కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్‌వాడీ టీ చర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు దేవగంగు, స్వర్ణ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్రం చాలా కీలకమన్నారు.
మాతా, శిశు మరణాలు త గ్గించడం, ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు చేయించడానికి టీచ ర్లు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే అంగన్‌వాడీల ను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడం ఐసీడీఎస్‌కు రక్షణ లేకుండా చేస్తుందన్నారు.
ఇప్పటికే కనీస వేతనాలు లేక ఇబ్బం దులు పడుతున్నామని, ఉద్యోగ భద్రత కూడా లేదన్నారు. పె న్షన్ సౌకర్యం కల్పించి టీచర్లకు పదవీ విరమణ తరువాత కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలువాలన్నారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు నూర్జహన్, రమేవ్‌బాబు, గంగాధర్, అంగన్‌వాడీ టీచర్ల సంఘం నాయకులు వసంత, రాజ సులోచన, సూర్యకళ, వాణి, భారతి, గోదావరి, జరీనా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment