తెయూ వీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు | Governor serious on Illegal recruitment | Sakshi
Sakshi News home page

తెయూ వీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు

Published Thu, May 22 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

Governor serious on Illegal recruitment

 తెయూ (డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగుసుకుంటోంది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమిం చారు. మూడు రోజుల క్రితం యూనివర్సిటీని సందర్శించిన జస్టి స్ సీవీ రాములు నియామకాలకు సంబంధించిన రికార్డులను పరి శీలించారు. వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిని ప్రశ్నించారు. కొన్ని రికార్డులను తన వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం.

 అసలేం జరిగింది
 తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, ఏడు బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012 మే 25న మూడు నోటిఫికేషన్‌లు వెలువడ్డా యి. 2012 అక్టోబర్-నవంబర్ నెలలో హైదరాబాద్‌లో ఇంట ర్వ్యూలు నిర్వహించారు. అర్హతలు న్న వారికి కాకుండా, అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించార ని, ముఖ్యంగా రోస్టర్ పాయింట్ పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, రద్దు చేసిన కోర్సులకు కూడా అధ్యాపకులను నియమించారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా వీసీ నియామకాలు చేపట్టారు. 54 మందికి 2013 ఫిబ్రవరి ఒకటిన నియామక పత్రాలు అందజేశారు.

ఆ సమయంలో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉం డడంతో అప్పటి కలెక్టర్ క్రిస్టినా ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. ఈ అన్ని విషయాలపై విద్యార్థి సంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు గవర్నర్ నరసింహన్‌కు, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డి ప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు అకడమిక్ కన్సల్టెంట్లు కోర్టును ఆశ్రయించారు.

 ద్విసభ్య కమిటీ నియామకం
 ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు నియామకాలను నిలిపివేయాలని 2013 ఫిబ్రవరి 15న ఆదేశించిం ది. ఆరోపణలపై విచారణకు, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావుతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వి చారణ జరిపి నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి 2013 ఏప్రిల్ 16న నివేదిక అందజేసింది. అదే సమయంలో హైకోర్టు సైతం ని యామక ప్రక్రియను నిలిపివేయాలని 2013 మార్చి 13న స్టే ఇచ్చింది.

ఈ ఏడాది జనవరి మూడున హైకోర్టు స్టే ఎత్తివేసింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలిపారు. పాలకమండలి సమావేశంలో చర్చించి అనుమతి పొందాలని ఆయన సూచించారు. అయితే ఆయన ఆదేశాలను ప ట్టించుకోకుండా వీసీ, రిజిస్ట్రార్ హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి ని యామక పత్రాలు సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేశారు. మరుసటి రోజున తెల్లవారుఝామున వీరిలో 48 మంది విధులలో చేరారు. ఇప్పటివరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు.

 వీసీని పదవి నుంచి తప్పించే అవకాశం
 వీసీ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ దీనిపై దష్టి సారించి మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. హైకోర్టు తీర్పుపై దష్టి సారించారు. అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం మే 14తో ముగియనుంది. ఈ లోపు విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తుది నివేదికను ఇవ్వాలని జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం కోరనుంది. ఇంత జరుగుతున్నా, తన పదవీ కా లం పూర్తయ్యేలోగా లైబ్రేరియన్లు, ఇతర బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement