ఏలూరులో జిల్లాపరిషత్ ప్రధాన ద్వారం పసుపుమయం, ఏలూరులో జెడ్పీ షాపింగ్ మాల్‌కు ఏర్పాటు చేసిన బోర్డు
ఏలూరు (టూటౌన్): అధికారం తమదే అన్న ధీమాతో ప్రజాధనంతో చేపట్టిన ప్రతి పనికీ అధికార పార్టీ నాయకులు తమ పార్టీ రంగులు వేసేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు తమ నాయకుల పేర్లు పెట్టి స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో గతంలో మొదలుపెట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ వాటికి తమ పార్టీ రంగులను అద్దేస్తున్నారు. ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసేస్తున్నారు. ఇది ఏదో మారుమూల గ్రామంలో జరిగి తంతు కాదు. జిల్లా కేంద్రం ఏలూరులో ‘పచ్చ’ పైత్యం ఆకాశాన్ని అంటడంతో ప్రజలు విస్తుపోతున్నారు.
అంతా పసుపు మయం
ఏలూరు జెడ్పీ కార్యాలయం మెయిన్ రోడ్డు నుంచి వెనుక కలెక్టరేట్ రోడ్డు వరకూ విస్తరించి ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాపరిషత్ ఆవరణలోని పాత బిల్డింగ్‌లను తొలగించి ఆ ప్రాంతంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేపట్టి పూర్తిచేశారు. పనిలో పనిగా కాంప్లెక్స్‌కు ఆనుకుని మెయిన్‌రోడ్డు వైపు, కలెక్టరేట్ వైపు ఉన్న ప్రవేశ ద్వారాలకు రంగులు అద్దారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అయితే మొత్తం ప్రవేశ ద్వారాలకు తెలుగుదేశం పార్టీ రంగు పసుపుతో నింపేశారు. పైన మొక్కుబడిగా ఎరుపు రంగు చారలు వేశారు. నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లకు పైన బోర్డులను సైతం పసుపు రంగుతోనే ఏర్పాటుచేశారు. అధికారులు సైతం ఇంతలా తమ స్వామి భక్తిని చాటాలా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్‌కు చంద్రబాబు పేరు
సాధారణంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు దేశ నాయకులు, ప్రముఖులు, దివంగతులైన నేతలు పేర్లు పెట్టడం పరిపాటి. అయితే ఏ లూరు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన షా పింగ్ కాంప్లెక్స్‌కు సీఎం చంద్రబాబు పేరును పె ట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టినా బాగుండేదని, సీఎం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఇలా చేశారనే వాదనలు ఉన్నాయి. జిల్లాపరిషత్‌కు చెం దిన ఓ ప్రజాప్రతినిధి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని, దీంతో ఇలా స్వామి భక్తిని చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment