‘మొండితోక’ సోదరులపై కక్ష సాధింపు | TDP Govt Latest Illegal Cases Against YSRCP Leaders: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘మొండితోక’ సోదరులపై కక్ష సాధింపు

Published Tue, Nov 26 2024 6:10 AM | Last Updated on Tue, Nov 26 2024 6:10 AM

 TDP Govt Latest Illegal Cases Against YSRCP Leaders: Andhra Pradesh

గతంలోనే బెడిసికొట్టిన బాబు ‘రాళ్ల దాడి’ పన్నాగం

అది కట్టుకథేనని ఆనాడే దర్యాప్తులో వెల్లడి

అయినా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ సర్కారు తాజాగా అక్రమ కేసులు

కొత్త సెక్షన్లు నమోదుచేసి నలుగురు అరెస్టు

వీరికి కోర్టులో సెల్ఫ్‌ బెయిల్‌ లభ్యం 

అయినా ‘మొండితోక’ సోదరులపై ఉచ్చు అంటూ పోలీసుల లీకులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీ­డియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డా­క్ట­ర్‌ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరు­డు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ నిత్యం ప్ర­భు­త్వ అక్రమా­లను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమా­ర్‌ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీని­ని జీ­ర్ణిం­చుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నా­రు. దీంతో..  2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దా­డి జరిగిందంటూ అ­ప్పట్లో నానా హంగామా చేశా­రు.

కానీ, అది వర్కవు­ట్‌ కాలేదు. రెడ్‌బుక్‌ రా­జ్యాంగంలో భాగంగా తా­జా­గా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గ­తంలో నమోదుచేసిన సెక్షన్‌–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలు­గురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కో­ర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీ­రును తప్పుపడుతూ సెల్ఫ్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మ­రిన్ని అరెస్టులు ఉంటాయని, మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అది కట్టు కథే.. అప్పుడే బట్టబయలు
నిజానికి.. అప్పట్లో చంద్రబాబు పర్యటన అంతా పక్కాగా ప్రణాళికతో నిర్వహించారు. నా­డు నందిగామలో రోడ్డుషో జరుగుతున్న దారి­లో ఆయన భద్రతాధికారిపై ఎవరో రాయి వి­సిరారని రాద్ధాంతం చేశారు. ఇంతలో మధు­బాబు అనే వ్యక్తి తనకు గాయమైందంటూ చంద్ర­బాబు వద్దకు రావడం, ఆ వెంటనే  దాడి జరిగిందని చంద్రబాబు ప్రక­టించడం జరిగిపోయింది. అయితే, పోలీ­సుల దర్యాప్తు­లో ఎ­లాంటి ఆధారాలు లభించలేదు. పైగా.. బాధితుడు దాడిపై కాలయా­పన చేసి రెండో­రోజు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్‌ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాలేదు. మధుబాబుకు గాయ­మైందని చెబు­తు­న్న గడ్డం ప్రాంతంలో వాపు­లేదని ప్రాథ­మి­కంగా నిర్ధారించారు. అలాగే, కెమెరా ఫుటేజీ, డ్రోన్‌ విజువల్స్‌లో ఎక్కడా దాడి జరిగిన ఆనవాళ్లు కని­పించలేదు. దీంతో చంద్రబాబు ఆరోపణ అవాస్తవమని తేలిపోయింది. అయి­నా ఇప్పు­డు మొండితోక సోదరులు, వైఎస్సా­ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు కోసం, నాటి సంఘటనను మళ్లీ ఉప­యోగించుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement