ప్రాణాలు తీసిన ప్రచార ఆర్భాటం  | Elderly Man With Heart Attack West Godavari | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన ప్రచార ఆర్భాటం 

Published Sun, Feb 3 2019 12:40 PM | Last Updated on Sun, Feb 3 2019 12:40 PM

Elderly Man With Heart Attack West Godavari - Sakshi

మంచిలి పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్‌ కోసం పడిగాపులు పడుతున్న వృద్ధులు, కర్రి వెంకటరెడ్డి (ఫైల్‌)

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం తాయిలాల పర్వానికి శ్రీకారం చుట్టింది.. నాలుగున్నరేళ్ల పాటు సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు ఎన్నికలు సమీపిస్తుండటంతో పింఛన్‌ల రెట్టింపు పేరిట మరో మాయోపాయానికి తెరదీశారు.. పింఛన్‌ల పంపిణీని ఎన్నికల స్టంట్‌గా వాడుకుని ప్రచార ఆర్భాటంగా నిర్వహించిన సభలు జిల్లాలో ఇద్దరు వృద్ధుల ప్రాణాలు తీశాయి. అత్తిలి మండలం మంచిలిలో ఓ వృద్ధుడు గుండెపోటుతో సభా ప్రాంగణంలోనే కన్నుమూయగా.. తాడేపల్లిగూడెంలో మరో వృద్ధుడు సొమ్మసిల్లి ఆస్పత్రికి తీసుకువెళుతుండగా తుదిశ్వాస విడిచాడు. ఇవి ప్రభుత్వ హత్యలని.. టీడీపీ అధికార దాహానికి నిదర్శనమని పలువురు బహిరంగంగానే విమర్శించారు.

అత్తిలి: రెట్టింపు పింఛన్‌ తీసుకుందామని ఎంతో ఆనందంగా ఇంటి నుంచి పంచాయతీకి వెళ్లిన వృ ద్ధుడు కర్రి వెంకటరెడ్డి (75) విగతజీవిగా తిరి గిరావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో ముని గిపోయింది. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెంచిన పింఛన్, పసుపు–కుంకుమ సొమ్ముల పంపిణీ కార్యక్రమం శనివారం మంచిలి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జరిగింది.

గ్రామంలో డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులంతా తప్పక హాజరుకావాలని పంచాయతీ అధికారులు టాంటాం వేయడంతో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఉదయం 7 గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పంచాయతీ సిబ్బంది పింఛన్‌ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలు తీసుకున్నారు. సాయంత్రం ఎమ్మె ల్యే చేతులమీదుగా పింఛన్‌ సొమ్ము అందజేస్తామని చెప్పడంతో కొందరు వెళ్లిపోగా..  మరికొందరు వృద్ధులు అక్కడే ఉండిపోయారు.

ఈక్రమంలో గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి అనే వృద్ధుడు లెప్రసీతో బాధపడుతూ ఇంటికి నడిచి వెళ్లలేక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌లో ఉండిపోయాడు. ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు వచ్చి కుర్చీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పంచాయతీ అధికారులు వెంకటరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం తెలపడంతో ఇక్కడకు వచ్చి చికిత్స నిమిత్తం పీఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. పింఛన్‌ కోసం వె ళ్లిన కుటుంబ యజమాని ఇలా విగతజీవిగా రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి.

పింఛన్‌ కోసం వెళ్లిన వెంటనే నగదు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని వారు వాపోయారు. కొద్దిసేపటికి పంచాయతీ సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి మృతుని కుమారుడు సతీష్‌రెడ్డికి పింఛన్‌ సొమ్ము రూ.3 వేలు అందజేశారు. ప్రచార ఆర్భాటంతో ఎమ్మెల్యే హాజరయ్యే సమావేశానికి  జనసమీకరణ కోసం ఇలా వృద్ధులు, వికలాంగులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీ నిపై పంచాయతీ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ను వివరణ కోరగా పింఛన్‌ కోసం వెంకటరెడ్డి ఉదయమే వచ్చాడని, వేలిముద్రలు తీసుకుని పింఛన్‌ సొ మ్ములు ఇచ్చేశామని, అయితే అతను అక్కడే కూర్చుండిపోయాడని చెప్పారు. 

నిరీక్షించి.. నీరసించి.. 

తాడేపల్లిగూడెం: వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చే కార్యక్రమాలను పండుగలా చేయాలి.. చంద్రన్న క్షీరాభిషేకాలు చేయాలి.. వెల్లువలా జనం తరలిరావాలి.. గంటలకు గంటలు ప్రసంగాలు వినాలి.. అనే ప్రభుత్వ ఆర్భాటానికి ఓ పండుటాకు రాలిపోయింది. పింఛన్‌ తీసుకోవడానికి వచ్చి గంటల తరబడి వేచి ఉన్న ఓ వృద్ధుడు ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో కన్నుమూసిన ఘటన శనివారం తాడేపల్లిగూడెం మూడో వార్డులో చోటుచేసుకుంది. పట్టణంలోని మూడో వార్డుకు చెందిన గొర్ల కొండయ్య (80) వృద్ధాప్య పింఛన్‌ తీసుకోవడానికి ఉదయం 9 గంటలకు పింఛన్‌ పంపిణీ చేసే ప్రాంతం ( 2వ వార్డులోని యర్రా నారాయణస్వామి మున్సిపల్‌ స్కూల్‌) చేరుకున్నాడు.

మధ్యాహ్నం 12 గంటల వరకు నిరీక్షించిన అతడు నీరసించి సొ మ్మసిల్లి పడిపోయాడు. అక్కడ ఉన్నవారు నీళ్లు ఇచ్చి లేపగా కొద్దిసేపు అక్కడే కూర్చుని పింఛన్‌ సొమ్ములు తీసుకున్నాడు. అతడి మూడో కుమారుడు వచ్చి ఇంటికి నడిపించుకుని తీసుకువెళుతుండగా కోతి బొమ్మ సెంటర్‌ వద్ద కొండయ్య కాళ్లు పట్టేసి పడిపోయాడు. దీంతో కొండయ్యను ఏరియా ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ప్రచార ఆర్భాటంతో పింఛన్‌ సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల  కొండయ్య కన్నుమూశాడని పలువురు విమర్శించారు. అధికారులు మాత్రం ఈ విషయం తమ దృష్టికి రాలేదని, దర్యాప్తు చేస్తామని అంటున్నారు.  

పింఛన్‌ కోసం ఉదయమే వెళ్లాడు
ఈ ఒక్కరోజే పింఛన్‌ ఇస్తామని చెప్పడంతో నాన్న ఉదయమే టిఫిన్‌ తిని పంచాయతీకి వెళ్లా డు. అక్కడ వేలిముద్రలు తీసుకున్నారు. పింఛన్‌ సొమ్మును మీ టింగ్‌లో ఇస్తామని చెప్పడంతో అక్కడే కూ ర్చుండిపోయి, అస్వస్థతకు గురై మృతి చెందాడు. వెళ్లిన వెంటనే పింఛన్‌ సొమ్ము ఇచ్చి ఉంటే ఇంటికి చేరేవాడు. పంచాయతీ సిబ్బంది ఇంటికి వచ్చి పింఛన్‌ సొమ్ము ఇచ్చి వెళ్లిపోయారు. నేను కూలి పనులు చేసుకుంటూ, నాతల్లి పార్వతి పూతరేకులు తయా రుచేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మాకు దిక్కేవరు. – కర్రి సతీష్‌రెడ్డి, మృతుని కుమారుడు
ఇది ప్రభుత్వ హత్యే


పింఛన్‌ కోసం వచ్చిన వృద్ధుడి వేలిముద్రలు తీసుకున్నాక నగదు ఇ వ్వకుండా మీటింగ్‌ వర కు వేచి ఉండమనడం దారుణం. ప్రచార ఆ ర్భాటం కోసం ఎమ్మెల్యే వచ్చే వరకు గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు, మహిళలను వేచి ఉంచడం దుర్మార్గం. పింఛన్‌ కోసం వెళ్లిన వెంకటరెడ్డికి సకాలంలో నగదు ఇచ్చి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునేవాడు. ఇది ప్రభుత్వ హత్యే.– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ తణుకు సమన్వయకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement