ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు | Man held for planting charas at his girlfriend’s house | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు

Published Fri, Jan 27 2017 4:51 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు - Sakshi

ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు

అహ్మదాబాద్: తనపై అత‍్యాచారం కేసు పెట్టిన ప్రియురాలిపై పగతీర్చుకునేందుకు పథకం పన్నిన ఓ ప్రియుడు.. కథం అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయాడు. ఆమెను అరెస్ట్ చేయించాలని కుట్ర పన్ని చివరకు తానే అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది.

వెజల్పూర్కు చెందిన దినేశ్ ప్రజాపతి అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. పెళ్లి చేసుకోకుండా సంబంధం కొనసాగిస్తామని కోరగా, ఆమె నిరాకరించింది. ఆ యువతి దినేశ్‌పై అత్యాచారం కేసు పెట్టింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన దినేశ్‌.. ప్రియురాలి ఇంట్లో ఆమెకు తెలియకుండా 3 లక్షల రూపాయల విలువైన 580 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలను ఉంచాడు. తర్వాత ఇన్ఫార్మర్ పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరోకు సమాచారం అందించాడు. అధికారులు యువతి ఇంటిని సోదా చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆ యువతి చెప్పింది. దినేశ్పై తాను అ‍త్యాచారం కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించింది.

అధికారులు ఆరా తీయగా, ఇద్దరికి రిలేషన్ ఉన్నట్టు తేలింది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని దినేశ్ ఆ యువతికి చెప్పాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. వివాహం చేసుకోకుండా సంబంధం కొనసాగిద్దామని అతను చెప్పగా, ఆమె అతనిపై రేప్ కేసు పెట్టింది. అధికారులు దినేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఇంట్లో రహస్యంగా మత్తుపదార్థాలు ఉంచినట్టు అంగీకరించాడు. ఎన్సీబీ అధికారులు దినేశ్ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement