
సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్ రీవర్స్ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఏకంగా ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో చేటుచేసుకుంది. ఓ యువకుడు తనను మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. తనను ప్రేమించిందని పేర్కొంటూ.. ఆమెతో దిగిన ఫొటోలు అందరికీ చూపించాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు.
Comments
Please login to add a commentAdd a comment