సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలో అధిక పెన్షన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు.. అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వడంతోపాటు దరఖాస్తు నింపాలి. ఇందుకు ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లో లింకును అందుబాటులోకి తెచ్చింది.
2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారు, ప్రస్తుతం సర్వీసులో ఉండి అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు జాయింట్ ఆప్షన్ ఇవ్వాలి. వీరు మే నెల 3 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు గడువు విధించింది. అయితే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలుండి ఆప్షన్ ఇచ్చి ఈపీఎఫ్‌ఓ ద్వారా తిరస్కరణకు గురైన వారు మాత్రం మార్చి 3లోపు జాయింట్ ఆప్షన్‌తోపాటు వివరాలు సమర్పించాలి. కాగా, అర్హులు ఎవరైనా జాయింట్ ఆప్షన్‌ను ఇవ్వకుంటే భవిష్యత్తులో అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
సర్వర్ సతాయింపు
ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లో అధిక పెన్షన్ లింకును ఎక్కువ మంది ఓపెన్ చేస్తున్నారు. దీంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. సాధారణ సమయంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్... తాజాగా అధిక పెన్షన్‌కు సంబంధించిన ఒత్తిడి పెరగడంతో స్తంభించిపోతోంది. వెబ్‌సైట్‌లో పేజీ తెరిచి ఆప్షన్ నమోదు లింకు, దరఖాస్తు లింకును క్లిక్‌చేస్తోంటే చాలామందికి ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీంతో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలున్న వారికి ఈ సాంకేతిక సమస్య గుబులు పుట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment