ప్రియురాలు మోసగించిందని ప్రియుడి వీరంగం | Lover halchal at tandur main road in karimnagar district | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మోసగించిందని ప్రియుడి వీరంగం

Published Fri, May 2 2014 9:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

అరుణ్ కుమార్తో మాట్లాడుతున్న ఎస్సై రాజేంద్రకుమార్

అరుణ్ కుమార్తో మాట్లాడుతున్న ఎస్సై రాజేంద్రకుమార్

తనను ప్రేమించిన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ మండల కేంద్రమైన తాండూరులో గురువారం ఓ యువకుడు కొద్దిసేపు వీరంగం వేశాడు. సదరు యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన ఎం.అరుణ్‌కుమార్ తిర్యాణికి చెందిన యువతితో కరీంనగర్‌లో ప్రేమాయణం కొనసాగించాడు. సదరు యువతి కరీంనగర్‌లో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.
 
 ఈ క్రమంలో ఆ యువతి తన స్వగ్రామానికి వచ్చి రెండ్రోజుల క్రితం మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్ ఆ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నావంటే తాను నమ్మడం లేదని పేర్కొన్నాడు. తాండూర్ ఐబీకి వస్తే తన భర్తను చూపిస్తానని ఆ యువతి చెప్పింది. దీంతో గురువారం సాయంత్రం భర్తతో కలిసి వచ్చిన ఆ యువతితో అరుణ్‌కుమార్ గొడవకు దిగాడు. తనను మోసగించవద్దని, పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 
ఆ తర్వాత కొద్దిసేపు అరుణ్‌కుమార్ తాండూర్‌లో హల్‌చల్ చేశాడు. తనకు ఆ యువతే కావాలంటూ కనిపించిన వారికల్లా తన ప్రేమ కథ చెప్పడంతో జనం భారీగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న తాండూర్ అదనపు ఎస్సై రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకుని అరుణ్‌కుమార్‌తో మాట్లాడారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement