ఎంజీయూ (నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ కోర్సుకు ఫ్యాకల్టీని నియమిం చాలని, ల్యాబ్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవా రం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించి విద్యాబోధన చేస్తుండగా ఎంజీయూలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో విద్యాబోధన చేయించడం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. 80 శాతం ఫార్మ సిలబస్‌ను బోధించే వారు లేకపోవడంతో 150 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం గా మారిందని అన్నారు. పూర్తిస్థాయి లో అధ్యాపకులను నియమించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షలో శివ, సోహెబ్, రాజు, నితిన్, దినేశ్, వెంకట్ పాల్గొన్నారు.
నేడు ఎంజీయూ బంద్
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మాసూటికల్ విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా గురువారం ఆ వర్సిటీ బంద్‌కు ఎంజీయూ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఆ సమితి ప్రకటన విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ కోర్సుకు ఫ్యాకల్టీని నియమించాలని, ప్రయోగశాల వసతి కల్పించాలని డిమాండ్ చేసింది. బోధన సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరింది.
ఎంజీయూలో ఫార్మా విద్యార్థుల నిరవధిక దీక్ష
Published Thu, Sep 5 2013 5:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement