girlfriend house
-
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు ధర్నా
సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్ రీవర్స్ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఏకంగా ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో చేటుచేసుకుంది. ఓ యువకుడు తనను మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. తనను ప్రేమించిందని పేర్కొంటూ.. ఆమెతో దిగిన ఫొటోలు అందరికీ చూపించాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. -
ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు
అహ్మదాబాద్: తనపై అత్యాచారం కేసు పెట్టిన ప్రియురాలిపై పగతీర్చుకునేందుకు పథకం పన్నిన ఓ ప్రియుడు.. కథం అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయాడు. ఆమెను అరెస్ట్ చేయించాలని కుట్ర పన్ని చివరకు తానే అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. వెజల్పూర్కు చెందిన దినేశ్ ప్రజాపతి అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. పెళ్లి చేసుకోకుండా సంబంధం కొనసాగిస్తామని కోరగా, ఆమె నిరాకరించింది. ఆ యువతి దినేశ్‌పై అత్యాచారం కేసు పెట్టింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన దినేశ్.. ప్రియురాలి ఇంట్లో ఆమెకు తెలియకుండా 3 లక్షల రూపాయల విలువైన 580 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలను ఉంచాడు. తర్వాత ఇన్ఫార్మర్ పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందించాడు. అధికారులు యువతి ఇంటిని సోదా చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆ యువతి చెప్పింది. దినేశ్‌పై తాను అత్యాచారం కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించింది. అధికారులు ఆరా తీయగా, ఇద్దరికి రిలేషన్ ఉన్నట్టు తేలింది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని దినేశ్ ఆ యువతికి చెప్పాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. వివాహం చేసుకోకుండా సంబంధం కొనసాగిద్దామని అతను చెప్పగా, ఆమె అతనిపై రేప్ కేసు పెట్టింది. అధికారులు దినేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఇంట్లో రహస్యంగా మత్తుపదార్థాలు ఉంచినట్టు అంగీకరించాడు. ఎన్సీబీ అధికారులు దినేశ్‌ను అరెస్ట్ చేశారు. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
లంగర్‌హౌస్: ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లంగర్‌హౌస్ ఎస్సై శశిధర్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన పిచ్చయ్య(42) గుడిమల్కాపూర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటూ మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద కూలీ పనిచేసే లంగర్‌హౌస్ కనకదుర్గా కాలనీకి చెందిన యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగిన పిచ్చయ్య యాదమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరూ రెండు గంటల పాటు గొడవపడ్డారు. యాదమ్మ ఆదివారం రాత్రి పిచ్చయ్య తన ఇంట్లో ఉండగానే పరుగు పరుగున లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు యాదమ్మ ఇంటికి వెళ్లగా.. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా యాదయ్య తలుపు తీయకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. చీరతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న యాదయ్యను సమీపంలోనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డబ్బుల విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలు మోసగించిందని ప్రియుడి వీరంగం
తనను ప్రేమించిన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ మండల కేంద్రమైన తాండూరులో గురువారం ఓ యువకుడు కొద్దిసేపు వీరంగం వేశాడు. సదరు యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన ఎం.అరుణ్‌కుమార్ తిర్యాణికి చెందిన యువతితో కరీంనగర్లో ప్రేమాయణం కొనసాగించాడు. సదరు యువతి కరీంనగర్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఆ యువతి తన స్వగ్రామానికి వచ్చి రెండ్రోజుల క్రితం మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్ ఆ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నావంటే తాను నమ్మడం లేదని పేర్కొన్నాడు. తాండూర్ ఐబీకి వస్తే తన భర్తను చూపిస్తానని ఆ యువతి చెప్పింది. దీంతో గురువారం సాయంత్రం భర్తతో కలిసి వచ్చిన ఆ యువతితో అరుణ్‌కుమార్ గొడవకు దిగాడు. తనను మోసగించవద్దని, పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపు అరుణ్‌కుమార్ తాండూర్‌లో హల్చల్ చేశాడు. తనకు ఆ యువతే కావాలంటూ కనిపించిన వారికల్లా తన ప్రేమ కథ చెప్పడంతో జనం భారీగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న తాండూర్ అదనపు ఎస్సై రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకుని అరుణ్‌కుమార్‌తో మాట్లాడారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.