public funds
-
నాడెప్ కుండీలతో నిధుల గల్లంతు..!
అధికారం ఉంది... అడిగేవారు ఎవ్వరన్న ధైర్యంతో గత టీడీపీ పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నాడెప్ కుండీల నిర్మాణాల పేరుతో రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు కాజేశారు. సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యాన్ని మరుగునపడేశారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేశామంటూ ప్రచారం చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు నిరుపయోగంగా మారిన నాడెప్ కుండీలు కనిపించడం లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. లక్కవరపుకోట: జిల్లాలోని పలు గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన నాడెప్ కుండీలు నిరుపయోగంగా మారాయి. ఉపాధి హామీ పథకం నిధులు రూ.కోట్లు ఖర్చుచేసినా పైసా ప్రయోజనం కలగలేదు. ఎక్కడా కిలో సేంద్రియ ఎరువు కూడా తయారు కాలే దు. టీడీపీ కార్యకర్తలకే కుండీలను మంజూరు చేసి నిధులను కైంకర్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని కుండీలు నిధుల దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యంగా మారాయి. అయ్యవారు టార్గెట్ ఇచ్చారు.. మనం నిర్మించేద్దామనే క్రమంలో ఒక్కో గ్రామంలో ఒకే చోట నాలుగు నుంచి ఎనిమిది కుండీలను నిర్మించారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేయాలని.. మంచి విజన్ ఉన్న నాయుకుడినంటూ చెప్పుకున్న చంద్రబాబుకు ఈ వృథా ఖర్చులు కనిపించలేదా అంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాల చేశారంటూ మండిపడుతున్నారు. నిర్మాణాల తీరు ఇలా... జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 33, 256 నాడెప్ కుండీల నిర్మాణానికి రూ. రూ.35కోట్ల72 లక్షల41వేలు ఖర్చుచేశారు. అలాగే, 2017–18 సంవత్సరంలో 16,450 కుండీల నిర్మాణానికి రూ.14.46 కోట్లు, 2018–19 సంవత్సరంలో 2,239 కుండీలకు రూ2.05కోట్లు ఖర్ఛు చేశారు. జిల్లాలో అత్యధికంగా గుర్ల మండలంలో 810 కుండీల నిర్మాణానికి సుమారు రూ.76లక్షల నిధులు చెల్లించారు. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని కొత్తవలస మండలంలో 796, లక్కవరపుకోటలో 520, వేపాడలో 705, ఎస్.కోటలో 421, జామి మండలంలో 550 సేందియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే నిర్వహించారు. ఇప్పటికే కొన్ని చోట్ల బీటలు వారి శిథిలావస్థకు చేరాయి. చెల్లింపులు ఇలా.. ఒక్కో కుండీ నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారుగా రూ10,900 కేటాయించింది. 10 అడుగుల పొడువు, ఆరడుగుల వెడెల్పు, మూడు అడుగుల ఎత్తు పరిమాణంలో నిర్మించాలి. ఈ నిర్మాణాలు అత్యధికంగా టీడీపీ కార్యకర్తలు సంబంధిత ఉపాధి హామీ క్షేత్రసహాయకులు కుమ్మకై నిర్మించారని పలువురు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఎలా నిర్మించినా ఒక్కోగుంతకు సుమారుగా రూ.9,100 చెల్లించారు. అవగాహన కల్పించక... సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కుండీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారే తప్ప వీటిపై రైతులకు ప్రచారం చేయలేదు. కుండీల లబ్ధిదారుల ఎంపికలో పాడి పశువులు లేనివారు.. ఎరువులు అవసరం లేనివారు అధికమంది ఉండడం వల్లే లక్ష్యం నీరుగారింది. నిధులు కాజేయడమే లక్ష్యంగా నిర్మాణాలు చేశారే తప్ప సేంద్రియ ఎరువులు తయారుచేద్దామన్న ఉద్దేశం ఎక్కడా కనిపించలేదనేందుకు నిరుపయోగంగా కనిపిస్తున్న కుండీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది తీసుకున్నారు. అవగాహన బాధ్యతను మండల వ్యవసాయాధికారులకు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. కాగా... ఎక్కడ రైతులకు అవగాహన మాత్రం కల్పించలేదు. సేంద్రియ ఎరువుల గుంతల్లో పోయాల్సిన చెత్త, పశువుల పేడను ఎప్పటి మాదిరిగానే ఆరుబయటే రైతులు పోసుకుంటున్నారు. నిధులు రికవరీ చేయాలి గ్రామాల్లో నిర్మించిన నాడెప్‌ల పనులను ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల నుంచి రికవరీ చేయాలి. నిర్మాణ పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వి నియోగం అయ్యింది. – గాడి అప్పారావు, సీఐటీయూ నాయకుడు, ఎస్.కోట డివిజన్ ఎందుకు నిర్మించారో తెలియదు... మా గ్రామంలో పదుల సంఖ్యలో సేంద్రియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు వచ్చి హడావుడిగా నిర్మించేశారు. వాటిని ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించలేదు. నిరుపయోగంగా ఉన్న కుండీలను ఇప్పటికే కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. – కొట్యాడ జగం, మాజీ సర్పంచ్ మాది నిర్మాణ బాధ్యత మాత్రమే.. మేము గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నాడెప్లను నిర్మించిన వరకే మా పని. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. – ఎస్.విజయలక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ, లక్కవరపుకోట మండలం -
సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీది..!
ఏలూరు (టూటౌన్): అధికారం తమదే అన్న ధీమాతో ప్రజాధనంతో చేపట్టిన ప్రతి పనికీ అధికార పార్టీ నాయకులు తమ పార్టీ రంగులు వేసేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు తమ నాయకుల పేర్లు పెట్టి స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో గతంలో మొదలుపెట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ వాటికి తమ పార్టీ రంగులను అద్దేస్తున్నారు. ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసేస్తున్నారు. ఇది ఏదో మారుమూల గ్రామంలో జరిగి తంతు కాదు. జిల్లా కేంద్రం ఏలూరులో ‘పచ్చ’ పైత్యం ఆకాశాన్ని అంటడంతో ప్రజలు విస్తుపోతున్నారు. అంతా పసుపు మయం ఏలూరు జెడ్పీ కార్యాలయం మెయిన్ రోడ్డు నుంచి వెనుక కలెక్టరేట్ రోడ్డు వరకూ విస్తరించి ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాపరిషత్ ఆవరణలోని పాత బిల్డింగ్‌లను తొలగించి ఆ ప్రాంతంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేపట్టి పూర్తిచేశారు. పనిలో పనిగా కాంప్లెక్స్‌కు ఆనుకుని మెయిన్‌రోడ్డు వైపు, కలెక్టరేట్ వైపు ఉన్న ప్రవేశ ద్వారాలకు రంగులు అద్దారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అయితే మొత్తం ప్రవేశ ద్వారాలకు తెలుగుదేశం పార్టీ రంగు పసుపుతో నింపేశారు. పైన మొక్కుబడిగా ఎరుపు రంగు చారలు వేశారు. నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లకు పైన బోర్డులను సైతం పసుపు రంగుతోనే ఏర్పాటుచేశారు. అధికారులు సైతం ఇంతలా తమ స్వామి భక్తిని చాటాలా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌కు చంద్రబాబు పేరు సాధారణంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు దేశ నాయకులు, ప్రముఖులు, దివంగతులైన నేతలు పేర్లు పెట్టడం పరిపాటి. అయితే ఏ లూరు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన షా పింగ్ కాంప్లెక్స్‌కు సీఎం చంద్రబాబు పేరును పె ట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టినా బాగుండేదని, సీఎం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఇలా చేశారనే వాదనలు ఉన్నాయి. జిల్లాపరిషత్‌కు చెం దిన ఓ ప్రజాప్రతినిధి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని, దీంతో ఇలా స్వామి భక్తిని చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు
బోధన్‌రూరల్(బోధన్): ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రజలకు ఉపాధిహామీ కల్పనలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో 10వ విడత మండలస్థాయి ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ తనిఖీలో మండలం లోని 32 జీపీల పరిధిలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు, రికార్డుల నమోదు, నిధుల వినియోగం వంటి అంశాలపై డీఆర్డీవో ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 జూన్ 30 వరకు మండలంలో మొత్తం రూ. 12కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు వినియోగించారని, అయితే ఇందులో సుమారు రూ. 3లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నిధులను ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేపట్టామని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవరించిన 70మంది మేట్లను తొలగించామని డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపీడీవో మల్లారెడ్డి, ఈవోపీఆర్డీ రాజేశ్వర్, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, సోషల్ ఆడిట్ అధికారి చంద్రశేఖర్, ఎస్‌ఆర్పీపీలు రాము, రవి పాల్గొన్నారు. -
మొక్కుల పేరిట ప్రజా ధనం దుర్వినియోగం
-
సాయం కోసమే చేతులు చాచాను: మాల్యా
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఇక అన్ని దారులు మూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాలే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభానికి కారణమయ్యాయంటూ ఆరోపించారు. ఓ వైపు ప్రభుత్వ పాలసీలు, మరోవైపు ఆర్థిక పరిస్థితులు కింగ్‌ఫిషర్‌ను దెబ్బతీశాయన్నారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం పబ్లిక్ ఫండ్స్ అన్నింటిన్నీ వెచ్చించిందని, కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎలాంటి బెయిల్ అవుట్ ప్రకటించలేదని ఆరోపించారు. ఎయిరిండియాకు అవసరమైన అన్ని సహాయాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. విధానాల్లో మార్పుల కొరకే తాను చేతులు చాచానని, రుణాల కోసం కాదని చెప్పుకొచ్చారు. కానీ పాలసీల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, దీంతో తన ఎయిర్‌లైన్స్ తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాయం కోసమే తాను అర్థించానని, రుణాల కోసం కాదంటూ పలు ట్వీట్లు చేశారు. పబ్లిక్ ఫండ్స్ మొత్తాన్ని ఎయిరిండియాకు అలా ఎలా కేటాయిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యారెల్ ఆయిల్ ధర డాలర్లకు పెరగడం, రూపాయి డీవాల్యుయేషన్తో సేల్స్ ట్యాక్స్ భారం ఇవన్నీ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభానికి కారణమని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ, కేవలం ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ఆర్థిక పరిస్థితుల వల్లే ఇది ఫెయిల్ అయిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు, స్టాక్ హోల్డర్స్ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ట్వీట్ చేశారు. సీబీఐ దీన్ని విచారిస్తుందని ఒక్క రూపాయి కూడా తప్పుదోవ పట్టించలేదని మాల్యా తెలిపారు. -
ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు
టీఆర్ఎస్పై కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి కళంకం తెచ్చారని టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ విప్ ఎస్.ఎస్.సంపత్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి దాన్ని కప్పి పుచ్చుకోడానికి రూ.లక్షల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించుకుంది. అయినప్పటికీ రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అనర్హత పిటిషన్లపై జరిగిన జాప్యాన్ని ప్రశ్నించింది. తాజా ఉత్తర్వులతో న్యాయ వ్యవస్థపై మరింత విశ్వాసం పెరిగింది’అన్నారు. ఇప్పటికై నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. -
ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోను
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల పరిశీలన నెల్లూరు (బృందావనం): ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించనని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తన వంతు పోరాటం సాగిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను బుధవారం ఆయన సందర్శించారు. కార్పొరేషన్, టూరిజం శాఖల అధికారులతో కలిసి ఘాట్లు, రహదారులు, మరుగుదొడ్లు, తదితర పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బారాషహీద్‌దర్గా పరిసరాల్లో ఘాట్లు, మరుగుదొడ్లు, బాత్రూమ్లు, రహదారులు, తదితర పనుల్లో నాణ్యత లోపించి, అవినీతి, అక్రమాలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో పరిశీలన నిమిత్తం తాను వచ్చానని చెప్పారు. రొట్టెల పండగ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బారాషహీద్ దర్గాను దర్శించుకునే భక్తుల కోసం సుమారు రూ.ఏడు కోట్లను ఖర్చుచేశారని, అయితే వీటి నాణ్యతప్రమాణాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని టూరిజం, నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కోసం అధికారులు తప్పిదాలుచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అధికారులను ఇబ్బందిపెట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఘాట్లు, మరుగుదొడ్లలో టైల్స్ లేచిపోవడం, పరిస్థితి అధ్వానంగా ఉండటం దారుణమన్నారు. పనుల వివరాలను తనకు తెలియజేయాలని, ఘాట్ల అక్రమ నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టూరిజం శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్యామ్సుందరరాజు, ఈఈ లక్ష్మీరంగయ్య, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, కార్పొరేషన్ డీఈ ఖాదర్షరీఫ్ పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు హంజాహుస్సేన్, సలీం, అబూబకర్, డాక్టర్ సత్తార్, హజరత్‌నాయుడు, చిన్నమస్తాన్, రియాజ్, నరసింహయ్య ముదిరాజ్, పురుషోత్తమ్యాదవ్, చెక్కా సాయిసునీల్, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాస్‌గౌడ్, తాళ్లూరు సురేష్‌బాబు, వేల్పుల అజయ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆడిట్ తలంటు
ఆర్థిక నిర్వహణ ఇంత అస్తవ్యస్తమా? జెడ్పీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు చురకలు బాధ్యతారాహిత్యంపై ఆడిట్ శాఖ మొట్టికాయలు మూడేళ్ల కిందటి నిర్వాకంపై అక్షింతలు సాక్షి, విశాఖపట్నం: ప్రజాధనమైతే చాలు.. బాధ్యతా రాహిత్యం కట్టలు తెంచుకుంటంది. అధికారుల నిర్లక్ష్యం ఉప్పెనలా పొంగిపొర్లుతుంది. అవినీతి, అక్రమాలకైతే ఇక అంతే ఉండ దు.. దాంతో కోట్ల కొద్దీ విలువైన నిధులు పక్కదారి పడతాయి. లేదా ప్రజలకు పనికి రాకుండా వృథా అవుతాయి. మూలనపడి మూలుగుతా యి. జిల్లాలో ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖలు ఈ తరహా వక్ర ధోరణులను ప్రదర్శించాయి. ఆడి ట్ శాఖకు అడ్డంగా దొరికిపోయాయి. జీవీఎం సీ, జిల్లాపరిషత్,మున్సిపాల్టీలు, పంచాయతీలు,మండల పరిషత్‌లలో ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధుల విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరించి ఖజానాకు నష్టం కలిగించి ఆడిట్ విభాగం ఆగ్రహానికి గురయ్యాయి. జీవీ ఎంసీ, భీమునిపట్నం,అనకాపల్లి మున్సిపాల్టీ లు చేతికి వచ్చిన నిధులను వినియోగించకుండా,ఉన్న వాటిని ఇష్టానుసారం వాడుకుంటున్నాయన్న విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆడిట్ శాఖ తాజాగా రూపొందించిన నివేదికలో, జిల్లాలో 2010-2011 సంవత్సరానికి సంబంధించిన నిధుల అపసవ్య వినియోగాన్ని తూర్పారబట్టింది. ఇష్టానుసారంగా వాడుకున్న నిధులను తక్షణమే రాబట్టాలని ఆదేశించింది. ఈ సంస్థల వ్యవహారశైలిపై మొత్తం 998 అభ్యంతరాలు వ్యక్తంచేసి లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవకతవకలు పైశాఖలన్నిటిలో కలిపి రూ. 28 కోట్ల మేరకు లెక్కలు తేలలేదని ఆడిట్ శాఖ స్పష్టంచేసింది. జీవీఎంసీతో కలిపి మొ త్తం రూ.7.25 కోట్ల మేరకు బకాయిలు వసూలుచేయలేదని స్పష్టం చేసింది. సొంత దుకాణాల సముదాయాల ద్వా రా జిల్లాపరిషత్‌కు రూ.1.68 లక్షలు అద్దెల రూపంలో ఆదాయం రావలసి ఉన్నా వసూలుచేయలేదు. ఓ బ్యాంకు కు భవనానికి అద్దెగా రూ.53,400రావలసి ఉన్నా వసూలుచేయలేదు. రూ.1.48 లక్షల నిధులను జిల్లాపరిష త్ అధికారులు ప్రయాణ భత్యం పేరు తో తీసుకున్నారు. ఇవి మళ్లీ వసూలు కాలేదు. జిల్లా పరిషత్ రూ.7.49 లక్షలకు సం బంధించిన ఖర్చుల వివరాలు తెలపకపోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం చెప్పింది. మునగపాక మండల పరిష త్ రూ. 2.25 లక్షల ఖర్చుల వివరాలు ఇవ్వలేదని తెలిపింది. బుచ్చయ్యపేట మండలపరిషత్ రూ. 8,720ను అనవసరంగా ప్రచార ఖర్చులకు ఖర్చు చేయగా, ఈ నిధులను రాబట్టాలని ఆదేశించింది. పంచాతీయరాజ్ సంస్థల్లో రూ. 28 కోట్లకు సంబంధించి ఖాతాల్లో లెక్కల కు 998 అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈసంస్థలు మొత్తం వివిధ విభాగాల్లో రూ.1.09కోట్లను అధికంగా వినియోగించాయి. జిల్లాపరిషత్,గ్రామపంచాయతీలు,మండల పరిషత్‌లు మొత్తం రూ.12లక్షల నిధులు మళ్లించాయి. జిల్లాపరిషత్,పంచాయతీలు,మండలపరిషత్‌లు కలిసి 2010-2011 ఏడాదిలో తనకు రావలసిన మొత్తం రూ. 4.25 కోట్ల ఆదాయాన్ని వసూలుచేయకుండా వదిలేశాయి. ఇందులో రూ.4.18 కోట్లు కేవలం పంచాయతీల బకాయిలే. అలాగే రూ.4.56కోట్లను అడ్వాన్స్‌లు, సర్దుబాటు పేరుతో పెం డింగ్‌లు ఉంచాయి. మరో రూ.9.34కోట్లకు రికార్డులు సమర్పించలేదు. అనకాపల్లి మున్సిపాల్టీ తనపరిధిలోని కేబుల్ ఆపరేటర్లనుంచి వినోదపన్నుకింద వసూలుచేయాల్సిన పన్నులు వసూలు చేయలేదు. నర్సీపట్నం మార్కెట్ కమిటీ తనకు రా వలసిన రూ.1.02లక్షల అద్దెను వసూ లు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. -
వ్యర్థాలకు కార్పొరేటర్ల ‘అర్థా’లే వేరులే
చెత్త తరలింపు పేరిట దోపిడీ ప్రజాప్రతినిధుల దందా ప్రజాధనం దుర్వినియోగం సాక్షి, సిటీబ్యూరో : వ్యర్థాలంటే గ్రేటర్ కార్పొరేటర్లకు ఎంతో మోజు! ఎందుకంటే వారికి ‘అర్థ’ బలం పెంపొందించేవి అవే మరి. చెత్త, నిర్మాణ వ్యర్థాల తరలింపు పేరిట బినామీ పేర్లతో లాభాలు సాధించే సాధనాలవి. అందుకే సమస్యల గురించి ఎవరెంత మొత్తుకుంటున్నా పట్టించుకోని కార్పొరేటర్లు.. పండగలొచ్చాయంటే చాలు.. వ్యర్థాల తరలింపు పనుల పేరిట అదనపు వాహనాలు.. అదనపు ట్రిప్పుల కోసం పట్టుబడుతుంటారు. పనులు మంజూరయ్యాక అద్దె వాహనాలతో తిప్పని ట్రిప్పుల్ని తిప్పినట్లు.. వినియోగించకుండానే కార్మికులను వినియోగించినట్లు రికార్డుల్లో చూపుతూ కాసులు సంపాదించుకుంటారు. ఇలా కార్పొరేటర్లు, వారికి సహకరించే అధికారులు కుమ్మక్కవుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఈ తంతు జరుగుతున్న తీరు.. అవకతవకలు ఇలా ఉన్నాయి. అవకతవకలిలా.. వర్క్ ఆర్డర్లో ఆరు టన్నుల టిప్పర్లుగా పేర్కొన చెత్త తరలింపు వాస్తవానికి రెండు టన్నులు కూడా ఉండవు. రోజుకు ఐదు ట్రిప్పులు చేయాల్సి ఉండగా.. రెండు ట్రిప్పులే నడిపి ఐదింటికి బిల్లులు పొందుతారు. ఒక్కో వాహనానికి నలుగురు కార్మికులనూ కాంట్రాక్టు ఏజెన్సీయే నియమించాలి. కానీ.. ఇద్దరిని లేదా ఒక్కరినే నియమిస్తుంది. సాధారణ రోజుల్లోనూ ఇవే నిబంధనలున్నా.. పండుగల సందర్భాల్లో అందినకాడికి అన్నట్లుగా వారం నుంచి పది రోజుల వరకు అదనపు వాహనాలను అద్దెకు తీసుకుంటారు. ఇలా అద్దెల పేరిట తీసుకునే వాహనాల్లో చాలా వరకు కార్పొరేటర్లకు చెందినవి (బినామీ పేర్లతోనూ) లేదా వారి మనుషులకు చెందినవి.. లేదా వారు సూచించిన ఏజెన్సీలవే ఉంటాయి. సొంత వాహనాలున్న వారే అద్దెకివ్వాల్సి ఉండగా.. మరొకరి దగ్గర తక్కువ ధరకు అద్దెకు తీసుకొని.. వాటినే జీహెచ్ఎంసీకి అద్దెకిస్తున్న వారూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఒక్కో వాహనానికి పది రోజులకు 50 ట్రిప్పులకు రూ.80,900 చెల్లిస్తుంది. ఇలా ఎన్ని వాహనాలైతే అంత మొత్తం చెల్లిస్తారు. ఇంత జరిగినా అసలు లక్ష్యం నెరవేరుతుందా అంటే అదీ లేదు. రహదారుల్లోని వ్యర్థాలను నిర్దేశించిన క్వారీకి తరలించాల్సి ఉండగా అలా చేయరు. ఒక చోట నుంచి వ్యర్థాలను సమీపంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అవే వ్యర్థాలను అక్కడి నుంచి మరో చోటుకు తరలించే పేరిట మరోమారు బిల్లు పొందుతారు. ఇలా ఓ చోట నుంచి వ్యర్థాలు మరో చోటుకు మారుతున్నాయే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. నిర్మాణ వ్యర్థాలు వెలువడేది ఎక్కువగా పాత భవనాలను కూల్చి కొత్తవి నిర్మించేటప్పుడే. సదరు వ్యర్థాలను తరలించాల్సిన భవన యజమానుల వద్ద సొమ్ము వసూలు చేస్తూ జీహెచ్ఎంసీ వాహనాల ద్వారా తరలిస్తున్న ఘనులూ ఉన్నారు. రహదారిపై నిర్మాణ వ్యర్థాలు వేసినందుకు ఒక యజమానికి ఆరేడునెలల క్రితం రూ.లక్ష జరిమానా విధించారు. అంతే అనంతరం చర్యలు నిల్. నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే ఎంతో ప్రయోజనం. ఆ దిశగానూ చర్యలు లేవు. చెప్పేదొకటి.. జరిగేదొకటి వాహనాల ట్రిప్పుల సంఖ్యలో అక్రమాల నివారణకు జీపీఎస్ వినియోగిస్తున్నారు. దాని ద్వారా వాహనం ఎక్కడ తిరిగిందీ తెలుస్తుందే తప్ప.. డెబ్రిస్‌ను తరలించిందీ, లేనిదీ తెలియదు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన క్వారీల్లో డెబ్రిస్ వేయాల్సి ఉండగా, ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ వదిలేస్తున్నారు. వ్యర్థాలు టిప్పర్లలోకి తరలించే ముందు.. అన్లోడ్ చేసేముందు ఓ ఎస్సార్టీ ద్వారా ఫొటోలు తీయలి. కానీ అమలవడం లేదు. వ్యర్థాల బరువు తూయాల్సి ఉన్నప్పటికీ తూతూమంత్రంగా తప్ప అమలు జరగడం లేదు. వ్యర్థాల తరలింపు పనులు జరిగినట్లు స్థానిక కార్పొరేటర్ల నుంచి ధ్రువపత్రం పొందాలి. కార్పొరేటర్లకూ కావాల్సింది ఇదే. వాటాలు ముడితే పత్రాలు.. లేకుంటే కొర్రీలు. దాదాపు 40 వాహనాలను ఇటీవల మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అద్దెకు తీసుకున్నారు. - బహిరంగ టెండర్లను ఆహ్వానిస్తే.. తక్కువ ధరకే వాహనాలను అద్దెకిచ్చేవారున్నా, జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్ల సిండికేట్‌కే వీటిని నామినేషన్‌పై అప్పగించారు. - ఇందుకు దాదాపు రూ. 40 లక్షలు ఖర్చుచేశారు. - ఇలా ఏటా కోట్ల రూపాయలు వ్యర్థాల పేరిట కాంట్రాక్టర్లకు కుమ్మరిస్తున్నారు. ఏం చేయవచ్చు.. బహిరంగ ప్రదేశాల్లో డెబ్రిస్ వేసేవారిపై చర్యలు తీసుకుంటే చాలా వరకు రోడ్డపై వ్యర్థాలు తగ్గుతాయి. డెబ్రిస్ తొలగింపు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అవసరమైన వారు జీహెచ్ఎంసీకి ఫోన్ చేస్తే వాహనాన్ని పంపే ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా అవసరమైన వారికి సదుపాయంతోపాటు.. జీహెచ్ఎంసీకి డెబ్రిస్ తరలింపు వ్యయం తగ్గేది. -
మసకబారిన ‘కలంకారీ’
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: కలంకారీ పుట్టినిల్లుగా శ్రీకాళహస్తికి జాతీయస్థాయిలో మంచి పేరుంది. స్థానికంగా సుమారు రెండు వేలమంది కలంకారీ కళాకారులు ఉన్నారు. పర్యాటకులు, యాత్రికులు ఇక్కడి కలంకారీ దుస్తులపట్ల ఆకర్షితులై కొనుగోలు చేసేవారు. దీంతో ప్రభుత్వం గ్రామీణ చేతివృత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారుచేసే వస్తువులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులను ఇక్కడ విక్రయిస్తుంటారు. కలంకారి కళాకారుల సౌకర్యార్థం పట్టణంలోని ఏపీ టూరిజం వద్ద 2010లో సుమారు రూ.2 కోట్లతో భవన సముదాయాన్ని నిర్మిం చారు. అవసరమైన మేరకు వసతులు కల్పించకపోవడంతో ఇక్కడ కలంకారీ పనులు జరగడంలేదు. ఆరు భవనాలతో పాటు కలంకారీ దుస్తులను ఆరబెట్టుకునేం దుకు, ఉడకబెట్టేందుకు తొట్టెలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు కలంకారీ వృత్తిపనులు సాగాయి. ఆపై వీటి నిర్వహణను గాలికొదిలేశారు. ఫలితంగా భవనా లు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ భవనం పైకప్పు పూర్తిగా తొలగిపోయింది. మిగిలిన షెడ్లు చిన్నపాటి వర్షాలకే ఉరుస్తున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలతో తయారు చేసిన కలంకారీ దుస్తులు తడిసిపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని పలువు రు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని ఏపీటూరి జం ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామీణ హస్తకళల కేంద్రంలో కొండపల్లి బొమ్మలు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రసిద్ధిచెందిన శంఖుపూసలు విరి విగా లభిస్తున్నాయి. అయితే ప్రత్యేక భవనసదుపాయం లేకపోవడంతో కలంకారీ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. దీంతో స్టాల్స్‌లో కూడా కలంకారీ వస్తువులు అరుదుగా లభిస్తున్నాయి.