తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అక్బర్ అలీఖాన్‌పై సోమవారం వర్సిటీ అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర మా నవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫి ర్యాదు చేశారు. హైదరాబాద్‌లో హె చ్చార్సీ చైర్మన్ కాకుమాను పెద్ద పేరిరెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసినట్లు అకడమిక్ క న్సల్టెంట్(ఏసీ) అసోసియేషన్ వర్సిటీ అధ్యక్షురాలు సుజాత తెలిపారు. ఆమె హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫో న్‌లో తెలిపిన వివరాలు.. తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాల్లో వీసీ అక్రమాల కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఫిబ్రవరిలో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు నియామకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంత రం ప్రభుత్వం కూడా నియామకాలను నిలిపివేస్తూ, విచారణ కోసం కమిటీని ని యమించింది. హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది.
అయితే వారం రోజులుగా తన పై హైకోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చే సుకోవాలని పిటిషనర్ వెంకటగిరి(ఏసీ) పై వైస్‌చాన్స్‌లర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నా రు. ఈనెల 25న వీసీ ఆయనను తన చాంబర్‌కు పిలిపించుకుని కేసు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. వెంకటగిరి బెదరకపోవడంతో వర్సిటీకి చెందిన అ సోసియేట్ ప్రొఫెసర్, ఏసీ అసోసియేష న్ మాజీ అధ్యక్షుడి ద్వారా ఆయనపై ఒ త్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఆదివా రం రాత్రి కామారెడ్డిలోని వెంకటగిరి ఇం టికి వెళ్లి మరోసారి ఒత్తిడి చేశారు. దీం తో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స భ్యులు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. వీసీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వీసీతో పాటు తన పై ఒత్తిడి తీసుకువచ్చిన వారి మాటలు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశామని, వాటి సీడీలను ఫిర్యాదుతో పాటు అందజేశారు.
రక్షణ కల్పించాలని ఆదేశం..
అకడమిక్ కన్సల్టెంట్ల ఫిర్యాదుతో స్పం దించిన హెచ్చార్సీ కేసు వేసిన పిటిషనర్ వెంకటగిరికి రక్షణ కల్పించాలంటూ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఆర్డీఓతో విచారణ జరిపించి, నవంబర్ 13న నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. అ నంతరం అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర ఉ న్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రాను కలిసి వీసీ బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏసీ అసోసియేషన్ సభ్యులు జోత్స్న, ఛాయాదేవి, వసంత, మాధురి, వెంకటగిరి, శరత్‌గౌడ్, నారాయణ, సు రేశ్‌గౌడ్, మోహన్‌తోపాటు బీసీ విద్యార్థి సంఘం నాయకులు యెండల ప్రదీప్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
తెయూ వీసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
Published Tue, Oct 29 2013 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement