మసకబారిన ‘కలంకారీ’ | Rs 2 crore to waste of public funds | Sakshi
Sakshi News home page

మసకబారిన ‘కలంకారీ’

Published Sat, Jan 18 2014 5:45 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

Rs 2 crore to waste of public funds

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: కలంకారీ పుట్టినిల్లుగా శ్రీకాళహస్తికి జాతీయస్థాయిలో మంచి పేరుంది. స్థానికంగా సుమారు రెండు వేలమంది కలంకారీ కళాకారులు ఉన్నారు. పర్యాటకులు, యాత్రికులు ఇక్కడి కలంకారీ దుస్తులపట్ల ఆకర్షితులై కొనుగోలు చేసేవారు. దీంతో ప్రభుత్వం గ్రామీణ చేతివృత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారుచేసే వస్తువులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులను ఇక్కడ విక్రయిస్తుంటారు.

 కలంకారి కళాకారుల సౌకర్యార్థం పట్టణంలోని ఏపీ టూరిజం వద్ద 2010లో సుమారు రూ.2 కోట్లతో భవన సముదాయాన్ని నిర్మిం చారు. అవసరమైన మేరకు వసతులు కల్పించకపోవడంతో ఇక్కడ కలంకారీ పనులు జరగడంలేదు. ఆరు భవనాలతో పాటు కలంకారీ దుస్తులను ఆరబెట్టుకునేం దుకు, ఉడకబెట్టేందుకు తొట్టెలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు కలంకారీ వృత్తిపనులు సాగాయి. ఆపై వీటి నిర్వహణను గాలికొదిలేశారు. ఫలితంగా భవనా లు శిథిలావస్థకు చేరాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు ఓ భవనం పైకప్పు పూర్తిగా తొలగిపోయింది. మిగిలిన షెడ్లు చిన్నపాటి వర్షాలకే ఉరుస్తున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలతో తయారు చేసిన కలంకారీ దుస్తులు తడిసిపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని పలువు రు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని ఏపీటూరి జం ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామీణ హస్తకళల కేంద్రంలో కొండపల్లి బొమ్మలు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రసిద్ధిచెందిన శంఖుపూసలు విరి విగా లభిస్తున్నాయి. అయితే ప్రత్యేక భవనసదుపాయం లేకపోవడంతో కలంకారీ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. దీంతో స్టాల్స్‌లో కూడా కలంకారీ వస్తువులు అరుదుగా లభిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement