన్వకేషన్ కోసం 1497 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పేరిట విద్యార్థుల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన వారికి సైతం వేదిక మీద కాన్వకేషన్స్ ఇవ్వబోమని వర్సిటీ ఉన్నతాధికారులు చెప్పడం వారిని నిరాశకు గురిచేసింది. మంచినీళ్లు కరువు... గోల్డ్‌మెడల్ అందుకోవడానికి వివిధ జిల్లాల నుంచి హాజరైన టాపర్లకు వారి కుటుంబసభ్యులతో పాటు పలువురికి మంచినీళ్లు, భోజనం అందించే వారే కరువయ్యా రు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అన్నం పెట్టకుం డా ఆకలితో కడుపులు మాడ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు, విద్యార్థులు, మీడియా వారికి, పోలీసులు, అధ్యాపకులకు భోజనాలు ఒకే దగ్గర పెట్టడంతో దాతలు సైతం ప్లేట్ల కోసం కుస్తీ పట్టాల్సి వచ్చింది. వీసీ అక్బర్‌అలీఖాన్ తన ప్రసంగంలో కేవలం ఇద్దరు దాత పేర్లనే ప్రస్తావించి, మిగిలిన దాతలను విస్మరించడంతో దాతలకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. విద్యార్థులు గుర్తు రాలేదా... కార్యక్రమంలో సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చి అతిథుల ఎదుట వర్సిటీ పరువు పోయినట్లయింది. కుర్చీ లు నిండని స్థితిలోనైనా విద్యార్థులను ఆహ్వానిస్తే నిండుదనం కన్పించేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుత విద్యార్థుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్న భవనం పక్కనే ఒక టెంటు వేసి ఎల్సీడీ ఏర్పా టు చేశారు. అయితే అక్కడ కూర్చుని కార్యక్రమాన్ని చూ సే వారే కరువయ్యారు. స్నాతకోత్సవాన్ని మినిట్స్ టు మి నిట్స్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటనలు చేసిన అధికారులు వాటిని పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. స్నాతకోత్సవం పేరిట లక్షలు వర్సిటీ నిధులను వృథా చేశారని, కేవలం 13 మందికి గోల్డ్ మెడల్స్ అందజేయడానికి ఇంత తంతు అవసరమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రతిష్టాత్మకంగా తెయూ స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవాన్ని ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. వర్సిటీలోని తన చాంబర్లో శుక్రవారం రిజిస్ట్రార్ లిం బాద్రి, సీఓఈ నసీంలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మిని ట్స్ ప్రకారం తెయూ స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తామని అన్నా రు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, దేశంలోని వివిధ వర్సిటీల వైస్చాన్స్లర్లు హాజరవుతారని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరవుతున్న యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్‌కు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్)కు ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్ ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, పలు గ్రంథాలు రచించారన్నారు. యూజీసీ చైర్మన్‌గా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, వర్సిటీ ల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ అందజేశారని వివరించారు. మినిట్స్ ప్రకారమే.. తెయూ తొలి స్నాతకోత్సవ వేడుకలను క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ సైన్స్ భవనంలో నిర్వహిస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్-1991 ప్రకారమే నిర్వహిస్తామన్నారు. మినిట్స్ టు మినిట్స్ కార్యక్రమ వివరాలు నిర్ణయించిన మేరకు జరుగుతాయన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 2006 నుంచి 2013వరకు వర్సిటీలో సుమారు ఐదువేల మంది విద్యార్థులు పీజీ కోర్సులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. 2013 వరకు ఆరు బ్యాచ్‌లు పూర్తయ్యాయన్నారు. వీరికి పాలకమండలి అనుమతి లభించిందన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు గవర్నర్ కాన్వొకేషన్(పట్టా)లు అందజేస్తారని చెప్పారు. మొత్తం 1497మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిబంధనలు పాటించాలి.. నవంబర్ 13న మద్యాహ్నం రెండు గంటలకు స్నాతకోత్సవ వేడుకలను గవర్నర్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభింస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని సూచించారు. విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించి రావాలని, 12గంటల లోపు వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలన్నారు. గుర్తింపుకార్డు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్నాతకోత్సవ కార్యక్రమానికి అనుమతించ బోమని రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టంచేశారు. కాన్వొకేషన్ కోసం 939మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 558 మంది బీఈడీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాన్వొకేషన్స్ అందుకునే విద్యార్థులతో డిగ్రీ విలువను కాపాడుతామని గవర్నర్ ప్రతిజ్ఞ చేయిస్తారని వీసీ తెలిపారు. స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా డీన్స్ సమావేశం నిర్వహించామన్నారు. స్నాతకోత్సవ వేడుకలను మిగతా విద్యార్థులు వీక్షిం చేందుకు కంప్యూటర్ సైన్స్ భవనం బయట ఎల్సీడీ తెరలు ఏర్పాటు చేస్తామన్నారు. అందరినీ గౌరవిస్తాం.. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లాలో నెలకొల్పేందుకు కృషి చేసిన రాజకీయ పార్టీల నాయకులు, సహకరించిన మీడియా వారికీ స్నాతకోత్సవం సందర్భంగా తగిన రీతిలో గౌరవిస్తామని తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించలేదని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్నాతకోత్సవం లో పాల్గొనే విద్యార్థులందరికీ తెయూ పూర్వవిద్యార్థుల(అలుమిని) అసోసియేషన్ డెరైక్టర్ ద్వారా ఆహ్వానాలు పంపించామన్నారు. -
తెయూ వీసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అక్బర్ అలీఖాన్‌పై సోమవారం వర్సిటీ అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర మా నవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫి ర్యాదు చేశారు. హైదరాబాద్‌లో హె చ్చార్సీ చైర్మన్ కాకుమాను పెద్ద పేరిరెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసినట్లు అకడమిక్ క న్సల్టెంట్(ఏసీ) అసోసియేషన్ వర్సిటీ అధ్యక్షురాలు సుజాత తెలిపారు. ఆమె హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫో న్లో తెలిపిన వివరాలు.. తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాల్లో వీసీ అక్రమాల కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఫిబ్రవరిలో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు నియామకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంత రం ప్రభుత్వం కూడా నియామకాలను నిలిపివేస్తూ, విచారణ కోసం కమిటీని ని యమించింది. హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. అయితే వారం రోజులుగా తన పై హైకోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చే సుకోవాలని పిటిషనర్ వెంకటగిరి(ఏసీ) పై వైస్‌చాన్స్‌లర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నా రు. ఈనెల 25న వీసీ ఆయనను తన చాంబర్‌కు పిలిపించుకుని కేసు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. వెంకటగిరి బెదరకపోవడంతో వర్సిటీకి చెందిన అ సోసియేట్ ప్రొఫెసర్, ఏసీ అసోసియేష న్ మాజీ అధ్యక్షుడి ద్వారా ఆయనపై ఒ త్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఆదివా రం రాత్రి కామారెడ్డిలోని వెంకటగిరి ఇం టికి వెళ్లి మరోసారి ఒత్తిడి చేశారు. దీం తో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స భ్యులు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. వీసీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వీసీతో పాటు తన పై ఒత్తిడి తీసుకువచ్చిన వారి మాటలు సెల్ఫోన్లో రికార్డు చేశామని, వాటి సీడీలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. రక్షణ కల్పించాలని ఆదేశం.. అకడమిక్ కన్సల్టెంట్ల ఫిర్యాదుతో స్పం దించిన హెచ్చార్సీ కేసు వేసిన పిటిషనర్ వెంకటగిరికి రక్షణ కల్పించాలంటూ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఆర్డీఓతో విచారణ జరిపించి, నవంబర్ 13న నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. అ నంతరం అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర ఉ న్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రాను కలిసి వీసీ బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏసీ అసోసియేషన్ సభ్యులు జోత్స్న, ఛాయాదేవి, వసంత, మాధురి, వెంకటగిరి, శరత్‌గౌడ్, నారాయణ, సు రేశ్‌గౌడ్, మోహన్‌తోపాటు బీసీ విద్యార్థి సంఘం నాయకులు యెండల ప్రదీప్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.